Brahmamudi weekly roundup: రుద్రాణిని చంపేసిన కావ్య.. బిడ్డలతో అనాథగా అపర్ణ, రేఖ చేతికి ఆస్తి
Photo Courtesy: JioHotstar
ట్రస్ట్ బాధ్యతల్ని మినిస్టర్ ధర్మేంద్ర, గురుమూర్తి చేతిలో పెడతారు రాజ్- కావ్య. అందరూ కలిసి శ్రీశైలం వెళ్లేందుకు వ్యాన్‌ని తెప్పిస్తారు.. దానికి రుద్రాణి మనుషులు బాంబు పెడతారు. రాహుల్- స్వప్నలను మరో కారులో రమ్మని చెబుతుంది రుద్రాణి. బస్సులో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషంగా గడుపుతుండగా బాంబు పేల్చేస్తుంది రుద్రాణి. ప్రమాదంలో అపర్ణ మాత్రమే బతికుండటంతో ఆమెను రాహుల్ చంపేందుకు ప్రయత్నిస్తుండగా రాజ్ లేచి అతనిని కాల్చేస్తాడు. ఇది చూసిన రుద్రాణి రాజ్‌ని కొట్టి కొట్టి చంపుతుంది. నా వారసుడిని చంపినందుకు నీ బిడ్డల్ని కూడా చంపేస్తానని పిల్లలకు రుద్రాణి గన్ గురిపెట్టగా.. కావ్య లేచి రుద్రాణిని త్రిశూలంతో పొడిచి చంపేస్తుంది. కుటుంబం మొత్తాన్ని కోల్పోయి, మంచాన పడిన భర్త, ఇద్దరు పసిబిడ్డలతో అపర్ణ ఒంటరిగా మిగులుతుంది. రేఖ వచ్చి నీకు అండగా ఉంటానని చెప్పగా అపర్ణ ఛీ కొడుతుంది. దాంతో పగబట్టిన రేఖ.. తన బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోచ్చి.. సుభాష్‌ని, పిల్లలను చంపేస్తానని బెదిరించి అపర్ణ దగ్గర ఆస్తి రాయించుకుంటుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు .. 963వ ఎపిసోడ్ నుంచి 968వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
ఫిబ్రవరి 23వ తేదీ 963వ ఎపిసోడ్‌లో ..
మా అమ్మ చేసిన పాపాలకు ఈ ఇంట్లో ఉండలేమని, మీ ముందు తలెత్తుకుని బతకలేమని రేఖ, రాహుల్‌లు డ్రామాలు ఆడతారు. నువ్వు కూడా మన బిడ్డను తీసుకొని వచ్చేస్తే వెళ్లిపోదామని స్వప్నకు చెబుతాడు రాహుల్. మా ముగ్గురం అక్కాచెల్లెళ్లం.. చివరి వరకు ఓకే చోట కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నామని మమ్మల్ని విడదీయొద్దని రాహుల్‌ని బతిమలాడుతుంది కావ్య. అయినా మీ అమ్మ చేసిన దానికి మీరేం చేస్తారు.. మనమంతా కలిసే ఉందామని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చెప్పడంతో తమ ప్లాన్ వర్కవుట్ అయినందుకు రాహుల్, రేఖలు సంతోషిస్తారు. ట్రస్ట్ పనులు మొదలవుతున్నాయి, పాప నామకరణం కూడా చేసేస్తున్నాం.. ఫ్యామిలీ అందరం కలిసి శ్రీశైలం వెళ్దామని కావ్యతో చెబుతాడు రాజ్. ఈ విషయాన్ని రుద్రాణికి చెబుతారు రాహుల్, రేఖ. ఫ్యామిలీ మొత్తాన్ని శ్రీశైలం వెళ్లేదారిలో బాంబు పెట్టి ఒకేసారి చంపేద్దామని.. అప్పుడు దుగ్గిరాల కుటుంబంలో మన ముగ్గురం మాత్రమే మిగులుతామని తన ప్లాన్ చెబుతుంది రుద్రాణి. ఉదయాన్నే మినిస్టర్ ధర్మేంద్ర.. దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటికి ఓ వ్యక్తితో కలిసి వస్తాడు. మినిస్టర్ గారు, గురుమూర్తి గారు, కావ్యలు ముగ్గురు ఈ ట్రస్ట్ బాధ్యతలు చూసుకుంటారని చెబుతాడు రాజ్. సగం ఆస్తిని ట్రస్ట్‌కు రాసివ్వడానికి ధాన్యలక్ష్మీతో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతకాలు పెడుతుంది.
ఫిబ్రవరి 24వ తేదీ 964వ ఎపిసోడ్‌లో..
శ్రీశైలం వెళ్లే వ్యాన్ రావడంతో డ్రైవర్‌ని మాటల్లో పెట్టి తాళాలు తీసుకుంటాడు రాహుల్. ఇంతలో కిరాయి హంతకుడు వచ్చి వ్యాన్ కింద టైం బాంబు పెట్టి వెళ్లిపోతాడు. ఈ విషయాన్ని రుద్రాణికి చెబుతాడు రాహుల్. మీరు ఆ బస్సులో రాకుండా మరో కారులో 200 అడుగుల డిస్టెన్స్‌లో ఫాలో అవ్వమని చెబుతుంది రుద్రాణి. ఇంతలో స్వప్న వచ్చి మన విజయవాడ ప్రాపర్టీకి ఏదో ప్రాబ్లమ్ ఉందని అక్కడికి వెళ్లాలని చెబుతుంది. శ్రీశైలంలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి విజయవాడ వెళ్దామని చెబుతాడు రాహుల్. అందరం ఒకే వ్యాన్‌లో వెళ్తున్నాం కాబట్టి కుదరదని, మనం వేరే కారులో వెళ్దామని అంటుంది స్వప్న. తన ప్లాన్ వర్కవుట్ కావడంతో సరేనని చెబుతాడు రాహుల్. కావ్య పాపకి ఇందు అని, అప్పూ పాపకి నందూ అని పేరు పెడుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ. కావ్య కూతురిని రేవతి కొడుకు ఊయలలో వేసి నా పెళ్లాన్ని నేనే చూసుకుంటానని అంటాడు. దాంతో అంతా సరేనని చెప్పి నవ్వుకుంటారు. త్వరగా బయల్దేరకపోతే శ్రీశైలం ఘాట్ రోడ్ మూసేస్తారని రాహుల్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వ్యాన్ ఎక్కేస్తారు. రాహుల్ - స్వప్న రాకపోవడంతో మీరు వేరే కారులో ఎందుకు? అందరం ఈ వ్యాన్‌లో వెళ్దామని చెబుతాడు రాజ్. నాకు విజయవాడలో చిన్న ప్రాపర్టీ ఇష్యూ ఉందని అందుకే నేనే కారులో వెళ్దామని చెప్పానని రాజ్‌తో అంటుంది స్వప్న. దుగ్గిరాల ఫ్యామిలీ వెళ్తున్న వ్యాన్‌ను వెనుక కారులో ఫాలో అవుతారు రాహుల్- రేఖ.

Photo Courtesy: JioHotstar
ఫిబ్రవరి 25వ తేదీ 965వ ఎపిసోడ్‌లో..
దుగ్గిరాల ఫ్యామిలీ వెళ్తున్న వ్యాన్ సడెన్‌గా ఆగిపోయి అప్పూ, కావ్యలు దిగడంతో రాహుల్ - రేఖలు షాక్ అవుతారు. మేం అక్కడ ఎంజాయ్ చేస్తుంటే .. మా అక్క ఒక్కటే ఇక్కడ ఉండిపోయిందని స్వప్నని ఇద్దరూ కలిసి తీసుకెళ్తారు. స్వప్న వ్యాన్ ఎక్కిందని మన ప్లాన్ ఆపేద్దామని రుద్రాణితో అంటాడు రాహుల్. నీకు పెళ్లాం కావాలా? ఆస్తి కావాలా? అని రుద్రాణి నిలదీయడంతో ఆస్తే కావాలని చెబుతాడు రాహుల్. శ్రీశైలం ఘాట్ రోడ్ దగ్గరికి రాగానే వ్యాన్‌ని రిమోట్‌తో పేల్చేస్తుంది రుద్రాణి. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మంటల్లో కాలిపోతారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిఉంటాయి. ఇంతలో అపర్ణకి స్పృహ వచ్చి.. విగతజీవులుగా పడిఉన్న తన కుటుంబాన్ని చూసి ఏడుస్తుంది. ఇంతలో సుభాష్‌కి స్పృహ వచ్చి తన చేతిలో ఉన్న అప్పూ బిడ్డని ఇస్తాడు. కావ్య పొత్తిళ్లలో ఉన్న బిడ్డను కూడా తీసుకుని అపర్ణ ఏడుస్తుండగా రాహుల్ గన్‌తో వచ్చి అపర్ణని కాల్చబోతాడు. ఇదంతా నేను, మా అమ్మ కలిసి చేయించానని చెప్పడంతో అపర్ణ, సుభాష్‌లు షాక్ అవుతారు. నిన్ను కూడా చంపేస్తానని తుపాకీ గురిపెట్టగా రాజ్ అడ్డుకుంటాడు. ఈ పెనుగులాటలో గన్ పేలి బుల్లెట్ రాహుల్‌కి తగులుతుంది, ఆ వెంటనే రాజ్ గన్ లాక్కొని రాహుల్‌ని కాల్చి చంపుతాడు. ఇది చూసిన రేఖ, రుద్రాణిలు షాక్ అవుతారు.
ఫిబ్రవరి 26వ తేదీ 966వ ఎపిసోడ్‌లో..
రాహుల్‌ని రాజ్ చంపేయడంతో రుద్రాణి పట్టరాని కోపంతో ఊగిపోతూ రాజ్‌ని కొట్టి కొట్టి చంపుతుంది. రాజ్ చనిపోతూ.. కావ్యని స్పృహలోకి వచ్చేలా చేసి నీ బిడ్డల్ని నువ్వే కాపాడుకునేలా చేయమని అంటాడు. పిల్లల్ని రుద్రాణి కాల్చేయబోతుండగా కావ్య లేచి అడ్డుకుంటుంది. నిన్ను పెంచి పెద్ద చేసిన కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్నావని రుద్రాణిపై మండిపడుతుంది కావ్య. అసలు నువ్వు వచ్చినప్పటి నుంచే నా ప్లాన్ ఏది వర్కవుట్ కావడం లేదని లేదంటే నా బిడ్డ మహారాజులా ఉండేవాడని అంటుంది రుద్రాణి. బిడ్డల్ని కాపాడే ప్రయత్నంలో కావ్య కిందపడిపోయి.. పక్కనే అమ్మవారి దగ్గరున్న త్రిశూలంతో రుద్రాణిని పొడిచి చంపేస్తుంది. ఇక బిడ్డల బాధ్యత నీదే, ఎప్పటికీ వాళ్లని విడిచి పెట్టొద్దని అపర్ణ చేతిలో చెయ్యేసి కన్నుమూస్తుంది కావ్య. యాక్సిడెంట్ నుంచి బయటపడి ఆసుపత్రికి చేరుకుంటుంది అపర్ణ. సుభాష్ వెన్నెముక విరిగిపోయిందని ఆయన జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో అపర్ణ కంటతడి పెడుతుంది.

Photo Courtesy: JioHotstar
ఫిబ్రవరి 27వ తేదీ 967వ ఎపిసోడ్‌లో..
సుభాష్ గారు జీవితంలో మళ్లీ నడవలేరని.. ఇక మంచానికే పరిమితమని డాక్టర్ చెప్పడంతో అపర్ణ వెక్కివెక్కి ఏడుస్తుంది. మా కంటూ ఎవరు లేరు.. మేం ఎవరి కోసం బతకాలని బాధపడుతుంది. ఇంతలో రేఖ అక్కడికి వచ్చి.. నేను మీకు అండగా ఉంటాను. కన్నకూతురిలా చూసుకుంటానని చెబుతుంది. ఆ మాటలతో అపర్ణ సీరియస్ అవుతుంది. మీ అమ్మ, అన్నయ్య ఈ కుటుంబానికి చేసింది చాలు అంటుంది. ఒంటరి ఆడదాన్ని నా మీద కొంచెం జాలి చూపించమని అడుగుతుంది రేఖ. పాతికేళ్ల క్రితం మీ అమ్మ కూడా మా మామగారి దగ్గరికి వచ్చి ఇలాగే జాలి చూపించమని అడిగి ఆదరించిన కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసిందని మండిపడుతుంది. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టి మిగిలిన పిల్లల్ని కూడ చంపేద్దామని అనుకుంటున్నావా? అంటుంది. అపర్ణ మాటలతో రేఖలో కోపం తెంచుకుంటుంది. మా అమ్మ, అన్నల పగని నేను సాధిస్తాను. ఈ దుగ్గిరాల ఫ్యామిలీలో ఎవ్వరినీ బతకనివ్వనని అనుకుంటుంది. వెంటనే తన ప్రియుడి దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకోమని అడుగుతుంది. నీకు నా ఆస్తితో పాటు సంఘంలో పరువు, ప్రతిష్టల్ని కూడా ఇస్తానని చెబుతుంది. నేను, నా భర్త కూడా నీతో పాటు మీ ఇంట్లోనే ఉంటామని ప్రియుడి అక్క చెప్పడంతో రేఖ సరేనని అంటుంది. కుటుంబమంతా చనిపోయి ఒంటరిగా మిగిలిన సుభాష్, అపర్ణ ఏడుస్తుంటారు. ఇంతలో అక్కడికి రేఖ తన భర్తతో కలిసి వస్తుండగా అపర్ణ మండిపడుతుంది.
ఫిబ్రవరి 28వ తేదీ 968వ ఎపిసోడ్‌లో..
దుగ్గిరాల వారింట్లో అడుగుపెడుతున్న రేఖ అతని భర్తను అడ్డుకుంటుంది అపర్ణ. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు ఒక్క దానివే పాలించలేవు.. అందుకే ఆస్తిని నా పేరు రాసేయమని అంటుంది రేఖ. ఇలాంటి పరిస్ధితి వస్తుందనే కావ్య- రాజ్‌లు తెలివిగా వ్యవహరించారు. ఈ ఆస్తి కావ్య పేరు మీద ఉంది.. కావ్య లేదు కాబట్టి లీగల్‌గా నా మనవరాలే ఈ ఆస్తికి వారసురాలు. మమ్మల్ని ఏమైనా చేస్తే ఆస్తి మొత్తం దుగ్గిరాల ట్రస్ట్‌కు వెళ్లిపోతుందని అపర్ణ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. అయితే కావ్య బిడ్డకు పాతికేళ్లు వచ్చే వరకు నేనే గార్డియన్‌గా ఉంటానని సంతకం పెట్టమని అడుగుతుంది రేఖ. అపర్ణ పెట్టకపోవడంతో సుభాష్‌ని చావబాదుతూ, పాపని చంపేస్తానని బెదిరిస్తుంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అపర్ణ సంతకం పెడుతుంది. మరోవైపు.. ఓ ఫ్యామిలీకి దొరికిన స్వరాజ్‌ను ఆ భార్యాభర్త కన్నబిడ్డలా చూసుకుంటూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











