Brahmamudi weekly roundup: ధర్మేంద్రకు టెన్షన్, డాక్టర్‌ను విడిపించిన రాజ్.. కావ్యకు రుద్రాణి షాక్
Photo Courtesy: JioHotstar
తులసి ఒడిలో గుక్కపెట్టి ఏడుస్తోన్న పాపకి కావ్య పాలు ఇవ్వడంతో తులసికి ఆమెకు మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. పాపకి బారసాల చేయాలని దుగ్గిరాల కుటుంబం నిర్ణయించగా రాజ్, కావ్యలు వద్దని చెబుతారు. మినిస్టర్ ఇంటికి కావ్య, రాజ్‌లు వెళ్లి తమ బిడ్డను 15 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలని చెబుతారు. తనకే వార్నింగ్ ఇచ్చిన కావ్య, రాజ్‌లపై పగతో రగిలిపోతున్న మినిస్టర్ వెంటనే రుద్రాణి సలహా మేరకు దుగ్గిరాల కుటుంబంలోని వ్యక్తులకు యాక్సిడెంట్ చేయిస్తాడు. నేరుగా ఇంటికొచ్చి నా జోలికి వస్తే ఈసారి నిజంగానే మీ ఇంట్లో ఎవ్వరినీ బతకనివ్వనని వార్నింగ్ ఇస్తాడు. ధర్మేంద్ర సీక్రెట్‌గా తన గెస్ట్‌హౌస్‌లో దాచిపెట్టిన డాక్టర్ చక్రవర్తిని రాజ్ విడిపిస్తాడు. రాజ్, కావ్యలు పెడుతున్న టెన్షన్‌తో మినిస్టర్ ధర్మేంద్ర కంటి మీద కునుకు లేక రాజ్‌తో మాట్లాడతాడు. నీ బిడ్డను నేను ఇవ్వలేను నా భార్య నాకు ప్రాణాలతో కావాలని అంటాడు. రాజ్, కావ్యలు తనను హింసిస్తుండటంతో కాపాడమని రుద్రాణిని అడుగుతాడు ధర్మేంద్ర. దాంతో ధాన్యలక్ష్మీతో ఇంట్లో పెద్ద గొడవ చేయిస్తుంది రుద్రాణి. తప్పనిసరి పరిస్ధితుల్లో జరిగినదంతా చెబుతాడు రాజ్.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు .. 945వ ఎపిసోడ్ నుంచి 950వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
ఫిబ్రవరి 2వ తేదీ 945వ ఎపిసోడ్‌లో ..
తులసి ఒడిలో ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తోన్న తన పాపకి కావ్య పాలు ఇస్తుంది. అది చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు. మీరు నా బిడ్డకు, నాకు చాలా సాయం చేశారు.. మీకు కూడా నేను సాయం చేస్తానని రాజ్, కావ్యలను ఇంటికి రమ్మంటుంది తులసి. నా బిడ్డకు నేను పాలు ఇవ్వడానికి కూడా ఒకరి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని రాజ్ దగ్గర బాధపడుతుంది కావ్య. పాపకు బారసాల చేయాలని, ఆమె జాతకం చూడాలని పంతులుగారిని పిలిపిస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ. చిన్నారి మహర్జాతకురాలని.. ఆమెకు తిరుగులేదని పంతులు చెప్పడంతో అంతా సంతోషిస్తారు. పాపకి హెల్త్ ప్రాబ్లమ్ అని దుగ్గిరాల ఫ్యామిలీ చెబుతుండగా.. అలాంటివేవి లేవని పంతులు అంటాడు. ఇంతలో రేఖ వచ్చి.. పాపకి పాలే ఇవ్వడానికి ఒప్పుకోని కావ్య.. బారసాలకు ఒప్పుకుంటుందా? అని ప్రశ్నిస్తుంది. దాంతో అపర్ణ, ఇందిరలు ఆమెపై మండిపడతారు. ధర్మేంద్ర, రుద్రాణిలు మాట్లాడుకుంటూ ఉండగా రాజ్, కావ్యలు మినిస్టర్ ఇంటికి వస్తారు. వాళ్లని చూసి రుద్రాణి దాక్కుంటుంది. మర్యాదగా చేసిన తప్పుని ఒప్పుకుని నా బిడ్డను నాకు ఇవ్వమని ధర్మేంద్రకు రాజ్ వార్నింగ్ ఇస్తాడు.
ఫిబ్రవరి 3వ తేదీ 946వ ఎపిసోడ్‌లో..
మినిస్టర్ ఇంటికి వచ్చిన కావ్య - రాజ్‌లు ధర్మేంద్రతో మాట్లాడుతుండగా తులసి వస్తుంది. ఒకసారి పాపను ఎత్తుకుంటానని కావ్య అడగ్గా.. తులసి సరేనని ఇస్తుంది. ఇదంతా చూసిన ధర్మేంద్ర షాక్ అవుతాడు. నా భార్య చెప్పినట్లు నీకు 15 రోజులు గడువు ఇస్తున్నా.. ఆ లోగా మా బిడ్డను మాకు తెచ్చి ఇవ్వాలని, మీ ఆవిడ ముందు నిజం ఒప్పుకోవాలని రాజ్ డెడ్‌లైన్ పెట్టి వెళ్లిపోతాడు. పాపకు బారసాల చేయాలని దుగ్గిరాల కుటుంబం చెప్పగా.. రాజ్, కావ్యలు ఇప్పట్లో అలాంటివి వద్దని.. పాప ఆరోగ్యం బాలేదని చెప్పడంతో అంతా సరే అంటారు. రాజ్ తనకే వార్నింగ్ ఇవ్వడంతో మినిస్టర్ ధర్మేంద్ర రగిలిపోతుండగా.. అతని ఫ్యామిలీ మీద దెబ్బ కొట్టాలని రుద్రాణి సలహా ఇస్తుంది. దాంతో రుద్రాణి చెప్పిన ప్లాన్‌కు మినిస్టర్ సరేనంటాడు. ఉదయాన్నే రాజ్‌కు ఫోన్ చేసి సీతారామయ్య - ఇందిర, సుభాష్ - అపర్ణ, అప్పూ - కళ్యాణ్‌ల కార్‌లకి యాక్సిడెంట్ చేయించి దమ్ముంటే కాపాడమని సవాల్ విసురుతాడు ధర్మేంద్ర. ఇంట్లో అందరికీ ఒకేసారి ఇలా జరగడంతో దుగ్గిరాల ఫ్యామిలీ కంగారు పడుతుండగా.. ధర్మేంద్ర నేరుగా అక్కడికే వస్తాడు.

Photo Courtesy: JioHotstar
ఫిబ్రవరి 4వ తేదీ 947వ ఎపిసోడ్‌లో..
దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటికొచ్చిన ధర్మేంద్ర.. ఈరోజు మీ ఇంట్లో మూడు యాక్సిడెంట్స్ జరిగి, ఆరు శవాలు లేచేవని దీనంతటికీ కారణం నేనే అని అంటాడు. నేను ఇలా ప్రవర్తించడానికి కారణం మీ అబ్బాయి రాజ్, మీ కోడలు కావ్యేనని చెబుతాడు. నా జోలికి, నా ఫ్యామిలీ జోలికి వస్తే ఈసారి నిజంగానే ఈ ఇంట్లో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడని వార్నింగ్ ఇస్తాడు. అతను వెళ్లిపోగానే ధర్మేంద్ర గురించి అడుగుతారు దుగ్గిరాల ఫ్యామిలీ సభ్యులు. ఇదంతా బిజినెస్‌లో మా మీద కక్ష గట్టి చేస్తున్నాడని కావ్య కవర్ చేస్తుంది. దుగ్గిరాల కుటుంబానికి ముచ్చెమటలు పట్టించినందుకు ధర్మేంద్రను అభినందిస్తుంది రుద్రాణి. మీ ఫ్యామిలీ ఆనందంగా ఉంటే చాలు.. అక్కడ నా కొడుకు, కూతురు సుఖంగా ఉంటారని అంటుంది. మినిస్టర్ తన ఇంటికే వచ్చి వార్నింగ్ ఇవ్వడంతో రాజ్ రగిలిపోతాడు. దాంతో కావ్య అద్భుమైన ప్రణాళిక చెబుతుంది. దాని ఆధారంగా బందీగా ఉన్న డాక్టర్ చక్రవర్తిని విడిపించాలని ప్లాన్ చేస్తారు. ఉదయాన్నే ధర్మేంద్రకు ఫోన్ చేసి డాక్టర్ చక్రవర్తి దగ్గరకు వెళ్తున్నానని రాజ్ చెప్పడంతో మినిస్టర్ షాకై.. డాక్టర్‌ను దాచిన గెస్ట్‌హౌస్ వైపు వెళ్తాడు.
ఫిబ్రవరి 5వ తేదీ 948వ ఎపిసోడ్‌లో..
రాజ్ దెబ్బకు డాక్టర్ చక్రవర్తిని దాచిన ప్లేస్‌కి వస్తాడు ధర్మేంద్ర. ఇక్కడికి ఎవ్వరూ రాలేదని.. ఒకవేళ వస్తే చస్తారని మినిస్టర్‌కి రౌడీలు చెబుతారు. ఇంతలో రాజ్ ఫోన్ చేసి డాక్టర్ చక్రవర్తితో మాకు పనిలేదు.. నేరుగా బిడ్డల్ని మార్చిన నర్స్ నీలవేణి దగ్గరికి వెళ్తున్నామని చెప్పడంతో ధర్మేంద్ర అక్కడికి బయల్దేరతాడు. ఈలోగా రౌడీలను చితకబాది డాక్టర్ చక్రవర్తిని విడిపిస్తాడు రాజ్. నర్స్ నీలవేణి ఇంటికి వెళ్లిన ధర్మేంద్ర.. రాజ్- కావ్యల గురించి అడుగుతాడు. బిడ్డల్ని మార్చినట్లు నేను ఒప్పుకున్నానని.. కానీ సాక్ష్యం మాత్రం చెప్పనని అనడంతో నన్ను కావ్య వదిలేసిందని చెబుతుంది నీలవేణి. మళ్లీ రాజ్ ఫోన్ చేసి.. అసలు ఈ తప్పు ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్తున్నామని చెప్పడంతో ధర్మేంద్ర నేరుగా ఆసుపత్రికి వెళ్తాడు. అప్పటికే తులసి, కావ్య, రాజ్, డాక్టర్ చక్రవర్తి మాట్లాడుకుంటూ ఉండటంతో ధర్మేంద్ర కంగారు పడతాడు. మేం నీ భార్యకు ఏం చెప్పలేదు. కానీ తలచుకుంటే ఇప్పటికిప్పుడే చెప్పేస్తామని... నీకిచ్చిన గడువులోగా బిడ్డను మాకు అప్పగించాలని డెడ్‌లైన్ పెడతాడు రాజ్. తులసి పాప కోలుకుంటోందని, త్వరలోనే ఆపరేషన్ చేద్దామని డాక్టర్ అనూరాధ చెప్పడంతో కావ్య - రాజ్ సంతోషిస్తారు. ఇంటి దగ్గర కళ్యాణ్ అందరికీ స్వీట్స్ పంచి అప్పూ డెలివరీ డేట్ గురించి చెబుతాడు. దుగ్గిరాల కుటుంబం సంతోషంగా ఉండటం చూసిన రేఖ రగిలిపోతుంది.

Photo Courtesy: JioHotstar
ఫిబ్రవరి 6వ తేదీ 949వ ఎపిసోడ్‌లో..
బిడ్డను ఎలా కాపాడుకోవాలి? ధర్మేంద్రపై ఎలా గెలవాలి? అంటూ కావ్య, రాజ్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు. భార్య మీద ప్రేమతో ఆ మినిస్టర్ దారుణాలకు తెగబడుతున్నాడని కావ్య అంటుంది. భార్య కోసమే అలా చేస్తే.. పేగు తెంచిన మమకారం కోసం మనం ఇంకెంత చేయాలని అంటాడు రాజ్. పాప కోసం రోజూ తులసిని కావ్యని కలవడం, పాపకు దగ్గరవుతుండటం చూసిన ధర్మేంద్రకు టెన్షన్ మొదలవుతుంది. నిద్రలో కావ్య తన బిడ్డను ఎత్తుకున్నట్లుగా అనిపించడంతో ఉలిక్కిపడతాడు. ఇక తాను ఈ నరకాన్ని అనుభవించలేనని.. తులసికి నిజం చెప్పేయాలని అనుకుంటాడు. భార్య దగ్గరికి వెళ్లి మరోలా తను చేసిన పాపం గురించి చెబుతాడు. తల్లి నుంచి బిడ్డను వేరు చేసిన ఎవ్వరైనా శిక్ష అనుభించాల్సిందేనని తులసి అంటుంది. ఆ తప్పు చేసింది మీరైనా సరే జైళ్లో వేయిస్తానని తులసి అనడంతో మంత్రి షాక్ అవుతాడు. వెంటనే రాజ్‌కు ఫోన్ చేసి కలవాలని చెబుతాడు. నీ బిడ్డను నీకు ఇవ్వలేను.. నా బాధను అర్ధం చేసుకోమని రాజ్‌ని వేడుకుంటాడు. అయినప్పటికీ రాజ్ ఏమాత్రం పట్టించుకోకుండ 24 గంటలు గడువు ఇస్తాడు. దాంతో ఏం చేయాలో తెలియక రుద్రాణి దగ్గరికి వెళ్లి జరిగింది చెబుతాడు ధర్మేంద్ర. ఇకపై ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేస్తాను.. మీరు రెస్ట్ తీసుకోండని చెబుతుంది రుద్రాణి.
ఫిబ్రవరి 7వ తేదీ 950వ ఎపిసోడ్‌లో ..
రాజ్, కావ్యల నుంచి మినిస్టర్‌ను కాపాడతానని మాటిచ్చిన రుద్రాణి వెంటనే ధాన్యలక్ష్మీకి ఫోన్ చేసి మంత్రి వల్ల మన ఫ్యామిలీకి పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెబుతుంది. అందరి సంగతి పక్కనపెడితే త్వరలో డెలివరి కానున్న నీ కోడలికి, ఆమె కడుపులోని బిడ్డకు ప్రమాదమని అంటుంది. రాజ్, కావ్యలు ఇంకా ఆ మంత్రి జోలికి వెళ్తూనే ఉన్నారని జాగ్రత్తగా ఉండమని రెచ్చగొడుతుంది రుద్రాణి. ఆమె మాటలు విన్న ధాన్యలక్ష్మీ వెంటనే కోపంతో పెద్ద గొడవ చేస్తుంది. మీ ఇద్దరి వల్ల కుటుంబంలో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతోందని రాజ్, కావ్యలపై మండిపడుతుంది. పిన్ని మాటలతో సీరియస్ అయిన రాజ్.. బిడ్డలు మార్చిన దగ్గరి నుంచి మినిస్టర్‌తో గొడవ వరకు జరిగినదంతా చెబుతాడు. దాంతో దుగ్గిరాల కుటుంబం కావ్యకి క్షమాపణలు చెబుతుంది. ఇదంతా రుద్రాణికి రేఖ చెప్పడంతో ఆమె మరో క్రూరమైన ప్లాన్ వేస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











