Brahmamudi Weekly Roundup ‘రాజ్ బిడ్డ సంగతి తేల్చకపోతే ఇంట్లో నుంచి గెంటేస్తా లేదా.. నా చావును కళ్లారా’

రాజ్ ఓ బిడ్డను తీసుకు రావడమనే అంశం బ్రహ్మముడి సీరియల్‌ను మలుపు తిప్పింది. కావ్యలో ఎన్నో అనుమానాలు, కల్యాణ్, అప్పు, అనామిక మధ్య గొడవ, రుద్రాణి విషయాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం లాంటి అంశాలు ఏప్రిల్ 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రసవత్తరంగా సాగాయి. ఎపిసోడ్స్ ట్విస్టులు, టర్నులతో కొనసాగింది.బిడ్డకు తల్లిగా భావించిన వెన్నెల బతికి లేదు అనే విషయం షాక్ గురి చేస్తుంది. ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రతికూలత రావడంతో రాజ్ బిడ్డను తీసుకొని అనాథాశ్రమానికి వెళ్లడాన్ని తండ్రి సుభాష్ అడ్డుకొంటాడు. ఏప్రిల్ 22వ నుంచి 27 వరకు సాగిన సీరియల్‌లో కొన్ని హైలెట్ అంశాలు మీ కోసం...

ఏప్రిల్ 22వ తేదీ ఎపిసోడ్‌లో
టెన్త్ క్లాస్ రీ యూనియన్ పార్టీకి వెన్నెల వస్తుందో లేదో అని కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటారు కావ్య, శ్వేత. వెన్నెల చనిపోయిందని బాబు రాజ్ కొడుకు కాదని తెలుసుకుంటుంది కావ్య. కళ్యాణ్ చేత సంతకం పెట్టించాలన్న రాహుల్ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. తల్లి స్పర్శ లేక బాబు హాస్పిటల్ పాలవుతాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత బాబుని తండ్రి కారులోంచి తీసుకొని వచ్చి తన కార్లో ఇంటి నుంచి వెళ్లిపోతాడు రాజ్. మరోవైపు సేటు దగ్గరికి వెళ్లిన రాహుల్ కోటి రూపాయలు అప్పు ఇచ్చి, కోటి పాతిక లక్షలు తీసుకున్నట్టు నోట్లో రాసుకొని ఇంటికి వచ్చి గొడవ చేసి డబ్బులు పట్టుకొని వెళ్ళమంటాడు. ఒకవేళ మీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అని అనుమానంగా అడుగుతాడు సేటు. అప్పుడు ఎలాగో ఆస్తి నీ చేతిలోనే ఉంది కదా అని రాహుల్ అంటాడు.

Brahmamudi Telugu Serial Weekly Roundup

ఏప్రిల్ 23వ తేదీ ఎపిసోడ్‌లో
రాజ్ ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ ఆర్డర్ వేస్తుంది అపర్ణ. ఆ బాబు నా బిడ్డే, అందుకే వాడి కోసం ఆస్తులు, అంతస్తులు, బంధాలు కూడా వదులుకోవాలని అనుకుంటున్నాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు కోటి రూపాయలు చూసుకొని ఆనందపడుతూ ఉంటారు రాహుల్, రుద్రాణి. అంతలోనే అక్కడికి లిప్స్టిక్ వెతుక్కుంటూ వస్తుంది స్వప్న. కంగారు పడుతూ నవ్వుతున్న తల్లి కొడుకుల్ని చూసి మళ్ళీ ఏం వెదవ వేషాలు వేశారు అని అడుగుతుంది.

ఏప్రిల్ 24వ తేదీ ఎపిసోడ్‌లో
సంప్రదాయ పద్దతిలో ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబం జరిపిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణ సమస్య రాజ్ కుటుంబంలో చర్చకుు దారి తీస్తుంది. మనమే జరిపిస్తామని సీతారామయ్య అంటే.. రాజ్ వ్యవహారంతో ఎలా జరిపిస్తామని అపర్ణ అంటుంది. అయితే బాబును తీసుకొని ఉత్సవాల్లో పాల్గొంటే సమాజం ఏమనుకొంటుందని ధాన్యలక్ష్మీ పాయింట్ లేవదీస్తుంది. ఇష్టం లేకుండానే కావ్య బలవంతంతో రాజ్ గుడికి రావడానికి, ఉత్సవాల్లో పాలొనడానికి అంగీకరిస్తాడు. అయితే గుడి వద్ద కారు దిగుతుండగానే మీడియా ఎదురుగా ఉండటంతో రాజ్ షాక్ తింటాడు. ఎవరి చేతుల మీదుగా కల్యాణం జరుగుతుందని మీడియా ప్రశ్నిస్తే.. రాజ్ దంపతుల చేతులు మీదుగా కల్యాణం జరిపిద్దామని అనుకొంటున్నామని చిట్టి సమాధానం ఇస్తుంది. దాంతో ఒడిలో ఉన్న బాబును చూసి ఎవరు ఈ బిడ్డ అని మీడియా అడిగితే.. మా ఇంటి వారసుడు అని రుద్రాణి సమాధానం ఇస్తుంది.

ఏప్రిల్ 25వ తేదీ ఎపిసోడ్‌లో
గుడి వద్దకు మీడియా వచ్చేసి రాజ్ చేతిలో ఉన్న బిడ్డను చూసి.. మీరు వేరే స్త్రీతో కన్నారంట కదా, మీ ఫ్యామిలీ మిమ్మల్ని దూరం పెట్టింది అంట కదా అని అడిగితే.. వాటన్నింటికీ సమాధానం చెప్తాడు కళ్యాణ్. అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎవరిస్తున్నారు అంటూ స్వప్న, కనకం మీడియాని కోప్పడతారు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మా ఫ్యామిలీ లో ఎలాంటి గొడవలు లేవు మేమందరం కలిసే ఉన్నాము అంటుంది కావ్య. అయితే ఆ బిడ్డకి తల్లి ఎవరు అని అడుగుతుంది మీడియా. నేనే అని అబద్ధం చెప్తుంది కావ్య. ఆవిడ చెప్పేది నిజమేనా అని అపర్ణ అని నిలదీస్తుంది మీడియా.నిజమే అని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇంటికి వచ్చిన తర్వాత నేను అనుకున్నదే జరిగింది, రాను అంటే బలవంతంగా తీసుకువెళ్లారు ఇప్పుడు చూడండి నేను అనుకున్నదే జరిగింది అని కోపంగా అపర్ణ అంటుంది.

Brahmamudi Telugu Serial Weekly Roundup

ఏప్రిల్ 26వ తేదీ ఎపిసోడ్‌లో
రాజ్‌ తీసుకొచ్చిన బిడ్డ గురించి నిజం తేల్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను.అందుకు ఎవరైనా అడ్డుకుంటే నా చావుని కళ్ళ చూస్తారు అంటుంది. ఆ తర్వాత బయట రుద్రాణి వాళ్ళతో మాట్లాడుతూ అసలు మీరు మనుషులేనా, మీరు కూడా ఈ ఇంటి మనుషులే కదా ఈ ఇంటి పరువు పోతే మీ పరువు పోతుంది అనే జ్ఞానం కూడా లేదా అని అంటుంది. గుడిలో మీడియాతో జరిగినదంతా చూశాను అయినా వాళ్లని ఏడిపించకుండా నువ్వు ఏడుస్తున్నావ్ ఏంటి అంటుంది రుద్రాణి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే నన్ను చెంప దెబ్బ కొట్టాడు ఇంక నేనేం చేయగలను అంటుంది అనామిక. వాళ్ల మానం మీద కొట్టు మధ్య తరగతి వాళ్ళకి ధనం కంటే మానం ముఖ్యం అంటూ రుద్రాణి. ఏదో సలహా ఇస్తే.. అందుకు సరే అని అనామిక అంటుంది.

ఏప్రిల్ 27వ తేదీ ఎపిసోడ్‌లో
అప్పును చెంప దెబ్బ కొట్టడంతో కల్యాణ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంట్లోకి వస్తారు. అప్పుతో కల్యాణ్ తిరుగుతున్నాడు. నాకు సవతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే నేను గృహ హింస కేసు పెట్టాను అని అనామిక అంటుంది. అయితే ఇంట్లో చిన్న సమస్య మేము రాజీ చేసుకొంటామని అని రాజ్ అంటే.. మీరు అరెస్ట్ చేయకపోతే.. పై ఆఫీసర్లను కలుస్తాను అని అనామిక బెదిరిస్తుంది. ఇంత చేసినందుకు కల్యాణ్ నాకు సారీ చెప్పాలని అంటుటంది. ఇంత జరిగాక కూడా నీకు సారీ చెప్తానని ఎలా అనుకుంటున్నావు, ఏం జరిగితే అదే జరుగుతుంది, నీతో కాపురం చేయటం కన్నా జైల్లో ఉండడమే బెటర్ అని పోలీసులతో పాటు స్టేషన్ కి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ధాన్యలక్ష్మి ఏడుస్తుంటే కొడుకుని తప్పు పట్టి కోడలు చేసిన తప్పుల్ని పక్కన పెట్టుకున్నావు, అనుభవించు. నిన్ను కట్టుకున్నందుకు నేను, ఆ పిల్లను కట్టుకున్నందుకు కళ్యాణ్ ఇద్దరు జీవితాంతం ఏడవాల్సిందే అని ప్రకాష్ ఎమోషనల్ అవుతాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X