Brahmamudi weekly roundup: ఆడబిడ్డకు జన్మనిచ్చిన కావ్య.. నిర్దోషిగా రాజ్, బిడ్డల్ని మార్చేసిన రుద్రాణి

Photo Courtesy: JioHotstar
రాజ్ కోసం కావ్య పురిటి నోప్పులతోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తను కలుసుకుంటుంది. కావ్య కోసం రాజ్ జైళ్లో నుంచి తప్పించుకుని రాగా.. అప్పూ అడ్డుకుని అరెస్ట్ చేస్తానని చెబుతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అప్పూను అడ్డుకుంటుంది. రాజ్ సమక్షంలోనే కావ్యకు డాక్టర్లు ఆపరేషన్ చేయగా ఆడపిల్ల పుడుతుంది. రాజ్‌ను ఈ కేసులో ఇరికించిన శాండీని అప్పూ చితకబాది నిజం కక్కించి బావగారిని నిర్దోషిగా విడిపించుకుంటుంది. మినిస్టర్ ధర్మేంద్ర భార్య తులసికి మరోసారి అనారోగ్యంతో ఉన్న బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డ బతకదని డాక్టర్లు చెప్పడంతో భార్యను కాపాడుకోవడం కోసం రుద్రాణి చెప్పినట్లు బిడ్డల్ని మార్చేస్తాడు ధర్మేంద్ర. బిడ్డను ముట్టుకోగానే తన బిడ్డ కాదని కావ్య గుర్తుపట్టడంతో దుగ్గిరాల ఫ్యామిలీ, రుద్రాణి షాక్ అవుతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup january 12th to january 17th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి జనవరి 12వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు .. 928వ ఎపిసోడ్ నుంచి 932వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

జనవరి 12వ తేదీ 928వ ఎపిసోడ్‌లో ..
తనకు పుట్టిన పిల్లలు పురిటిలోనే చనిపోతున్నారని తులసి, మినిస్టర్ ధర్మేంద్రలు బాధపడతారు. ఈసారి మాత్రం నువ్వే కాపాడాలని డాక్టర్‌కు చెబుతాడు ధర్మేంద్ర. ఆపరేషన్ చేయడానికి లోపలికి వచ్చిన డాక్టర్లకు బెడ్ మీద కావ్య కనిపించకపోవడంతో అంతా షాక్ అవుతారు. ఆ వెంటనే విషయం దుగ్గిరాల ఫ్యామిలీకి చెప్పగా వారు భయాందోళనలకు గురవుతారు. అయితే వదిన ఎక్కడుందో? ఎక్కడికి వెళ్లిందో నాకు తెలుసు? నేను వెళ్లి తీసుకొస్తానని కళ్యాణ్ అందరికీ చెబుతాడు. భర్త కోసం తపించిపోతున్న కావ్య... పురిటి నొప్పులతో బాధపడుతూనే పోలీస్ స్టేషన్‌కు వస్తుంది. ఆమెను అలా చూడగానే పోలీసులు సైతం నిర్ఘాంతపోతారు. ఏ తప్పు చేయని మీరు జైళ్లో ఉన్నారని దీని వెనుక ఏదో కుట్ర ఉందని రాజ్‌తో చెబుతుంది కావ్య. తన భర్తను వదిలేయాలని కావ్య పోలీసులను బతిమలాడుతుంది. రాజ్ గారు ఎలాంటి వారో నాకే కాదు, ఈ సిటీలో అందరికీ తెలుసని కావ్యతో ఎస్ఐ అంటాడు. కానీ సాక్ష్యాధారాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతాడు. ఇంతలో కావ్య పురిటి నొప్పులతో విలవిలలాడిపోవడంతో వెంటనే కళ్యాణ్ వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తాడు. కానిస్టేబుల్ దగ్గర ఫోన్ తీసుకున్న రాజ్... తాను జైలు నుంచి తప్పించుకుంటానని కళ్యాణ్‌కు ప్లాన్ చెబుతాడు.

జనవరి 13వ తేదీ 929వ ఎపిసోడ్‌లో ..
డెలివరీ టైంకు నీ పక్కనే ఉంటానని మీ వదినకి నేను మాటిచ్చాను.. ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేను జైలులో నుంచి తప్పించుకోవాలనిన చెబుతాడు రాజ్. అన్నయ్య చెప్పినట్లే వాళ్ల ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఓ కానిస్టేబుల్‌కు భోజనం ఇస్తున్నట్లు క్యారియర్ పంపించాలని, అందులో రాళ్లు తప్ప ఏం ఉండకూడదని చెబుతాడు కళ్యాణ్. అతని ఫ్రెండ్ కూడా కళ్యాణ్ చెప్పినట్లే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి క్యారియర్ ఇచ్చి వచ్చేస్తాడు. ఆ వెంటనే కళ్యాణ్ పోలీసులకు ఫోన్ చేసి ... కానిస్టేబుల్ క్యారియర్‌‌లో బాంబు ఉందని, వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసేయమని చెబుతాడు. దాంతో పోలీసులు, ఖైదీలు భయంతో బయటకు పరుగులు తీస్తారు. అప్పటికే కళ్యాణ్ బైక్ మీద రెడీగా ఉండటంతో రాజ్ తప్పించుకుంటాడు. హాస్పటల్‌కు వచ్చిన రాజ్‌ను అరెస్ట్ చేసి డిపార్ట్‌మెంట్‌కి అప్పగించాల్సిందిగా అప్పూకి పై అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. కావ్య గదిలోకి రాజ్ వెళ్తుండగా అప్పూ వచ్చి అడ్డుకుంటుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ రాజ్‌కు అడ్డుగా నిలబడి పోలీసులు లోపలికి వెళ్లకుండా ఆపుతారు. చావు బతుకుల్లో ఉన్న కావ్యకి రాజ్ ధైర్యం చెప్పి ఆపరేషన్‌కు ఒప్పిస్తాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup january 12th to january 17th episode Story

Photo Courtesy: JioHotstar

జనవరి 15వ తేదీ 930వ ఎపిసోడ్‌లో ..
ఆపరేషన్ థియేటర్‌లో రాజ్ ఉండటంతో డాక్టర్ సీరియస్ అవుతుంది. మీరు నేరం చేశారో? చేయలేదో నాకు తెలియదు.. కానీ ఓ క్రిమినల్ ఇక్కడ ఉండటానికి వీల్లేదని తక్షణం వెళ్లిపోమ్మని రాజ్‌పై మండిపడుతుంది డాక్టర్. నా భార్యా, బిడ్డల ప్రాణాల కాపాడండి.. కావ్యకి డెలివరీ అయిన వెంటనే పోలీసులకు లొంగిపోతానని రాజ్ బతిమలాడతాడు. కావ్య కూడా తన భర్త లేకుండా ఆపరేషన్ చేయించుకోనని మంకు పట్టు పట్టడంతో డాక్టర్ తప్పనిసరి పరిస్ధితుల్లో ఒప్పుకుంటుంది. ఆపరేషన్ ముగిసిన వెంటనే బావగారిని అరెస్ట్ చేస్తానని అప్పూ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఆమెను నానామాటలు అంటుంది. బావ గారిని అరెస్ట్ చేయకపోతే ఆయన జీవితాంతం జైళ్లోనే ఉండాలని అప్పూ చెబుతుంది. నీకు నీ అక్కాబావలపై అంత ప్రేమ ఉంటే ముందు రాజ్‌ని జైలు నుంచి బయటకు తీసుకురమ్మని చెబుతారు దుగ్గిరాల కుటుంబ సభ్యులు. దాంతో అప్పూ నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రాజ్ కేసుకు సంబంధించిన ఫైల్‌ను చదువుతుంది. ఆ వెంటనే శాండీగాడిని నాలుగు పీకడంతో రాహుల్ పేరు చెప్పకుండా రాజ్‌పై పగతోనే ఇదంతా చేశానని ఒప్పుకుంటాడు. కావ్యకు పండంటి ఆడబిడ్డ పుట్టడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది.

జనవరి 16వ తేదీ 931వ ఎపిసోడ్‌లో ..
మరోవైపు.. మినిస్టర్ ధర్మేంద్ర భార్య తులసికి కూడా అదే ఆసుపత్రిలో డెలివరీ చేస్తారు డాక్టర్స్. అయితే పాప పుట్టగానే ఏడవకపోవడం, ఆమె హార్ట్‌కు ప్రాబ్లం ఉందని తెలియడంతో డాక్టర్ చక్రవర్తి షాక్ అవుతాడు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు డాక్టర్ పుట్టాడా? బాబు పుట్టాడా అని అడుగుతాడు మినిస్టర్ ధర్మేంద్ర. ఆడపిల్ల పుట్టిందని చెప్పగానే మినిస్టర్ సంతోషిస్తాడు. కానీ పాప హార్ట్‌కు ప్రాబ్లమ్ ఉందని, తనకు ఆపరేషన్ చేసినా బతకదని డాక్టర్ చెప్పగానే ధర్మేంద్ర షాక్ అవుతాడు. కావ్య స్పృహలోకి వచ్చి కుటుంబాన్ని పలకరిస్తుంది. ఇంతలో కానిస్టేబుల్స్ వచ్చి రాజ్‌ను అరెస్ట్ చేయబోతుండగా అప్పూ అడ్డుకుని మా బావ నిర్దోషి అని జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్స్ చూపిస్తుంది. దాంతో అంతా సంతోషిస్తారు. తన పాపను బతికించుకోవడానికి మినిస్టర్ ధర్మేంద్ర అన్ని రకాల ప్రయత్నిస్తుండగా రుద్రాణి వచ్చి మీ పాపని నేను బతికిస్తానని చెబుతుంది. బిడ్డల్ని మార్చేద్దామని రుద్రాణి చెప్పగా ధర్మేంద్ర సీరియస్ అవుతాడు. మీరే నాకు ఫోన్ చేస్తారని విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్లిపోతుంది రుద్రాణి.

Brahmamudi Telugu Serial Weekly roundup january 12th to january 17th episode Story

Photo Courtesy: JioHotstar

జనవరి 17వ తేదీ 932వ ఎపిసోడ్‌లో ..
తులసి కళ్లు తెరిచి పాపను చూడాలని అడగటంతో భార్యను తీసుకుని వెళ్లి చూపిస్తాడు ధర్మేంద్ర. ఇన్నాళ్లు నేను నోచిన నోములకు దేవుడు కరుణించాడు.. పాపని అల్లారుముద్దుగా చూసుకుంటానని తులసి చెప్పడంతో ధర్మేంద్ర ఎమోషనల్ అవుతాడు. పాప బతకదని తెలిస్తే తన భార్య బతకదని వెంటనే రుద్రాణికి ఫోన్ చేస్తాడు ధర్మేంద్ర. బిడ్డలను మార్చడానికి నాకు అభ్యంతరం లేదని.. ఇంతకీ బిడ్డ తల్లిదండ్రులు ఎవరు అని మినిస్టర్ అడుగుతాడు. దాంతో రాజ్, కావ్యలను చూపిస్తుంది రుద్రాణి. హాస్పిటల్‌లో నర్స్‌కు డబ్బులు ఆశ చూపించి బిడ్డల్ని మార్చేస్తాడు మినిస్టర్. ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వచ్చి పాపను చూడాలని అడగటంతో డాక్టర్ బిడ్డను తీసుకొచ్చి కావ్య చేతిలో పెడుతుంది. చిన్నారి స్పర్శ తగలగానే ఈ బిడ్డ నా బిడ్డ కాదని కావ్య గుర్తుపట్టి గట్టిగా ఏడుస్తుంది. ఆ మాటలతో రాజ్, దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X