Brahmamudi Weekly Roundup : నగల రహస్యం బయటపెట్టిన రుద్రాణి .. కావ్య - రాజ్‌లను కాపాడిన అపర్ణ
తన శ్రీమంతం దుగ్గిరాల వారి కుటుంబంలో జరగకుండా చేసినందుకు కావ్యతో గొడవ పడుతుంది స్వప్న. కోడలిని దారిలోకి తెచ్చుకోవాలని రుద్రాణి - రాహుల్‌లు ప్రయత్నిస్తారు. తన బడ్జెట్‌లో శ్రీమంతానికి ఏర్పాట్లు చేస్తుంది కనకం. కనకం ఇంటికొచ్చిన కావ్యను నగల గురించి అడుగుతారు రుద్రాణి - ధాన్యలక్ష్మీ. శీమంతం శీను వేసిన విరిగిపోయిన కుర్చీలో కూర్చొని రుద్రాణి నడుం విరుగుతుంది. స్వప్న గతంలో కొనుక్కొన్న నెక్లెస్‌ని కావ్య ఆమెకు ఇవ్వడంతో రుద్రాణి - ధాన్యలక్ష్మీలు రచ్చ చేస్తారు. తాతయ్య హాస్పిటల్ బిల్‌ను కావ్య తన నగలు తాకట్టు పెట్టి కట్టిందని చెప్పిన రాహుల్ దీనికి సంబంధించిన రసీదుని తల్లికి చూపిస్తాడు. ఈ ఆధారంతో మరోసారి చిచ్చు పెడుతుంది రుద్రాణి. కొడుకు - కోడల్ని రక్షించడానికి నగల్ని తానే తాకట్టు పెట్టమని చెప్పినట్లు అపర్ణ అబద్ధం చెబుతుంది. ఇంటికొచ్చిన తర్వాత నిజం చెప్పమని కావ్యని ఎంత అడిగినా ఆమె నోరు విప్పకపోవడంతో తనతో మాట్లాడొద్దని అంటుంది అపర్ణ. తాతయ్య షూరిటీ గురించి నిజం చెబితేనే మన కష్టాలు తీరతాయని కావ్యతో అంటాడు రాజ్.
జనవరి 13వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు .. 618 ఎపిసోడ్ నుంచి 622 వరకు ఏం జరిగిందంటే?
జనవరి 13వ తేదీ 618వ ఎపిసోడ్‌లో తాతయ్య హాస్పిటల్ బిల్‌ను ఆఫీస్ అకౌంట్ నుంచి కాకుండా క్యాష్ రూపంలో చెల్లించినట్లు తెలియడంతో రుద్రాణి - రాహుల్‌లకు ఎక్కడో తేడా కొడుతుంది. తన శ్రీమంతం దుగ్గిరాల వారి ఇంట్లో కాకుండా పుట్టింట్లో జరిగేలా ఎందుకు చేశావంటూ కావ్యతో గొడవ పడుతుంది స్వప్న. ఇదంతా దూరం నుంచి చూసిన అపర్ణ.. నువ్వు చెప్పాల్సిన టైంలోనే నిజం చెప్పమని కోడలితో అంటుంది . శ్రీమంతం అత్తారింట్లో జరగకపోవడంతో బాధపడుతున్న స్వప్నను తమవైపుకు తిప్పుకోవాలని రాహుల్ - రుద్రాణిలు అనుకుంటారు. స్వప్న శ్రీమంతానికి .. శీమంతం శీను అనే ఈవెంట్ ప్లానర్‌తో బేరాలు ఆడి రూ.20 వేలకి ఒప్పందం కుదుర్చుకుంటుంది కనకం. గదిలో బట్టలు సర్దుతున్న కావ్య నడుమును చూసిన రాజ్.. ఆమెను వెనుక నుంచి పట్టుకోవాలని అనుకుంటాడు. శ్రీమంతం కోసం దుగ్గిరాల ఫ్యామిలీ కనకం ఇంటికొస్తుంది.

జనవరి 15వ తేదీ 619వ ఎపిసోడ్‌లో పుట్టింటికి మెడలో ఏం లేకుండా బోసిగా వచ్చిన కావ్యను నగల గురించి నిలదీస్తారు అపర్ణ, ధాన్యలక్ష్మీ, రుద్రాణి. కంగారులో మరిచిపోయానని ఆమె చెప్పినప్పటికీ రుద్రాణికి అనుమానం వస్తుంది. వియ్యాల వారికి కనకం, కృష్ణమూర్తిలు స్వాగతం పలుకుతారు. పుట్టింట్లో శ్రీమంతం ఏర్పాట్లు నచ్చకపోవడంతో బాధపడుతున్న స్వప్నకి కావ్య నచ్చజెప్పి నవ్విస్తుంది. కనకం చేయించిన ఉప్మా తినలేక పల్లెంలో పెట్టిన యాపిల్ తినబోతుండగా శీమంతం శీను వచ్చి రుద్రాణిని అడ్డుకుంటాడు. దీంతో అతని చెంప పగలగొడుతుంది రుద్రాణి. తాను తిన్నది ప్లాస్టిక్ పండ్లు అని తెలియడంతో కనకాన్ని నానామాటలు అంటుంది. పూలతో డెకరేట్ చేసిన గదిని చూస్తూ తన ఫస్ట్ నైట్ రోజును గుర్తుచేసుకుంటాడు రాజ్. ఇంతలో కావ్య లోపలికి వచ్చి తలుపు వేయగానే భార్యను దగ్గరికి లాక్కుంటాడు.
జనవరి 16వ తేదీ 620వ ఎపిసోడ్‌లో స్వప్న గతంలో కొనుక్కున్న నెక్లెస్‌ను రాజ్ కావ్యకి ఇచ్చి.. శ్రీమంతం గిఫ్ట్‌గా ఆమెకు ఇవ్వమంటాడు. ఎంత చెబుతున్నా వినకుండా విరిగిపోయిన కుర్చీలో కూర్చొని రుద్రాణి నడుం విరగ్గొట్టుకోవడంతో కనకం, శీమంతం శీను పకపక నవ్వుతారు. స్వప్నకి కావ్య నెక్లెస్ ఇస్తుండగా చూసిన రుద్రాణి.. ధాన్యంతో ఈ విషయం చెప్పి ఇంట్లో గొడవ చేస్తుంది. మమ్మల్ని ఒకలా , అక్కని ఒకలా చూస్తూ పక్షపాతం చూపిస్తున్నావంటూ కావ్యని ధాన్యలక్ష్మీ నానా మాటలు అంటుంది. మధ్యలో రాజ్ కలగజేసుకుని నెక్లెస్ నేనే తీసుకొచ్చి ఇవ్వమన్నానని చెబుతాడు. నా భార్య ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా చూడదని కౌంటర్ ఇస్తాడు. తాతయ్య హాస్పిటల్ బిల్‌ను కావ్య తన నగలు తాకట్టు పెట్టి కట్టిందని కాసేపట్లో ఆ రసీదు తీసుకొచ్చి ఇస్తానని రుద్రాణితో చెబుతాడు రాహుల్.

జనవరి 17వ తేదీ 621వ ఎపిసోడ్‌లో కావ్య బంగారం తాకట్టు పెట్టింది అని తెలుసుకున్న రుద్రాణి.. వెంటనే అపర్ణ దగ్గరికి వెళ్లి కావ్య నగల గురించి మళ్లీ పంచాయతీ పెడుతుంది. తన నెక్లెస్ తీసి కోడలి మెడలో వేస్తుంది అపర్ణ.. అత్తగారు తనపై చూపెడుతున్న ప్రేమతో కంటతడి పెడుతుంది కళావతి. స్వప్నకు ముత్తయిదువులు అంతా కలిసి శ్రీమంతం ఘనంగా చేయగా సంతోషంతో కనకం కంటతడి పెడుతుంది. ఇంట్లో అంతా ఆనందంగా ఉండటంతో రుద్రాణి ఉడుక్కుంటూ బయటికి వచ్చేస్తుంది. ఇంతలో రాహుల్ వచ్చి నగల తాకట్టుకు సంబంధించిన రసీదును తల్లికి చూపిస్తాడు. ఇదే అదనుగా లోపలికి వెళ్లి కావ్య - రాజ్‌లు నగలు తాకట్టు పెట్టిన విషయాన్ని బయటపెడుతుంది రుద్రాణి.
జనవరి 18వ తేదీ 622వ ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ భోజనాలు చేస్తుండగా రుద్రాణి వచ్చి తాకట్టు విషయం బయటపెడుతుంది. రాజ్ కలగజేసుకుని.. నువ్వు ఎన్ని చేసినా మౌనంగా ఉన్నానని ఇకపై సహించేది లేదని అంటాడు. అసలు కావ్యని నగలు తాకట్టు పెట్టమని చెప్పిందే నేనంటూ అబద్ధం చెప్పి రాజ్ - కావ్యలను కాపాడుతుంది అపర్ణ. జరిగిన అవమానంతో భోజనం చేయకుండా వెళ్లిపోతున్న రుద్రాణి - రాహుల్‌కి కృష్ణమూర్తి నచ్చచెప్పాలని చూసినా వాళ్లు పట్టించుకోకుండా వెళ్లిపోతారు. ఇంటికొచ్చిన తర్వాత అసలు నిజమేంటో చెప్పాలని కోడలిని నిలదీస్తుంది అపర్ణ. ఎంత అడిగినా కావ్య నిజం చెప్పకపోవడంతో ఇకపై నీతో మాట్లాడేది లేదని అంటుంది. అందరికీ ష్యూరిటీ గురించి చెబితేనే ఈ సమస్యలకు ముగింపు లభిస్తుందని కావ్యతో రాజ్ అంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











