Brahmamudi weekly roundup: డీఎన్ఏ రిపోర్ట్‌తో కావ్య షాక్.. ధర్మేంద్ర చెరలో డాక్టర్‌.. రుద్రాణి సంబరాలు

Photo Courtesy: JioHotstar

కావ్య తన బిడ్డ కోసం పిల్లల వార్డ్ అంతా వెతుకుతూ నానా రచ్చ చేస్తుండటంతో డాక్టర్ ఆమెను డిశ్చార్జ్ చేస్తుంది. ఇంటికి వచ్చాక కూడా కావ్య అలాగే ప్రవర్తిస్తుంది. అయితే అర్ధరాత్రి లేచి బిడ్డకు పాలు పట్టడంతో ఆమె తన బిడ్డగా అంగీకరించిందని సంబరపడిపోతారు. కావ్యకు అనుమానం మొదలైందని ఆమెను అంత తేలికగా వదిలేయొద్దని మినిస్టర్ ధర్మేంద్రకు వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. కావ్య చెప్పే కోణంలోనూ ఆలోచించాలని రాజ్‌కు దుగ్గిరాల ఫ్యామిలీ చెప్పడంతో డీఎన్ఏ టెస్ట్‌ చేయిస్తాడు రాజ్. అయితే రిపోర్ట్స్‌తో ఆ పాప కావ్య బిడ్డేనని బయటకు రావడంతో అంతా షాక్ అవుతారు. ఎవ్వరూ తన మాట నమ్మకపోవడం, డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కూడా వ్యతిరేకంగా రావడంతో కృష్ణుడి ముందు బాధపడుతుంది కావ్య. ఇంతలో పాప నురగలు కక్కడం, శరీరమంతా రంగు మారిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారు రాజ్ , కావ్య. అక్కడ పాపని పరీక్షించిన డాక్టర్ .. ఈ పాప మినిస్టర్ ధర్మేంద్ర కూతురని పసిగట్టి అసలు పాపని ఇచ్చేయమని వార్నింగ్ ఇస్తాడు. దాంతో డాక్టర్ చక్రవర్తిని మినిస్టర్ కిడ్నాప్ చేయిస్తాడు. పాపకు అరుదైన వ్యాధి వచ్చిందని డాక్టర్ చెప్పడంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup january 19th to january 24th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి జనవరి 19వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు .. 933వ ఎపిసోడ్ నుంచి 938వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

జనవరి 19వ తేదీ 933వ ఎపిసోడ్‌లో ..
ఈ బిడ్డ నా బిడ్డ కాదని, బిడ్డలు మారిపోయారని కావ్య పిల్లల వార్డ్‌లో ప్రతి బిడ్డను ఎత్తుకుంటూ ఉండటంతో రోగులు, బాలింతలు టెన్షన్ పడతారు. దాంతో దుగ్గిరాల కుటుంబంపై డాక్టర్ సీరియస్ అవుతుంది. బిడ్డలు మారిపోయే అవకాశం లేదని... అసలు ఈ పాప మీ పాప కాదని ఎలా చెబుతున్నారని నిలదీస్తుంది. ఈ బిడ్డను ఎత్తుకుంటే నాకు తల్లిగా ఎలాంటి ఫీలింగ్ రావడం లేదని.. పైగా తన పాప చేతిపై పుట్టుమచ్చను చూశానని, అది ఈ బిడ్డకు లేదని గుర్తులతో సహా చెబుతుంది కావ్య. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. మరోవైపు.. కావ్యకు బిడ్డల్ని మార్చిన విషయం తెలిసిపోయిందని వెంటనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వమని మినిస్టర్ ధర్మేంద్రకు పరుగు పరుగున వెళ్లి చెబుతుంది రుద్రాణి. కావ్య పరిస్దితి చూసిన డాక్టర్.. ఆమె ఇక్కడే ఉంటే మా ఆసుపత్రి పరువు పోతుందని, మీరు వెంటనే డిశ్చార్జ్ అయి వెళ్లిపోమ్మని రాజ్‌కు చెబుతుంది.

జనవరి 20వ తేదీ 934వ ఎపిసోడ్‌లో ..
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుదామని రాజ్ ఎంత చెప్పినా కావ్య వినిపించుకోదు. దాంతో నువ్వు డిశ్చార్జ్‌కు ఒప్పుకోకపోతే నేను చచ్చినంత ఒట్టేనని అనడంతో కావ్య భర్త కోసం మౌనం వహిస్తుంది. తర్వాత మినిస్టర్ భార్య, కావ్య - రాజ్‌లు ఆసుపత్రి నుంచి వెళ్లిపోతారు. బిడ్డల్ని మార్చి దుగ్గిరాల కుటుంబంలో చిచ్చు పెట్టాను.. ఆ కావ్య పిచ్చిది అవ్వడం ఖాయం, రాజ్ నీకు దక్కడం ఖాయమని రేఖతో అంటుంది రుద్రాణి. ఇంటికొచ్చాక కూడా కావ్య మనస్సు బిడ్డను అంగీకరించకపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ తలపట్టుకుంటుంది. పది రోజుల పాటు రాత్రి, పగలు మనబిడ్డ దగ్గరే ఉన్నాం.. డాక్టర్లు కూడా ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు.. అయినా బిడ్డ మారిపోయిందంటే ఎలా అని రాజ్ మండిపడతాడు. మన బిడ్డ కానీ బిడ్డని నేను బిడ్డగా అంగీకరించలేను, మీరు ఎవ్వరూ అంగీకరించకపోయినా నా బిడ్డను నేనే వెతుక్కుంటానని బిడ్డను అపర్ణ చేతిలో పెట్టి కోపంగా వెళ్లిపోతుంది కావ్య.

Brahmamudi Telugu Serial Weekly roundup january 19th to january 24th episode Story

Photo Courtesy: JioHotstar

జనవరి 21వ తేదీ 935వ ఎపిసోడ్‌లో ..
మినిస్టర్ ధర్మేంద్ర అతని భార్య తులసిలు పాపను చూసుకుంటూ, ఆడుకుంటూ మురిసిపోతారు. ఇంతలో రుద్రాణి వచ్చి... కావ్య సామాన్యురాలు కాదని, దానికి అనుమానం మొదలైంది అంటే అంతుచూసే వరకు వదిలిపెట్టదని ధర్మేంద్రకు వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. పాప ఆకలితో, తల్లి స్పర్శ లేక గుక్కపట్టి ఏడుస్తుండటంతో ఇందిర, అపర్ణ, ధాన్యలక్ష్మీలు ఎంత సముదాయించాలని చూసినా చిన్నారి ఏడుపు ఆపదు. ఇంతా జరుగుతున్నా కావ్య కనీసం గదిలో నుంచి బయటకు రాపోవడంతో రాజ్ బాధపడతాడు. పాప ఏడుపు విని కావ్య వచ్చి పాపకు పాలు పట్టడంతో అంతా సంతోషిస్తారు. ఇదంతా చూసిన రేఖ.. రాహుల్ దగ్గరికి వెళ్లి మన ప్లాన్ మొత్తం వేస్ట్ అంటుంది. ప్రేమ, మమకారం కావ్య బ్లడ్‌లోనే ఉన్నాయి. ఈ పాపే కాదు.. ఏ పాప ఏడ్చినా కావ్య అలాగే పాలు పడుతుందని చెబుతాడు రాహుల్. ఆ బిడ్డను కావ్య ఎప్పటికీ తన బిడ్డగా ఒప్పుకోదు.. ఇంతలో ఆ పాప హెల్త్‌ క్షీణించి చనిపోతుంది. ఇంటికి వారసుడిని ఇవ్వలేక.. రాజ్‌ని అలా చూడలేక కావ్య నలిగిపోతుంది. ఖచ్చితంగా రాజ్‌ని నీకు ఇచ్చి పెళ్లి చేయమని ఇంట్లో వాళ్లతో పోరాడుతుందని రాహుల్ చెప్పడంతో రేఖ సంతోషిస్తుంది.

జనవరి 22వ తేదీ 936వ ఎపిసోడ్‌లో ..
బిడ్డ ఏడుపు చూసి పాలు ఇచ్చాను కానీ.. ఈ బిడ్డ నా బిడ్డ కాదని కావ్య చెప్పడంతో రాజ్, దుగ్గిరాల కుటుంబం బాధపడుతుంది. కావ్య తప్పు చేసే మనిషి కాదు.. నవమాసాలు మోసి కన్నబిడ్డని ఏ తల్లి కూడా తన బిడ్డ కాదని చెప్పదు. అయినా కావ్య ఇంత బలంగా చెబుతుంది అంటే ఏదో కారణం ఉండే ఉంటుందని దుగ్గిరాల ఫ్యామిలీకి అనుమానం వస్తుంది. అక్క చెబుతున్నది నిజమో? కాదో? తెలియాలంటే పాపకి డీఎన్ఏ టెస్ట్ చేయించాలని అప్పూ చెప్పడంతో రాజ్ కూడా సరేనని అంటాడు. పాపకి డీఎన్ఏ టెస్ట్ చేయించడానికి కావ్యను ఒప్పిస్తాడు రాజ్. కావ్యకి రాజ్ డీఎన్ఏ టెస్ట్‌ చేయించబోతున్నాడని రుద్రాణి చెప్పడంతో మినిస్టర్ ధర్మేంద్ర షాక్ అవుతాడు. ఏం చేసైనా సరే ఈ బిడ్డను దూరం చేసుకోనని... నా భార్య ఇలాగే ఆనందంగా ఉండాలని రుద్రాణితో చెబుతాడు. డీఎన్ఏ టెస్ట్ కోసం కావ్య బ్లడ్ శాంపిల్స్ ఇస్తుంది. రిపోర్ట్స్ ఎలా వచ్చినా సరే దానికి కట్టుబడి ఉంటానని కావ్య దగ్గర రాజ్ మాట తీసుకుంటాడు. కావ్యను వరుసగా సమస్యలు చుట్టుముడుతూ ఉండటంతో సుభాష్, అపర్ణలు బాధపడతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup january 19th to january 24th episode Story

Photo Courtesy: JioHotstar

జనవరి 23వ తేదీ 937వ ఎపిసోడ్‌లో ..
పాప డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ చూసి రాజ్ షాక్ అవుతాడు. ఆ పాప మా బిడ్డేనని రిపోర్ట్స్‌లో వచ్చిందని చెప్పగానే దుగ్గిరాల ఫ్యామిలీ, కావ్యలు షాక్ అవుతారు. కన్నతల్లిని నా మాటను కాదని ఈ చిత్తు కాగితాలను నమ్ముతారా? అని భర్తప మండిపడుతుంది కావ్య. నా బిడ్డను నేనే వెతికి తెచ్చుకుంటాను.. నాకు ఎవ్వరి సాయం అక్కర్లేదని కావ్య చెబుతుంది. డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్‌ని మార్చేసి కావ్య ప్లాన్ తిప్పికొట్టడంతో ధర్మేంద్ర, రుద్రాణిలు సంబరాలు చేసుకుంటారు. ఇండియాలో ఏ ల్యాబ్‌లో డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నా.. ఆ పాప కావ్య బిడ్డేనని రిపోర్ట్ వస్తుందని రుద్రాణికి చెబుతాడు మినిస్టర్. ఇంట్లో నుంచి బయటకు వస్తున్న రుద్రాణిని చూసి ఆమె ఎవరు అని ధర్మేంద్రను అడుగుతుంది తులసి. డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినా కావ్య తన పట్టుదల వదిలిపెట్టకపోవడంతో భార్యపై కోప్పడతాడు రాజ్. కృష్ణుడి విగ్రహం ముందు కావ్య తన మొర చెప్పుకుంటూ ఉండగా.. పాప నోటి వెంట నురగ రావడం, శరీరం రంగు మారిపోతుండటంతో కావ్య షాక్ అవుతుంది.

జనవరి 24వ తేదీ 938వ ఎపిసోడ్‌లో ..
పాప నోట్లో నుంచి నురగా రావడం, శరీరమంతా రంగు మారిపోతుండటంతో రాజ్, కావ్యలు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ చక్రవర్తి పాపను పరీక్షించి టెస్టులు చేస్తాడు. పాపకు వచ్చిన వ్యాధి గురించి తెలుసుకుని షాక్ అవుతాడు. మినిస్టర్ ధర్మేంద్ర గారి పాపకు ఎలాంటి వ్యాధి ఉందో అదే వ్యాధి ఈ పాపకు కూడా ఉండటంతో ఉలిక్కిపడతాడు. నేను వినలేదని.. మరో రకంగా బిడ్డల్ని మార్చేసి ఉంటాడని కోపంతో రగిలిపోయిన చక్రవర్తి నేరుగా మినిస్టర్ ఇంటికి వెళ్తాడు. రుద్రాణి, ధర్మేంద్రలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వెళ్లి మీరు ఇలా చేయడం అస్సలు బాలేదని.. మర్యాదగా మీ బిడ్డ స్థానంలో ఉన్న కావ్య బిడ్డను ఇచ్చేయమంటాడు. కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతున్న డాక్టర్ చక్రవర్తిని మినిస్టర్ మనుషులు వెనుక నుంచి కొట్టడంతో అతను స్పృహ తప్పి పడిపోతాడు. దాంతో అతనిని తన గెస్ట్ హౌస్‌లో బంధిస్తాడు ధర్మేంద్ర. వెంటనే నర్స్ నీలవేణికి ఫోన్ చేసి నాటకం ఆడతాడు. పాప రిపోర్ట్స్ డాక్టర్ అనూరాధ చేతికి రావడంతో అది చూసి ఆమెకు షాక్ అవుతుంది. పాపకు అరుదైన వ్యాధి ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పడంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X