Brahmamudi Weekly Roundup : నందగోపాల్ దారుణహత్య .. సుభాష్‌కు అవమానం, కావ్యకు కొత్త కష్టాలు
కావ్య గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్‌ని రుద్రాణికి పంపిస్తుంది అనామిక. ట్రైనింగ్‌కు సెలవులు కావడంతో కళ్యాణ్‌ని చూడటానికి వస్తుంది అప్పూ. వారిద్దరికి అనామిక కనిపించి నానా మాటలు అనడంతో త్వరలోనే అప్పూ ఎస్ఐ నీలాంటి వాళ్ల అంతు చూస్తుందని కళ్యాణ్ వార్నింగ్ ఇస్తాడు. అనామిక ఇచ్చిన డాక్యుమెంట్స్‌తో గెస్ట్‌హౌస్ తాకట్టుపై పంచాయతీ పెడుతుంది ధాన్యలక్ష్మీ. నందగోపాల్ ఎక్కడ ఉన్నాడో తెలియడంతో వాడిని వెతుక్కుంటూ వెళ్లి పట్టుకుని పోలీసులకు అప్పగిస్తుండగా అగంతకుడు వచ్చి నందని కాల్చి చంపేస్తాడు. ఆస్తి నా మీద ఉందని.. నేనేం చేసినా మాట్లాడటానికి వీల్లేదని సుభాష్‌కి తేల్చి చెబుతుంది కావ్య. ఎంతో పెద్ద కష్టం వస్తేనే కావ్య అలా ప్రవర్తిస్తుందని ప్రకాశంతో అంటాడు సుభాష్. నన్ను బాగా అర్ధం చేసుకున్నందుకు మామగారికి థ్యాంక్స్ చెబుతుంది కావ్య. అసలు నందగోపాల్‌ను చంపాల్సిన అవసరం ఎవరికొచ్చిందని రాజ్‌ని అడుగుతుంది కావ్య.
జనవరి 20వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు .. 623 ఎపిసోడ్ నుంచి 628 వరకు ఏం జరిగిందంటే?
జనవరి 20వ తేదీ 623వ ఎపిసోడ్‌లో నందగోపాల్‌ను పట్టుకుంటే గానీ మన కష్టాలు పోవని రాజ్‌తో అంటుంది కావ్య. నగల తాకట్టు గురించి రుద్రాణి , రాహుల్, ధాన్యలక్ష్మీలు మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య గెస్ట్‌హౌస్‌ను తాకట్టు పెట్టిన విషయానికి సంబంధించిన డాక్యుమెంట్లను రుద్రాణికి పంపిస్తుంది అనామిక. ఇంట్లో చిచ్చుపెట్టడానికి అత్త ఏదో స్కెచ్ వేసిందని పసిగడుతుంది స్వప్న. కిచెన్‌లో ఉన్న కావ్య దగ్గరికి ఇందిర వచ్చి నగలు ఇస్తుంది. అయితే కళావతి వాటిని తిరస్కరించడంతో నేను పెట్టిన టెస్ట్‌లో నువ్వు పాసయ్యావని ఇందిర అంటుంది. హాస్పిటల్‌కు వచ్చిన అప్పూని చూసి భ్రమ పడుతున్నానని అనుకుంటాడు కళ్యాణ్. ఈ దెబ్బకు కళ్యాణ్‌కి దిమ్మ తిరుగుతుంది. ఉదయాన్నే కావ్య కాఫీ తీసుకొచ్చి ఇచ్చినా అపర్ణ తీసుకోదు.

జనవరి 21వ తేదీ 624వ ఎపిసోడ్‌లో మా అమ్మకి నేను కాఫీ ఇస్తానని గొప్పలు చెప్పి అపర్ణ గదిలోకి వెళ్లి తన్నులు తింటాడు రాజ్. ఇందిర ఎంత చెబుతున్నా వినకుండా మరోసారి కాఫీ తీసుకుని రాజ్ - కావ్యలు అపర్ణ దగ్గరికి వెళ్లి ఆమె కాళ్ల మీద పడతారు. కానీ అక్కడ అపర్ణకు బదులు ఇందిర కాఫీ తాగుతూ కనిపిస్తుంది. అప్పూ - కళ్యాణ్‌లు రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తుండగా అనామిక - సామంత్‌లు కనిపిస్తారు. అప్పూ ఎస్ఐ కాబోతోందని .. త్వరలోనే నీలాంటి వాళ్ల ఆట కట్టించబోతుందని చెబుతాడు కళ్యాణ్. అనామిక పంపించిన డాక్యుమెంట్స్ తీసుకుని ధాన్యలక్ష్మీకి చూపిస్తుంది రుద్రాణి. దుగ్గిరాల వారి గెస్ట్‌హౌస్‌ను రూ.10 కోట్లకు తాకట్టు పెట్టినట్లుగా అందులో ఉండటంతో ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. ఇంత ఆస్తిని ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చిందో అందరి ముందు కావ్యను నిలదీయాలని ధాన్యంతో అంటుంది రుద్రాణి.
జనవరి 22వ తేదీ 625వ ఎపిసోడ్‌లో నందగోపాల్ ఎక్కడ ఉన్నాడో ఎస్ఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో రాజ్ - కావ్యలు బయల్దేరుతుండగా ధాన్యలక్ష్మీ వాళ్లిద్దరినీ ఆపుతుంది. సుభాష్ చేతికి డాక్యుమెంట్స్ ఇచ్చి మీ కోడలు రూ.10 కోట్లకు దుగ్గిరాల వారి గెస్ట్ హౌస్‌ని తాకట్టు పెట్టిందని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అర్జెంట్ పని మీద వెళ్తున్నామని.. సాయంత్రం వచ్చి మీరు అడిగిన అన్ని విషయాలు చెబుతామని రాజ్ చెబుతాడు. అసలు ఇంతకీ డాక్యుమెంట్స్ మీ చేతికి ఎలా వచ్చాయని రుద్రాణి - రాహుల్‌లను నిలదీస్తుంది స్వప్న. నందగోపాల్ గాడిని పట్టుకుని మన రూ.100 కోట్లు కక్కించి జరిగినదంతా ఇంట్లో వాళ్లకి చెబితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్లేనని కావ్యతో అంటాడు రాజ్. తన అనుచరులతో కలిసి నందగోపాల్ ఓ ఇంట్లో మందు కొడుతూ ఉండగా.. అక్కడికి రాజ్ - కావ్యలు వస్తారు .

జనవరి 23వ తేదీ 626వ ఎపిసోడ్‌లో నందగోపాల్‌ను చితక్కొట్టిన రాజ్.. వాడిని పోలీసులకు అప్పగించి బయటికి తిరిగొస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి అతనిని కాల్చి చంపుతాడు. కష్టాలు పొయినట్లేనని సంబరపడుతున్న రాజ్ - కావ్యలు ఈ హఠాత్పరిణామంతో షాక్ అవుతారు. మరోవైపు.. రాజ్ - కావ్యల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎదురుచూస్తుంటుంది. ఇంతలో వాళ్లిద్దరూ రాగానే ఇంటికి రుద్రాణి, ధాన్యలక్ష్మీలు రౌండప్ చేసి ఆస్తుల్ని ఎందుకు తాకట్టు పెట్టారు? అంత అవసరం ఏమొచ్చిందని అడుగుతారు. మీ అమ్మ కనకం మీ అక్కచెల్లెళ్లను నాటకాలాడి మాకు అంటగట్టిందని ధాన్యం మండిపడుతుంది. తన ముందే కావ్యను నానా మాటలు అనడంతో రాజ్ తట్టుకోలేక.. మేం చెప్పే నిజం విని తట్టుకోగలరా అంటాడు . భర్త నిజం చెప్పేస్తాడేమోనని భయపడిన కావ్య అతనిని ఆపుతుంది.
జనవరి 24వ తేదీ 627వ ఎపిసోడ్‌లో ఆస్తి మొత్తం నా మీద ఉందని.. నేనేం చేసినా ఎవ్వరూ కలగజేసుకోవడానికి వీలు లేదని సుభాష్‌కి తేల్చి చెబుతుంది కావ్య. మామగారిని కళావతి ఎదిరించేసరికి దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. ఇంతలో అపర్ణ వచ్చి కావ్యని కొట్టబోతుండగా సుభాష్ ఆపుతాడు. గదిలోకి వెళ్లి దేవుడి లాంటి మామయ్య గారిని నానా మాటలు అన్నానని మీకు కోపం రాలేదా అని రాజ్‌ని ప్రశ్నిస్తుంది. ఇన్నాళ్లు నీ విలువ నాకు తెలియలేదని .. ఇకపై నిన్ను ఏ కష్టం లేకుండా చూసుకుంటానని రాజ్ చెప్పడంతో భర్తను హత్తుకుని ఏడుస్తుంది కావ్య . రైటర్ లక్ష్మీకాంత్ కోసం పాట రాస్తుండగా కళ్యాణ్‌కు అనామిక మాటలే గుర్తొస్తాయి. అర్ధరాత్రి ఇంటి ముందు ఒంటరిగా బాధపడుతున్న సుభాష్ దగ్గరికి ప్రకాశం వచ్చి ఆస్తిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో కావ్య ఏం చేస్తోందని ప్రశ్నిస్తాడు ప్రకాశం .

జనవరి 25వ తేదీ 628వ ఎపిసోడ్‌లో ఏనాడూ పల్లెత్తు మాట కూడా అనని కావ్య .. ఈరోజు అంత మాట అందంటే తనకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో ఆలోచించాలని ప్రకాశంతో అంటాడు సుభాష్. ఇదంతా లోపలి నుంచి చూసి కంటతడి పెడుతుంది కళావతి. భోజనాల దగ్గరికి సుభాష్ - అపర్ణ రాకపోవడంతో కావ్యని నానామాటలు అంటుంది రుద్రాణి. తనను బాగా అర్ధం చేసుకున్నందుకు మామగారికి థ్యాంక్స్ చెబుతుంది కావ్య. గదిలో బాధపడుతున్న అపర్ణకి భోజనం తీసుకెళ్లి తినిపిస్తుంది ఇందిర. గార్డెన్‌లో కూర్చొని ఆలోచిస్తున్న కావ్య దగ్గరికి రాజ్ రాగా.. అసలు నందగోపాల్ చనిపోవడం వల్ల ఎవరికి లాభం అని ప్రశ్నిస్తుంది. సామంత్ - అనామికలు చెస్ ఆడుతూ నందగోపాల్ హత్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తరవాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











