Brahmamudi weekly roundup: బిడ్డని కనిపెట్టిన కావ్య.. మినిస్టర్‌కు వార్నింగ్, నిజం తెలుసుకున్న రాజ్

Photo Courtesy: JioHotstar

మీ బిడ్డకు అరుదైన వ్యాధి ఉందని డాక్టర్ చెప్పడంతో అనారోగ్యంగా ఉన్న బిడ్డను మాకు ఇచ్చి.. ఆరోగ్యంగా ఉన్న మా పాపని మార్చేస్తారా అని రాజ్ ముందే కావ్య సీరియస్ అవుతుంది. బిడ్డను స్వప్నకి ఇచ్చి కావ్య వెళ్లి డాక్టర్‌ను కలుస్తుంది. నాకు సాయం చేయాలంటూ కళావతి ప్రాధేయపడటంతో డాక్టర్ ఒప్పుకుంటుంది. గుడిలో శాంతి పూజ చేయించుకుంటున్న ధర్మేంద్ర, తులసి దగ్గరికి కావ్య వస్తుంది. బిడ్డ ఏడుపు చూసి జోలపాట పాడటంతో చిన్నారి పడుకుంటుంది. తులసి ఒడిలోని బిడ్డను ఎత్తుకోగానే కావ్యకు అది తన బిడ్డేనని తెలిసిపోతుంది. దాంతో బిడ్డను వెంబడిస్తూ వెళ్తుండగా రుద్రాణి అడ్డుపడుతుంది. నేరుగా హాస్పిటల్‌కు వెళ్లిన కావ్య డాక్టర్‌తో కలిసి హెడ్ నర్స్‌ని చితకబాదడంతో నిజం చెబుతుంది నర్స్. దాంతో రిపోర్ట్స్ తీసుకుని నేరుగా మినిస్టర్ ధర్మంద్ర ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇంటికి వెళ్లిన కావ్యపై రాజ్ సీరియస్ అవుతాడు. భర్తకు జరిగినదంతా చెప్పిన కావ్య.. నేరుగా మినిస్టర్ ఇంటికి తీసుకెళ్లి బిడ్డను చూపిస్తుంది. దాంతో కావ్య, రాజ్‌లు కలిసి బిడ్డను వెనక్కి తీసుకురావడానికి పథకం వేస్తారు.

Brahmamudi Telugu Serial Weekly roundup january 26th to january 31st episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి జనవరి 26వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు .. 939వ ఎపిసోడ్ నుంచి 943వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

జనవరి 26వ తేదీ 939వ ఎపిసోడ్‌లో ..
పాపకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్ గురించి చెప్పి ఆపరేషన్ చేయాలని చెబుతుంది డాక్టర్. అయితే సర్జరీ చేసినా చిన్నారి బతుకుతుందన్న గ్యారంటీ లేదని అనడంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. ఆ మాటలతో ఈ పాపకు ఉన్న వ్యాధి గురించి మీకు ముందే తెలుసు.. అందుకే అనారోగ్యంతో ఉన్న పాప స్థానంలో ఆరోగ్యంగా ఉన్న నా బిడ్డను మార్చారని ఆరోపిస్తుంది కావ్య. ఆమె మాటలతో డాక్టర్ సీరియస్ అవుతుంది. నువ్వు ఈ జన్మకు మారావా? అర్ధం చేసుకుంటావని అనుకున్నాను, కానీ నీలో ఎలాంటి మార్పులేదని ఫైర్ అవుతుంది. ఇంటికొచ్చిన రాజ్... కుటుంబ సభ్యులకు జరిగినదంతా చెబుతాడు. కావ్య మాత్రం నా బిడ్డను మార్చేశారు.. నా బిడ్డను నేనే వెతికి తెచ్చుకుంటానని అంటుంది. తన ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా వర్కవుట్ కావడంతో రాహుల్, రేఖలతో కలిసి రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది. త్వరలో కావ్య పిచ్చిది అయిపోతుందని ఆ వెంటనే రాజ్‌తో నీకు పెళ్లి అని రేఖతో రుద్రాణి చెబుతుంది. పాప జాతకంలో చిన్న దోషం ఉందని.. పూజ చేస్తే అన్ని దోషాలు పోతాయని జ్యోతిష్యుడు చెప్పడంతో మినిస్టర్ ధర్మేంద్ర షాక్ అవుతాడు.

జనవరి 27వ తేదీ 940వ ఎపిసోడ్‌లో ..
పాప గురించి పిచ్చిదానిలా మారిపోతూ, కుటుంబానికి దూరమైపోతున్న కావ్య గురించి ఆలోచిస్తున్న అప్పూ దగ్గరికి స్వప్న వచ్చి జ్యూస్ ఇస్తుంది. నీకు నా మీద కోపం పోయిందా? అని అడుగుతుంది. రాహుల్‌ని అనుమానించడంతో ముందు నీ మీద కోపం వచ్చినా నీ నిజాయితీతో రాజ్‌ని కాపాడావని... లేదంటే కావ్య మనకి దక్కేదే కాదని మెచ్చుకుంటుంది స్వప్న. ఇంతలో కావ్య వచ్చి స్వప్నకి బిడ్డను ఇచ్చి... బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్లిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి తన బిడ్డను వెతకడంలో సాయం చేయమని ప్రాధేయపడుతుంది కావ్య. కళావతి మాటలతో కరిగిపోయిన డాక్టర్.. సాయం చేయడానికి ఒప్పుకుంటుంది. పాపకు పంతులుగారు చెప్పినట్లు శాంతి పూజ చేయించడానికి తులసిని గుడికి తీసుకుని వస్తాడు మినిస్టర్ ధర్మేంద్ర. అక్కడ మినిస్టర్‌ని చూసి షాకైన రుద్రాణి... ఎందుకు బయటకు వచ్చారు? కొన్నాళ్లు ఇల్లు దాటి బయటకు రావొద్దని చెప్పానని మండిపడుతుంది. శాంతి పూజ కోసం వచ్చామని త్వరగా వెళ్లిపోతామని చెబుతాడు ధర్మేంద్ర. ఇంతలో కావ్య అదే గుడికి వచ్చి దేవుడి ముందు బాధపడుతుంది. ఇదే సమయంలో తులసి ఒడిలో ఉన్న పాప బాగా ఏడుస్తుంది. దాంతో బిడ్డ దగ్గరికి వెళ్తుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup january 26th to january 31st episode Story

Photo Courtesy: JioHotstar

జనవరి 28వ తేదీ 941వ ఎపిసోడ్‌లో ..
పాప ఏడుస్తుండటంతో తులసి ఎంతగా లాలించినా చిన్నారి ఏడుపు ఆపదు. దాంతో కావ్య జోల పాట పాడటంతో చిన్నారి ఏడుపు ఆపేస్తుంది. ఇదంతా చూసిన రుద్రాణి.. వెంటనే మినిస్టర్‌ ధర్మేంద్రను పక్కకు పిలిచి ఈ కావ్య ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది. ఇదంతా అనుకోకుండా జరిగిందని.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెబుతుంది రుద్రాణి. కావ్య తన పాప కోసం వెతుకుతున్నట్లు తులసికి చెప్పడంతో మా ఆయన మినిస్టర్, మీకు తప్పకుండా న్యాయం చేస్తారని అంటుంది తులసి. వెంటనే ఈ విషయాన్ని ధర్మేంద్రకు చెప్పగా.. నా పీఏకి నీ సమస్య చెబితే నీ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తానని నటిస్తాడు ధర్మేంద్ర. చీరకు అంటుకున్న పసుపు, కుంకుమలను శుభ్రం చేసుకుంటూ పాపని కావ్యకు ఇస్తుంది తులసి. చిన్నారి స్పర్శ తగలగానే అది తన బిడ్డేనని కావ్య గుర్తుపడుతుంది. ఇది చూసిన మినిస్టర్ ఆ పాపను బలవంతంగా లాక్కుని వెళ్లిపోతుండగా.. పాప చేతి ఉన్న పుట్టుమచ్చని చూస్తుంది కావ్య. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ రోజున తనతో పాటు డెలివరి అయిన వాళ్ల వివరాలు తెలుసుకుంటుంది. అందులో తులసి కూడా ఉండటంతో షాక్ అవుతుంది. నా పాపను చక్రవర్తి అనే డాక్టర్ గారు టెస్ట్ చేశారని .. కానీ ఆయన కనిపించకుండా పోయాడని చెబుతుంది కావ్య.

జనవరి 29వ తేదీ 942వ ఎపిసోడ్‌లో ..
బిడ్డల్ని మార్చిన విషయం డాక్టర్ చక్రవర్తి గారికి తెలిసిపోయిందని.. దీనిపై అడిగేందుకు మినిస్టర్ ఇంటికి వెళ్లడంతో ధర్మేంద్ర గారే చక్రవర్తిని ఏదో చేశాడని కావ్య అనడంతో డాక్టర్ షాక్ అవుతుంది. అయితే హెడ్ నర్స్‌ నీలవేణికి కూడా ఆరోజు ఇక్కడేం జరుగుతుందో తెలిసే అవకాశం ఉందని చెబుతుంది డాక్టర్. ఉన్నపళంగా బోల్డెంత డబ్బులు రావడం, నగలు చేయించుకున్న విషయాన్ని మరో నర్స్‌తో చెబుతుంది నీలవేణి.. ఇంతలో కావ్య, డాక్టర్ అనురాధ వచ్చి ఆమెను నాలుగు పీకడంతో నిజం చెప్పేస్తుంది నర్స్. ఈ విషయం తెలిస్తే ఆ మినిస్టర్ నన్ను చంపేస్తాడని చెబుతుంది నీలవేణి. కావ్య, డాక్టర్‌లు బిడ్డ పుట్టుమచ్చ కోసం రిపోర్ట్స్ పరిశీలించగా... మినిస్టర్ వాటిని కూడా తనకు అనుకూలంగా మార్చేసినట్లు గుర్తిస్తారు. నువ్వు నీ బిడ్డ గురించి ఎంత చెబుతున్నా మేం వినిపించుకోలేదు.. నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా చేస్తానని కావ్యకు మాటిస్తుంది డాక్టర్. కావ్య ఎంతకు రాకపోవడం, బిడ్డ ఏడుపు ఆపకపోవడంతో రాజ్‌పై దుగ్గిరాల ఫ్యామిలీ మండిపడుతుంది. ఇంతలో రేఖ వచ్చి కావ్య పిచ్చిదానిలా రోడ్ల వెంట పరుగులు తీస్తోందని, కనిపించినవారి పిల్లలను లాక్కుంటోందని చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup january 26th to january 31st episode Story

Photo Courtesy: JioHotstar

జనవరి 30వ తేదీ 943వ ఎపిసోడ్‌లో ..
బిడ్డల్ని మినిస్టర్ మార్చిన విషయం ఆధారాలతో సహా తెలుసుకున్న కావ్య నేరుగా ధర్మేంద్ర ఇంటికి వస్తుంది. ఆమెను చూడగానే రుద్రాణి లోపలికి వెళ్లి దాక్కుంటుంది. నీ బిడ్డను నేనే మార్చాను.. ఈ జన్మలో నీకు దక్కనివ్వనని చెబుతాడు ధర్మేంద్ర. డబ్బు, పరపతి, పవర్ ఉన్నాయని రెచ్చిపోతున్నావు.. ఇంకో 15 రోజుల్లో నీకు బుద్ధి చెబుతానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య. బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుండటంతో కావ్య ఎంతకు ఇంటికి రాకపోవడంతో భార్యపై రగిలిపోతుంటాడు రాజ్. అప్పుడే ఇంటికి వచ్చిన కావ్యను రాజ్ గుమ్మంలోనే ఆపేస్తాడు. నీ అనుమానాలతో పసికందును ఏడిపిస్తావా అంటూ క్లాస్ పీకుతాడు. నాకు నిజం తెలిసింది.. ఇకపై నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలదని చెబుతుంది కావ్య. తాను చెప్పిన మాటలతో కావ్యని అందరూ ఛీ కొడతారు.. ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందని అనుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉండటంతో రేఖ రగిలిపోతుంది. ఇంట్లో ఏం జరిగిందో ఆ వెంటనే రుద్రాణికి చెబుతుంది రేఖ. ఆ కావ్య ఇంటిలో నుంచి బయటికి రాకుండా చూస్తే నేను నా ప్లాన్‌ని అమలు చేస్తానని చెబుతుంది రుద్రాణి. బిడ్డను వదిలేసి ఎక్కడికి వెళ్లావని కావ్యని నిలదీస్తాడు రాజ్. దాంతో ఆసుపత్రిలో బిడ్డలను మార్చిన విషయాన్ని ఆధారాలతో సహా బయటపెడుతుంది కావ్య.

జనవరి 31వ తేదీ 944వ ఎపిసోడ్‌లో ..
మినిస్టర్ తన బిడ్డను ఎలా మార్చింది.. ఎలా నాటకం ఆడింది అన్ని వివరాలు కావ్య చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నా మాటల మీద మీకు నమ్మకం రావడం లేదా? అని వెంటనే భర్తను తీసుకుని మినిస్టర్ ఇంటికి దొంగచాటుగా వెళ్తుంది కావ్య. అక్కడ బిడ్డను తులసి ముద్దు చేస్తూ ఉంటుంది. తులసి, ధర్మేంద్రలు భోజనం చేయడానికి వెళ్లగానే పాపని ముద్దాడుతూ మురిసిపోతుంది కావ్య. పాప చేతిపై ఉన్న పుట్టుమచ్చని చూపించడంతో రాజ్ షాక్ అవుతాడు. ఆ వెంటనే బిడ్డ ఏడ్చిన అలికిడికి ధర్మేంద్ర, తులసి పైకి వచ్చి చూస్తారు. నువ్వు చెబుతుంటే నేను నమ్మలేకపోతున్నా.. ఎంత ధైర్యం ఉంటే మన బిడ్డని మార్చేస్తాడని కావ్యతో అంటాడు రాజ్. మన బిడ్డను దక్కించుకోవడానికి నువ్వు ఏం చెప్పినా నేను చేస్తానని చెబుతాడు. మరుసటి రోజు కావ్య, తులసిలు తమ బిడ్డల్ని తీసుకుని ఆసుపత్రికి వస్తారు. అక్కడ రాజ్‌ని తులసికి పరిచయం చేస్తుంది కావ్య. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X