Brahmamudi weekly roundup: రుద్రాణిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కనకం.. రాజ్‌ని ఇరికించిన రాహుల్
Photo Courtesy: JioHotstar
కావ్య కడుపులోని బిడ్డను చంపాలని రుద్రాణి చేసిన కుట్రను ఆధారాలతో సహా బయటపెడుతుంది కనకం. దాంతో రుద్రాణిని ఇంట్లో నుంచి గెంటేస్తుంది ఇందిర. నన్ను అవమానించిన దుగ్గిరాల ఫ్యామిలీ ముక్కలు కావాలని రాహుల్, రేఖలకు చెబుతుంది రుద్రాణి. తల్లికిచ్చిన మాట ప్రకారం రాజ్‌ని దొంగ బంగారం కేసులో పక్కాగా ఇరికిస్తాడు రాహుల్. భర్త అరెస్ట్ కావడంతో కావ్యకు పురిటి నొప్పులు వస్తాయి.. ఆమెను ఆసుపత్రిలో చేర్చగా అర్జెంట్‌గా 7వ నెలలోనే ఆపరేషన్ చేయాలని లేదంటే తల్లీబిడ్డా ఇద్దరూ దక్కరని చెబుతుంది డాక్టర్. శని, ఆదివారాలు కావడంతో రాజ్‌కి బెయిల్ దొరకదు. రాజ్ వస్తేనే తాను ఆపరేషన్ చేయించుకుంటానని కావ్య మొండిగా ఉండటంతో అన్నయ్య వచ్చేస్తున్నాడని కళ్యాణ్ అబద్ధం చెబుతాడు. రాజ్ అరెస్ట్ కావడం వెనుక రాహుల్ ఉన్నాడని అప్పూ అనుమానిస్తుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి జనవరి 5వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు .. 922వ ఎపిసోడ్ నుంచి 927వ వరకు ఏం జరిగిందంటే?
జనవరి 5వ తేదీ 922వ ఎపిసోడ్‌లో ..
కావ్య కడుపుని పొగొట్టి రేఖను రాజ్‌కిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది రుద్రాణి. అర్ధరాత్రి పసరు మందు తీసుకొస్తూ కనకానికి ఎదురవుతుంది. చేతిలో ఆ బాటిల్ ఏంటని కనకం అడగ్గా.. నాకు అజీర్తి చేసింది పసరు మందు తెచ్చుకుంటున్నానని చెబుతుంది రుద్రాణి. పసరు మందు ఉదయం పూట ఇస్తారు, అర్ధరాత్రి ఇవ్వరని కనకానికి ఏదో తేడా కొడుతుంది. కావ్య, అప్పూల శ్రీమంతం కోసం రాజ్, కళ్యాణ్‌లు ఏర్పాట్లు ఇరగదీస్తారు. అయితే విలువైన బంగారు నగల్ని తీసుకొచ్చి మట్టిగాజులు తీసుకురాకపోవడంతో వాటి ప్రాశస్త్యాన్ని చెబుతుంది కనకం. దాంతో పశ్చాత్తాపపడిన రాజ్.. ఇప్పుడే ఎన్ని మట్టిగాజులు కావాలంటే అన్ని తెప్పిస్తానని చెబుతాడు. అప్పూ, కావ్యలను రాజ్, కళ్యాణ్‌లు అందంగా ముస్తాబు చేస్తూ మురిసిపోతారు. ఇంతలో కావ్య తాగే కషాయంలో పసరు మందు కలపడానికి రుద్రాణి టైం కోసం ఎదురుచూస్తుంటుంది.
జనవరి 6వ తేదీ 923వ ఎపిసోడ్‌లో ..
కావ్య కడుపు పొగొట్టాలని రేఖ, రుద్రాణిలు రాజ్ బెడ్ రూం దగ్గర కాపు కాస్తారు. ఇంతలో కనకం వచ్చి.. ఎన్నో కష్టాలు పడ్డావు అసలు నీ కాపురం నిలబడుతుందో? లేదో అనుకున్నాను? కానీ నీ ఓర్పు, సహనంతో అందరి మనసులు గెలుచుకున్నావని కావ్యని మెచ్చుకుంటుంది. ఎంతకూ కావ్య, కనకం, ఇందిరలు అక్కడే ఉండటంతో పసరు మందు కలిపే వీలు లేక రేఖ, రుద్రాణిలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పూ, కావ్యలకు వారి భర్తల చేతుల మీదుగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహిస్తారు పంతులుగారు. ఫ్యామిలీ అంతా ఫంక్షన్‌లో ఉండగా... ఇదే మంచి సమయమని భావించిన రుద్రాణి కావ్య కషాయంలో పసరు మందు కలపాలని అనుకుంటుంది. దొంగచాటుగా రాజ్ బెడ్ రూంలోకి వెళ్లి పసరు మందు కలుపుతుండగా కనకం వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. దాంతో షాకైన రుద్రాణి... ఇది కలిపితే కావ్య కడుపుకి మంచిది, బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని కవర్ చేసినా కనకం నమ్మదు. కావ్యకి రుద్రాణి బొట్టు పెడుతుండగా కనకం ఆ పసరు మందు అమ్మినవాడిని తీసుకుని రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

Photo Courtesy: JioHotstar
జనవరి 7వ తేదీ 924వ ఎపిసోడ్‌లో ..
కావ్య కడుపులోని బిడ్డను పసరు మందుతో చంపాలని రుద్రాణి చేసిన కుట్రను సాక్ష్యాధారాలతో సహా బయటపెడుతుంది కనకం. దాంతో ఈ కనకం మన సంతోషాన్ని దూరం చేయడానికి వచ్చింది, నేనెందుకు అలా చేస్తాను, నాకేం పని అని కవర్ చేయడానికి రుద్రాణి ప్రయత్నిస్తుంది. దాంతో పసరు మందు ఇచ్చినవాడిని సుభాష్ నాలుగు పీకడంతో అతను నిజం చెప్పేస్తాడు. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మా బావ ఇచ్చిన ఎప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి నీకు ఈ కుటుంబం కూతురి హోదా కల్పించింది. నా బిడ్డలతో సమానంగా, నా కన్నకూతురిలా నిన్ను పెంచానని ఇందిర ఫైర్ అవుతుంది. రాహుల్, రేఖలు కూడా రుద్రాణిని అసహ్యించుకున్నట్లుగా నటిస్తారు. రాహుల్‌ని నా సొంత తమ్మడిలా చూసుకున్నాను, వాడితో కంపెనీ పెట్టించి మాతో సమానంగా ఎదిగేలా చేశాను కానీ నువ్వు మా జీవితాలతో ఆడుకున్నావని రాజ్ బాధపడతాడు. ఆ వెంటనే రుద్రాణిని మెడపెట్టి బయటకు గెంటేస్తుంద ఇందిర. తనకు జరిగిన అవమానానికి రుద్రాణి పగతో రగిలిపోతుంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీని ముక్కలు చేసే వరకు మీరిద్దరూ అక్కడే ఉండాలని రేఖ, రాహుల్‌లకు చెబుతుంది రుద్రాణి.
జనవరి 8వ తేదీ 925వ ఎపిసోడ్‌లో ..
రుద్రాణి కుట్ర నుంచి క్షేమంగా బయటపడినా తన బిడ్డకు ఏం జరగుతుందోనని కావ్య బాధపడుతుంది. దాంతో రాజ్ వచ్చి భార్యను ఓదారుస్తాడు. ఆ భగవంతుడి దయ వల్ల గండం గడిచిందని ఆయన తోడు ఉండగా మన బిడ్డకు ఏం కాదని చెబుతాడు. ఈ సంఘటన ద్వారా ఇకపై బిడ్డ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మనకి హెచ్చరిక అని చెబుతాడు రాజ్. నేను బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మీరు నా పక్కనే ఉంటానని మాట ఇవ్వాలని రాజ్ దగ్గర మాట తీసుకుంటుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రుద్రాణి చేసినది తలచుకుంటూ బాధపడుతుంది. మా అమ్మ మీద కోపం తగ్గకపోతే నన్ను, నా చెల్లెలిని శిక్షించాలని నటిస్తాడు రాహుల్. ఇంతలో ఇంటికి పోలీసులు వచ్చి మీరు దొంగ బంగారం నిల్వ చేస్తున్నారని శాండీని తీసుకొచ్చి చూపిస్తారు. అతను కూడా తాను రాజ్‌కి దొంగ బంగారం అమ్మినట్లు చెబుతాడు. పోలీసులకు రాజ్ కారులో బంగారం ఉన్న బ్రీఫ్‌కేస్ దొరకడంతో రాజ్‌ని అరెస్ట్ చేస్తారు. భర్తని అరెస్ట్ చేయడంతో కావ్య కంగారుపడుతుంది.

Photo Courtesy: JioHotstar
జనవరి 9వ తేదీ 926వ ఎపిసోడ్‌లో ..
రాజ్‌ని అరెస్ట్ చేయడంతో కావ్య టెన్షన్ పడటంతో ఆమెకు పురిటినొప్పులు వస్తాయ. దాంతో వెంటనే కావ్యను ఆసుపత్రికి తరలిస్తారు. వెంటనే కావ్యకి ఆపరేషన్ చేయకపోతే తల్లీ, బిడ్డా ఇద్దరికీ ప్రమాదమని డాక్టర్ చెబుతుంది. తనకు వెంటనే మా ఆయనని చూడాలని కావ్య చెప్పడంతో డాక్టర్ వెంటనే ఆమె భర్తను తీసుకొచ్చే ఏర్పాట్లు చేయమని చెబుతుంది. రాజ్‌ను తీసుకుని రావడానికి కళ్యాణ్, సుభాష్‌లు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కావ్య పరిస్ధితి చెప్పడంతో రాజ్ బాధపడతాడు. నేను నిర్దోషిగా బయటకు వస్తాను, అప్పటి వరకు కావ్యను జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు రాజ్. తనను ఎవరు ఈ కేసులో ఇరికించారు? నా కారులోకి బంగారం ఎలా వచ్చిందోనని రాజ్ ఆలోచిస్తూంటాడు. రాజ్‌కి బెయిల్ వచ్చే పరిస్ధితి లేదని సుభాష్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.
జనవరి 10వ తేదీ 927వ ఎపిసోడ్‌లో ..
రాహుల్ ప్రవర్తనపై అప్పూకి అనుమానం వచ్చి .. ఆరోజు నీ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్, బావగారి కారులోని బ్రీఫ్ కేస్ రెండూ ఒకటేనని అనడంతో రాహుల్ షాక్ అవుతాడు. భర్తను తన చెల్లెలు అనుమానిస్తూ ఉండటంతో స్వప్న సీరియస్ అవుతుంది. ప్రతిదానికి రాహుల్‌ను అనుమానించడం నీకు అలవాటైపోయిందని మండిపడుతుంది. నా కోడలిని ఏమీ అనొద్దని స్వప్నకి వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మీ. ఇంట్లో మనషులు తమలో తాము కొట్టుకుంటూ ఉండటంతో ఇందిర సీరియస్ అవుతుంది. మరోవైపు మినిస్టర్ ధర్మేంద్ర భార్యకు ప్రెగ్నెన్సీ నిలవకపోవడంతో బాధపడుతుంటాడు. భార్యను తీసుకుని చివరిసారిగా ప్రెగ్నెన్సీ కోసం ఆసుపత్రికి తీసుకొస్తాడు. కావ్య ఎంతకూ ట్రీట్‌మెంట్ చేసుకోకపోవడంతో అన్నయ్య కాసేపట్లోనే తిరిగొస్తానని చెప్పాడని కళ్యాణ్ అబద్ధం చెబుతాడు. ఇదంతా విన్న కావ్య బాధపడుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











