Brahmamudi Weekly Roundup : రుద్రాణికి షాక్, రాజ్‌ను రక్షించిన కళావతి.. కావ్యకి శత్రువులా స్వప్న
అనుకున్నదానికంటే ముందే జగదీష్ చంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్ పూర్తి చేసి నగల్ని దాచి పెడతారు రాజ్ - కావ్య. ఈ విషయం తెలుసుకున్న అనామిక.. రాజ్ కంపెనీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పాత మేనేజర్‌ని ట్రాప్ చేస్తుంది. ఆమె చెప్పినట్లుగానే ఒరిజినల్ కిరీటం ప్లేస్‌లో డూప్లికేట్‌ది పెడతాడు వాచ్‌మెన్. నీ భర్తకు కాసేపట్లో ఘోర అవమానం జరగబోతోందని కావ్యకి ఫోన్ చేసి చెబుతుంది అనామిక. దేవుడి కిరీటం నకిలీదిగా లేడంతో రాజ్‌ను తిడతాడు జగదీష్. ఇంతలో కావ్య అది డూప్లికేట్ కిరీటమని.. ఒరిజినల్‌ది భర్తతో కలిసి తీసుకొస్తుంది. ధాన్యలక్ష్మీ మేనమామ వచ్చి తక్కువ ధరకు బంగారం అమ్ముతానని చెప్పడంతో కావ్య దానికి నిరాకరిస్తుంది. అందరిలో తనకు జరిగిన అవమానంతో ప్రకాశం బాధపడతాడు. స్వప్నకు శ్రీమంతం చేయాలని రుద్రాణి కొత్త ప్లాన్ గీయగా తల్లితో కలిసి దానిని తిప్పికొడుతుంది కావ్య. కూతురు చెప్పినట్లుగానే శ్రీమంతం తన ఇంట్లో జరిపించేలా దుగ్గిరాల ఫ్యామిలీని ఒప్పిస్తుంది కనకం.
జనవరి 6వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు .. 612 ఎపిసోడ్ నుంచి 617 వరకు ఏం జరిగిందంటే?
జనవరి 6వ తేదీ 612వ ఎపిసోడ్‌లో రాజ్ - కావ్యలను భోజనానికి పిలిచినా రాకపోవడంతో అపర్ణ సహా ఇతర కుటుంబ సభ్యులు బాధపడతారు. వాళ్లు బయట మంచి ఫుడ్ తినేసి ఉంటారని రుద్రాణి - ధాన్యలక్ష్మీలు డైనింగ్ టేబుల్ దగ్గరి నుంచి వెళ్లిపోతారు. జగదీష్ చంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్‌ను పూర్తి చేసి నగలను సేఫ్‌గా లాకర్‌లో పెట్టిస్తారు రాజ్- కావ్య. రాజ్ కంపెనీలో వాచ్‌మెన్‌గా ఉన్న పాత మేనేజర్‌కు అనామిక ఫోన్ చేసి రూ.50 లక్షలు ఆశ చూపి డూప్లికేట్ కిరీటం పెట్టేలా ప్లాన్ చేస్తుంది. వాచ్‌మెన్‌లుగా ఉన్న వారికి టీలో మత్తు మందు కలిపి ఇస్తాడు పాత మేనేజర్. అందరూ పడుకున్నాక నకిలీ కీరిటాన్ని ఒరిజినల్ ప్లేస్‌లో పెడతాడు. ఆభరణాల్ని అనుకున్న సమయానికి పూర్తి చేయడంతో హ్యాపీగా నిద్రపోతున్న భర్తను లేపి ఇంకొన్ని పనులు ఉన్నాయని చెబుతుంది కావ్య. అయినప్పటికీ రాజ్ పట్టించుకోకుండా ఆలస్యంగా నిద్రలేస్తాడు.

జనవరి 7వ తేదీ 613వ ఎపిసోడ్‌లో ఉదయాన్నే భార్యాభర్తలిద్దరూ రొమాంటిక్ మూడ్‌లో ఉంటారు. రాజ్‌లో మార్పు మొదలవ్వడంతో కావ్య సంతోషిస్తుంది. కారులో వెళ్తుండగా ఫైల్ మరిచిపోవడంతో కావ్య మధ్యలోనే దిగి ఇంటికెళ్తుంది. ఆఫీసుకి రాజ్ ఒక్కడే రావడాన్ని చూసి వాచ్‌మెన్ .. అనామికకి ఫోన్ చేసి చెబుతాడు. దీంతో ఆమె వెంటనే కావ్యకి ఫోన్ చేసి రాజ్‌కు కాసేపట్లో అవమానం జరగబోతోందని చెబుతుంది. రాజ్ ఇచ్చిన నగల్ని చెక్ చేస్తుండగా కీరిటం రోల్డ్ గోల్డ్‌దని తేలడంతో జగదీష్ ప్రసాద్ .. రాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇంతలో కావ్య వచ్చి కిరీటం నకిలీదని.. అసలది లాకర్‌లో ఉందని చెప్పి భర్తతో కలిసి తీసుకొచ్చి జగదీష్‌కి ఇస్తుంది. మిమ్మల్ని అపార్ధం చేసుకున్నానని రాజ్- కావ్యలకి క్షమాపణలు చెబుతాడు జగదీష్. ఆఫీస్‌లో కావ్య ఇచ్చిన ట్విస్ట్‌ని వాచ్‌మెన్.. అనామికకి ఫోన్ చేసి చెప్పగా ఆమె షాక్ అవుతుంది.
జనవరి 8వ తేదీ 614వ ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో జరిగినదంతా అనామికకి వాచ్‌మెన్ చెబుతుండగా కావ్య వచ్చి ఫోన్ లాక్కుంటుంది. ఇప్పటికైనా మారకుంటే పెద్ద గుణపాఠం నేర్పిస్తానని అనామికకు వార్నింగ్ ఇస్తుంది. వాచ్‌మెన్‌ను ఉద్యోగంలో నుంచి తీసేసి పంపేస్తుంది. కావ్య ముందు నువ్వు ఎందుకు పనికిరావని అనామిక మీద మండిపడతాడు సామంత్. దుగ్గిరాల వారింటికి ధాన్యలక్ష్మీ మేనమామ వచ్చి తక్కువ ధరకు బంగారం అమ్ముతానని చెబుతాడు. ఇంతలో రాజ్ - కావ్యలు రాగా.. ఆయనను పరిచయం చేసి విషయం చెబుతారు ధాన్యం - ప్రకాశం. ఇప్పుడు బంగారం కొనాల్సిన అవసరం లేదని కావ్య అనడంతో ఆ బంధువు వెళ్లిపోతాడు. మా పుట్టింటి వాళ్ల ముందు నన్ను, నా భర్తని అవమానిస్తావా అంటూ కావ్యపై ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. ఇకపై ఆఫీస్ విషయాల్లో ఎవ్వరూ కలగజేసుకోవద్దని తేల్చి చెబుతుంది కావ్య. ఆ మాటలతో ప్రకాశం కంటతడి పెట్టి అన్నయ్య సుభాష్ దగ్గరికెళ్లి బాధపడతాడు .
జనవరి 9వ తేదీ 615వ ఎపిసోడ్‌లో కావ్య .. ధాన్యలక్ష్మీ పుట్టింటి వాళ్ల ముందు నా పరువు పోయేలా మాట్లాడటం బాలేదని సుభాష్‌తో చెప్పుకుని బాధపడతాడు ప్రకాశం. లోపలికి వెళ్తున్న ప్రకాశానికి ఎదురైన కావ్య తాను అన్న మాటలకు క్షమాపణలు చెబుతుంది. కానీ ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా విదిలించుకుని వెళ్తాడు ప్రకాశం . కావ్య తీరు వల్ల ప్రకాశం మన వైపుకి వస్తాడని త్వరలోనే ఆస్తిని కొట్టేసి హాయిగా ఉంటామని రాహుల్‌తో చెబుతుంది రుద్రాణి. ఉదయాన్నే శాంత వచ్చి ఏం టిఫిన్ కావాలో చెప్పమని రుద్రాణిని అడగటంతో అంతా షాక్ అవుతారు. ఇంతలో నంతులు గారు రావడంతో ఆయనను తానే పిలిపించానని, స్వప్నకి శ్రీమంతం చేయాలని అనుకుంటున్నానని చెబుతుంది రుద్రాణి.

జనవరి 10వ తేదీ 616వ ఎపిసోడ్‌లో స్వప్నకు శ్రీమంతం చేయడానికి కావ్య ఒప్పుకోవడంతో రాహుల్ - రుద్రాణిలు షాక్ అవుతారు. శ్రీమంతానికి ఎంత ఖర్చు అవుతుందోనని భయపడ్డ రాజ్ .. కావ్యతో పర్సనల్‌గా మాట్లాడతాడు . మన దగ్గర అంత డబ్బు లేదు కదా? శ్రీమంతం చేయకుంటే రుద్రాణి అత్తయ్య, చేస్తే ధాన్యలక్ష్మీ పిన్నిలు రెచ్చిపోవడానికి రెడీగా ఉన్నారని అంటాడు రాజ్. ఇది రుద్రాణి నన్ను ఇరికించడానికి వేసిన స్కెచ్ అని.. దీనికి నేను కౌంటర్ ఇస్తానని చెబుతుంది కావ్య. శ్రీమంతం ఎందుకు చేయాలని అనుకుంటున్నానో ధాన్యలక్ష్మీకి చెబుతుంది రుద్రాణి. మరోవైపు తనకు కనిపించకుండా తిరుగుతున్న కళ్యాణ్ మీద రైటర్ లక్ష్మీకాంత్ కోప్పడతాడు. రాత్రి పూట ఒంటరిగా పుట్టింటి కొచ్చిన కూతురిని చూసి షాక్ అవుతుంది ధాన్యలక్ష్మీ. తల్లికి జరిగినది చెప్పి శ్రీమంతం .. దుగ్గిరాల వారింట్లో కాకుండా మన ఇంట్లో చేయమని కనకాన్ని ఒప్పిస్తుంది కావ్య.
జనవరి 11వ తేదీ 617వ ఎపిసోడ్‌లో స్వప్న శ్రీమంతానికి కావాల్సిన ఏర్పాట్లకు రూ. 20 లక్షలు అవుతుందని రుద్రాణి చెప్పడంతో ఆమెకు చెక్ ఇస్తుంది కావ్య. ఇంతలో కనకం వచ్చి శ్రీమంతం దుగ్గిరాల వారింట్లో కాకుండా మా ఇంటి సాంప్రదాయం ప్రకారం జరపాలని అడగటంతో అంతా ఒప్పుకుంటారు. ఆ వెంటనే రుద్రాణికి ఇచ్చిన చెక్‌ను కావ్య చించేస్తుంది. రైటర్ చెప్పిన విధంగా అద్భుతంగా పాట రాసి దానిని అప్పూకి వినిపిస్తాడు కళ్యాణ్. మనం వేసిన ప్లాన్‌ని కావ్య తిప్పికొట్టిందని రాహుల్‌తో రుద్రాణి చెబుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











