Brahmamudi weekly roundup: రాజ్ ఎవరో చెప్పిన చలపతి.. బావ కోసం ఇందూ దీక్ష, తల్లి గురించి లక్కీ నరకం
Photo Courtesy: JioHotstar
రాజ్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడని తెలిసి ఇందూ కంగారుగా వెళ్లడంతో అతను నీ బావ అని చలపతి నిజం చెబుతాడు. నా కొడుకు ప్రాణాలతో ఉండాలంటే ఈ నిజం ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుని రాజ్‌ని దుగ్గిరాల నివాసానికి తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. రాజ్ ఇంటికి వెళ్లిన రేఖకి అతను ప్రాణాలతో ఉండటం చూసి షాక్ అవుతుంది. లక్కీగాడి మేటర్ ఎక్కడ బయటపెడతానో అని నువ్వే నన్ను చంపాలని అనుకున్నావని రాజ్ అనడంతో రేఖకి చెమటలు పడతాయి. రాజ్‌ని ఇంటికి తిరిగి రమ్మని ఎంత బతిమలాడినా వినిపించుకోడు. అపర్ణతో పనులు చేయిస్తున్న భ్రమరాంబ, ఐశ్వర్యలకు ఉప్మాలో ఫెవికాల్ కలిపి తినిపిస్తుంది నందూ. తన తల్లి గురించి చెప్పమని రాజ్‌ను బతిమలాడతాడు లక్కీ. రాజ్‌ను తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి ఇంటి ముందు ధర్నా చేస్తుంది ఇందూ.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి జూలై 13వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు .. 1083వ ఎపిసోడ్ నుంచి 1088వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
జూలై 13వ తేదీ 1083వ ఎపిసోడ్‌లో ..
రేఖకి ఫోన్ చేసిన రాజ్.. లక్కీకి తల్లినని ఒప్పుకుంటావా? లేక నేనే వచ్చి అందరి ముందు నిజం చెప్పానా అని బెదిరిస్తాడు. ఆ మాటలు విన్న రేఖ షాక్ అవుతుంది. ఈ ఇంటికి దూరంగా ఉంటున్నా నిన్ను దెబ్బకొట్టాడని ఫైర్ అవుతుంది భ్రమరాంబ. దాంతో రాజ్ కథ ఈరోజుతో ముగించేస్తున్నానని, దానికి ఏర్పాట్లు చేశానని రేఖ చెబుతుంది. ఈ మాటలన్నీ విన్న స్వాతి వెంటనే ఇందూకి చెబుతుంది. రాజ్‌ని ఎలాగైనా కాపాడుకోవాలని అతను ఫోన్ ఎత్తకపోవడంతో వెంటనే రాజ్ తల్లిదండ్రులకు చెప్పడంతో వారిద్దరూ కంగారుపడతారు. రాజ్‌ను వెంటాడుతున్న రేఖ మనిషి కారుతో గుద్దేయడంతో అతను కిందపడిపోతాడు. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్యలో ఉన్న రాజ్‌ని చూసి కంటతడి పెడతారు ఇందూ, లక్ష్మీ, చలపతి. వాడు నీ మొగుడు అయినందుకే ఆ రేఖ చంపాలని అనుకుంది. అదే దుగ్గిరాల వారసుడని తెలిస్తే అస్సలు బతకనివ్వదని చలపతి అనడంతో ఇందూ షాక్ అవుతుంది.
జూలై 14వ తేదీ 1084వ ఎపిసోడ్‌లో..
రాజ్ ప్రాణాలతో ఉండాలంటే నీ ప్రేమను చంపేసుకోవాలి. నువ్వు వాడి జీవితంలో నుంచి తప్పుకోమని ఇందూకి చెబుతాడు చలపతి. మీ మనవడు ఎప్పటికీ తిరిగిరాడని రేఖ చెప్పడంతో ఏం జరిగిందోనని అపర్ణ కంగారుపడి రాజ్, ఇందూలకి ఫోన్ చేస్తుంది, కానీ ఎవ్వరూ ఫోన్ తీయరు. నా కొడుకు ప్రాణాలతో ఉండి, మా కళ్ల ముందే ఉంటే చాలు అని ఏడుస్తాడు చలపతి. మా మధ్యలో నువ్వు ఉండొద్దు వెళ్లిపోమని ఇందూని కసురుకుంటాడు. రాజ్‌ని బతికించమంటూ దేవుడి ముందు ఏడుస్తుంది ఇందూ. నా బావకి ఏమైనా అయితే నేను భరించలేను, నాకు నా బావ కావాలని చెబుతుంది. రాజ్‌కి ఏం జరిగింది? ఇందూ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అపర్ణ, సుభాష్‌లు కంగారుపడతారు. రాజ్ స్పృహలోకి రావడంతో చలపతి, ఇందూ, లక్ష్మీలు సంతోషిస్తారు. ఇకపై నువ్వు వాడి జీవితంలో ఉండొద్దు, వాడి మీద నీ ప్రేమను చంపేసుకోమని చెబుతాడు చలపతి. మా బావని మా ఇంటికి తీసుకెళ్తాను, అక్కడైతేనే రాజ్ సేఫ్‌గా ఉంటాడని చెబుతుంది ఇందూ.

Photo Courtesy: JioHotstar
జూలై 15వ తేదీ 1085వ ఎపిసోడ్‌లో..
రాజ్‌ని నాతో పంపండి అని చలపతి కాళ్ల మీద పడుతుంది ఇందూ. దాంతో చలపతి మనసు కరిగిపోతుంది. కానీ రాజ్ దుగ్గిరాల వారసుడని మీ ఇంట్లో వాళ్లకి కానీ, బంధువులకు కానీ ఎప్పటికీ నిజం చెప్పకూడదని మాట ఇవ్వమని అడుగుతాడు. రాజ్ స్పృహలోకి రావడంతో చూడటానికి వెళ్లి బావ అని పిలుస్తుంది.. దాంతో రాజ్, చలపతి, లక్ష్మీలు షాక్ అవుతారు. భర్తని బావ అని పిలవొచ్చు కదా అని ఇందూ కవర్ చేస్తుంది. మేం మా ఇంటికి వెళ్తాం.. నువ్వు మీ అత్తారింటికి వెళ్లమని చలపతి చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఉదయాన్నే అందంగా ముస్తాబవుతున్న రేఖ దగ్గరికి భ్రమరాంబ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గా ఆ రాజ్ గాడిని చంపించేశాను, శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్తున్నానని చెబుతుంది రేఖ. ఆ మాటలతో భ్రమరాంబ షాక్ అవుతుంది. అత్తారింటికి వెళ్లకుండా మా ఇంట్లో ఎందుకు ఉన్నావని రాజ్‌పై మండిపడతాడు చలపతి. నువ్వు ఒప్పుకుంటే సరిపోతుందా? నేను ఒప్పుకోవాలి కదా అని అంటాడు రాజ్.
జూలై 16వ తేదీ 1086వ ఎపిసోడ్‌లో..
నేను నీతో కలిసి మీ ఇంటికి రాను.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని ఇందూపై సీరియస్ అవుతాడు రాజ్. తను నీ భార్య, ఈ ఇంటి కోడలు.. నీకు ఈ ఇంట్లో ఉండటానికి ఎంత హక్కుందో, తనకు అంతే హక్కుంది.. అయినా భార్యాభర్తల గొడవల్లోకి మేమెందుకు అని చలపతి, లక్ష్మీలు వెళ్లిపోతారు. రాజ్ కోపంగా వెళ్తుండగా కాలు జారి కిందపడిపోతుండగా ఇందూ వచ్చి కాపాడుతుంది. యాక్సిడెంట్ జరిగినా రాజ్ బతికే ఉండటం చూసి రేఖ షాక్ అవుతుంది. నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావని తెలిసి చూద్దామని వచ్చానని రేఖ చెబుతుంది. లక్కీగాడి మేటర్ సమాధి చేయడానికి నన్ను చంపాలని నువ్వే ఈ యాక్సిడెంట్ చేయించావని నాకు తెలుసని రాజ్ అనడంతో రేఖ ఉలిక్కిపడుతుంది. లక్కీగాడి మేటర్ నేను మరొకరికి కూడా చెప్పాను.. నాకు ఏదైనా జరిగితే వాళ్లు వచ్చి ఈ విషయం బయటపెట్టేవారు అనడంతో రేఖకి చెమటలు పడతాయి. త్వరలోనే నేను మళ్లీ దుగ్గిరాల నిలయానికి వస్తాను.. అప్పుడు లక్కీగాడి విషయం బయట పెడతానని వార్నింగ్ ఇస్తాడు.

Photo Courtesy: JioHotstar
జూలై 17వ తేదీ 1087వ ఎపిసోడ్‌లో..
అపర్ణతో వంట చేయించి ఉప్మా బాలేదన్న భ్రమరాంబ, ఐశ్వర్యలకు బుద్ధి చెప్పడానికి ఉప్మాలో గమ్ వేసి తయారు చేస్తుంది నందూ. నందూ చేసిన ఉప్మాని ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నానని అంటుంది భ్రమరాంబ. ఐశ్వర్యకు మాత్రం ఉప్మా వాసన తేడాగా ఉండటంతో ముందు మీరు తినండి తర్వాత నేను తింటానని చెబుతుంది. ఉప్మా నోటిలో పెట్టుకోగానే భ్రమరాంబ, ఐశ్వర్యలకికి నోరు అతుక్కుపోతుంది. రాజ్‌ని గదిలోకి తీసుకెళ్లి కాలికి మర్దన చేస్తానని అడుగుతుంది ఇందూ. దానికి రాజ్ ససేమిరా అనడంతో నీకు మరో కాలు ఉందనే కదా? నీ రెండో కాలిని కూడా చితక్కొడితే చచ్చినట్లు నా మాట వింటావని అంటుంది. దాంతో చేసేదేం లేక మర్దన చేయించుకోవడానికి ఒప్పుకుంటాడు రాజ్. నన్ను వదిలేసి వెళ్లిపోమంటే ఎందుకు వెళ్లడం లేదు? నీకు నాకు సంబంధం ఏంటీ అని ఫైర్ అవుతాడు రాజ్. నువ్వు వచ్చాక నా జీవితంలో చాలామంచి జరిగింది, అలాంటిది నిన్ను వదిలేసి వెళ్లనని తేల్చేస్తుంది ఇందూ.
జూలై 18వ తేదీ 1088వ ఎపిసోడ్‌లో..
నువ్వు లేకుండా నేను బతకలేను, నీతోనే ఉంటానని రాజ్‌తో చెబుతుంది. నీకు నాకు పెళ్లి జరిగిందని మా అమ్మానాన్నలు అనుకుంటున్నారు. మనకి పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిపిస్తే నీ జీవితమే నాశనం అయిపోతుందని వార్నింగ్ ఇస్తాడు రాజ్. భ్రమరాంబకి నోరు అతుక్కుపోయి బాధపడుతుంటే రేఖ వచ్చి మనం అనుకున్నది ఏది జరగలేదని రగిలిపోతుంది. రాజ్‌కి యాక్సిడెంట్ జరిగిందని తెలిసి అతనిని పరామర్శించడానికి లక్కీ వస్తాడు. మీ అమ్మ అడ్రస్, వివరాలు తెలుసుకుందామని వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెబుతాడు రాజ్. మా అమ్మ ఎవరో త్వరగా తెలుసుకుని నా ముందు నిలబెట్టమని అడుగుతాడు లక్కీ. పాల గ్లాసుతో గదిలోకి వచ్చిన ఇందూని చూసి రాజ్ వణికిపోతాడు. తన అందంతో, గిలిగింతలతో రాజ్‌ని ముగ్గులోకి లాగాలని ఇందూ అనుకోగా అతను తప్పించుకుంటాడు. ఉదయాన్నే ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్న ఇందూని చూసి రాజ్ షాక్ అవుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications