Brahmamudi weekly roundup: రేవతి గతం తెలుసుకున్న కావ్య .. శీనుగాడి ఆచూకీ పట్టేసిన రాజ్

Photo Courtesy: JioHotstar

అప్పూ కేసును రీ కన్‌స్ట్రక్షన్ చేసి రాహుల్- రుద్రాణిలను చితక్కొడతారు దుగ్గిరాల ఫ్యామిలీ. రాజ్- కావ్యలు సాక్ష్యం కోసం బయల్దేరిన విషయాన్ని యామినికి లీక్ చేస్తుంది రుద్రాణి. దాంతో శీనుగాడిని తన అడ్డాకి మార్చేస్తుంది యామిని. శీనుగాడిని మేం కిడ్నాప్ చేశామని ఆమె తల్లికి యామిని మనుషులు చెబుతారు. రేవతి ఇంటికి వచ్చిన ఇందిర.. రాజ్- కావ్యలకి దొరికిపోతుంది. రేవతి కొడుకుతో అపర్ణకి అనుబంధం ఏర్పడి బాబును చూసుకుని మురిసిపోతుంది.

రేవతి.. అపర్ణ కూతురని ఇష్టం లేని పెళ్లి చేసుకుందామని రేవతిని, ఆమె భర్తని ఇంట్లో నుంచి గెంటేశామని కావ్యతో చెబుతుంది ఇందిర. రేవతిని తిరిగి ఈ ఇంటితో కలుపుతానని కావ్య మాట ఇస్తుంది. రాజ్ బావని వదిలేస్తే అప్పూని శిక్ష నుంచి నేను తప్పిస్తానని కావ్యతో అంటుంది యామిని. శీనుగాడిని పట్టుకోవడానికి రాజ్ మాస్టర్ ప్లాన్ వేసి రేవతిని అతని ఇంటికి పంపిస్తాడు. శీనుగాడు వాళ్లమ్మతో మాట్లాడుతుండగా యామిని మనుషులకు దొరికిపోతాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup July 14th to July 19th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి జూలై 14వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు .. 773వ ఎపిసోడ్ నుంచి 778 వరకు ఏం జరిగిందంటే?

జూలై 14వ తేదీ 773వ ఎపిసోడ్‌లో ..
అప్పూని యామిని ఎలా ఇరికించిందో తెలుసుకోవడానికి అత్తారింటికి దారేది సినిమాలో మాదిరిగా సీన్ రీక్రియేట్ చేసి రుద్రాణి- రాహుల్‌లను కుమ్మేస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ. అప్పూ చెప్పిన అడ్రస్ ఆధారంగా శీనుగాడి అడ్రస్ కనుక్కొని రాజ్- కావ్యలు అక్కడికి బయల్దేరతారు. దెబ్బకు దెబ్బ తీయాలని రుద్రాణి రగిలిపోతూ వెంటనే యామినికి ఫోన్ చేసి రాజ్- కావ్యలు శీనుగాడి దగ్గరికి వెళ్లారని చెబుతుంది. ఆ శీనుగాడు వాళ్లకి దొరికితే నువ్వు ఇరుక్కుంటావని, రాజ్ నీకు దక్కడని .. నిన్ను నమ్ముకున్నందుకు మాకు కూడా చిప్పేనని అనడంతో యామిని టెన్షన్ పడుతుంది. వెంటనే శీనుగాడికి ఫోన్ చేసి తాను చెప్పిన ప్లేస్‌కి వెళ్లిపోమ్మని అంటుంది. తప్పించుకుంటూ రాజ్ - కావ్యల కారును ఢీకొడతాడు.

జూలై 15వ తేదీ 774వ ఎపిసోడ్‌లో ..
ఇందిర దొంగచాటుగా బయటికి వెళ్తూ అపర్ణ - స్వప్నలకు దొరికిపోతుంది. వాళ్ల నుంచి తప్పించుకుని రేవతి దగ్గరికి వచ్చేస్తుంది ఇందిర. జీవితంలో అమ్మ నన్ను క్షమించదని, కనీసం నా కొడుకునైనా వాడి అమ్మమ్మ దగ్గరికి చేర్చాలని బాధపడుతుంది రేవతి. అపర్ణ కారు డోర్ తగిలి ఓ బాబు కిందపడిపోతాడు. చిన్నారిని పైకి లేపి క్షమాపణలు చెబుతుంది .. నాకు సారీ వద్దు రెండు ఐస్‌క్రీమ్‌లు కావాలని బాబు అడగ్గా అపర్ణ షాక్ అవుతుంది. తన పేరు రాజ్.. స్వరాజ్ అని చిన్నారి చెప్పడంతో ఆ బాబు మాటలకు అపర్ణ చాలా సంతోషిస్తుంది. మీ అమ్మనాన్నల పేరు ఏంటీ అని అపర్ణ అడగ్గా.. నాకు తెలియదని చెబుతాడు బాబు. మనిద్దరం ఫ్రెండ్స్ అని రోజు ఇక్కడే కలుద్దామని అపర్ణతో బాబు చెబుతాడు. రాజ్ - కావ్యలు సడెన్‌గా రావడంతో రేవతి ఇంట్లో దాక్కుంటుంది ఇందిర. అప్పూని ఇరికించిన శీనుగాడిని తాము కిడ్నాప్ చేసినట్లు యామిని మనుషులు చెప్పడంతో అతని తల్లి భయపడుతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup July 14th to July 19th episode Story

Photo Courtesy: JioHotstar

జూలై 16వ తేదీ 775వ ఎపిసోడ్‌లో ..
నా కొడుకుని మీరే కాపాడాలని రాజ్- కావ్యలను శీనుగాడి తల్లి ప్రాధేయపడుతుంది. ఉన్న అవకాశం చేజారిపోవడంతో రాజ్ బాధపడుతుండగా... రేవతి ఇంట్లో నుంచి ఇందిర బయటికి రావడాన్ని గమనిస్తాడు. ఆమెను పిలిచి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడగ్గా ఇందిర ఏదేదో చెప్పి ఎస్కేప్ అవుతుంది. మా అమ్మతో ఒకసారి ఫోన్‌లో మాట్లాడతానని అడుగుతాడు శీనుగాడు. ఇంతలో యామిని వచ్చి ఫోన్ మాట్లాడటమే కాదు.. ఇక్కడి నుంచి వెళ్లడం కూడా కుదరదని తేల్చిచెబుతుంది. రెండ్రోజులు నువ్వు ఇక్కడే ఉంటే నీకు 2 లక్షల రూపాయలు ఇస్తానని ఆశపెడుతుంది యామిని. శీనుగాడు దొరక్క ఒట్టి చేతులతో వచ్చిన రాజ్‌- కావ్యలను చూసి దుగ్గిరాల ఫ్యామిలీ బిత్తరపోతుంది. రేవతిని అపర్ణకు దగ్గర చేసే దారి చూపమని దేవుడితో మొరపెట్టుకుంటుంది ఇందిర.

జూలై 17వ తేదీ 776వ ఎపిసోడ్‌లో ..
రేవతి ఇంట్లో మీరు దొంగచాటుగా దాక్కోవడం నేను చూశానని.. అసలు ఆ రేవతి ఎవరు? ఈ ఇంటికి ఆమెకు సంబంధం ఏంటీ? అని నిలదీస్తుంది కావ్య. దాంతో ఆ రేవతి స్వయానా అపర్ణ కూతురని, రాజ్‌కి అక్క అని ఇందిర చెబుతుంది. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. డ్రైవర్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న విషయం .. అపర్ణ - సుభాష్‌లు వాళ్లిద్దరినీ మెడపట్టి బయటికి గెంటేయడం గురించి చెబుతుంది ఇందిర. ఆ మాటలు విన్న కావ్య.. రేవతిని ఈ ఇంటితో కలిపే బాధ్యత తీసుకుంటుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup July 14th to July 19th episode Story

Photo Courtesy: JioHotstar

జూలై 18వ తేదీ 777వ ఎపిసోడ్‌లో ..
అప్పూని ఎలా బయటకు తీసుకురావాలా అని ఆలోచిస్తున్న కావ్యకి యామిని ఫోన్ చేసి సెటైర్లు వేస్తుంది. నా చెల్లెల్ని నేను కాపాడుకుంటానని యామినితో సవాల్ చేస్తుంది కావ్య. రోడ్డుపై రేవతి కొడుకు మాటలు, వాడు చేసిన అల్లరి గుర్తొచ్చి అపర్ణ తనలో తాను నవ్వుకుంటుంది. ఇది చూసి సుభాష్ ఏం జరిగిందని అడగ్గా.. జరిగినదంతా చెబుతుంది అపర్ణ. అప్పూ కోసం ఆలోచిస్తున్న రాజ్‌ని ఓదార్చిన యామిని నోరు జారి ఓ క్లూ ఇస్తుంది. దీని ఆధారంగా అప్పూని పట్టుకోవాలని రాజ్ అనుకుంటాడు.

జూలై 19వ తేదీ 778వ ఎపిసోడ్‌లో ..
రేవతికి ఫోన్ చేసి శీనుగాడు ఖచ్చితంగా వాళ్లమ్మకి ఫోన్ చేస్తాడని.. నువ్వ వాళ్ల ఇంట్లోనే పడుకోమని చెబుతాడు. దానికి సరేనన్న రేవతి .. శీనుగాడి ఇంట్లో పడుకుని అతను తన తల్లికి కాల్ చేసిన విషయాన్ని గమనిస్తుంది. కోర్టులో కావ్య, అప్పూ, కళ్యాణ్‌లు టెన్షన్ పడుతుండగా రాజ్ వచ్చి ఆ శీనుగాడు వాళ్లమ్మకి ఫోన్ చేసిన విషయం చెబుతాడు. కావ్య దగ్గరికి యామిని వచ్చి రాజ్ బావని వదిలిస్తే అప్పూని శిక్ష నుంచి తప్పిస్తానని ఆఫర్ ఇస్తుంది. ఆ మాటలతో కావ్య మండిపడుతుంది. శీనుగాడి ఇంటికి వచ్చి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నది నేను తెలుసుకుంటానని వాళ్లమ్మకి చెబుతాడు రాజ్. శీనుగాడికి రాజ్ ఫోన్ చేసి మీ అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పడంతో అతను కంగారుపడి ఇంటికి బయల్దేరబోతుండగా యామిని మనుషులు కత్తితో బెదిరిస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X