Brahmamudi Weekly Roundup: అప్పు బాధ్యత తనదంటున్న రాజ్.. రాహుల్ తిక్క కుదిర్చిన స్వప్న!

భర్త ఇచ్చిన చీరని పనిమనిషి ఇచ్చేయటం తో అపర్ణ చేసిన పనిని తప్పుపడుతుంది కావ్య. మరోవైపు తప్పుగా మాట్లాడినందుకు ఆకతాయిల తల పగలగొడుతుంది అప్పు. తనని విడిపించడానికి వచ్చిన కళ్యాణ్, రాజ్ లను కూడా పోలీసులు అరెస్టు చేస్తారు. వాళ్ళని చాకచక్యంతో విడిపించుకుని వస్తుంది కావ్య. మరోవైపు ముభావంగా ఉన్న కళ్యాణ్ కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు రాజ్.అప్పుకి నావల్ల అన్యాయం జరిగింది కానీ ఆమెకి న్యాయం చేయలేకపోతున్నాను అంటాడు కళ్యాణ్. తన బాధ్యత నాది అని ధైర్యం చెప్తాడు రాజ్. మరోవైపు ఇందిరా దేవి అందరి గురించి ఆలోచించే నువ్వు నీ భార్య గురించి ఎందుకు ఆలోచించవు, నువ్వు కూడా సంసారం చేసి పిల్లల్ని కనాలి నా కోరిక తీర్చు అంటుంది. మరోవైపు అపర్ణ కూడా కావ్య తో సంసారం చక్కదిద్దుకోమని చెప్తుంది. రాజ్ కావ్యని డిన్నర్ కి తీసుకు వెళ్తాను అంటాడు. ఆ ప్రోగ్రాం ని డిస్టర్బ్ చేయాలి అనుకున్న రాహుల్ కి జ్యూస్ లో మోషన్ టాబ్లెట్స్ కలిపి అతని తిక్క కుదురుస్తుంది స్వప్న.

జూలై 15 వ తేదీ నుంచి జులై 20 వ తేదీ వరకు.. 462 ఎపిసోడ్ నుంచి 467వరకు ఏం జరిగిందంటే?

జూలై 15 వ తేదీ 462 ఎపిసోడ్‌లో తనకి భర్త ఇచ్చిన చేరని పని మనిషికి ఇచ్చేసిన అపర్ణని తప్పుపడుతుంది కావ్య. మరోవైపు అప్పు ఫోన్ ఎత్తడం లేదని స్వప్నకి చెప్తాడు కళ్యాణ్. కొద్ది రోజులు మీ ఇద్దరూ మాట్లాడుకోకుండా ఉండడమే మంచిది అనే సలహా ఇస్తుంది స్వప్న. మరోవైపు తనని ఏడిపించిన ఆకతాయిల తల పగలగొడుతుంది అప్పు. ఆమెని పోలీసులు అరెస్టు చేస్తారు.

Brahmamudi Telugu Serial Weekly Roundup July 15th to July 20th episode Story

జూలై 16 వ తేదీ 463ఎపిసోడ్‌లో అప్పుని అరెస్టు చేశారని తెలుసుకున్న కళ్యాణ్ స్టేషన్ కి వెళ్లి ఆవేశంగా ప్రవర్తించి అతను కూడా అరెస్టు అవుతాడు విషయం రాజ్ వరకు వెళుతుంది. పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతుంటే నేను కూడా వస్తాను అంటుంది కావ్య ఆడదానివి నీ వల్ల ఏమవుతుంది అని చులకనగా మాట్లాడి వెళ్ళిపోతాడు రాజ్. అతను కూడా ఆవేశంగా ప్రవర్తించే అరెస్ట్ అవటంతో బంటి కావ్య కి ఫోన్ చేస్తాడు.

జూలై 17 వ తేదీ 464 ఎపిసోడ్ లో పోలీస్ స్టేషన్కు వచ్చిన కావ్య తెలివిగా వ్యవహరించి అందరినీ విడిపించుకుని వస్తుంది. ఆకతాయిల తల పగలగొట్టినందుకు చెల్లెల్ని మందలిస్తుంది కావ్య. నన్ను ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను అంటూ ఆవేశంగా అక్కడికి వెళ్ళిపోతుంది అప్పు. మరోవైపు కళ్యాణ్ ముభావంగా ఉండడం చూసిన రాజ్ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. నావల్ల అప్పుకి అన్యాయం జరిగింది అంటాడు కళ్యాణ్.

Brahmamudi Telugu Serial Weekly Roundup July 15th to July 20th episode Story

జూలై 18 వ తేదీ 465 ఎపిసోడ్ లో అప్పుకి న్యాయం చేయడానికి నేను ఉన్నాను తన అక్క కావ్య ఉంది.అప్పు బాధ్యత నాది బాధపడకు అని ధైర్యం చెప్తాడు రాజ్. మరోవైపు అందరి సమస్యలు తీరుస్తున్నావు కానీ నీ భార్య గురించి ఆలోచించడం లేదు నువ్వు కూడా సంసారం చేసి పిల్లల్ని కంటే చూడాలని ఉంది ఈ కోరిక తీర్చుఅని రాజ్ తో అంటుంది ఇందిరాదేవి. మరోవైపు అపర్ణ కూడా కావ్యతో నీ భర్త దగ్గరికి వెళ్లి మీ జీవితాన్ని పండించుకో అని రాజ్ దగ్గరికి పంపిస్తుంది. కానీ వాళ్ళిద్దరూ పోట్లాడుకొని అలసిపోయి పడుకుంటారు.

జూలై 19 వ తేదీ 466 ఎపిసోడ్‌లో ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటున్నా కళ్యాణ్ ని చూసి ఆనందపడతారు కుటుంబ సభ్యులు. గదిలో ఏమి జరగలేదని తెలుసుకొని కావ్య మీద కోప్పడతారు అపర్ణ ఇందిరా దేవి. ఇదే విషయంగా రాజ్ కి క్లాస్ పీకుతుంది ఇందిరా దేవి మూడు నెలలలో నా మనవరాలు నెలతప్పాలి అని డెడ్ లైన్ పెడుతుంది. మరోవైపు రాహుల్ స్వప్నని దగ్గరికి తీసుకోబోతే వెద వేషాలు ఆపే వరకు దగ్గరికి రానివ్వను అంటుంది స్వప్న. ఎప్పటికైనా నేనే గ్రేట్ అని నువ్వే నా కాళ్లు పట్టుకుంటావు అని స్వప్నతో చాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు రాహుల్.

Brahmamudi Telugu Serial Weekly Roundup July 15th to July 20th episode Story

జూలై 20వ తేదీ 467 ఎపిసోడ్‌లో కావ్య ని తీసుకొని డిన్నర్ కి వెళ్లడానికి కావ్యని ఒప్పిస్తాడు రాజ్. ఈ మాటలు విన్న రుద్రాణి విషయాన్ని కొడుక్కి చెప్తుంది. వాళ్ళిద్దరూ కలవకుండా రాజుని నేను ఆఫీస్కు తీసుకెళ్లి పోతాను అంటాడు రాహుల్ ఆ మాటలు స్వప్న విని రాహుల్ కి జ్యూస్ లో మోషన్ టాబ్లెట్స్ కలిపి తాగిస్తుంది. స్టమక్ అప్సెట్ బాధపడుతున్న రాహుల్ రాజ్ వాళ్ళని డిన్నర్ కి వెళ్లకుండా ఆపలేకపోతాడు. విషయం తెలుసుకున్న రుద్రాణి స్వప్న పై కోప్పడుతుంది. మరోవైపు రాజ్ కావ్యని తీసుకొని రెస్టారెంట్ కి వెళ్తాడు. అప్పుడప్పుడు ఇలా తీసుకురండి ప్రశాంతంగా ఉంటుంది కావ్య. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X