Brahmamudi Weekly Roundup:అనామికను కల్యాణ్ చిత్రహింసలు పెట్టాడా? కోర్టు బోనులో వాస్తవాలతో కావ్య!

తనకి అన్యాయం జరిగిందని టీవీలో రచ్చబండ పెడుతుంది అనామిక. అలాంటి ఆడదానితో కళ్యాణ్ కలిసి ఉండకపోవడమే మంచిది అంటే కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తాడు రాజ్. ఇంతలో అనామిక కళ్యాణ మీద పోలీస్ కేసు పెట్టి అతడిని కోర్టుకీడుస్తుంది. కొడుకు కోసం ధాన్యలక్ష్మి బాధపడుతుంటే ఇదంతా నువ్వు ఇచ్చిన వలసే అంటూ భార్యపై ఫైర్ అవుతాడు ప్రకాష్. కోర్టులో అప్పు ని కూడా హాజరు పరచాలని చెప్తాడు జడ్జి. కనకం నేను పంపించను అంటే ఆమెకి నచ్చ చెప్తుంది. కావ్య కోర్టు బయట సమస్య పరిష్కరించుకోవాలని అనామికతతో రాజీ కోసం ఆమె ఇంటికి వెళుతుంది కానీ రాజీకి ఒప్పుకోదు అనామిక. కోర్టులో అనామిక లాయర్.. జూలై 1 వ తేదీ నుంచి జులై 6 వ తేదీ వరకు.. 450 ఎపిసోడ్ నుంచి 455వరకు ఏం జరిగిందంటే?

జూలై 1 వ తేదీ 450 ఎపిసోడ్‌లో
తనకి అన్యాయం జరిగిందని టీవీలో రచ్చబండ పెడుతుంది అనామిక. అలా చేసినందుకు ఆమె తల్లిదండ్రులు ఆమెని మందలిస్తారు కానీ అనామిక వినిపించుకోదు. మరోవైపు కావ్య వాళ్ళ ఇంట్లో అందరూ కళ్యాణ్ తో విడాకులు ఇప్పించడానికే సిద్ధమవుతారు. కానీ కావ్య వారిస్తుంది. అదే సమయంలో పోలీసులు వచ్చి అనామిక కేసు పెట్టింది అంటూ కళ్యాణ్ ని అరెస్టు చేసి తీసుకువెళ్తారు.

Brahmamudi Telugu Serial Weekly Roundup July 1st to July 6th episode Story

జూలై 2 వ తేదీ 451ఎపిసోడ్‌లో
కళ్యాణి పోలీసులు అరెస్టు చేశారని తెలుసుకొని అప్పు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలనుకుంటుంది కానీ కనకం వెళ్లకుండా అడ్డుకుంటుంది. కోర్టు దగ్గర మీడియా వాళ్ళు కావ్య వాళ్ళని నిలదీస్తారు. కానీ కళ్యాణ్ ని తన కుటుంబాన్ని వెనకేసుకొస్తుంది కావ్య. కొడుకుని మీడియా ఇబ్బంది పెడుతుంటే చూసి భరించలేక పోతుంది ధాన్యలక్ష్మీ. అలాంటి ఆడదాన్ని కోడలుగా తెచ్చినందుకు క్షమించండి అని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్తాడు కళ్యాణ్.

జూలై 3వ తేదీ 452 ఎపిసోడ్ లో
తమ్ముడిని ప్రశ్నలతో మీడియా వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే భరించలేక పోతాడు రాజ్, ఆవేశంగా వాళ్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటే భర్తని పక్కకు తీసుకువచ్చి మీరు ఏం మాట్లాడినా కవి గారికి ఇబ్బంది అవుతుంది అని నచ్చచెప్తుంది. కోర్టులో అనామిక భర్త మీద, అత్తింటిమీద లేనిపోని ఆరోపణలన్నీ చెప్తుంది. అనామిక వాదన విన్న జడ్జి అప్పు ని కూడా కోర్టులో ప్రవేశపెట్టమంటాడు.

జూలై 4 వ తేదీ 453 ఎపిసోడ్‌లో
కళ్యాణ్ అనామికని హింసించలేదని సాక్షాలు కావాలి అని కావ్య వాళ్ళని అడుగుతాడు లాయర్. అలాంటివి వాళ్ళ దగ్గర ఉండవు, నా కాళ్లు పట్టుకుని క్షమాపణ అడిగితే కేసు వెనక్కి తీసుకుంటాను అంటుంది అనామిక అది జరగదు అంటాడు కళ్యాణ్. మరోవైపు అప్పు ని కోర్టు కి పంపించను అంటుంది కనకం. కానీ అప్పు తల్లి కి నచ్చచెప్తుంది. మరోవైపు అనామిక కి చనువుచ్చి చంకనెక్కించుకున్నావు అందుకే పరిస్థితి ఇంతవరకు వచ్చింది అని భార్య పై విరుచుకుపడతాడు ప్రకాష్.

జూలై 5 వ తేదీ 454 ఎపిసోడ్‌లో
కవి గారికి శిక్ష పడుతుందేమో అని ఇంట్లో అందరూ భయపడుతున్నారు మనం వెళ్లి ఒకసారి అనామికతో మాట్లాడదామా అని భర్తతో అంటుంది కావ్య. నేనైతే రాను కావాలంటే నువ్వు వెళ్లి మాట్లాడు అంటాడు రాజ్.తర్వాత కావ్య అనామిక దగ్గరికి వెళ్లి ఆమెని ఒప్పించాలని చూస్తుంది కానీ అనామిక డబ్బే ముఖ్యం అన్నట్లుగా మాట్లాడుతూ రేపు కోర్టులోనే తేల్చుకుందాం అంటుంది. మరోవైపు కోర్టుకు వచ్చిన అప్పుని ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు వేస్తారు మీడియా వాళ్ళు. వాళ్లని కోప్పడుతుంది కనకం. మరోవైపు జడ్జి గారు మాట్లాడుతూ ఇలాంటి విషయాలు కోర్టు వరకు రాకుండా ఉండడమే మంచిది అందుకే ఆఖరి సారి అడుగుతున్నాను మీ ఇద్దరికీ కలిసి ఉండాలని లేదా అని అడుగుతారు. అనామిక నాకు నా భర్త కావాలి కానీ నా కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగాలి అదే సమయంలో అప్పుకి శిక్ష పడేలాగా చేయాలి అని డిమాండ్ చేస్తుంది.

జూలై 6వ తేదీ 455 ఎపిసోడ్‌లో
కళ్యాణ్ మాత్రం తనకి విడాకులు కావాలి అంటాడు. శిక్ష తప్పించుకోవాలని లేదా అంటాడు జడ్జి. ఆమెతో జీవితాంతం కలిసి ఉండటం కంటే మీరు వేసే శిక్ష చాలా తక్కువ అంటాడు కళ్యాణ్. ఆ తరువాత అనామిక పప్పు గురించి చేసిన ఆరోపణలు అన్నీ తప్పు అని కోర్టులో సాక్షాలతో సహా నిరూపిస్తాడు లాయర్. అనామిక తరపు లాయర్ కళ్యాణ్ అనామిక ని పెట్టిన చిత్రహింసల మాటేమిటి అని అడుగుతుంది. అది కూడా తప్పని ఎన్ని రూపిస్తాను అందుకు ఒక సాక్షిని ప్రవేశపెట్టాలని కావ్యని బోనులో నిలబెడతాడు లాయర్. కావ్య కళ్యాణ్ ని సమర్థిస్తూ మాట్లాడుతుంది తర్వాత గత రాత్రి అనామిక తో మాట్లాడటానికి వెళ్ళాను అప్పుడు ఆమెకి తెలియకుండా సంభాషణ అంతా రికార్డు చేశాను అని చెప్పి ఒక ఎవిడెన్స్ కోర్టు వాళ్ళకి సబ్మిట్ చేస్తాడు లాయర్. అది ఏమిటో, కావ్య మరిదిని ఎలా కాపాడుకుంటుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X