Brahmamudi weekly roundup: లక్కీ పుట్టుకపై ఇందూకి నిజం చెప్పిన రాజ్.. నందూ మాటలతో వెంకీ గుండె బద్ధలు

Photo Courtesy: JioHotstar

ఇరుగుపొరుగు వారి టార్చర్ భరించలేక ఇందూతో కలిసి దుగ్గిరాల ఇంటిలో అడుగుపెడతాడు రాజ్. మనవడికి దెబ్బలు చూసి అపర్ణ తల్లడిల్లిపోతుంది. రాజ్‌కి యాక్సిడెంట్ చేయించింది రేఖ ఆంటీయేనని ఇందూ చెప్పడంతో నందూ షాక్ అవుతుంది. లక్కీని దుగ్గిరాల ఇంటికి పిలిపించిన రాజ్.. వీడు మనతోనే ఉంటాడని చెబుతాడు. రేఖ కూడా దానికి ఒప్పుకోవడంతో భ్రమరాంబ, భూషణ్‌లు షాక్ అవుతారు. నందూని ఇష్టపడుతున్న లక్కీ.. ఆమెకు ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు అయితే దుగ్గిరాల ఇంటి అమ్మాయిని తప్పించి ఎవరినైనా ప్రేమించమని చలపతి అంటాడు. మదన్ రూమ్‌లో లక్కీని ఉండమని రాజ్ చెప్పడంతో లక్కీ అదే గదిలోకి వెళ్లడంతో మదన్ పెద్ద గొడవ చేస్తాడు. రేఖ కూడా రాజ్‌నే సమర్ధించడంతో కొడుకు దానిని అవమానంగా ఫీలవుతాడు. నందూ దుగ్గిరాల ఇంటి వారసురాలు అని తెలుసుకున్న వెంకీ తన ప్రేమను మనసులోనే దాచుకుంటాడు. వెంకీని ఇష్టపడుతున్నట్లు ఇందూకి చెబుతుంది నందూ. కాబోయే భార్య ఎలా ఉండాలో ఇందూకి చెబుతాడు రాజ్.

Brahmamudi Telugu Serial Weekly roundup July 20th to July 25th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి జూలై 20వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు .. 1089వ ఎపిసోడ్ నుంచి 1094వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

జూలై 20వ తేదీ 1089వ ఎపిసోడ్‌లో ..
నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చే వరకు ధర్నా ఆపేది లేదని రాజ్‌తో తేల్చి చెబుతుంది ఇందూ. నాకు మీరు సపోర్ట్‌గా ఉండాల్సిందిపోయి ఈ అమ్మాయికి అండగా ఉంటారా? నేను మీ కన్నకొడుకునేనా అని మండిపడతాడు రాజ్. ఇందూ అరుపులతో ఇరుగుపొరుగు ఆడవాళ్లు వచ్చి రాజ్‌పై కేసులు పెట్టి, జైళ్లో పెట్టిద్దామని, నీకు విడాకులు ఇప్పిస్తానని చెబుతారు. తన ప్లాన్ రివర్స్ అయ్యేలా ఉందని వాళ్లని ఇందూ పంపించేస్తుంది. ఇంతలో కాలనీలో ఉన్న భర్తలంతా వచ్చి ఏం జరిగిందని అడగ్గా.. నా భర్తను మా ఇంటికి రమ్మంటే రావడం లేదని అమాయకంగా చెబుతుంది ఇందూ. దాంతో భర్తలంతా ఇందూకి అండగా నిలిచి రాజ్‌కి చీవాట్లు పెడతాడు. మర్యాదగా నువ్వు ఆ అమ్మాయితో వెళ్లకపోతే మన సిటీలో ఉన్న భర్తలందరినీ ఇక్కడ దింపుతామని బెదిరిస్తారు. చేసేదిలేక రాజ్ ఇందూ వెంట వెళ్లడానికి ఒప్పుకుంటాడు. రాజ్‌ని ఇందూని ఆటోలో అత్తారింటికి పంపుతారు.

జూలై 21వ తేదీ 1090వ ఎపిసోడ్‌లో..
నేను పెట్టే కండీషన్స్‌కి నువ్వు ఒప్పుకుంటేనే నేను నీతో పాటు వస్తాను, లేదంటే లేదని చెబుతాడు రాజ్. రాజ్- ఇందూలు తిరిగి దుగ్గిరాల నిలయంలో అడుగుపెట్టడంతో రేఖ, భ్రమరాంబలు షాక్ అవుతారు. రాజ్‌ ఒంటి మీద గాయాలు ఉండటంతో ఏం జరిగిందని అపర్ణ కంగారు పడుతుంది. నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఈ యాక్సిడెంట్ చేయించిన వాళ్లని అస్సలు వదిలిపెట్టనని రాజ్‌తో అంటుంది నందూ. దాంతో రేఖకి ముచ్చెమటలు పడతాయి. రేఖ ప్రవర్తనపై శేషం, భ్రమరాంబలో అనుమానం వస్తుంది. గదిలోకి వెళ్లిన తర్వాత రాజ్‌ పెట్టిన కండీషన్స్‌ను ఒప్పుకొనేది లేదని, గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటానని ఇందూ చెబుతుంది. రాజ్ దగ్గరి నుంచి ఇందూ బయటకు వస్తుండగా రాజ్‌ని ఎందుకు వెనక్కి తీసుకొచ్చావు? నీకు అతనికి రిలేషన్ ఏంటని ఇందూని నందూ నిలదీస్తుంది. రాజ్ మన ఫ్యామిలీ కోసం ఎంతో చేశాడు.. అలాంటి వాడిని చంపాలని చూసిన వాళ్లని వదిలిపెట్టనని నందూ చెబుతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup July 20th to July 25th episode Story

Photo Courtesy: JioHotstar

జూలై 22వ తేదీ 1091వ ఎపిసోడ్‌లో..
రాజ్‌ని చంపాలనుకున్నది రేఖ ఆంటీయేనని ఇందూ చెప్పడంతో నందూ షాక్ అవుతుంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెబుతుంది. ఉదయాన్నే ఇంటికి డబ్బుల కోసం వచ్చిన శృతిని ఐశ్వర్య నానామాటలు అంటుంది. ఇదంతా చూసిన నందూ కోపంతో రగిలిపోతుంది. నందూని కొట్టడానికి ఐశ్వర్య చేయ్యెత్తగా ఇందూ ఆపుతుంది. శృతికి డబ్బులిచ్చి పంపేసి ఐశ్వర్యకి క్లాస్ పీకుతుంది. నిద్రలో యాక్సిడెంట్ కల రావడంతో రాజ్ ఉలిక్కిపడి లేస్తాడు. అదంతా విన్న ఇందూ.. నువ్వు దుగ్గిరాల వారసుడివి కాబట్టేనని మనసులో అనుకుంటుంది. లక్కీని ఇంటికి పిలిపించిన రాజ్.. ఇతను నాతో పాటు ఇక్కడే ఉంటాడని చెబుతాడు. మేం ఒప్పుకోమని భ్రమరాంబ అనడంతో ఒప్పుకోవాల్సింది రేఖ పిన్ని అని రాజ్ చెబుతాడు. చిన్నప్పుడే వీడి తల్లి .. లక్కీని అనాథాశ్రమంలో పడేసిందని రాజ్ చెప్పడంతో అలాంటిది తల్లే కాదని సుభాష్, అపర్ణలు నానామాటలు అంటారు.

జూలై 23వ తేదీ 1092వ ఎపిసోడ్‌లో..
లక్కీకి రేఖ పిన్నియే అడ్రస్.. తనే ఆధార్ కార్డ్ అని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతాడు. లక్కీ వాళ్ల అమ్మని వెతికి పెడతానని రేఖ పిన్నియే నాకు మాటిచ్చింది.. అందుకే వాడిని తీసుకొచ్చానని అంటాడు. రేఖ పిన్ని మాట తప్పదు.. మాట మీదే నిలబడుతుందని చెబుతాడు రాజ్. ఇకపై నాకు ఇచ్చిన గౌరవమే వీడికి కూడా ఇవ్వాలని చెబుతాడు రాజ్. నందూ మీద ఇష్టం పెంచుకున్న వెంకీ.. ఆమెకు ప్రపోజ్ చేయడానికి లవ్ లెటర్ రాసిపెట్టుకుంటాడు. రాజ్ గురించి ఆలోచిస్తున్న చలపతి- లక్ష్మీలు .. వెంకీని పిలిచి నువ్వు ఎవరినీ ప్రేమించినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ దుగ్గిరాల ఇంటి వారసురాలిని మాత్రం ప్రేమించొద్దని మాట తీసుకుంటాడు చలపతి. లక్కీని నువ్వు తీసుకురావడం వెనుక ఏదో కారణం ఉందని రాజ్‌ని ఇందూ నిలదీయడంతో రేఖ ఆంటీయే లక్కీ కన్నతల్లని రాజ్ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup July 20th to July 25th episode Story

Photo Courtesy: JioHotstar

జూలై 24వ తేదీ 1093వ ఎపిసోడ్‌లో..
తననే పనిచేయమని చెప్పడంతో.. పదేపదే అవమానిస్తూ ఉండటంతో ఇందూపై రగిలిపోతుంది ఐశ్వర్య. ఇంతలో తనను వెతుక్కుంటూ లక్కీ రావడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. ఇకపై నేను కూడా ఇదే ఇంట్లో ఉంటానని లక్కీ చెప్పడంతో ఉలిక్కిపడుతుంది. రాజ్ ఏం చెప్పినా ఓకే చెప్పడం, లక్కీ ఇక్కడ ఉండటానికి ఒప్పుకోవడంతో రేఖపై భూషణ్, భ్రమరాంబలు నిలదీస్తారు. ఆ రాజ్‌గాడిని నా దారిలోకి తెచ్చుకోవడానికి లక్కీగాడి తల్లి విషయంలో సాయం చేస్తానని చెప్పానని కవర్ చేస్తుంది రేఖ. మదన్‌ని వాడుకుని పిన్ని చేతే లక్కీగాడు నా కొడుకు అని చెప్పేలా చేస్తానని ఇందూకి తన ప్లాన్ చెబుతాడు రాజ్. ఇంతలో లక్కీ వచ్చి నేను ఎక్కడ ఉండాలని అడుగుతాడు.. నువ్వెళ్లి లక్కీగాడి గదిలో ఉండమని రాజ్ చెబుతాడు. తన ఫ్రెండ్ చెప్పినట్లే మదన్ రూమ్‌లోకి లక్కీ వెళ్లడంతో అతను పెద్ద పంచాయతీ పెడతాడు

జూలై 25వ తేదీ 1094వ ఎపిసోడ్‌లో..
లక్కీ మదన్ రూమ్‌లో ఉండాలో వద్దో రేఖ పిన్నిదే ఫైనల్ డెసిషన్ అని చెబుతాడు రాజ్. చేసేదేం లేక కొడుకుని కొన్ని రోజులు అడ్జెస్ట్ కావాలని రేఖ చెప్పడంతో భ్రమరాంబ, భూషణ్ షాక్ అవుతారు. తాను దుగ్గిరాల వారసురాలిని అని, ఇందూ చెల్లెలిని అని నందూ చెప్పడంతో తండ్రి మాటలు గుర్తొచ్చి తన ప్రేమను దాచిపెట్టి బాధగా వెళ్లిపోతాడు వెంకీ. వీరిద్దరినీ చూసిన ఇందూ.. చెల్లెలిని పక్కకి పిలిచి వెంకీని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. దానికి నందూ అవునని సమాధానం చెబుతుంది. ఐశ్వర్య కష్టాల్లో ఉందని తెలుసుకున్న ఆమె ఫ్రెండ్.. ఆమెను తన బాయ్‌ఫ్రెండ్‌తో కలపాలని ప్లాన్ చేస్తుంది. డబ్బు మీద ఆశ చూపించి అతనికి దగ్గర చేయాలని మాయమాటలు చెప్పడంతో ఐశ్వర్య ఆలోచనలో పడుతుంది. నీకు కాబోయే భార్య ఎలా ఉండాలో నాకు చెప్పమని రాజ్‌ని ఇందూ అడుగుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X