Brahmamudi weekly roundup: నిర్దోషిగా అప్పూ.. రేవతిని అవమానించిన అపర్ణ.. కావ్య ప్లాన్ ఫెయిల్

Photo Courtesy: JioHotstar

శీనుగాడిని రక్షించి కోర్టులో సాక్ష్యం చెప్పించడంతో అప్పూని నిర్దోషిగా ప్రకటిస్తారు న్యాయమూర్తి. కావ్య చేతిలో ఓడిపోవడంతో యామిని రగిలిపోతుంది. ఆమెను ఓదార్చి తిరిగి వస్తుండగా రేవతి భర్త జగదీష్‌ను చూసి అతనిని ఫాలో అవుతుంది రుద్రాణి. ఇంట్లో రేవతిని చూసి ఎప్పటికి తీరిగి రాకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది. స్వప్న కూతురి పుట్టినరోజుకు రావాల్సిందిగా రేవతికి అపర్ణతో ఫోన్ చేయించడంతో ఆమె సంతోషిస్తుంది. అపర్ణతో తాను జగదీష్‌ను చూశానని రుద్రాణి చెప్పడంతో ఆమె రగిలిపోతుంది.

కూతురి పుట్టినరోజుకు రాహుల్ తక్కువ రకం డ్రెస్ తీసుకు రావడంతో స్వప్న దానిని విసిరి కొడుతుంది. మా దగ్గర డబ్బులు లేవని మా వాటా మాకు ఇచ్చేస్తే మేం కూడా బాగుంటామని రుద్రాణి గొడవ పడుతుంది. ఇందిరకు కోపం వచ్చి విల్లాను రాసివ్వబోతుండగా స్వప్న అడ్డుపడుతుంది. ఇంటికొచ్చిన రేవతి- జగదీష్‌లను చూసి అపర్ణ రగిలిపోతుంది. ఈ ఇంటితో నీకు, నీ కొడుక్కి ఎలాంటి బంధం ఉండదని చెప్పడంతో రేవతి ఏడుస్తూ వెళ్లిపోతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup July 21st to July 26th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి జూలై 21వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు .. 779వ ఎపిసోడ్ నుంచి 784 వరకు ఏం జరిగిందంటే?

జూలై 21వ తేదీ 779వ ఎపిసోడ్‌లో ..
కావ్యని బోనులో నిలబెట్టి సాక్ష్యాధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించిందని యామిని తరపు లాయర్ వాదించడంతో అంతా షాక్ అవుతారు. శీనుగాడిని వెతికి పట్టుకుని కోర్టుకు తీసుకొస్తానని వెళ్లిన తిరిగి రాకపోవడంతో కావ్య టెన్షన్ పడుతుంది. ఇంతలో యామిని వచ్చి రాజ్ బావని వదిలేస్తే అప్పూని చిటికెలో విడిపిస్తానని అంటుంది. ఆ మాటలతో రగిలిపోయిన కావ్య.. నువ్వు సంబరపడొద్దని గెలిచేది ధర్మమేనని చెబుతుంది. లోకేషన్ ఆధారంగా శీనుగాడు ఉన్న ప్లేస్‌కి వెళ్లి రౌడీల బారి నుంచి రక్షించే ప్రయత్నంలో రాజ్ తలకు బలమైన గాయం అవుతుంది. అప్పూకి న్యాయమూర్తి శిక్ష విధించే సమయానికి శీనుగాడిని తీసుకొస్తాడు రాజ్. అప్పూ మేడంని ఇరికించమని ఒకావిడ తనకు డబ్బులు ఎరగా వేయడంతో ఇలా చేశానని యామినిని తప్పిస్తాడు శీను. జరిగిన దానిలో అప్పూ తప్పు లేకపోవడంతో ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తుంది కోర్ట్.

జూలై 22వ తేదీ 780వ ఎపిసోడ్‌లో ..
తనను కేసు నుంచి విడిపించి నందుకు రాజ్‌కు థ్యాంక్స్ చెబుతుంది అప్పూ. యామిని వచ్చి లాస్ట్ మినిట్‌లో అప్పూని సేవ్ చేశావంటూ రాజ్‌ని పొగుడుతుంది. అప్పూని ఇరికించిన వాళ్లని అంత తేలిగ్గా విడిచిపెట్టనని కావ్య అంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీ భోజనాలు చేస్తుండగా ఇకపై ఇలాంటి గండాలు రాకుండా ఉండాలంటే అప్పూ పోలీస్ ఉద్యోగం మానేయాలని ధాన్యలక్ష్మీ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. రేవతి కొడుక్కి అపర్ణ కారు డోర్ తగిలి మరోసారి కింద పడిపోతాడు. దీంతో ఆమె పిల్లాడి గాయానికి మందు రాస్తుంది. తల్లితో కొడుకుని చూసిన రేవతి ఎంతో సంతోషిస్తుంది. కావ్య చేతిలో ఓడిపోవడంతో యామిని రగిలిపోతుంది. నేనే చెప్పే వరకు సైలెంట్‌గా ఉండమని యామినికి నచ్చచెబుతుంది రుద్రాణి. బయటికి వస్తుండగా క్యాబ్ డ్రైవర్‌గా ఉన్న రేవతి భర్త జగదీష్‌ను చూసి అతనిని రాహుల్ - రుద్రాణిలు అనుసరిస్తారు.

Brahmamudi Telugu Serial Weekly roundup July 21st to July 26th episode Story

Photo Courtesy: JioHotstar

జూలై 23వ తేదీ 781వ ఎపిసోడ్‌లో ..
రేవతిని అపర్ణతో కలపాలని కావ్య ఆలోచిస్తుండగా రాజ్ వస్తాడు. కావ్య బాధ గురించి తెలుసుకుని అపర్ణతో రేవతిని కలుపుతానని మాట ఇస్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి అపర్ణతోనే రేవతికి ఫోన్ చేయించి స్వప్న కూతురి బర్త్ డే పార్టీకి పిలిచేలా చేస్తారు. దుగ్గిరాల కుటుంబం నుంచి ఆహ్వానం అందడంతో రేవతి- జగదీష్‌లు చాలా సంతోషిస్తాడరు. జగదీష్‌ను ఫాలో అయిన రాహుల్ - రుద్రాణిలు ఆ ఇంట్లో రేవతిని చూసి షాక్ అవుతారు. రేవతి కనుక ఇంటికి తిరిగొస్తే ఆస్తిలో వాటాదారులు పెరిగిపోతారని ఎలాగైనా సరే తల్లీకూతుళ్లని విడదీయాలని ప్లాన్ చేస్తుంది రుద్రాణి.

జూలై 24వ తేదీ 782వ ఎపిసోడ్‌లో ..
మనిద్దరి వయసు దాటిపోతోందని త్వరగా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కావ్యతో అంటాడు రాజ్. యామిని చూసేలా రాజ్‌ను గట్టిగా హత్తుకోవడంతో ఆమె రగిలిపోతుంది. ఇన్ని రోజులు అవుతున్నా కావ్యకి ఎందుకు ప్రపోజ్ చేయలేదని అడుగుతుంది యామిని. కావ్యకి చిన్న సమస్య ఉందని దానిని పరిష్కరించి ప్రపోజ్ చేస్తానని చెబుతాడు రాజ్. అపర్ణతో తాను జగదీష్‌ను చూశానని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో రగిలిపోయిన అపర్ణ.. ఇంకెప్పుడూ రేవతి మాట ఎత్తవద్దని వార్నింగ్ ఇస్తుంది. ఇంటికొచ్చిన రాజ్‌తో ఏం ప్లాన్ వేయబోతున్నారని అడుగుతుంది కావ్య.

Brahmamudi Telugu Serial Weekly roundup July 21st to July 26th episode Story

Photo Courtesy: JioHotstar

జూలై 25వ తేదీ 783వ ఎపిసోడ్‌లో ..
కూతురి పుట్టినరోజుకి కావాలనే తక్కువ రకం డ్రెస్ తీసుకొచ్చి తన పవర్స్, పాకెట్ మనీ తిరిగి దక్కించుకోవాలని ప్లాన్ చేస్తాడు రాహుల్. స్వప్న కూతురికి దుగ్గిరాల కుటుంబ సభ్యులు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారు. రాహుల్ తన ప్లాన్‌లో భాగంగా తక్కువ రకం గౌను తీసుకొచ్చి ఇస్తాడు. అలాంటి చీప్ డ్రెస్ చూసి నేలకేసి కొడుతుంది స్వప్న. నా దగ్గర డబ్బులు లేవని, నువ్వేమో ఇవ్వవు.. అందుకే ఉన్నవాటితోనే తీసుకొచ్చానని స్వప్నతో చెబుతాడు రాహుల్. ఆస్తిలో మా వాటా మాకు ఇచ్చేస్తే ఈ బాధ ఉండదని రుద్రాణి గొడవ పెట్టుకోవడంతో విల్లా రాసిస్తానని చెబుతుంది ఇందిర. దాంతో స్వప్న జోక్యం చేసుకుని వీళ్లకి ఇస్తే అమ్మేస్తారని.. అంతగా ఇవ్వాలని అనుకుంటే నా బిడ్డ పెద్దయిన తర్వాత ఇవ్వమని చెబుతుంది. తమ ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణి - రాహుల్‌లు రగిలిపోతారు

జూలై 26వ తేదీ 784వ ఎపిసోడ్‌లో ..
కేక్ కట్ చేస్తుండగా కావ్య అడ్డుకుని ఇంకా రావాల్సిన వారు ఉన్నారని చెప్పడంతో ఎవరు? అని అపర్ణ అడుగుతుంది. మమ్మల్ని కాపాడిన రేవతి గారు ఇంకా రాలేదని చెబుతుంది. ఇంతలో ఆటోలో నుంచి దిగిన రేవతి- జగదీష్‌లను చూసి దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది. గుమ్మంలో అడుగుపెడుతున్న రేవతిని చూసి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావని నానా మాటలు అంటుంది. నా కొడుకుకి పెద్ద కుటుంబాన్ని ఇవ్వాలని ఆశపడ్డానని చెబుతుంది. నీ కొడుకు ఎప్పటికీ ఈ ఇంటికి దగ్గర కాలేడని.. అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పమని అంటుంది అపర్ణ. దాంతో జగదీష్ - రేవతిలు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కూతురి ఫోటో చూస్తూ బాధపడుతున్న అపర్ణని సుభాష్ ఓదారుస్తాడు. నేను ఇంతకాలం కష్టపడినదంతా మీరు పాడు చేశారని కావ్య- రాజ్‌లపై ఇందిర సీరియస్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X