Brahmamudi Weekly Roundup: భర్తని కాళ్లు పట్టుకోమన్న కావ్య.. కళ్యాణ్ ప్రేమ గెలిపిస్తానంటున్న రాజ్!

భార్య మనసు గెలవడానికి రాజ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు కానీ అట్టర్ ప్లాప్ అవుతుంది ఆ ప్లాన్. ఆ రాత్రి కి కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తాడు రాజ్. అయితే ఈరోజు ఉదయం కావ్యకి నిజం తెలిసిపోతుంది. కళ్యాణ్ మనసులో అప్పు ఉందని తెలుసుకుంటాడు రాజ్ అతని ప్రేమని ఎలా అయినా గెలిపించాలి అనుకుంటాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పుకుంటుంది అప్పు.

విషయం రాజ్ ద్వారా తెలుసుకున్న కళ్యాణ్ హర్ట్ అవుతాడు. కళ్యాణ్ ఖాళీగా ఉంటే తన చెల్లెలు ఇచ్చి కావ్య పెళ్లి చేసేస్తుంది అందుకే సంబంధం తీసుకువచ్చానంటూ ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. ధాన్యలక్ష్మి నీ మరిది జీవితం నిజంగా బాగోవాలంటే అతడిని పెళ్లికి ఒప్పించు అని కావ్యకి కండిషన్ పెడుతుంది. అందుకు ఒప్పుకుంటుంది కావ్య. అలా ఎలా మాటిచ్చేస్తావు, కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అని చెప్తాడు రాజ్.

Brahmamudi Telugu Serial Weekly Roundup July 22nd to July 27th episode Story

జూలై 22 వ తేదీ నుంచి జులై 27 వ తేదీ వరకు.. 468 ఎపిసోడ్ నుంచి 473 వరకు ఏం జరిగిందంటే?

జూలై 22 వ తేదీ 468 ఎపిసోడ్‌లో భార్య మనసు గెలుచుకోవడానికి రాజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు కానీ ఆ ప్లాన్ ప్లాప్ అవుతుంది. అక్కడినుంచి వచ్చేస్తుంటే వర్షం పడటంతో దగ్గరలో ఉన్న పాడుబడిన బంగాళాలోకి వెళ్తారు కావ్య వాళ్ళు. మరోవైపు రూమ్ డెకరేట్ చేసి కావ్య దంపతుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అపర్ణ, ఇందిరాదేవి. ఇన్నాళ్లు కావ్యని తప్పుగా చూసినందుకు బాధపడుతుంది అపర్ణ.

జూలై 23 వ తేదీ 469ఎపిసోడ్‌లో పాడబడిన బంగాళా,లోపల డెకరేషన్ రాజ్ సెట్టింగ్ అని తెలుసుకుంటుంది కావ్య. ఇంట్లో చెప్తాను అంటుంది. వద్దు పరువు పోతుంది కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను అంటాడు రాజ్ పట్టుకోండి అయితే అంటుంది కావ్య. రాజ్ భార్య కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తే వద్దని వారిస్తుంది ఇంట్లో నిజం చెప్పను లెండి అంటుంది కానీ ఇంటికి వెళ్లి ఇందిరా దేవికి అపర్ణకి విషయం చెప్పేస్తుంది వాళ్ళు రాజ్ ని మందలిస్తారు. తర్వాత కావ్య దగ్గరికి వెళ్లి మనవడు మంచివాడే అర్థం చేసుకో అని కావ్యకి సర్ది చెప్తుంది ఇందిరా దేవి.

జూలై 24 వ తేదీ 470 ఎపిసోడ్ లో కళ్యాణ్ విసిరి వేసిన కవిత చదివి కళ్యాణమనసులు అప్పు ఉంది అని గ్రహిస్తాడు రాజ్ తమ్ముడి ప్రేమను ఎలాగైనా గెలిపించాలి అనుకుంటాడు. అప్పుకి మంచి సంబంధం వచ్చిందని చెప్తుంది మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతుంది. నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పు. విషయం కావ్యకి చెప్పి పెళ్లి చూపులకు రమ్మని ఆహ్వానిస్తుంది కనకం. అప్పుకి పెళ్లిచూపులు అని తెలుసుకుని షాక్ అవుతాడు రాజ్. ఇదే విషయం కళ్యాణ్ కి చెప్తే కళ్యాణ్ కూడా షాక్ అవుతాడు.

జూలై 25 వ తేదీ 471 ఎపిసోడ్ లో కావ్య స్వప్న ఇద్దరు అప్పుకి చీర కట్టి ముస్తాబు చేస్తారు కానీ తన ముస్తాబు తనకై నచ్చకపోవటంతో నేను ప్యాంటు షర్ట్ తోనే పెళ్లి చూపుల్లో కూర్చుంటాను, నేను నాలానే ఉంటాను ఎవరి కోసం మారను అంటుంది అప్పు.మరోవైపు నువ్వు అప్పు నీ ప్రేమిస్తున్నావు కదా అని కళ్యాణ్ ని అడుగుతాడు రాజ్. తెలియటం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మరోవైపు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లతో అప్పు గురించి చెప్పాలనుకుంటుంది కావ్య నాకు అన్నీ తెలుసు అని చెప్పి అన్నిటికీ ఒప్పుకుంటారు పెళ్ళి వారు. ఆనందపడతారు కావ్య కుటుంబ సభ్యులు.

జూలై 26 వ తేదీ 472 ఎపిసోడ్‌లో కళ్యాణ్ కోసం సంబంధం తీసుకువస్తుంది రుద్రాణి. అప్పుడే పెళ్లంటే అని ధాన్యలక్ష్మి అంటే నువ్వు అలా ఆలోచిస్తే కూర్చుంటే కావ్య తన చెల్లిని తీసుకువచ్చి నీ కోడల్ని చేస్తుంది తర్వాత నీ ఇష్టం అని రెచ్చగొడుతుంది. మరోవైపు అప్పు సంబంధం కుదిరినందుకు ఆనంద పడుతూ, ఆ కుటుంబం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు. ఇంతలోనే అప్పు బయటకు రావటంతో నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని ఆమె దగ్గరికి వచ్చి అడుగుతారు స్వప్న కావ్య. అలాంటిదేమీ లేదు అమ్మ నాన్న ఇష్టమైన ఇష్టం అంటుంది అప్పు. కళ్యాణ్ పెళ్లి గురించి ఇంట్లో పంచాయతీ పెడుతుంది ధాన్యలక్ష్మి. నీ చెల్లెల్ని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు అంటూ కావ్య పై విరుచుకుపడుతుంది నాకు అంత అవసరం లేదు అప్పుకి ఇప్పుడే మంచి సంబంధం కుదిరింది అని చెప్తుంది కావ్య.

జూలై 27వ తేదీ 473 ఎపిసోడ్‌లో నిజంగా నీ చెల్లెల్ని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశం లేకపోతే కళ్యాణ్ ని నేను తెచ్చిన సంబంధం చేసుకోమని ఒప్పించు అంటుంది ధాన్యలక్ష్మి. అందుకు ఒప్పుకుంటుంది కావ్య. విషయం తెలుసుకున్న రాజ్ భార్యని మందలిస్తాడు కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎలా మాటిస్తావు, అతడి మనసులో అప్పు ఉంది అంటాడు. కాదు వాళ్ళ మధ్యలో ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అంటుంది కావ్య.

కాదు కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు అని రాజ్ చెప్పటంతో కవి గారిని నేనే కనుక్కుంటాను అంటుంది. తర్వాత కళ్యాణ్ తో మాట్లాడుతూ మీరు నిజంగా అప్పు నీ ప్రేమిస్తున్నారా మీ ఇద్దరూ కేవలం స్నేహితులు మాత్రమే కదా అయినా అప్పు ఈ ఇంటి కోడలు అయితే మీ అమ్మగారు అంగీకరించారు ఈ ఇంట్లో నేను మా అక్క పడుతున్న మాటలు చాలు మా చెల్లిని ఇంటికి కోడలుగా తీసుకురావాలని ఉద్దేశం నాకు లేదు అంటుంది కావ్య. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X