Brahmamudi weekly roundup: దుగ్గిరాల వారింట్లో రేవతి కొడుకు అల్లరి.. కావ్య కడుపులో రాజ్ వారసుడు
Photo Courtesy: JioHotstar
రేవతి కొడుకు సాయంతో రేవతిని అపర్ణని కలపాలని రాజ్ - కావ్య ప్లాన్ చేస్తారు. పథకంలో భాగంగా బాబుని అపర్ణకి గుడిలో కనిపించేలా చేసి ఇంటికి తీసుకెళ్తారు. పిల్లాడి అల్లరితో దుగ్గిరాల ఇంటికి కొత్త కళ వస్తుంది. తన తల్లిదండ్రులు తన కొడుకుని గారాబం చేస్తుండటంతో రేవతి మురిసిపోతుంది. స్వరాజ్ ఎవరు? అతని తల్లిదండ్రులు ఎవరు? అని రుద్రాణి కనుక్కోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతుంది. కావ్య- రాజ్‌లు విడిపోయే వరకు ఎలాంటి ప్లాన్స్ వేయొద్దని యామినికి ఆమె పేరెంట్స్ వార్నింగ్ ఇస్తారు. స్వరాజ్.. రేవతి అక్క కొడుకని తెలుసుకున్న కళ్యాణ్ బాబుని వెంటనే పంపించమని అప్పూతో చెబుతాడు. దాంతో బాబు తల్లిదండ్రుల ఆచూకీ దొరికినట్లుగా నాటకం ఆడుతుంది అప్పూ. పిల్లాడిని పంపించనని అపర్ణ మారాం చేయడంతో రేవతితో ఫోన్‌లో మాట్లాడిస్తుంది అప్పూ. తనకు వాంతులు కావడంతో ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటుంది కావ్య. ఇంట్లో వాళ్లకి నిజం చెప్పలేక బాధపడుతుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి జూలై 28వ తేదీ నుంచి ఆగస్ట్ 2 తేదీ వరకు .. 785వ ఎపిసోడ్ నుంచి 790 వరకు ఏం జరిగిందంటే?
జూలై 28వ తేదీ 785వ ఎపిసోడ్‌లో ..
రుద్రాణి అత్తయ్య ఇచ్చిన సలహా వల్లే నేను అమ్మానాన్నలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని రేవతి చెప్పడంతో ఇందిర, కావ్య, రాజ్‌లు షాక్ అవుతారు. రేవతి గారి నిర్ణయం వెనుక ఖచ్చితంగా రుద్రాణి గారి హస్తం ఉంటుందని నేను ముందే అనుకున్నానని చెబుతుంది కావ్య. రేవతిని అపర్ణ దారుణంగా అవమానించడంతో రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది. ఇంతలో ఇందిర వచ్చి ఆమెను లాగి కొడుతుంది. గతంలో నువ్వు చేసిన దానికి దీనితో చెల్లు అని అంటుంది అపర్ణ. రేవతిని అపర్ణతో కలపడానికి బాబుని ఆయుధంగా చేసుకుని కొత్త ప్లాన్ వేస్తారు కావ్య- రాజ్. పథకంలో భాగంగా అపర్ణని రెచ్చగొట్టి గుడికి పంపుతుంది కావ్య.
జూలై 29వ తేదీ 786వ ఎపిసోడ్‌లో ..
పుట్టింటిలో జరిగిన అవమానాన్ని తలచుకుంటూ బాధపడుతుంది రేవతి. జగదీష్ వచ్చి ఆమెను ఓదారుస్తాడు. తాను వేసిన ప్లాన్‌ని రేవతితో రాజ్ చెప్పి బాబును పంపించమని అడుగుతాడు రాజ్. కావ్య కూడా బతిమలాడటంతో రేవతి ఒప్పుకుంటుంది. ప్లాన్‌లో భాగంగా అపర్ణ గుడిలో దర్శనం చేసుకుని వచ్చేసరికి రేవతి కొడుకు స్వరాజ్ ఆమెను ఢీకొడతాడు. నేను మా అమ్మ నుంచి తప్పిపోయామని బాబు ఏడుస్తాడు. దాంతో అపర్ణ జాలిపడి.. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్దామని చెప్పడంతో కావ్య, రాజ్‌లు ఉలిక్కిపడి అక్కడికి వస్తారు. మనింట్లోనే పోలీస్ ఉందని అప్పూకి చెబితే బాబు పేరెంట్స్‌ని క్షణాల్లో కనిపెడుతుందని చెబుతుంది కావ్య. దాంతో కావ్య, రాజ్, అపర్ణలు కలిసి బాబును తీసుకుని దుగ్గిరాల వారింటిలో అడుగుపెడతారు.

Photo Courtesy: JioHotstar
జూలై 30వ తేదీ 787వ ఎపిసోడ్‌లో ..
ఇంట్లోకి వచ్చిన పిల్లాడు రేవతి కొడుకని గమనించిన ఇందిర ఆ విషయాన్ని సీతారామయ్యకి చెబుతుంది. ఆ బాబుని చూసిన సీతారామయ్య ఎంతో సంతోషిస్తాడు. అత్తయ్యకి బాబుకి మధ్య ప్రేమ ఇంకా పెంచాలని రాజ్‌తో అంటుంది కావ్య. నాకు వంకాయ కూర ఇష్టం ఉండదని చికెన్ కర్రీ కావాలని బాబు మారాం చేయడంతో చికెన్ కర్రీ తెప్పిస్తుంది అపర్ణ. డైనింగ్ టేబుల్ దగ్గర తినడం నాకు ఇష్టం ఉండదని, నేను పరిగెత్తుతూ ఉంటాను నువ్వొచ్చి పట్టుకుని అన్నం తినిపించమని బాబు చెబుతాడు. పిల్లాడు ఇళ్లంతా తిరుగుతూ ఉండటంతో దుగ్గిరాల వారింట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. కొడుకుని తన తల్లిదండ్రులు గారాబం చేస్తుండటాన్ని రేవతికి కావ్య వీడియో కాల్ చేసి చూపిస్తుంది. అది చూసిన రేవతి ఎమోషనల్ అవుతుంది.
జూలై 31వ తేదీ 788వ ఎపిసోడ్‌లో ..
బాబుకి ఇంట్లో వాళ్లంతా క్లోజ్ అవ్వడం చూసి రుద్రాణికి అనుమానం వస్తుంది. బాబుని అపర్ణకి ఇంకా ఎలా దగ్గర చేయాలా? అని రాజ్, కావ్యలు ఆలోచిస్తుండగా ఇందిర వచ్చి మండిపడుతుంది. మీరు ఆడుతున్న నాటకం అపర్ణకి తెలిస్తే చాలా ప్రమాదమని రేవతిని జీవితంలో క్షమించదని వాళ్లని హెచ్చరిస్తుంది. లోపలికి వస్తుండగా ఇందిరను తాతమ్మ అని బాబు పిలవడంతో దుగ్గిరాల కుటుంబం మొత్తం ఉలిక్కిపడుతుంది. దాంతో తమ నాటకం ఎక్కడ బయటడపడిపోతుందోనని ఇందిర, కావ్య, రాజ్‌లు షాక్ అవుతారు. అయితే చిన్నారి స్వరాజ్ మాత్రం చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చి తప్పించుకుంటాడు. కావ్యకి ప్రపోజ్ చేసేందుకు రాజ్ దుగ్గిరాల వారి ఇంటి దగ్గరే ఉండిపోయిన విషయాన్ని యామినికి చెబుతాడు. దాంతో ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలంటూ రగిలిపోతుంది యామిని. మేం చేస్తున్నది తప్పు అయినా రాజ్- కావ్యలు విడిపోయేంత వరకు వెయిట్ చేయమని యామినికి ఆమె పేరెంట్స్ సలహా ఇస్తారు.

Photo Courtesy: JioHotstar
ఆగస్ట్ 1వ తేదీ 789వ ఎపిసోడ్‌లో ..
ప్లాన్‌లో భాగంగా బాబుని అపర్ణ దగ్గర పడుకోమని చెబుతుంది కావ్య. ఆమె చెప్పినట్లుగానే అపర్ణ గదిలోకి వెళ్తాడు స్వరాజ్. కథ వింటూ అపర్ణ ఒడిలోనే నిద్రపోతాడు బాబు. ఉదయాన్నే మొక్కలకు నీరు పోస్తున్న స్వరాజ్‌ని చూసిన రుద్రాణి.. బాబుకి చాక్లెట్ ఇచ్చి అతని వివరాలు కనుక్కోవాలని అనుకుంటుంది. బాబు ఏ సమాధానం చెప్పకుండా రుద్రాణిపై నీళ్లు పోస్తాడు. దాంతో పిల్లాడిని కొట్టబోతుండగా అపర్ణ వచ్చి ఆపుతుంది. రాజ్ ప్రపోజ్ చేయడానికి వస్తుండటంతో అతని కోసం అందంగా ముస్తాబు అవుతుంది కావ్య. ఇది చూసిన అపర్ణ, ఇందిరలు చాలా సంతోషిస్తారు. స్వరాజ్.. రేవతి అక్క కొడుకని తెలుసుకున్న కళ్యాణ్ షాక్ అవుతాడు. ఎలాగైనా బాబుని ఇంట్లో నుంచి పంపించాలని అప్పూకి చెబుతాడు కళ్యాణ్. డైనింగ్ టేబుల్ దగ్గర సీటు కోసం కళ్యాణ్‌తో గొడవపడతాడు స్వరాజ్. పిల్లాడు ఈ ఇంటి మనిషేనని ఇందిర నోరు జారడంతో అంతా షాక్ అవుతారు.
ఆగస్ట్ 2వ తేదీ 790వ ఎపిసోడ్‌లో ..
ఇందిర మాటల్ని కావ్య కవర్ చేస్తుంది. బాబుకి అపర్ణ టిఫిన్ తినిపిస్తుండటంతో ఇందిర చాలా సంతోషిస్తుంది. నీ కొడుకు కోడలు సరిగ్గా ఉంటే నీక్కూడా మనవడో, మనవరాలో ఉండేవాళ్లని నానా మాటలు అంటుంది రుద్రాణి. బాబు తల్లిదండ్రుల అడ్రస్ దొరికిందని పిల్లాడిని స్టేషన్‌కు తీసుకెళ్లాలని అపర్ణతో చెబుతుంది అప్పూ. దీని వెనుక ఏదో కుట్ర ఉందనుకున్న రుద్రాణి.. బాబుని ఎలా పంపిస్తాం వాడి తల్లిదండ్రులను ఇంటికి రమ్మని చెబుతుంది. అపర్ణ కూడా అదే మాట చెప్పడంతో అప్పూ, కావ్యలు షాక్ అవుతారు. దాంతో రేవతితో అపర్ణ చేత మాట్లాడిస్తుంది అప్పూ. రుద్రాణికి అనుమానం మరింత బలపడటంతో అప్పూని ఫాలో అవ్వమని రాహుల్‌కు చెబుతుంది. కావ్యకి వాంతులు రావడంతో ఆమె చెక్ చేసుకోగా ప్రెగ్నెంట్ అని తేలుతుంది. ఈ విషయాన్ని అందరితో చెప్పాలని అనుకుని తర్వాత నిరాశ పడుతుంది. అప్పుడే అప్పూ రావడంతో ఆమెను హత్తుకుని ఏడుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











