Brahmamudi Weekly Roundup: కళ్యాణ్ ని పెళ్లికి రావద్దన్న కనకం.. పెళ్లి ఆపి తీరతానంటున్న రాజ్!
భర్త మాటలు విన్న కావ్య కళ్యాణ్ తోనే అప్పు ప్రేమ గురించి మాట్లాడుతుంది. మీరు ఈ పెళ్లి చేసుకున్న అప్పు ఇక్కడ సుఖపడలేదు అని నచ్చ చెప్తుంది. ధాన్యలక్ష్మి కావ్యతో మాట్లాడుతూ కళ్యాణ్ కి మరొక పెళ్ళికి ఒప్పించమని డిమాండ్ చేస్తుంది. రాజ్ కళ్యాణ్ అప్పులతో మాట్లాడి వారి మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టాలని చూస్తాడు కానీ పెద్దల కోసం వాళ్లు వెనకడుగు వేస్తారు. ఇంట్లో అందరినీ పెళ్లికి పిలిచి కళ్యాణ్ ని మాత్రం పెళ్ళికి రావద్దు అంటుంది కనకం. పెళ్లిని ఎలాగైనా ఆపుతాను అంటాడు రాజ్, అలా జరగనివ్వను అంటుంది కావ్య. పెళ్లి మండపంలో పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తాడు రాజ్.
జూలై 29 వ తేదీ నుంచి ఆగష్టు 3వ తేదీ వరకు.. 474 ఎపిసోడ్ నుంచి 479 వరకు ఏం జరిగిందంటే?
జూలై 29 వ తేదీ 474 ఎపిసోడ్‌లో మీరు అప్పుని పెళ్లి చేసుకున్న మీఅమ్మగారు ఆమెని కోడలిగా అంగీకరించరు అని కళ్యాణ్ కి నచ్చ చెప్తుంది. రాజ్ అందరి ముందు కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అని చెప్తాడు. లేదు అని చెప్తుంది కావ్య. అందరూ కళ్యాణ్ ని పిలిచి మనసులో మాట చెప్పమంటారు. కళ్యాణ్ అప్పును ప్రేమించలేదు అని చెప్తాడు. నిజం చెప్పమంటూ తమ్ముడిని కోప్పడతాడు రాజ్.

జూలై 30 వ తేదీ 475ఎపిసోడ్‌లో ధాన్యలక్ష్మి కావ్య తో కళ్యాణ్ ని పెళ్లికి ఒప్పించమంటుంది. కావ్య కళ్యాణ్ తో మాట్లాడుతూ వీళ్ళ మాటలు విన్నారు కదా మీరు మీ అమ్మగారు చెప్పిన సంబంధం చేసుకుంటేనే వీళ్ళ నోళ్లు మూతపడతాయి అంటుంది. నాకు ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్. తర్వాత రాజ్ భార్య దగ్గరికి వెళ్లి ఆ ప్రేమికులని విడదీస్తే పాపం చుట్టుకుంటుంది అని కోప్పడతాడు. అప్పుకి ఆ ఉద్దేశం లేదు అంటుంది కావ్య. రాజ్ అప్పు వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగితే తను కళ్యాణ్ ని ప్రేమించలేదు అని చెప్తుంది.
జూలై 31 వ తేదీ 476 ఎపిసోడ్ లో ఇంటికి వచ్చిన రాజుని మా ఇంటి దగ్గర ఏం జరిగిందో చెప్పండి మీ పిన్ని అత్త వాళ్ళు నన్ను నానా మాటలు అంటున్నారు అంటుంది కావ్య. వాళ్లు ఈ పెళ్లికి సిద్ధంగా లేరు అని చెప్తాడు రాజ్. ధాన్య లక్ష్మి, రుద్రాణి ఆనందిస్తారు. అప్పుకి కళ్యాణ్ కి యాక్సిడెంట్ అయిందని బంటిద్వారా కబురు పెడతాడు రాజ్. హాస్పిటల్ కి వచ్చిన అప్పు తో కఠినంగా మాట్లాడి ఆమె మనసులో ఉన్న ప్రేమని బయటపడతాడు రాజ్. ఇంట్లో వాళ్ల కోసం పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి ఆపొద్దు అంటుంది అప్పు. ఈ మాటలు అన్ని కళ్యాణ్ వింటాడు. మరోవైపు ధాన్యలక్ష్మి రాజ్ కళ్యాణ్ ని ఎక్కడికి తీసుకు వెళ్ళాడు నీకు తెలిసే ఉంటుంది అని కావ్యతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన కళ్యాణ్ వాళ్లతో మీరు కలవడానికి వెళ్లారు కదా అని గొడవ పడుతుంది. అప్పుడే పెళ్లి పిలుపులకు వచ్చిన కనకం మా ఇంటికి ఎవరూ రాలేదు అని చెప్తుంది.

ఆగష్టు 1వ తేదీ 477 ఎపిసోడ్ లో పెళ్లి పిలుపులకు వచ్చిన తనకు అందర్నీ ఆహ్వానించి కళ్యాణ్ ని మాత్రం పెళ్ళికి రావద్దు అని చెప్తుంది. మరోవైపు బాధపడుతున్న అప్పుకి ధైర్యం చెప్పి ఆమెని పెళ్లికి సిద్ధపరుస్తారు కృష్ణమూర్తి దంపతులు. మరోవైపు తమ్ముడిని పెళ్లికి రావద్దు అని కనకం చెప్పటం పట్ల భార్య దగ్గర తన కోపాన్ని వ్యక్తం చేస్తాడు రాజ్. అలా ఎందుకు చేసిందో మీకు కూడా తెలుసు కదా అంటుంది కావ్య. మరోవైపు రుద్రాణి కళ్యాణ్ ని ఊరు నుంచి పంపించేయమని ధాన్య లక్ష్మి కి సలహా ఇస్తుంది. దాని లక్ష్మి కొడుకు దగ్గరికి వెళ్లి అదే విషయం చెప్తే నేను వెళ్ళను అంటూ తల్లి పై కోప్పడతాడు కళ్యాణ్.
ఆగస్టు 2 వ తేదీ 478 ఎపిసోడ్‌లో నీ భయం నాకు అర్థమైంది నేను కళ్యాణ మండపానికి రానులే అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మరోవైపు కూతురు పెళ్లిలో తెగ హడావిడి పడిపోతూ ఉంటుంది కనకం. మరోవైపు పెళ్లికి వెళ్లి అక్కడ లేనిపోని మాటలు మాట్లాడవద్దు అని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది ఇందిరా దేవి. అయితే మండపానికి వచ్చిన రుద్రాణి ఆమె బుద్ధి చూపించకుంటుంది. ఆమెకి సరైన సమాధానం చెప్తుంది స్వప్న. పేద ఇంటికి వెళ్ళినప్పుడు లోటుపాట్లు ఎంచకుండా సర్దుకోవాలి అని చివాట్లు పెడుతుంది కావ్య. మరోవైపు అప్పు మనసులో ఇంకా కళ్యాణ్ ఉన్నాడని తెలుసుకున్న స్వప్న పారిపోయి కళ్యాణ్ ని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంది.
ఆగస్టు 3 వ తేదీ 479 ఎపిసోడ్‌లో చెల్లెలి ప్రేమ విషయం కళ్యాణ్ తో చెప్తుంది స్వప్న. ఏది జరిగితే అదే జరుగుతుంది ఎలాగైనా అప్పుని ఒప్పించి తీసుకువచ్చేయాలి అని ఇంట్లోంచి బయలుదేరుతాడు కళ్యాణ్. స్వప్న మాటలు విన్న రాజ్ అప్పుడు కళ్యాణ్ లని కలపటానికి ఏదైనా చేయాలి అనుకుంటాడు పెళ్ళికొడుకుతో అప్పు ప్రేమ విషయం చెప్తే అతను నమ్మడు. కానీ ఆ మాటలు విన్న కావ్య భర్తని కోప్పడుతుంది.
నా కుడుకన్ను కొట్టుకుంటుంది ఎందుకో ఈ పెళ్లి జరగదనిపిస్తుంది అంటుంది రుద్రాణి.ఏవేవో చెప్పే భయ పెట్టొద్దు అంటుంది ధాన్యలక్ష్మి. తర్వాత రాజ్ అప్పు గది దగ్గరికి వెళ్లి ఎవరికోసమో ఆలోచించి మీ జీవితాలని త్యాగం చేసుకోవద్దు, ధైర్యం చేసి అడుగు ముందుకు వెయ్యు నీకోసం నేను కార్లో బయట వెయిట్ చేస్తాను కళ్యాణ్ దగ్గరికి తీసుకు వెళ్తాను అంటాడు. ఆ మాటలు అప్పు కాకుండా కావ్య వింటుంది రాజు వెనుక కావ్య ముసుగు వేసుకొని కూర్చుంటుంది. ఈ పెళ్లి జరుగుతుందా? లేదంటే రాజ్ ఈ పెళ్లిని ఆపేస్తాడా తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే!


Click it and Unblock the Notifications











