Brahmamudi weekly roundup: అప్పూని సస్పెండ్ చేయించిన యామిని.. చెల్లెలి కోసం కావ్య పోరాటం

Photo Courtesy: JioHotstar

రాహుల్ సెకండ్ సెటప్ గురించి స్వప్న ఇంట్లో వాళ్లందరికీ చెప్పడంతో అతని పాకెట్ మనీని కట్ చేస్తుంది ఇందిర. ఎండీగా ట్రైనింగ్ ఇచ్చేందుకు నైట్ మొత్తం రాజ్‌ని తనతోనే ఉంచుకుంటుంది కావ్య. స్వప్న పెట్టే టార్చర్ తట్టుకోలేక రక్షించమని రుద్రాణిని అడుగుతాడు రాహుల్. ఎండీ గెటప్‌లో ఉన్న రాజ్‌ని చూసి దుగ్గిరాల కుటుంబం సంతోషిస్తుంది. పక్కా ప్లాన్ ప్రకారం డబ్బులు ఇస్తూ ఏసీబీ అధికారులకి అప్పూని పట్టిస్తారు యామిని మనుషులు. ఆఫీసులో రాజ్ దెబ్బకు సిద్ధార్ధ్ తోకముడిచి పారిపోతాడు.

కావ్యకి యామిని ఫోన్ చేసి నీ అప్పూని అరెస్ట్ చేయించి, ఉద్యోగం లేకుండా చేశానని చెబుతుంది. స్టేషన్‌లో అప్పూని విడిపించి ఇంటికి తీసుకొచ్చిన కావ్య.. తన చెల్లెలు నిజాయితీని నిరూపిస్తానని, లేదంటే ఇంట్లోనే తాను ఉంటుందని ఛాలెంజ్ విసురుతుంది. కావ్య గురించి లేనిపోనివి చెప్పి రాజ్ మనసును విరిచేయాలని అనుకుంటుంది యామిని. అప్పూని బయటికి తీసుకొచ్చేందుకు నేను అండగా ఉంటానని కావ్యతో అంటాడు రాజ్. పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి సీన్ రీ క్రియేట్ చేస్తాడు రాజ్.

Brahmamudi Telugu Serial Weekly roundup July 7th to July 12th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి జూలై 7వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు .. 767వ ఎపిసోడ్ నుంచి 772 వరకు ఏం జరిగిందంటే?

జూలై 7వ తేదీ 767వ ఎపిసోడ్‌లో ..
స్వరాజ్ గ్రూప్‌లోని ఉద్యోగులను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నానని రాజ్ చెప్పడంతో స్టాఫ్ మొత్తం షాక్ అవుతారు. ఇంతలో కావ్య వచ్చి ఇదంతా ఫ్రాంక్ అని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. రాహుల్‌ను ఇంటికి లాక్కొచ్చిన స్వప్న అతని సెకండ్ సెటప్, నగల దొంగతనంపై పంచాయతీ పెడుతుంది. ఎవరూ నమ్మేలా కనిపించకపోవడంతో రాహుల్ సెకండ్ సెటప్‌ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తుంది అప్పూ. దీంతో రాహుల్‌కి పాకెట్ మనీ కట్ చేయడంతో పాటు ఇంటి పనులన్నీ చేయాలని ఆర్డర్స్ వేస్తుంది. గొడవ సద్దుమణిగిన తర్వాత కొడుకుని లాగిపెట్టి కొడుతుంది రుద్రాణి. నేను ఇంటికి రావడం లేదని రాత్రంతా కళావతి దగ్గరే ఉంటానని యామినికి రాజ్ ఫోన్ చేసి చెబుతాడు.

జూలై 8వ తేదీ 768వ ఎపిసోడ్‌లో ..
నైట్ అంతా రాజ్‌ని నిద్రపోనివ్వకుండా ఫైల్స్ మొత్తం చదివిస్తుంది కళావతి. ఉదయాన్నే ఇందిర, అపర్ణలు వచ్చి చూసేసరికి కావ్య ఒడిలో రాజ్ నిద్రపోతూ కనిపిస్తారు. పోలీస్ స్టేషన్‌కి రెడీ అవుతున్న అప్పూతో హనీమూన్‌కు వెళ్దామని అడుగుతాడు కళ్యాణ్. నాకు కుదరదని పెండింగ్ కేసులు చాలా ఉన్నాయని చెబుతుంది అప్పూ. ఇంట్లో వాళ్లు పాకెట్ మనీ కట్ చేయడంతో పనివాడిగా రాహుల్‌తో అన్ని పనులు చేయిస్తుంది స్వప్న. తన బాధను తల్లితో చెప్పుకుని కాపాడమని ప్రాధేయపడతాడు రాహుల్. బోర్డ్ మీటింగ్ కోసం బయల్దేరిన సిద్ధార్ధ్‌కు రాజ్ ఆఫీసుకు వస్తున్న విషయాన్ని లీక్ చేయడంతో పాటు ఎలాంటి ప్లాన్ చేయాలో చెబుతుంది యామిని.

Brahmamudi Telugu Serial Weekly roundup July 7th to July 12th episode Story

Photo Courtesy: JioHotstar

జూలై 9వ తేదీ 769వ ఎపిసోడ్‌లో ..
ఆఫీస్‌కి బయల్దేరిన రాజ్‌ నడక, మాట తీరు అంతా నిజమైన రాజ్‌లా ఉండటంతో దుగ్గిరాల కుటుంబంతో పాటు కావ్య షాక్ అవుతారు. కావ్యకు యామిని ఫోన్ చేసి నీకు ఎండీగా ఇదే లాస్ట్ డే.. నీకోసం ఇంకో సర్‌ప్రైజ్ ప్లాన్ చేశానని చెబుతుంది. ఆ మాటలతో తన ఇంట్లో వాళ్లకి ఏమైనా ఆపద జరగబోతుందా అని కంగారు పడిన కావ్య.. స్వప్న, అప్పూలకి ఫోన్ చేసి ఆరా తీస్తుంది. యామిని ఏర్పాటు చేసిన శీనుగాడు, అతని ఫ్రెండ్ పక్కా ప్లాన్‌తో ఏసీబీకి ఫోన్ చేసి స్టేషన్‌కి రప్పిస్తారు. అప్పూకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఆమెను పట్టుకుంటారు. ఇదంతా కుట్రలా ఉందని, తాను ఏ తప్పూ చేయలేదని అప్పూ ఎంత చెబుతున్నా వినిపించుకోరు. అప్పూకి ఇలా జరగడంతో స్టేషన్‌లోని సిబ్బంది కూడా బాధపడతారు. ఎండీగా రాజ్‌ ఆఫీస్‌కు రీ ఎంట్రీ ఇవ్వడంతో సిద్ధార్ధ్ టెన్షన్ పడతాడు.

జూలై 10వ తేదీ 770వ ఎపిసోడ్‌లో ..
స్వరాజ్ గ్రూప్ లాభాల్లో లేకపోవడంతో ఎండీని మార్చాలనుకుంటున్నట్లు రాజ్‌తో చెబుతాడు సిద్ధార్ధ్. ఇటీవల యాక్సిడెంట్ జరిగి నీ హెల్త్ కండీషన్ బాలేదని.. గతంలో మాదిరిగా కంపెనీని నడిపించలేవని రాజ్‌తో అంటాడు సిద్ధార్ధ్. దాంతో తాను ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎన్ని లాభాలు తీసుకొచ్చింది.. కంపెనీని ఎంతగా డెవలప్‌ చేసింది చెబుతాడు రాజ్. అలాగే సిద్ధార్ధ్ నాన్నగారు గతంలో దొంగ బంగారం తీసుకొచ్చిన రహస్యాన్ని రాజ్ బయటపడంతో బోర్డ్ మెంబర్స్ సహా కావ్య కూడా షాక్ అవుతుంది. నువ్వు చూపించిన 500 కోట్ల ప్రాజెక్ట్ కూడా ఫేక్ అని తేల్చిచెబుతాడు రాజ్. ఆ మాటలతో సిద్ధార్ధ్‌కు చెమటలు పడతాయి. నువ్వు కంపెనీని అద్భుతంగా నడిపిస్తున్నావని, నువ్వు ఉన్నంత వరకు ఆ ఎండీ చైర్‌ జోలికి రానని వెళ్లిపోతాడు సిద్ధార్ధ్. బోర్డ్ మీటింగ్‌లో రాజ్ గెలిచినట్లు తెలుసుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ ఎంతో సంతోషిస్తుంది. కావ్య‌కు రాజ్ ప్రపోజ్ చేస్తుండగా యామిని ఫోన్ చేసి అప్పూ పోలీస్ ఉద్యోగాన్ని తీయించేశానని చెప్పడంతో కళావతి షాక్ అవుతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup July 7th to July 12th episode Story

Photo Courtesy: JioHotstar

జూలై 11వ తేదీ 771వ ఎపిసోడ్‌లో ..
అప్పూని పోలీసులు అరెస్ట్ చేశారని తాను అర్జెంట్‌గా వెళ్లాలని రాజ్‌తో చెబుతుంది కావ్య. వెళ్తూ వెళ్తూ రాజ్‌కి ఒక హగ్ ఇస్తుంది. నేను కూడా వస్తానని రాజ్ చెప్పగా.. మిమ్మల్ని ఇంకా సమస్యల్లోకి నెట్టడం నాకు ఇష్టం లేదని అంటుంది. ఏసీబీకి పట్టుబడటంతో అప్పూ తన యూనిఫాంను చూసుకుని బాధపడుతుంది. అప్పూని జైలులో పెట్టమని కానిస్టేబుల్స్‌ని ఏసీబీ ఆఫీసర్ ఆదేశిస్తాడు. అవసరం లేదని నేనే వెళ్లి జైలులో కూర్చొంటానని చెబుతుంది అప్పూ. ఇంతలో కావ్య వచ్చి తన చెల్లెల్ని బెయిల్‌పై విడిపిస్తుంది. ఇంత ఫాస్ట్‌గా ఈమెకు బెయిల్ ఎలా వచ్చింది? అంత బ్యాక్‌గ్రౌండ్ ఉందా? అని ఏసీబీ ఆఫీసర్ అడుగుతాడు. మా అప్పూ.. దుగ్గిరాల వారి ఇంటి కోడలు అని చెప్పడంతో ఏసీబీ ఆఫీసర్ షాక్ అవుతాడు. ఇంటికొచ్చిన రాజ్‌తో కళావతి గురించి చెడుగా చెబుతుంది యామిని. దాంతో రాజ్ ఆమెపై మండిపడతాడు. స్టేషన్ నుంచి అప్పూని ఇంటికి తీసుకొస్తుంది కావ్య. గుమ్మం దగ్గరే రుద్రాణి, ధాన్యలక్ష్మీలు ఆమెను నానామాటలు అంటారు. తన చెల్లెలు నిజాయితీని నేను నిరూపిస్తానని.. అలా చేయలేకపోతే అప్పూ ఇంట్లోనే ఉండిపోతుందని కావ్య సవాల్ విసురుతుంది.

జూలై 12వ తేదీ 772వ ఎపిసోడ్‌లో ..
అప్పూకి ఏం జరిగిందోనని కావ్యకి ఫోన్ చేసి అడుగుతాడు రాజ్. అప్పూని ఇరికించిన వారిని విడిచిపెట్టొద్దని... ఆమె నిజాయితీని నిరూపిద్దామని కావ్యతో అంటాడు. లంచం తీసుకుంటూ దొరికిపోవడం, ఉద్యోగం పోవడం, ధాన్యలక్ష్మీ నానామాటలు అనడంతో ఏడుస్తున్న అప్పూని ఓదారుస్తాడు కళ్యాణ్. మా అమ్మని తప్పుగా అర్ధం చేసుకోవద్దని నా గురించే ఆమె అలా మాట్లాడుతుందని చెబుతాడు కళ్యాణ్. అప్పూని ఎలా బయటికి తీసుకురావాలా? అని దుగ్గిరాల కుటుంబం మాట్లాడుకుంటూ ఉండగా రాజ్ వస్తాడు. అప్పూని ఇరికించిన వాడిని వెతుకుదామని చెబుతాడు. దానికి రుద్రాణి అడ్డుపడి అవన్నీ వేస్ట్ అని చెబుతుంది. దీంతో సీన్ రీ క్రియేషన్ పేరుతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి రాజ్ నాటకం ఆడతాడు. ఇందులో శీనుగాడు, వాడి ఫ్రెండ్ గెటప్స్ వేసిన రాహుల్- రుద్రాణిలను ఇంట్లో వాళ్లంతా చితకబాదుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X