Brahmamudi Weekly Roundup: మంట పెట్టి చోద్యం చూస్తున్న రుద్రాణి.. భర్తని ఎప్పటికీ క్షమించలేనంటున్న అపర్ణ!
తప్పంతా అనామిక దే అని సాక్షాధారాలు కోర్టులో సబ్మిట్ చేస్తుంది కావ్య. జడ్జి కళ్యాణ్ కి అనుకూలంగా తీర్పు ఇస్తాడు. కనకం చుట్టుపక్కల వాళ్ళు అప్పు గురించి తప్పుగా మాట్లాడుతారు సరైన సమాధానం చెప్పి వాళ్ళ నోర్లు మూయిస్తుంది కనకం. కళ్యాణ్ అనామిక గుర్తులన్నీ కాల్చి బూడిద చేస్తాడు. మరోవైపు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోవడానికి, కవి గారి మూడ్ మార్చటానికి సుభాష్ వాళ్ళ పెళ్లి రోజుని గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేస్తారు రాజ్ దంపతులు. పెళ్లి రోజు నాడు కుటుంబ సభ్యులందరూ ఆటపాటలతో గడుపుతారు.. జూలై 8 వ తేదీ నుంచి జులై 13 వ తేదీ వరకు.. 456 ఎపిసోడ్ నుంచి 461వరకు ఏం జరిగిందంటే?
జూలై 8 వ తేదీ 456 ఎపిసోడ్‌లో
తప్పంతా అనామిక అదే అని కోర్టులో నిరూపిస్తుంది కావ్య జడ్జిగారు కళ్యాణ్ కి అనుకూలంగా తీర్పు ఇస్తారు. అనామిక కి జైలు శిక్ష కూడా వేస్తారు. ఈ కేసులో అప్పు ని ఇన్వాల్వ్ చేసినందుకు ఆమెకి క్షమాపణ చెప్తాడు కళ్యాణ్. కోర్టు నుంచి ఇంటికి వచ్చిన అప్పు గురించి తప్పుగా మాట్లాడుతారు పక్కింటి వాళ్ళు, వాళ్ళ నోర్లు ముయించేలా సమాధానం చెబుతుంది కనకం. మరోవైపు తన మనసులో మాట భార్యకి చెప్పడానికి ఇబ్బంది పడుతుంటాడు రాజ్.

జూలై 9 వ తేదీ 457ఎపిసోడ్‌లో
అనామిక తన పట్ల ప్రవర్తించిన తీరుకి బాధపడతాడు కళ్యాణ్, ఆమెకి గుర్తుగా ఉన్న ఫోటోలన్నీ కాల్చి బూడిద చేస్తాడు. తర్వాత కావ్య అతడిని బలవంతంగా భోజనానికి తీసుకువెళుతుంది అక్కడ రుద్రాణి అతని మనసు గాయపడేలా మాట్లాడుతుంది. ఆ మాటలకి వంతపాడుతుంది ధాన్యలక్ష్మి. తల్లి మీద కోప్పడి భోజనం చేయకుండా వెళ్ళిపోతాడు కళ్యాణ్. తన వల్ల అప్పు జీవితంలో మచ్చ పడిందని వదిన దగ్గర బాధపడతాడు కళ్యాణ్. తన గురించి ఆలోచించవద్దు తనకు మేమందరం సపోర్టుగా ఉన్నాము మీ గురించి మీరు ఆలోచించండి మళ్లీ రచనలు ప్రారంభించండి అని సపోర్ట్ ఇస్తుంది కావ్య.
జూలై 10 వ తేదీ 458 ఎపిసోడ్ లో
మరుసటి రోజు తల్లిదండ్రుల పెళ్లి రోజు కావడంతో ఈ వేడుక ఘనంగా చేయాలి అనుకుంటారు రాజ్ దంపతులు. మరోవైపు అప్పుకి పెళ్లి చేసేద్దాం అంటుంది కనకం. తప్పనిసరి పరిస్థితులలో ఒప్పుకుంటాడు కృష్ణమూర్తి. మరొకటి రోజు సుభాష్ చేతిలో గిఫ్ట్ పెట్టి విషెస్ చెప్పి సుభాష్ ఇచ్చినట్లుగా అపర్ణకి గిఫ్ట్ ఇప్పిస్తారు దంపతులు ఆ గిఫ్ట్ అపర్ణ తీసుకుంటుంది. బాగా ఎమోషనల్ అవుతాడు సుభాష్. తర్వాత అప్పు కోసం ఒక రౌడీని తీసుకు వస్తాడు పెళ్లిళ్ల పేరయ్య. వాడిని తరిమేస్తుంది కనకం. మరోవైపు బాధగా ఉన్న కొడుకుని ఓదార్చుతారు ధాన్యలక్ష్మి దంపతులు.

జూలై 11 వ తేదీ 459 ఎపిసోడ్ లో
భర్త ఇచ్చిన చేరని పని మనిషికి ఇచ్చేసిన అపర్ణ భర్తని ఎప్పటికీ క్షమించలేను అని మనసులో అనుకుంటుంది. తర్వాత ఇంట్లో అందరూ సుభాష్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. సరదాగా గేమ్స్ కుటుంబ సభ్యులందరూ. సీతారామయ్య దంపతులు ఆ గేమ్స్ కి జడ్జిలుగా వ్యవహరిస్తారు.
జూలై 12 వ తేదీ 460 ఎపిసోడ్‌లో
గేమ్స్ లో సుభాష్ దంపతులు అవుతారు తర్వాత కళ్యాణి కూడా గేమ్లో ఇన్వాల్వ్ చేస్తారు రాజ్ దంపతులు ఎమోషనల్ అయినా కళ్యాణ్ ఏడుస్తూ కుప్పకూలిపోతాడు. కుటుంబ సభ్యులందరూ బాధపడుతుంటే నేను ఏడవడం లేదు పెర్ఫార్మన్స్ చేశాను మీకు నచ్చలేదా అంటూ తన బాధ బయటికి కనిపించకుండా కవర్ చేసుకుంటాడు . ఈ ప్రోగ్రాంలో రుద్రాణి డాన్స్ అదరగొడుతుంది.
జూలై 13వ తేదీ 461 ఎపిసోడ్‌లో
అపర్ణకి ఇచ్చిన చీర పనిమనిషి కట్టుకోవటంతో షాక్ అవుతారు సుభాష్, కావ్య, రాజ్. ఇదే విషయం గా భార్యని నిలదీస్తాడు సుభాష్. నా సౌభాగ్యాన్ని వేరొకడికి దోచిపెట్టి మీరు ఇచ్చిన చీర కట్టుకోమంటే నేను కట్టుకోలేను అని తెగేసి చెప్తుంది అపర్ణ. మీ ఇద్దరు కలిసి పోలేదా అని తండ్రిని అడుగుతాడు రాజ్. అందుకు సుభాష్ కొడుకు కోడల్ని కోప్పడతాడు. వేరే వాళ్ల కాపురాలని సరి చేసే క్రమంలో మీ జీవితాన్ని కోల్పోతున్నారు ముందు మీ జీవితాన్ని ఆస్వాదించండి అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత కావ్య ఆపర్ణ దగ్గరికి వెళ్తుంది ఆ మనిషి రాయబారానికి పంపించారా, నువ్వు నన్ను నిలదీయటానికి వచ్చావా అంటుంది అపర్ణ. మిమ్మల్ని నిలదీసే మొహమేనా నాది అంటుంది కావ్య. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











