Brahmamudi Weekly Roundup: భర్త ఇచ్చిన షాక్ కి హాస్పిటల్ పాలైన అపర్ణ.. కావ్య ముఖం చూడనంటున్న రాజ్!

బ్రహ్మముడి సీరియల్‌లో అసలు మాయని తీసుకువస్తానని అనుకుంటుంది కావ్య. వెళ్ళిపోవటంతో పెళ్లి ఆపలేని పరిస్థితిలోకి వచ్చేస్తుంది ఇక చూస్తూ ఊరుకోలేని సుభాష్ నిజం చెప్పి పెళ్లి ఆపేస్తాడు అయితే నిజం తట్టుకోలేక హాస్పిటల్ పాలవుతుంది అపర్ణ. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన అపర్ణ కోడలు పట్ల చూపిస్తున్న అభిమానానికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.జూన్ 10వ తేదీ నుంచి జూన్ 15 వ తేదీ వరకు.. 432 ఎపిసోడ్ నుంచి 437 వరకు ఏం జరిగిందంటే?

జూన్ 10వ తేదీ 432 ఎపిసోడ్‌లో
దిగులుగా కూర్చున్న అత్తమామల దగ్గరికి వచ్చి నాకు కూడా ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదు కానీ బిడ్డకి న్యాయం చేయటం కోసం ఇలా చేస్తున్నాను అంటుంది అపర్ణ. మరి కావ్యకి ఏ న్యాయం చేస్తావు అని అడుగుతాడు సీతారామయ్య. ఏమి మాట్లాడలేక పోతుంది అపర్ణ. మరోవైపు పెళ్ళి తంతు ఎక్కడ వరకు తీసుకువచ్చినందుకు చెల్లెలిపై ఫైర్ అవుతుంది స్వప్న. పెళ్లి పీటల మీద కూర్చున్న రాజ్తో కాసేపట్లో నిన్ను సొంతం చేసుకోబోతున్నాను అంటుంది. మనం ఇంకా పెళ్లి పీటల మీదే కూర్చున్నాము ఏ నిమిషంలో అయినా ఈ పెళ్లి ఆగిపోవచ్చు అంటాడు రాజ్. మరోవైపు మాయా కి మెలుకువ వచ్చింది అని చెప్పడంతో హాస్పిటల్ కి వెళుతుంది కావ్య. నిలదీస్తుంది కానీ మాయ మళ్లీ స్పృహ కోల్పోవడంతో బాధగా ఇంటికి వచ్చేస్తుంది.

Brahmamudi Telugu Serial Weekly Roundup june 10th to June 15th episode Story

జూన్ 11 వ తేదీ 433 ఎపిసోడ్‌లో
పెళ్లి పీటల వరకు వచ్చేయడంతో సుభాష్ చాలా కంగారు పడతాడు. ఇంట్లో వాళ్ళందరూ కావ్యని పెళ్లి ఆపడానికి ఏం చేయబోతున్నావు అని అడుగుతారు. మరోవైపు అబ్బో స్పృహలోకి వచ్చింది అని చెప్పటంతో కావ్య మళ్ళీ హాస్పిటల్ కి వెళుతుంది మాయ. నిజం చెప్పేలోపే కోమాలోకి వెళ్ళిపోతుంది. అట్నుంచి ఏడుస్తూ వచ్చిన కావ్య పెళ్లి ఆపలేకపోతున్నందుకు రాజ్ ని క్షమాపణ అడుగుతుంది.ఇక వేరే దారి లేక సుభాష్ నిజం చెప్పేస్తాడు. ఆ నిజం తట్టుకోలేక కుప్పకూలిపోతుంది అపర్ణ.ఆమె ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంట్లో వాళ్ళు. ఇదంతా నా వల్లే అని సుభాష్ గిల్టీగా ఫీల్ అవుతాడు.

జూన్ 12వ తేదీ 434 ఎపిసోడ్ లో
కోడలికి ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చినందుకు సుభాష్ చెంప పగల కొడుతుంది ఇందిరాదేవి. నీవల్లే నా కోడలు ఈ పరిస్థితికి వచ్చింది దానికి జరగకూడనిది ఏమైనా జరిగితే నిన్ను నా గుమ్మం కూడా తొక్కనివ్వను అని హెచ్చరిస్తుంది. మరోవైపు రాజ్ కావ్య పై కోప్పడుతూ నీ వల్లే మా నాన్న నిజం చెప్పవలసి వచ్చింది. అమ్మకి ఏమైనా జరిగితే జీవితంలో నీ మొఖం చూడను అని హెచ్చరిస్తాడు. అవమానం తట్టుకోలేక సుభాష్ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు.

జూన్13 వ తేదీ 435 ఎపిసోడ్‌లో
డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ చేసి సుభాషిని మందులు ఇస్తాడు రాజ్ దంపతులు కూడా సుభాష్ కి ధైర్యం చెప్తారు. బెడ్ మీద ఉన్న అత్తగారి దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్తుంది కావ్య. ఒకప్పుడు నేను కూడా ఈ పరిస్థితులలోనే ఉన్నాను అయినా నా భర్తని నమ్మాను, పెళ్లయి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఎందుకు మామయ్య గారిని నమ్మలేకపోతున్నారు. ఎక్కడో ఏదో జరిగింది నిజం తెలిసే వరకు ఓపిక పట్టండి అంటుంది. మరోవైపు అపర్ణ చనిపోలేనందుకు బాధపడుతూ ఉంటారు రాహుల్ రుద్రాణి. హార్ట్ ఎటాక్ వచ్చిన గుండె షెడ్ కి వెళ్లినట్టే, ప్రతి చిన్న దానికి ఆగిపోతుంది అలా ఆగిపోయేటట్లు మనం చేద్దాం అంటుంది రుద్రాణి. మరోవైపు ఊరు నుంచి వచ్చిన తనకు దంపతులు కావ్య ఇంట్లో జరిగిందంతా అప్పు ద్వారా తెలుసుకొని బాధపడతారు. మరోవైపు డాక్టర్ రాజ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీ అమ్మగారికి మీ భార్య ఏం చెప్పారో తెలియదు కానీ చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు అంటూ కావ్య అని పొగిడి అపర్ణని ఇంటికి తీసుకు వెళ్ళిపోమని చెప్తుంది. ఇంటికి వచ్చిన అపర్ణ మనసు బాధపడేటట్లు మాట్లాడుతుంది రుద్రాణి. ఆమెని కోప్పడతారు ఇంట్లో వాళ్ళు.

Brahmamudi Telugu Serial Weekly Roundup june 10th to June 15th episode Story

జూన్ 14 వ తేదీ 436 ఎపిసోడ్‌లో
తనకి సేవలు చేస్తున్న కోడలి ముఖం చూడటానికి ఇబ్బంది పడుతుంది అపర్ణ ఆమె పట్ల తాను ఎలా ప్రవర్తించినది తలచుకొని పశ్చాత్తాప పడుతుంది. కానీ కావ్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా అత్తగారికి సేవచేస్తుంది. తర్వాత తండ్రిని అసహ్యించుకుంటున్న తల్లితో నా భార్యకి నా మీద ఉన్న నమ్మకం మీకు నాన్న మీద ఎందుకు లేకపోయింది అని అడుగుతాడు రాజ్. తండ్రిని వెనకేసుకొస్తున్నందుకు రాజ్ ని కోప్పడుతుంది అపర్ణ.

జూన్ 15వ తేదీ 437 ఎపిసోడ్‌లో
కావ్య చేత్తో సూప్ తాగను అంటుంది అపర్ణ. మీరు కూడా నా మీదే కోప్పడండి మీ అబ్బాయి కూడా నామీద కోప్పడుతున్నారు అంటుంది కావ్య. రాజ్ మీద కోప్పడుతుంది అపర్ణ. కావ్య వెళ్ళిపోయిన తర్వాత భార్యని సరిగ్గా చూసుకో అని కొడుకుని మందలిస్తుంది. తర్వాత సుభాష్ ని మందలిస్తున్న ఇందిరా దేవిని వారిస్తుంది కావ్య. ఈ పూజ మీ చేతుల మీదుగా జరుగుతుందని చెప్పండి మామయ్య గారు మీదుగా అంటే అత్తగారు ఒప్పుకోరు అంటుంది. తర్వాత తనని చూడటానికి వచ్చిన కనకం దంపతులను ఆప్యాయంగా పలకరిస్తుంది అపర్ణ ఆమె ప్రవర్తనకి అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత అపర్ణ పీఠల మీద ఎక్కువసేపు కూర్చోలేను అంటే సుభాష్ కూర్చుంటాడు. ఆయన పూజ చేయటం ఇష్టం లేదని మొహం మీదే చెప్తుంది అపర్ణ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X