Brahmamudi weekly roundup: రాజ్‌కి లక్కీ వెన్నుపోటు... రాజ్- ఇందూల గుట్టు కనిపెట్టిన ఐశ్వర్య..

Photo Courtesy: JioHotstar

కంపెనీకి రా మెటీరియల్ సప్లయ్ చేసేవాడు డబ్బులు కట్టాలని నోటీసు పంపడంతో ఇందూకి ఏం చేయాలో అర్ధం కాదు. దాంతో సుభాష్ ఓ ప్లాన్ చెప్పడంతో, రేఖని రెచ్చగొట్టి పార్టీకి ఒప్పుకునేలా చేస్తుంది ఇందూ. రాజ్‌కి ఇందూకి పెళ్లి జరిగిందా? లేదా? అని తెలుసుకోవడానికి లక్కీని దువ్వుతుంది ఐశ్వర్య. ఆమె చెప్పినట్లుగానే రాజ్‌ని లక్కీ మందు కొట్టడానికి పిలిచి పెళ్లి గురించి వివరాలు కనుక్కుంటాడు. నేను ఇందూకి అద్దె మొగుడిని, డబ్బులు తీసుకుని నటిస్తున్నానని రాజ్ చెప్పడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. అతను చెప్పే మాటలన్నీ రికార్డ్ చేస్తుంది. ఇందూని సీఈవోగా అనౌన్స్ చేసే పార్టీలో సీతారామయ్య ఫోటో ఉండటంతో రేఖ షాక్ అవుతుంది. అయినప్పటికీ రాజ్ తన తెలివితేటలతో రేఖని బురిడీ కొట్టిస్తాడు. రాజ్ ఎక్కడున్నాడో లక్కీ ద్వారా తెలుసుకున్న చలపతి- లక్ష్మీలు దుగ్గిరాల వారింటికి వస్తారు. అది చూసిన రాజ్.. తల్లిదండ్రులకు నచ్చజెప్పి పంపిస్తాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup June 15th to June 20th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి జూన్ 15వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు .. 1059వ ఎపిసోడ్ నుంచి 1064వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

జూన్ 15వ తేదీ 1059వ ఎపిసోడ్‌లో ..
వెంకీ డెలివరీ బాయ్‌గా జాయిన్ అవ్వడానికి వెళ్తుండగా బైక్ స్టార్ట్ కాదు.. దీంతో ఓనర్ ఫోన్ చేసి నానామాటలు అంటాడు. దాంతో చేసేదేం లేక సైకిల్ మీద వెళ్తాడు వెంకీ. ఇందూకి కొరియర్ రావడంతో అది చదువుకుంటూ వస్తుంది. ఇందులో ఏముందో చదివి వినిపించమని రేఖను అడుగుతుంది ఇందూ. అది చదివిన భూషణ్.. మన కంపెనీకి రా మెటీరియల్ సప్లయ్ చేసే ఓ క్లయింట్‌కి 3 నెలల నుంచి పేమెంట్ ఇవ్వకపోవడంతో వాడు డబ్బులు కట్టాలని నోటీసులు పంపించాడని భూషణ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. రా మెటీరియల్ సప్లయ్ చేయకపోతే మాన్యుఫాక్చరింగ్ ఆగిపోతుంది.. కంపెనీని మూసేయాల్సి వస్తుందని రేఖ చెప్పడంతో.. ఎలాగైనా దీని నుంచి కాపాడమని ఇందూ బతిమలాడుతుంది. కంపెనీకి వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించాలా అని ఇందూ, రాజ్ ఆలోచిస్తుండగా సుభాష్ వచ్చి ఓ ప్లాన్ చెప్పి ఒక పార్టీ ఏర్పాటు చేయమని చెబుతాడు. పార్టీకి రేఖను ఒప్పించడానికి అపర్ణ ఫ్రెండ్ శకుంతలని రంగంలోకి దించమని చెబుతుంది ఇందూ.

జూన్ 16వ తేదీ 1060వ ఎపిసోడ్‌లో..
వెంకీ సైకిల్ మీద డెలివరీలు చేస్తుండటంతో కస్టమర్లంతా తిట్టుకుంటూ ఓనర్‌కి ఫోన్ చేయడంతో అతను వెంకీని పిలిపించి నానామాటలు అంటాడు. బైక్ లేకపోయినా సైకిల్ మీద కష్టపడి అన్ని డెలివరీలు ఇచ్చానని వెంకీ చెప్పడంతో ఒక చివరి అవకాశం ఇస్తాడు ఓనర్. ఇందూ ప్లాన్‌లో భాగంగా దుగ్గిరాల ఇంటికి అపర్ణ ఫ్రెండ్ శకుంతల వస్తుంది. ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావు? అయినా ఈ ఇంటికి ఏదో దిష్టి తగిలిందని రేఖ ముందే సెటైర్లు వేస్తుంది శకుంతల. ఇందూకి పెళ్లయిపోయిందా? పెళ్లేంటీ.. సీఈవో కూడా అయిపోయిందని రాజ్ అనడంతో శకుంతల షాక్ అవుతుంది. ఈ రేఖ ఉండగా నువ్వు సీఈవో అయ్యావంటే నమ్మలేకపోతున్నానని అంటుంది శకుంతల. ఇలాంటి వాళ్ల నోరు మూయించాలంటే వెంటనే మనం పార్టీ ఏర్పాటు చేసి అందరినీ పిలిచి మా రేఖ ఆంటీయే నన్ను సీఈవో చేసిందని చెప్పాలని అంటుంది ఇందూ. ప్లాన్ బాగుందని దానికి సరేనని చెబుతుంది రేఖ.

Brahmamudi Telugu Serial Weekly roundup June 15th to June 20th episode Story

Photo Courtesy: JioHotstar

జూన్ 17వ తేదీ 1061వ ఎపిసోడ్‌లో..
ఇందూ- రాజ్‌లు వేరు వేరుగా పడుకోవడం, తిట్టుకోవడం చూసిన ఐశ్వర్య వీరిద్దరికీ నిజంగానే పెళ్లి జరిగిందా? లేక నాటకాలు ఆడుతున్నారా అని డౌట్ వస్తుంది. వెంటనే వెళ్లి రేఖ దగ్గరికి వెళ్లి రాజ్- ఇందూల తీరుపై నాకు అనుమానంగా ఉందని చెప్పి రేఖని రాజ్ గదిలోకి తీసుకొస్తుంది. అయితే అక్కడ చాప లేకపోవడంతో ఐశ్వర్యపై మండిపడుతుంది రేఖ. వెంటనే ఆమెను తీసుకుని గార్డెన్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ ఇందూని రాజ్ బుజ్జగిస్తూ, పాటలు పాడుతూ ఉంటాడు. రాజ్- ఇందూల మధ్య ఏదో జరుగుతోంది.. అదేంటో తెలుసుకోవాలని వెంటనే లక్కీకి ఫోన్ చేసి పిలిపిస్తుంది. రాజ్ గురించి, అతని ప్రవర్తన గురించి నేను తెలుసుకోవాలి.. వాడు నా చెల్లెలికి అన్యాయం చేయకూడదని నటిస్తుంది ఐశ్వర్య. రాజ్‌కి ఫోన్ చేసి సిట్టింగ్ వేసి నిజాలు రాబట్టమని చెబుతుంది. దాంతో రాజ్‌కి లక్కీ ఫోన్ చేసి సిట్టింగ్ వేద్దామని పిలుస్తాడు.

జూన్ 18వ తేదీ 1062వ ఎపిసోడ్‌లో..
సైకిల్ తొక్కి తొక్కి బొబ్బలు ఎక్కిపోవడంతో వెంకీ కాలికి చలపతి, లక్ష్మీలు వెన్న రాస్తారు. మందు పార్టీకి రాజ్‌ని పిలిచిన లక్కీ.. అతని నుంచి ఇందూతో పెళ్లి ఎలా జరిగిందో నిజాలు రాబడతాడు. మా ఇద్దరికీ పెళ్లి కాలేదు.. నేను తనకి అద్దె మొగుడిగా నటిస్తున్నాను అని రాజ్ చెప్పడంతో లక్కీ, ఐశ్వర్యలు షాక్ అవుతారు. ఇంట్లో వాళ్లు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, దాని నుంచి తప్పించుకోవడానికి నాతో పెళ్లయినట్లుగా ఇందూ నాటకం ఆడిందని రాజ్ చెబుతాడు. ఈ మాటలన్నీ ఫోన్‌లో రికార్డ్ చేసిన ఐశ్వర్య.. ఈ విషయం పార్టీలో బయటపెట్టాలని అనుకుంటుంది. పార్టీ కోసం రెడీ అవుతున్న రాజ్‌కి చలపతి పదే పదే ఫోన్ చేస్తాడు. కానీ రాజ్ మాత్రం ఫోన్ కట్ చేస్తూనే ఉంటాడు. ఇది గమనించిన ఇందూ.. రాజ్‌కి క్లాస్ పీకుతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup June 15th to June 20th episode Story

Photo Courtesy: JioHotstar

జూన్ 19వ తేదీ 1063వ ఎపిసోడ్‌లో..
రోజంతా డెలివరీలు చేసి చేసి అలిసిపోయిన వెంకీ భోజనం చేద్దామని కారియర్ తీసేసరికి అది వాసన వస్తుంది. దాంతో మంచినీళ్లు తాగి కడుపు నింపుకుంటాడు. ఇదంతా చూసిన నందూ కూడా బాధపడుతుంది. పవర్ బిల్ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని కరెంట్ ఆఫీసర్ బెదిరించడంతో లక్ష్మీ, చలపతి టెన్షన్ పడతారు. ఇంతలో వెంకీ వచ్చి బిల్లు కట్టేస్తాడు. నీ శాలరీ ఫస్ట్ తారీఖున వస్తుంది కదా? ఈ డబ్బు ఎక్కడిదని అడుగుతాడు చలపతి. టిప్ వచ్చిందని వెంకీ చెప్పడంతో.. లక్ష్మీ, చలపతి షాక్ అవుతారు. నేను మంచి ఐడియా చెప్పినందుకు కంపెనీ వాళ్లు ఇచ్చారని కవర్ చేస్తాడు వెంకీ. ఇందూని సీఈవోగా అనౌన్స్ చేస్తున్న పార్టీలో సీతారామయ్య ఫోటో ఉండటంతో రేఖ రగిలిపోతుంది. సీతారామయ్య గారి ఫోటో ఉంటే నీకే మంచిది, క్లయింట్స్ దృష్టిలో నీ మీద మంచి పాజిటివ్ ఓపీనియన్ వస్తుందని చెబుతాడు రాజ్. దాంతో చేసేదేం లేక రేఖ కూడా ఆ ఫోటోకి దండం పెట్టుకుంటుంది. ఇదంతా చూసిన సుభాష్, అపర్ణ, ఇందూలు సంతోషించి రాజ్‌కి థ్యాంక్స్ చెబుతారు.

జూన్ 20వ తేదీ 1064వ ఎపిసోడ్‌లో..
స్వరాజ్ కంపెనీకి ఇందూనిని సీఈవోగా అనౌన్స్ చేస్తుంది రేఖ. ఇప్పటి వరకు ఈ కంపెనీని నేను నడిపించాను, ఇకపై ఇందూనే చూసుకుంటుందని చెబుతుంది. ఇందూ మాట్లాడుతూ.. కంపెనీని అద్భుతంగా నటిస్తానని, మీ సపోర్ట్ కావాలని అడుగుతుంది దానికి ఒక క్లయింట్ స్పందిస్తూ మీతో నేను డీల్ కుదుర్చుకుంటానని చెప్పడంతో అంతా సంతోషిస్తారు. రాజ్‌ను వెతుక్కుంటూ లక్కీ దగ్గరికి వెళ్తారు చలపతి - లక్ష్మీ. రాజ్ ఎక్కడున్నాడో నాకు తెలియదని లక్కీ డ్రామాలు ఆడుతుండగా రాజ్ ఫోన్ చేసి పార్టీకి రమ్మని చెప్పడంతో ఇరుక్కుంటాడు. రాజ్ ఎక్కడున్నాడో చెప్పడంతో దుగ్గిరాల ఇంటికి వెళ్తారు చలపతి - లక్ష్మీ. వారిని చూసిన అపర్ణ వాళ్లని పలకరించి రాజ్‌తో చెబుతుంది. దాంతో అమ్మానాన్నల దగ్గరికి వెళ్లి ఏదో మాటలు చెప్పి అక్కడి నుంచి పంపేస్తాడు రాజ్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X