Brahmamudi weekly roundup: రుద్రాణి ఎంట్రీ.. అప్పూ ప్లాన్ తలక్రిందులు, యామిని దెబ్బకి అప్పూకి ముచ్చెమటలు
Photo Courtesy: JioHotstar
యామిని- రాజ్‌ల పెళ్లి ఆపడానికి ముత్తయిదువలతో కలిసి ప్లాన్ చేస్తుంది అప్పూ. కనకాంబరం పేరుతో పంతుల్ని కూడా ట్రాప్ చేస్తుంది కనకం. నిశ్చితార్ధం ఉంగరాలను కనకం మార్చేయడంతో పెళ్లి ఆగిపోతుందని అంతా అనుకుంటారు. కానీ యామినికి శాస్త్రి వేసిన ప్లాన్ తెలిసిపోవడంతో ఆమెకు భయపడి ప్లాన్ మార్చేస్తాడు. స్వప్న బారి నుంచి రుద్రాణి - రాహుల్‌లు తప్పించుకుని వస్తారు. రాజ్- కావ్యల మీద అటాక్ చేయించింది యామినియేనని తెలుసుకున్న అప్పూ.. కిల్లర్ రఘు సాయంతో యామినిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న యామిని.. అప్పూకి కౌంటర్ ప్లాన్ రెడీ చేస్తుంది.
సంగీత్‌లో రాజ్‌తో కలిసి డ్యాన్స్ వేస్తుంది కావ్య. యామిని పెళ్లి ఆపొద్దని కావ్యని రఘునాథ్ అభ్యర్ధిస్తాడు. అప్పూ ప్లాన్‌లో భాగంగా యామినికి కిల్లర్ రఘు ఫోన్ చేసి కోటి రూపాయలు అడుగుతాడు. అతనికి యామినికి డబ్బులు ఇస్తుండగా అప్పూ దొంగచాటుగా వీడియో తీస్తుంది. యామిని మెడలో రాజ్ తాళి కడుతుండగా పోలీసులు వచ్చి యామినిని అరెస్ట్ చేస్తున్నట్లు చెబుతారు. రాజ్- కావ్యల మీద అటాక్ చేయించడానికి రఘుని పంపావని ఇందుకు సాక్ష్యం నా దగ్గర ఉందని అప్పూ ఫోన్‌లో వీడియో తీసి చూపించబోయే సరికి అది కనిపించదు.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి జూన్ 16వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు .. 749 ఎపిసోడ్ నుంచి 754 వరకు ఏం జరిగిందంటే?
జూన్ 16వ తేదీ 749వ ఎపిసోడ్‌లో ...
అమ్మవారికి యామిని హారతి ఇస్తుండగా ప్లాన్ ప్రకారం కనకం ఫ్యాన్ పెట్టి ఆరిపోయేలా చేస్తుంది. దీంతో ఇది అరిష్టమని, అశుభమని పెళ్లిని అపేయాలని అపర్ణ, ఇందిరతో పాటు వాళ్లు ఏర్పాటు చేసిన ముత్తయిదవలు అంటారు. పంతులు మనవైపే కాబట్టి పెళ్లి ఆగిపోతుందని భావించిన అపర్ణ, ఇందిరలకు శాస్త్రి షాకిస్తాడు. పెళ్లిని ఆపాల్సిన అవసరం లేదని ఈరోజే రాజ్- యామినికి నిశ్చితార్ధం చేస్తే అన్ని దోషాలు పోతాయని అప్పుడు పెళ్లి చేద్దామని చెబుతాడు. పెళ్లిని ఆపాలని శాస్త్రితో కలిసి వేసిన పథకం యామినికి తెలిసిందని దుగ్గిరాల ఫ్యామిలీకి అర్ధమవుతుంది. కర్ర విరగ్గొట్టి, ఫ్యాన్ ఆపినంత మాత్రాన ఈ పెళ్లి ఆగదని కావ్యతో యామిని చెబుతుంది. రాజ్ మనసు మార్చి పెళ్లిని ఆపేయాలని కనకం అనుకుంటుంది.
జూన్ 17వ తేదీ 750వ ఎపిసోడ్‌లో ...
స్వప్న లాక్ చేయడంతో రూమ్‌లో ఇరుక్కుపోయిన రాహుల్- రుద్రాణిలు కిటికీలోంచి పారిపోతారు. స్వప్న నిద్రలేచి చూసిసరికి చాలా సమయం అవ్వడంతో వాళ్లు ఆకలి తట్టుకోలేక చనిపోయారేమోనని అనుకుంటుంది. లోపలికి వెళ్లి చూడగా కిటికీ ఓపెన్ చేసి ఉంటుంది. బయటికి వచ్చి చూసేసరికి తల్లీకొడుకులు కారులో పారిపోతారు. ఈ విషయాన్ని వెంటనే అప్పూకి ఫోన్ చేసి తను కూడా యామిని ఇంటికి బయల్దేరుతుంది స్వప్న. వైదేహి ఎంగేజ్‌మెంట్ రింగ్స్ తీసుకొస్తుండగా ఆమెను డైవర్ట్ చేసి ఉంగరాలు ఉన్న బాక్స్ కొట్టేసి ఖాళీ బాక్స్ పెడుతుంది కనకం. ఉంగరాలు కనిపించకపోవడంతో యామిని -రాజ్‌లు పాత ఉంగరాలతో నిశ్చితార్ధం చేసుకుంటుండగా కళ్యాణ్ వేసిన ప్లాన్‌తో కనకం మళ్లీ మాయ చేస్తుంది. అప్పూకి స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేసి రాజ్- కావ్యలపై అటాక్ చేయించింది యామినియే అని చెబుతాడు.

Photo Courtesy: JioHotstar
జూన్ 18వ తేదీ 751వ ఎపిసోడ్‌లో ...
రఘు దొరికిపోవడంతో వాడి సాయంతో యామినిని ఇరికించాలని ప్లాన్ చేస్తుంది అప్పూ. యామిని - రాజ్‌లకు మెహందీ ఫంక్షన్ జరుగుతుండగా కానిస్టేబుల్.. ఆ కిల్లర్‌ను తీసుకుని యామిని ఇంటికి వస్తాడు. మేం చెప్పినట్లు చేస్తేనే నిన్ను కేసులో నుంచి తప్పిస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తాడు కానిస్టేబుల్. రాజ్ మెహందీ పెడుతున్న సమయంలో యామినికి కిల్లర్ ఫోన్ చేసి అర్జెంట్‌గా కలవాలని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. నేను ఇండియా విడిచి వెళ్లిపోతానని అందుకు కోటి రూపాయలు ఇవ్వాలని లేదంటే మీరే రాజ్- కావ్యల మీద అటాక్ చేయించారని చెబుతానని బ్లాక్‌మెయిల్ చేస్తాడు రఘు. ఇంతలో కావ్యని చంపమని ఎందుకు సుపారీ ఇచ్చావంటూ యామినిపై రఘునాథ్ క్లాస్ పీకుతాడు.
జూన్ 19వ తేదీ 752వ ఎపిసోడ్‌లో ...
నిశ్చితార్దం కూడా పూర్తయిపోవడంతో కావ్యకి దూరమవుతున్నానని రాజ్ బాధపడతాడు. పనిమీద తిరుగుతున్న కావ్యని పిలిచి నా వల్ల కావడం లేదని, మీరెందుకు ఇలా చేస్తున్నారని అడుగుతాడు. కావ్యకి తన మనసులోని మాటను చెప్పబోతుండగా యామిని వచ్చి అడ్డుకుంటుంది. ఇంట్లో నుంచి తప్పించుకున్న రాహుల్ - రుద్రాణిలకు స్వప్న ఎదురవుతుంది. కిల్లర్ రఘుకి అప్పూ ఫోన్ చేసి ప్లాన్‌లో ఏం తేడా రాకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇస్తుంది. సంగీత్ కార్యక్రమం మొదలవ్వగానే అప్పూ చెప్పినట్లుగానే యామినికి ఫోన్ చేస్తాడు కిల్లర్. దాంతో డ్యాన్స్ వేయకుండా కంగారుగా బయటికి వెళ్లిపోతుంది యామిని. రఘు అడిగిన కోటి రూపాయల డబ్బును అతనికి యామిని ఇస్తుండగా అప్పూ- కళ్యాణ్‌లు దానిని వీడియో తీస్తారు. వారిని చూసిన యామినికి ముచ్చెమటలు పడతాయి. సంగీత్‌లో రామ్‌తో కలిసి కావ్య డ్యాన్స్ చేస్తుంది.

Photo Courtesy: JioHotstar
జూన్ 20వ తేదీ 753వ ఎపిసోడ్‌లో ...
సంగీత్ కార్యక్రమం ముగియగానే కావ్యని కలిసి ఏకాంతంగా మాట్లాడతాడు రాజ్. మనిద్దరి మధ్య ఇదే చివరి రాత్రని.. తెల్లారితే నేను మరొకరికి భర్త అయిపోతానని చెబుతాడు. రాజ్ ఎంత చెబుతున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. అపర్ణ, ఇందిర, కనకం దగ్గరికి అప్పూ- కళ్యాణ్‌లు వచ్చి ఆ యామినిని అరెస్ట్ చేయడానికి సాక్ష్యం దొరికిందని చెబుతారు. కిల్లర్‌కు యామిని డబ్బులు ఇస్తుండగా తీసిని వీడియోని కూడా చూపిస్తారు. వారి మాటలన్నీ దొంగచాటుగా విన్న రుద్రాణి- రాహుల్‌లు వెంటనే యామినికి విషయం చెబుతాడు. అప్పూ స్కెచ్ గురించి తెలుసుకున్న యామిని నేను చూసుకుంటానని చెబుతుంది. యామిని పెళ్లి ఆపొద్దని ఆమె తండ్రి.. కావ్యని బతిమలాడతాడు.
జూన్ 21వ తేదీ 754వ ఎపిసోడ్‌లో ...
రాజ్- యామినిల పెళ్లి జరుగుతుండగా రుద్రాణి వచ్చి నువ్వేం మాట్లాడవేంటీ అని కావ్యని అడుగుతుంది. ఆమె బ్రహ్మముడి గురించి సోది చెప్పడంతో రుద్రాణికి మైండ్ బ్లాక్ అవుతుంది. అది చూసి ఇందిర, అపర్ణలు నవ్వుకుంటారు. పెళ్లికి టైం అవుతుండంతో కానిస్టేబుల్‌కి ఫోన్ చేసి రఘుని త్వరగా తీసుకురమ్మని చెబుతుంది అప్పూ. యామిని మెడలో రాజ్ తాళి కడుతుండగా రుద్రాణి పెళ్లి ఆపమని కేకలు పెడుతుంది. ఇంతలో పోలీసులు వచ్చి రాజ్ - కావ్యలపై అటాక్ చేయించినందుకు గాను యామినిని అరెస్ట్ చేస్తామని చెబుతారు. నువ్వు రఘుకి డబ్బులు ఇస్తుండగా వీడియో తీశామని అప్పూ చెప్పడంతో దానిని చూపించమంటాడు రాజ్. అయితే కళ్యాణ్ ఫోన్‌లో ఆ వీడియోను డిలీట్ చేస్తాడు రాహుల్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











