Brahmamudi weekly roundup: సీఈవో ఛైర్ కోసం రేఖ పావులు.. ఇందూని కిడ్నాప్ చేసిన ఐశ్వర్య, చిక్కుల్లో రాజ్
Photo Courtesy: JioHotstar
రాజ్- ఇందూల ఫస్ట్ నైట్ ఆపడానికి రేఖ ఇచ్చిన నిద్రమాత్రల్ని విసిరేసిన భ్రమరాంబ మరో టాబ్లెట్ పాలలో కలిపి ఇస్తుంది. ఇందూ లోపలికి రావడంతో పాలు తీసుకోబోతున్న రాజ్‌కి షాకిస్తుంది. పాలు పక్కన పారబోసి నేల మీద పడుకోమని క్లాస్ పీకుతుంది ఇందూ. అర్ధరాత్రి ఇంటికొచ్చిన నందూ.. వెంకీ ఎక్కడున్నాడని చలపతి- లక్ష్మీలను అడుగుతుంది. అందరూ కలిసి కిటికీలోంచి చూడగా చేయి కట్ చేసుకుని కనిపిస్తాడు వెంకీ. దాంతో తలుపులు బద్ధలు కొట్టిన నందూ అతనిని రక్షించి లాగిపెట్టి కొడుతుంది. శోభనం గదిలోంచి చెదిరిన జుట్టు, నలిగిన బట్టలతో రాజ్, ఇందూ బయటికి రావడం చూసి రేఖ.. ఇందూని పక్కకి పిలిచి ఏం జరిగిందని అడుగుతుంది. ఏం కాలేదని.. మీరు ఇచ్చిన పాలు తాగి పడుకున్నాడని చెబుతుంది. తమ్ముడు సూసైడ్ అటెంప్ట్ చేశాడని తెలుసుకున్న రాజ్.. వెంటనే ఇంటికి వెళ్లి గడ్డిపెడతాడు. రాజ్‌ని సీఈవో కాకుండా ఆపాలంటే ఇందూని సీఈవో చేయాలని రేఖ చెబుతుండగా విన్న ఐశ్వర్య ఇది ఎలాగైనా ఆపాలని ప్లాన్ చేస్తుంది. రాకేష్‌తో మాట్లాడాలని చెప్పి ఇందూని కిడ్నాప్ చేస్తుంది. బోర్డ్ మీటింగ్‌కి ఇందూ రాకపోవడంతో రాజ్‌పై పరంధామయ్య సీరియస్ అవుతాడు.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు .. 1047వ ఎపిసోడ్ నుంచి 1052వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
జూన్ 1వ తేదీ 1047వ ఎపిసోడ్‌లో ..
ఇందూ- రాజ్‌ల ఫస్ట్ నైట్ ఆపడానికి రేఖ ప్లాన్ చేసి.. నిద్రమాత్రలను భ్రమరాంబకి ఇస్తుంది. కానీ ఇందూ- రాజ్‌లని కలపాలని అనుకున్న భ్రమరాంబ నిద్రమాత్రలకు బదులుగా రాజ్‌ని రెచ్చగొట్టే మాత్రని పాలలో కలిపి ఇస్తుంది. స్వాతి, అపర్ణలు కలిసి ఇందూని రెడీ చేస్తారు. ఇంతలో అక్కడిక వచ్చిన భ్రమరాంబను చూసి షాక్ అవుతారు. పాలలో ఏమైనా కలిపావా అని భ్రమరాంబపై డౌట్ పడుతుంది అపర్ణ. ఇందూ బాగుండాలని నాకు మాత్రం ఉండదా? నేనేం చేయకూడదా అని మండిపడుతుంది భ్రమరాంబ. ఇందూకి, రాజ్‌కి శోభనం ఎలా జరుగుతుందో ఊహించి చెబుతాడు శేషం. అది వినగానే భార్యాభర్తలు ఇద్దరూ డ్యాన్స్ చేస్తారు. గదిలో బెడ్ మొత్తం పూలు, పండ్లు, స్వీట్లతో అందంగా డెకరేట్ చేయడంతో రాజ్ సంబరపడిపోతాడు. మనది మామూలు లక్ కాదు.. నాకు, ఇందూకి పెళ్లి జరగలేదు.. కానీ పెళ్లికాకుండానే శోభనం చేసుకోపోతున్నానని ఖుషి అవుతాడు. ఇంతలో పాల గ్లాసు తీసుకుని, అందంగా రెడీ అయి గదిలోకి వస్తుంది ఇందూ. ఆమెను చూడగానే సిగ్గుపడతాడు రాజ్. పాల గ్లాసు ఇవ్వమని అడగ్గానే పాలు మొత్తం డస్ట్‌బిన్‌లో పారబోస్తుంది ఇందూ. ఈరోజు నిన్న వదలను అంటూ రాజ్ మీదకు వస్తుండగా అతని బిహేవియర్‌కి ఇందూ కంగారుపడుతుంది.
జూన్ 2వ తేదీ 1048వ ఎపిసోడ్‌లో..
నీ కళ్లలో ఏదో మాయ ఉందని ఇందూని ముద్దు పెట్టుకోబోతాడు రాజ్. ఆ వెంటనే గట్టిగా నవ్వుతూ భయపడ్డావు కదా అని అంటాడు. నా మీద చేయి వేసి చూడాల్సింది అప్పుడు చెప్పేదానిని అంటుంది ఇందూ. నేను నీ అద్దె మొగుడిని అందుకే కంట్రోల్‌గానే ఉంటానని చెబుతాడు రాజ్. అయితే ఈరోజు నీ ఈ పూల పాన్పు మీద పడుకుంటానని బతిమలాడగా.. అదేం కుదరదు రోజు లాగానే కింద పడుకోమని చెబుతుంది ఇందూ. చేసేదేం లేక తిట్టుకుంటూ కింద పడుకుంటాడు రాజ్. చలపతి, లక్ష్మీలు వెంకీ గురించి బాధపడుతుండగా నందూ కంగారుగా పరిగెత్తుకొస్తుంది. వెంకీ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. వాడికేం కాలేదు కదా అని టెన్షన్ పడుతుంది. వెంకీ రూమ్ దగ్గరికి వెళ్లి పిలిచినా తలుపులు మూసేసి ఉంటాయి. ఎంతసేపటికీ తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా వెంకీ చేయి కట్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఆ వెంటనే తలుపులు బద్ధలుకొట్టి వెంకీని కాపాడుతుంది. నేను చచ్చిపోతానంటూ గోల చేయడంతో లాగిపెట్టి కొడుతుంది నందూ. డాక్టర్ వచ్చి ట్రీట్‌మెంట్ చేసినా డబ్బులు ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉంటారు చలపతి- లక్ష్మీ. జాబ్ లేకపోయినా పర్లేదు.. నువ్వు ప్రాణాలతో నా కళ్లముందు ఉంటే చాలని చలపతి బాధపడతాడు. శోభనం జరిగిందా? ఆగిపోయిందా అనేది తెలుసుకోవాలని భ్రమరాంబ, రేఖలు టెన్షన్ పడుతుండగా రాజ్ ఒళ్లు విరుచుకుంటూ కిందకి వస్తాడు. అది చూసి రేఖ షాక్ అవ్వగా.. భ్రమరాంబ మాత్రం మురిసిపోతుంది.

Photo Courtesy: JioHotstar
జూన్ 3వ తేదీ 1049వ ఎపిసోడ్‌లో..
శోభనం గది నుంచి నలిగిన బట్టలు, చెదిరిన జుట్టుతో ఇందూ బయటికి రావడం చూసిన రేఖ షాక్ అవ్వగా.. భ్రమరాంబ సంబరపడిపోతుంది. బాగా ఒళ్లు నొప్పులుగా ఉన్నాయి.. బాడీ మసాజ్ చేయమని రాజ్ చెప్పడంతో శేషం షాక్ అవుతాడు. ఇందూని పక్కకి తీసుకెళ్లిన రేఖ.. శోభనం జరిగిందా? లేదా? అని అడుగుతుంది. మీరిచ్చిన పాలు తాగి వాడు మత్తుగా పడుకున్నాడు.. మాకు శోభనం జరగలేదని చెబుతుంది ఇందూ. ముందు వాడిని ఇంట్లో నుంచి గెంటేయమని అంటుంది. బెడ్‌రూమ్‌లో రాజ్‌పై ఫైర్ అవుతుంది ఇందూ. మనిద్దరికీ శోభనం జరగకపోయినా జరిగిందని ఓవరాక్షన్ చేస్తున్నావని అంటుంది. అలా చెప్పకపోతే మన సీక్రెట్ బయటపడుతుంది. అలాగే నేను పెళ్లి కావాల్సిన కుర్రోడిని, ఓవరాక్షన్ చేయకపోతే నాకే మేటర్ లేదని అనుకుంటారని అంటాడు రాజ్. నాకు కనుక అమౌంట్ కట్ చేస్తే మనిద్దరికీ పెళ్లి జరగలేదని.. నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావో మొత్తం చెబుతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు రాజ్. దాంతో ఇందూ సైలెంట్ అయిపోతుంది. తమ్ముడు సూసైడ్ అటెంప్ట్ చేశాడని తెలుసుకున్న రాజ్ పరుగు పరుగున ఇంటికి వెళ్తాడు. వెంకీకి క్లాస్ పీకి చిన్న చిన్న ఇబ్బందులను చూసి ప్రాణాలను తీసుకోవద్దని మండిపడతాడు. అయినా నువ్వు కూడా బిజినెస్ కాకుండా నేను చూసిన ఉద్యోగం చేయమని చెబుతాడు చలపతి. ఒకరి కింద నేను పనిచేయను.. మిమ్మల్ని జీవితాంతం హ్యాపీగా చూసుకుంటానని అంటాడు రాజ్.
జూన్ 4వ తేదీ 1050వ ఎపిసోడ్‌లో..
నీకు పెళ్లయి మొగుడు రాగానే కళ్లు నెత్తికెక్కాయి ఏ పని చేయడం లేదని ఇందూపై గొడవ పడుతుంది ఐశ్వర్య. నేను నీలాగా ఖాళీగా కూర్చొని జులాయిగా తిరగడం లేదని కౌంటర్ ఇస్తుంది ఇందూ. ఉదయాన్నే దేవుడికి దండం పెట్టుకుని నానమ్మ, తాతయ్యల దగ్గరికి వెళ్తుంది ఇందూ. ఇప్పుడు నీ జీవితం ఓ దారిలోకి వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది, రాజ్ నీకు తోడుగా ఉన్నాడని అంటుంది అపర్ణ. మీ నాన్న ఎంత బాగా చూసుకునేవాడో రాజు కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటున్నాడని సుభాష్ చెబుతాడు. ఇంతలో రాజ్ వచ్చి ఇందూకి నేను అండగా ఉంటాను, మీరేం బాధపడొద్దని ధైర్యం చెబుతాడు. ఆ రాజ్ గాడు సీఈవో అవ్వడానికి అన్ని రకాల ప్లాన్లు వేస్తున్నాడని రేఖతో అంటుంది భ్రమరాంబ. వాడేం చేసినా నా ప్లాన్లు నాకున్నాయి.. రేపు బోర్డ్ మీటింగ్‌కి ఇందూని తీసుకెళ్లబోతున్నాను, తననే సీఈవోని చేయబోతున్నానని రేఖ చెబుతుంది. ఆ మాటలు విన్న ఐశ్వర్య.. ఇందూ సీఈవో అయితే దాని ఓవరాక్షన్ తట్టుకోలేం, నా నెత్తిమీదకెక్కి ఆడుకుంటుందని రగిలిపోతుంది. వెంటనే ఇద్దరు రౌడీలకు ఫోన్ చేసి రెడీగా ఉండమని చెబుతుంది. ఆంటోనీ తన తల్లిని ఎంతకూ వెతక్కపోవడంతో కోపంగా ఇంటికొస్తాడు లక్కీ. వచ్చి చూసేసరికి ఆంటోనీ నిద్రపోతుండగా.. అతని జేబులో ఒక ఫోటో కనిపిస్తుంది. దాని చూస్తుండగా ఆంటోనీ నిద్రలేచి వెంటనే ఫోటో లాగేసుకుంటాడు. ఇది వాడి చేతిలో పడితే నా ఫుడ్, బెడ్ కట్ అని భయపడతాడు.

Photo Courtesy: JioHotstar
జూన్ 5వ తేదీ 1051వ ఎపిసోడ్‌లో..
ఇందూ సీఈవో కావడం ఇష్టం లేని ఐశ్వర్య.. ఆమెను ఎలాగైనా అడ్డుకోవాలని కుట్ర చేస్తుంది. తన ప్లాన్‌లో భాగంగా ఇందూని పిలిచి రాకేశ్ గాడు టార్చర్ చేస్తున్నాడు, నా ఫోటోలు, నా గురించి సోషల్ మీడియాలో పెడతానని చెబుతున్నాడని అంటుంది ఐశ్వర్య. నువ్వు వచ్చి వాడితో మాట్లాడమని అడుగుతుంది. ఇదేం తెలియని ఇందూ.. సరేనని ఒప్పుకుంటుంది. ఇందూ కనిపించకపోవడంతో రాజ్‌ని నిలదీస్తుంది రేఖ. నాకేం తెలియదని చెప్పిన రాజ్.. ఇందూకి ఫోన్ చేయగా నేను ఓ పని నిమిత్తం బయటికి వచ్చానని చెబుతుంది. ఉద్యోగం పోయిందన్న బాధలో చేయి కోసుకున్న వెంకీతో మాట్లాడి అతనికి ధైర్యం చెబుతుంది నందూ. నువ్వు ఆ ఏఐ టెక్నాలజీ నేర్చుకుని తిరిగి ఉద్యోగం సంపాదించమని అంటుంది నందూ. ఇందుకు డబ్బు కావాలి, మా ఇంట్లో కూడా ఎంతో కొంత డబ్బు కావాలని చెబుతాడు వెంకీ. అయితే పార్ట్‌టైమ్ డెలివరీ బాయ్‌గా పనిచేయమని సలహా ఇస్తుంది నందూ. దానికి వెంకీ సరేనని అంటాడు. ఇందూని తీసుకుని దూరంగా కారులో వెళ్తుంది ఐశ్వర్య.
జూన్ 6వ తేదీ 1052వ ఎపిసోడ్‌లో..
ఇందూని తీసుకుని ఊరి చివరికి వచ్చేస్తుంది ఐశ్వర్య. ఎక్కడికి వెళ్తున్నామని ఇందూ అడగ్గా.. ఆ రాకేష్ గాడి దగ్గరికేనని అబద్ధం చెబుతుంది ఐశ్వర్య. ఓ చోటికి వెళ్తుండగా కారుకు నారాయణ అనే తాగుబోతు అడ్డొస్తాడు. అతనితో ఐశ్వర్య గొడవ పడటంతో కారును వెంటాడుతూ వెళ్తాడు నారాయణ. ఇందూని ఒక చోటికి తీసుకొచ్చిన ఐశ్వర్య.. నువ్వు సీఈవో కావడం నాకిష్టం లేదు. అందుకే నిన్ను కిడ్నాప్ చేశానని చెబుతుంది. ఆ మాటలతో ఇందూ షాక్ అవుతుంది. నేను మన కుటుంబం కోసం, నీ కోసం, మనల్ని నమ్ముకున్న వారి కోసం సీఈవో అవ్వాలని అనుకుంటున్నానని చెబుతుంది ఇందూ. అయినప్పటికీ ఐశ్వర్య వినిపించుకోదు. బోర్డ్ మీటింగ్‌కి ఇందూ రాకపోవడంతో రాజ్‌పై పరంధామయ్య మండిపడతాడు. ఇందూ రాకపోతే మనమే సీఈవో అయిపోదామని ప్లాన్ చేసిన రాజ్.. ఈ విషయం గురించి పరంధామయ్యని అడగ్గా ఆ రేఖకైనా సపోర్ట్ చేస్తాను కానీ, కంపెనీని నీ చేతుల్లో పెట్టనని అంటాడు. ఐశ్వర్య కారుని ఫాలో అవుతూ వచ్చిన నారాయణ.. ఇందూని కట్టేయడం చూస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications