Brahmamudi weekly roundup: ఇందూని ఆదుకున్న నందూ.. ఐశ్వర్య ప్లాన్ ఫెయిల్, రేఖకి షాకిచ్చిన ఇందూ
Photo Courtesy: JioHotstar
లక్కీ - రాజ్‌లు మందులో ఉన్నప్పుడు మాట్లాడుకున్న వీడియోను పార్టీలో ప్లే చేస్తుంది ఐశ్వర్య. అయితే సమయానికి నందూ వచ్చి మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించడంతో రేఖ నోరు మూసుకుంటుంది. నీతో ప్రేమగా ఉన్నట్లు నటించి మనిద్దరం మాట్లాడుకున్న మాటల్ని ఐశ్వర్య రికార్డ్ చేసిందని రాజ్ చెప్పడంతో లక్కీ షాక్ అవుతాడు. స్వరాజ్ కంపెనీకి 100 ఆలయాలకు నగలు చేసే కాంట్రాక్ట్ ఇస్తాడు హర్ష. ఈ సమయంలో ఇందూ అగ్రిమెంట్‌పై వేలిముద్రలకు బదులు సంతకం చేయడంతో రేఖ షాక్ అవుతుంది. డబ్బు రాగానే ఉద్యోగులకు శాలరీ ఇచ్చి ఆదుకుంటుంది ఇందూ. డబ్బు ఇవ్వకపోవడంతో ఐశ్వర్యని కిడ్నాప్ చేయబోయిన రాకేష్‌ని లాగిపెట్టి కొట్టి బాకీ తీరుస్తుంది ఇందూ. నువ్వు వేలిముద్రలకు బదులుగా సంతకం ఎలా పెట్టావని రేఖ అడగ్గా నేనే నేర్పించానని ఇందూని కాపాడతాడు రాజ్. ఇందూ కాంట్రాక్ట్ త్వరగా పూర్తి చేయకుండా ఉండేందుకు గాను శృతిని ట్రాప్ చేస్తుంది రేఖ.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి జూన్ 22వ తేదీ నుంచి జూన్ 23వ తేదీ వరకు .. 1065వ ఎపిసోడ్ నుంచి 1070వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
జూన్ 22వ తేదీ 1065వ ఎపిసోడ్‌లో ..
స్టేజ్ మీదకి వెళ్లి స్వాతి- మదన్‌ల పెళ్లి చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తానని భ్రమరాంబ వెళ్లబోతుండగా రాజ్- లక్కీలు మందు కొడుతున్న వీడియో స్క్రీన్ మీద కనిపిస్తుంది. నాకు అసలు పెళ్లే కాలేదు.. ఇందూకి అద్దె మొగుడిగా నటిస్తూ డబ్బులు తీసుకుంటున్నానని చెబుతాడు రాజ్. ఆ మాటలు విన్న అంతా షాక్ అవుతారు. వీళ్లకి పెళ్లి జరగలేదు.. మిమ్మల్ని ఇందూ మోసం చేసిందని ఐశ్వర్య చెబుతుంది. ఈ వీడియో నమ్మొద్దని మాకు నిజంగానే పెళ్లి జరిగిందని ఇందూ చెబుతుంది. అయితే సాక్ష్యం ఏంటని రేఖ అడగ్గా.. ఇంతలో నందూ వచ్చి పోలీసుల సమక్షంలోనే రాజ్- ఇందూల పెళ్లి జరిగిందని మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తుంది. దాంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. మరి ఈ వీడియో ఏంటని రేఖ అడగ్గా.. ఏఐ టెక్నాలజీతో ఐశ్వర్య ఇలా చేసిందని రాజ్ ఓ వీడియో తీసి నమ్మిస్తాడు. దాంతో ఐశ్వర్యకి క్లాస్ పీకుతుంది రేఖ. తనను కాపాడినందుకు నందూకి థ్యాంక్స్ చెబుతుంది ఇందూ.
జూన్ 23వ తేదీ 1066వ ఎపిసోడ్‌లో..
నువ్వు తాగి మీ ఫ్రెండ్ దగ్గర వాగడం వల్ల మనం ఇరుక్కుపోయేవాళ్లమని రాజ్‌పై మండిపడుతుంది ఇందూ. వీరిద్దరి గొడవ చూసి అపర్ణ.. అసలు మీరిద్దరూ నిజమైన భార్యభర్తలేనా కదా అని నాకే అనుమానంగా ఉందని మండిపడుతుంది. రాజ్ ఆ దుగ్గిరాల కుటుంబానికి దగ్గరై.. తన తల్లిదండ్రులకు చంపిన రేఖపై పగతీర్చుకుంటాడు. అదే జరిగితే వాడి ప్రాణానికే ప్రమాదమని, దీని నుంచి ఎలాగైనా కొడుకుని కాపాడుకోవాలని చలపతి- లక్ష్మీ అనుకుంటారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తూ.. సుభాష్- అపర్ణల ఆశీర్వాదం తీసుకుంటుంది ఇందూ. మందు పేరిట నన్ను ట్రాప్ చేసి నా సీక్రెట్స్ అన్ని బయటకు లాగుతావా? నిన్న వెర్రివాడిని చేసి ఆ ఐశ్వర్య ఆడుకుంటోందని లక్కీకి వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఇంతలో ఐశ్వర్య వచ్చి నువ్వు, మీ ఫ్రెండ్ ఆ రోజు ఏం మాట్లాడుకున్నారో మా ఆంటీకి చెప్పమని లక్కీతో అంటుంది ఐశ్వర్య. రాజ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి లక్కీ జారుకుంటాడు.

Photo Courtesy: JioHotstar
జూన్ 24వ తేదీ 1067వ ఎపిసోడ్‌లో..
ఇందూ సీఈవో అయ్యాక ఎదురు తిరుగుతుందని భయపడుతుంది భ్రమరాంబ. అయితే రేఖ మాత్రం అది ఎప్పటికీ నా కీలుబొమ్మ.. నాకు ఎదురుతిరిగితే ఏం జరుగుతుందో దానికి బాగా తెలుసని అంటుంది. నందూ అర్జెంట్‌గా ఒకచోట బోకేలు ఇవ్వడానికి వెళ్తుండగా బైక్ ఆగిపోతుంది, దాంతో వెంకీని పిలిపించి ఇద్దరూ ఒకే బైక్ మీద వెళ్తారు. బోర్డ్ మీటింగ్‌లో స్వరాజ్ కంపెనీకి 100 ఆలయాలలో విగ్రహాలకు బంగారు ఆభరణాలు తయారు చేసే కాంట్రాక్ట్ ఇస్తానని, కానీ ముందు శాంపిల్‌గా కొన్ని ఆభరణాలు చేయించాలని అంటాడు హర్ష. అగ్రిమెంట్ మొత్తం చదివి, దాని మీద ఇందూ వేలిముద్రలకు బదులుగా సంతకం చేయడంతో రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు. అడ్వాన్స్ కింద హర్ష 50 లక్షల రూపాయలు ఇవ్వడంతో డబ్బును నేను హ్యాండిల్ చేస్తానని రేఖ వెళ్లగా.. నేను చూసుకుంటానని రాజ్ బ్రీఫ్‌కేసును పట్టుకుంటాడు. కానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి వెళ్తుంది ఇందూ. ఊహించని ట్విస్ట్‌తో రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు. ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్లిన వెంకీకి అక్కడ తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ రోజా కనిపించి నానామాటలు అంటుంది. దాంతో నందూ రగిలిపోతూ.. ఇలాంటి వాడిని మిస్ అయినందుకు జీవితాంతం బాధపడతావు, ఏదో ఒకరోజున వీడు గొప్పొడు అవుతాడని చెబుతుంది.
జూన్ 25వ తేదీ 1068వ ఎపిసోడ్‌లో..
ఎంప్లాయిస్ అందరికీ శాలరీలు ఇచ్చిన ఇందూ.. ఇక మీదట కూడా ప్రతినెల ఫస్ట్ తారీఖున మీ జీతం అకౌంట్‌లో పడుతుందని చెబుతుంది. బాకీ తీర్చాలంటూ నేరుగా దుగ్గిరాల వారింటికి వచ్చిన రాకేష్.. ఐశ్వర్యతో గొడవపడి ఆమెను కిడ్నాప్ చేసేందుకు లాక్కెళ్తుండగా ఇందూ వచ్చి లాగిపెట్టి కొడుతుంది. మీ ఐశ్వర్య నా దగ్గర 10 లక్షల రూపాయలు అప్పు చేసిందని రాకేష్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దాంతో రాకేష్‌కి ఇవ్వాల్సిన 10 లక్షలు ఇచ్చి వెళ్లిపోమని చెబుతుంది ఇందూ. ఆ వెంటనే ఆమెను తీసుకుని రూమ్‌లోకి వెళ్తుంది రేఖ. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు, డబ్బులు కూడా నా చేతికి రానివ్వడం లేదని ఇందూకి క్లాస్ పీకుతుంది రేఖ. మన కోసం, మన కుటుంబం కోసమే ఇలా చేశానని కవర్ చేస్తుంది ఇందూ. అయితే నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం ఎలా పెట్టావని రేఖ అడగ్గా.. ఇందూ, రాజ్ షాక్ అవుతారు. నేనే ఇందూకి సంతకం ఎలా పెట్టించాలో నేర్పించానని రాజ్ చెప్పి ఇందూని కాపాడతాడు. రేఖ నుంచి కాపాడినందుకు రాజ్‌కి థ్యాంక్స్ చెబుతుంది ఇందూ.

Photo Courtesy: JioHotstar
జూన్ 26వ తేదీ 1069వ ఎపిసోడ్‌లో..
నీ దగ్గర డబ్బులు లేవు, నిన్ను నమ్ముకున్నందుకు నాకు గుణపాఠం నేర్పించావని ఇందూపై మండిపడతాడు రాజ్. దాంతో పర్స్‌లో నుంచి డబ్బులు తీసి రాజ్‌కి ఇస్తుంది ఇందూ. ఇందూ నీ చేయి దాటిపోతోంది.. తను కాంట్రాక్ట్ పూర్తి చేస్తే ఆఫీసులో మనల్ని ఎవ్వరూ లెక్క చేయరని భూషణ్ చెప్పడంతో రేఖ మండిపడుతుంది. ఇందూ ఎప్పుడైతే తోక జాడించిందో అప్పుడే దాని తోక కట్ చేయాలని అనుకున్నాను. అప్పుడు చచ్చినట్లు ఇందూ నా దగ్గరకే వస్తుందని రేఖ చెప్పడంతో భ్రమరాంబ, భూషణ్ సంతోషిస్తారు. ఇంతలో ఐశ్వర్య వచ్చి తనకు లక్ష రూపాయలు కావాలని అడగటంతో రేఖ సీరియస్ అవుతుంది. నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను, నోరుమూసుకుని ఇంట్లో కూర్చోమని వార్నింగ్ ఇస్తుంది. ఆఫీసులో డిజైన్లు చూపించమని శృతిని అడుగుతుంది ఇందూ. అయితే అవి అంత బాగుండకపోవడంతో కావ్య వేసిన పాత డిజైన్లను హర్షకి పంపుతుంది. వాటిని అతను గుర్తుపట్టి.. మీ అమ్మ వేసినవి కాదు, కొత్తవి కావాలని అడుగుతాడు. దాంతో ఇందూకి ధైర్యం చెప్పి డిజైన్లు గీయిస్తాడు రాజ్.
జూన్ 27వ తేదీ 1070వ ఎపిసోడ్‌లో..
ఇందూ గీసిన డిజైన్లు చూసి రాజ్ నవ్వుకుంటాడు, ఇంతలో అపర్ఱ వచ్చి మీరిద్దరూ గొడవ పడతారు, మళ్లీ తిట్టుకుంటారు, ఒక్కటి అవుతారు నాకేం అర్ధం కావడం లేదని అంటుంది. డిజైన్లు చూసి మీ కన్నా చిన్నపిల్లలు బాగా వేస్తారని చెబుతుంది. నేను మా అమ్మలా టాలెంటెడ్ కాకపోవచ్చు, కానీ టాలెంట్ ఉన్న వ్యక్తుల నుంచి ఔట్‌పుట్ తీసుకుంటానని చెప్పి శృతికి కాల్ చేస్తుంది. ఆవిడ పంపించిన డిజైన్లు బాగున్నాయని మెచ్చుకుంటుంది ఇందూ. శృతికి రేఖ ఫోన్ చేసి మీ అమ్మ హాస్పిటల్‌లో ఉంది, ఆమెను నేను కాపాడతాను అని కానీ నేను చెప్పినట్లు నువ్వు చేయాలని కండీషన్ పెడుతుంది. ఇందూ అడిగిన డిజైన్లు ఆలస్యంగా ఇవ్వమని చెబుతుంది. బోర్డ్ మీటింగ్ కోసం వచ్చిన హర్షను చూసి శృతికి కాల్ చేస్తుంది ఇందూ. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో రేఖ వచ్చి శృతి రాలేదా అని అడుగుతుంది. శృతిని గమనిస్తూ ఉండాలని ఇద్దరు రౌడీలకు చెబుతుంది రేఖ. అయితే వాళ్లిద్దరికి మస్కా కొట్టి ఆఫీస్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది శృతి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications