Brahmamudi weekly roundup: యామిని ప్లాన్ తిప్పికొట్టిన రేవతి.. కావ్య ఎండీ చైర్‌పై యామిని కన్ను
Photo Courtesy: JioHotstar
యామిని మెడలో తాళి కట్టబోతుండగా కావ్య గుర్తురావడంతో పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోతాడు రాజ్. దాంతో రగిలిపోయిన యామిని లోపలికి వెళ్లి గడి పెట్టుకోవడంతో రాజ్, రఘునాథ్, వైదేహిలు టెన్షన్ పడతారు. యామిని బయటికి వచ్చి నువ్వు ప్రేమించిన కావ్యకి ఐ లవ్ యూ చెప్పమని రాజ్‌ను దుగ్గిరాల వారింటికి పంపుతుంది. ఆ వెంటనే కావ్యకి ఫోన్ చేసి రాజ్ నీకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నాడని మా బావకి నువ్వు ఐ హేట్ యూ చెప్పాలని లేదంటే మీ స్వప్న అక్కని చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది.
స్వప్న కిడ్నాప్ అయిన విషయం తెలుసుకున్న కావ్య ఆమెను వెతుక్కుంటూ వెళ్లి రౌడీల బారి నుంచి కాపాడుతుంది. స్వప్న, కావ్యలు వాళ్ల నుంచి తప్పించుకుంటూ ఉండగా ఓకామె కాపాడి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తుంది. తన పేరు రేవతి అని మీరు దుగ్గిరాల వారింటి కోడళ్లని పేర్లతో సహా చెప్పడంతో కావ్య, స్వప్నలు షాక్ అవుతారు. తమ పరిస్ధితి గురించి అప్పూకి కావ్య చెప్పడంతో అక్కలను వెతుక్కుంటూ వస్తుంది. రేవతికి థ్యాంక్స్ చెప్పి కావ్య, స్వప్నలను తీసుకెళ్తుంది. వాళ్లు వెళ్లిపోగానే రేవతి ఓ ఫోటో పెట్టుకుని ఏడుస్తుండగా ఆమె భర్త వచ్చి ఓదారుస్తాడు.
కావ్య, స్వప్నలను ఏడిపించినందుకు రగిలిపోయిన అప్పూ యామిని ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇస్తుంది. దాంతో యామిని మరో పథకం వేసి ఏకంగా దుగ్గిరాల కంపెనీ నుంచే కావ్యని బయటికి పంపేలా చేస్తుంది. స్వరాజ్ కంపెనీ డైరెక్టర్‌ను పిలిపించి తన ప్లాన్ మొత్తం చెబుతుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి జూన్ 23వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు .. 755 ఎపిసోడ్ నుంచి 760 వరకు ఏం జరిగిందంటే?
జూన్ 23వ తేదీ 755వ ఎపిసోడ్‌లో ...
తమపై అటాక్ చేయించింది యామినియేనని అప్పూ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేకపోవడంతో అప్పూని రాజ్ నిలదీస్తాడు. తప్పు చేసింది యామినియే అని నిరూపించేందుకు ఆధారాలు అక్కర్లేదని నాలుగు పీకితే చాలాని కనకం ఆవేశపడుతుంది. దాంతో అప్పూని పిలిచి కనకాన్ని తీసుకెళ్లిపోమని చెబుతుంది కావ్య. యామిని తప్పు చేయడం లేదని మీరు నమ్ముతున్నారా? లేదా? అని రాజ్‌ని అడుగుతుంది. దానికి అతను నమ్మడం లేదని సమాధానం ఇవ్వడంతో.. ఇక ఎవరి మాటలు పట్టించుకోవద్దని మీరిద్దరూ సంతోషంగా పెళ్లిచేసుకోమని చెబుతుంది కావ్య.
యామిని మెడలో రాజ్ తాళి కట్టబోతుండగా కావ్య గుర్తు రావడంతో అతను పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోతాడు. దాంతో యామిని, ఆమె తల్లిదండ్రులు షాక్ అవుతారు. యామినితో రాజ్ పెళ్లి ఆగిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ డ్యాన్స్ వేస్తుండటంతో కావ్య వచ్చి కోప్పడుతుంది.
జూన్ 24వ తేదీ 756వ ఎపిసోడ్‌లో ...
తన పెళ్లి పీటల మీదే ఆగిపోవడంతో యామిని గదిలోకి వెళ్లి లాక్ చేసుకుంటుంది. తలుపు తీయమని వైదేహి, రఘునాథ్, రాజ్‌లు వేడుకుంటారు. నీ వల్లే నా కూతురు ప్రాణాలు తీసుకోబోతుందని రాజ్‌పై యామిని తల్లిదండ్రులు మండిపడతారు. ఇంతలో యామిని డ్రెస్ మార్చుకుని బయటికి రావడంతో అంతా షాక్ అవుతారు. బావ పెళ్లి చేసుకోనని చెప్పడంతో నిజంగానే చనిపోదామని అనుకున్నానని యామిని చెబుతుంది. కానీ రుద్రాణి ఫోన్ చేసి ధైర్యం నూరిపోయడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు అంటుంది. నీ మనసులో ఉన్నది ఎవరు? నాతో పెళ్లిని ఎందుకు వద్దు అని యామిని నిలదీయడంతో తాను కళావతిని ప్రేమిస్తున్నానని రాజ్ బయటపెడతాడు. వెంటనే వెళ్లి కావ్యకి ప్రపోజ్ చేయమని రాజ్‌కి చెబుతుంది యామిని. రాజ్ ఆనందంగా దుగ్గిరాల ఫ్యామిలీకి వెళ్లగా కావ్యకి యామిని ఫోన్ చేస్తుంది.

Photo Courtesy: JioHotstar
జూన్ 25వ తేదీ 757వ ఎపిసోడ్‌లో ...
ఆసుపత్రికి వెళ్తున్నానని తనకు తోడు వస్తావా అని రాహుల్‌ని స్వప్న అడగటంతో .. అతను రానని చెబుతాడు. రుద్రాణి కూడా అదే మాట చెప్పడంతో వారిద్దరిపై స్వప్న కోప్పడుతుంది. రాజ్ వచ్చి ఐ లవ్ యూ చెబితే నువ్వు ఐ హేట్ యూ అని చెప్పాలని కావ్యకి వార్నింగ్ ఇస్తుంది యామిని. నేను చెప్పినట్లు నువ్వు వినకపోతే మీ అక్క నీకు దక్కదని చెప్పడంతో కావ్య టెన్షన్ పడుతుంది. మీ అక్క ఆసుపత్రికి వెళ్లలేదని కిడ్నాప్ అయ్యిందని చెప్పడంతో కావ్య భయపడుతుంది. స్వప్నని కాపాడుకోవడానికి వెళ్తుండగా రాజ్ ఎదురు కావడంతో తనకు అర్జెంట్ పని ఉందని కంగారుగా వెళ్లిపోతుంది కావ్య. ఆసుపత్రికి వెళ్తుండగా స్వప్నని తన కారు డ్రైవరే కిడ్నాప్ చేస్తాడు. ఆసుపత్రికి వెళ్లి స్వప్న కోసం వెతికిన కావ్యకి ఆమె అక్కడ కనిపించదు.. అయితే కారులో జీపీఎస్ ట్రాకర్ ఉన్నట్లు తెలుసుకుని స్వప్న ఆచూకీ కనుక్కుంటుంది.
జూన్ 26వ తేదీ 758వ ఎపిసోడ్‌లో ...
స్వప్నను వెతుకుతుండగా కావ్యకి రాజ్ ఫోన్ చేసి నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోతారా? అని మండిపడతాడు. తాను అర్జెంట్ పని మీద ఉన్నానని ఇంటికి వచ్చి తీరిగ్గా కబుర్లు చెబుతానని ఫోన్ పెట్టేస్తుంది కావ్య. ఆ వెంటనే కావ్యకి యామిని ఫోన్ చేసి మీ అక్కతో ఐదు నిమిషాల్లో ఫోన్ చేయిస్తానని చెప్పావని సెటైర్లు వేస్తుంది. కారులో ఉన్న జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా నువ్వు మీ అక్కని వెతుకుదామని అనుకుంటున్నావా? నీ ప్లాన్ నాకు తెలిసిపోయిందని యామిని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. నా మనుషులు పరమ దుర్మార్గులని మీ అక్కని చంపేస్తారని వార్నింగ్ ఇస్తుంది యామిని. రౌడీలు స్వప్నని కత్తితో పొడవబోతుండగా కర్రతో వెనుక నుంచి కొడుతుంది కావ్య. స్వప్న,కావ్యలను రౌడీలు వెంటాడుతుండగా వాళ్లిద్దరినీ ఓకావిడ కాపాడుతుంది. నా పేరు రేవతి అని చెప్పి మీరు దుగ్గిరాల వారింటి కోడళ్లని చెప్పడంతో కావ్య, స్వప్నలు షాక్ అవుతారు. పదే పదే అపర్ణ గురించి చెప్పడంతో వాళ్లిద్దరికీ అనుమానం వస్తుంది. యామిని కిడ్నాప్ కుట్రను అప్పూకి కావ్య ఫోన్ చేసి చెప్పడంతో ఆమె బయల్దేరుతుంది.

Photo Courtesy: JioHotstar
జూన్ 27వ తేదీ 759వ ఎపిసోడ్‌లో ...
అప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి తిరిగి కావ్య కోసం వెళ్తున్న అప్పూని నానామాటలు అంటుంది ధాన్యలక్ష్మీ. ఓ కిడ్నాప్ కేసు వచ్చిందని అందుకే వాళ్లని కాపాడటానికి వెళ్తున్నానని చెబుతుంది అప్పూ. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అప్పూకి సపోర్ట్ చేయడంతో ధాన్యం సైలెంట్ అయిపోతుంది. రేవతి ఇంట్లో ఉన్న కావ్య, స్వప్నలు తాము ఇక్కడే ఉంటే ఆ రౌడీలు లోపలికి వచ్చేస్తారని భయపడతారు. ఇంతలో తలుపు కొట్టిన శబ్ధం రావడంతో కావ్య, స్వప్నలని ఆమె లోపల దాచేస్తుంది. రేవతి తలుపు తీసి చూడటంతో బయట ఆమె భర్త ఉంటాడు. తర్వాత భర్తకు కావ్య, స్వప్నలని పరిచయం చేస్తుంది. ఆ వెంటనే అప్పూ అక్కడికి వచ్చి కావ్య, స్వప్నలను కలుసుకుంటుంది. మా అక్కలను కాపాడినందుకు రేవతికి అప్పూ థ్యాంక్స్ చెబుతుంది. నాకు చావు భయం పరిచయం చేసిన ఆ యామినిని వదలొద్దని అప్పూకి చెబుతుంది స్వప్న. కావ్య చెప్పినా వినకుండా యామిని ఇంటికి వెళ్లిన అప్పూ ఆమెను లాగి పెట్టి కొడుతుంది.
జూన్ 28వ తేదీ 760వ ఎపిసోడ్‌లో ...
ఇంకోసారి మా అక్కల జోలికి వస్తే నేను తీసుకెళ్లి లాకప్‌లో పడేస్తానని యామినికి వార్నింగ్ ఇస్తుంది అప్పూ. నా పెళ్లి ఆపుతానని, అరెస్ట్ చేస్తానని ఓవరాక్షన్ చేసి ఏం చేయలేకపోయావని అప్పూతో అంటుంది యామిని. నిన్న అరెస్ట్ చేయొద్దని మా కావ్య అక్క చెప్పింది కాబట్టే వదిలేశానని.. నువ్వు వీడియో డిలీట్ చేయించినంత మాత్రన ఆధారం కనుక్కోలేక కాదని అంటుంది అప్పూ. యామినితో అప్పూ సీరియస్‌గా మాట్లాడుతుండగా రాజ్ చూసి ఏం జరిగిందని అడుగుతాడు. ఓ కేసు గురించి వెళ్తూ యామినిని పలకరిద్దామని వచ్చానని అంటుంది అప్పూ. నీ చెల్లిని పంపించి నాకు వార్నింగ్ ఇస్తే భయపడే రకం కాదని అంటుంది యామిని. స్వరాజ్ గ్రూప్ డైరెక్టర్ సిద్ధార్ధ్‌ని ఇంటికి పిలిపించి ఆ కంపెనీని కొట్టేసే ప్లాన్ చెబుతుంది యామిని. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











