Brahmamudi Weekly Roundup: రెండోసారి కావ్య, రాజ్‌కు శోభనం.. అనామికకు కల్యాణ్ విడాకులు?
ఇంట్లో వాళ్ళందరూ కలిసిపోయారు మళ్ళీ రాజ్ ఆఫీస్ కి వస్తాడు అని కంగారు పడతాడు రాహుల్. మరోవైపు అప్పు ఇంటికి వచ్చిన కళ్యాణ్ ముఖం మీద తలుపేసేస్తుంది కనకం. మరోవైపు తన భార్యకి ప్రపోజ్ చేయాలనుకుంటాడు రాజ్ కానీ చేయలేక పోతాడు ఆ విషయం ఇందిరా దేవి గ్రహించి వాళ్ళిద్దరికీ తెలియకుండా వాళ్ళకి శోభనం ఏర్పాట్లు చేస్తుంది. అలా చేయటం ఇష్టం లేని రుద్రాణి తన ట్రాప్ లో కళ్యాణ్ ని ఇరికిస్తుంది. హోటల్లో హడావుడి అంతా అనామికే చేసినట్లు కళ్యాణ్ కి ఆధారాలు దొరికేలా చేస్తుంది ఆధారాలు తీసుకొని ఇంటికి వచ్చి అందరికీ నిజం చెప్తాడు. అనామికకి కళ్యాణ్ డైవర్స్ ఇవ్వాలనుకుంటాడు. కానీ రాజ్ దంపతులు అనామిక దంపతులని కలిపే ప్రయత్నం చేస్తారు. జూన్ 24వ తేదీ నుంచి జూన్ 29 వ తేదీ వరకు.. 444 ఎపిసోడ్ నుంచి 449వరకు ఏం జరిగిందంటే?
జూన్ 24వ తేదీ 444 ఎపిసోడ్‌లో
ఇంట్లో వాళ్ళందరూ కలిసి పోయారు, ఇప్పుడు రాజ్ మళ్ళీ ఆఫీస్ కి వస్తాడేమో అని తల్లితో చెప్పి కంగారు పడతాడు రాహుల్. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య ఖచ్చితంగా ఆయన ఆఫీస్ కి వస్తారు అంటూ మాయ వెనుక రుద్రాణి వాళ్ళు ఉన్నారనే విషయాన్ని సాక్షాదారాలతో సహా నిరూపించి ఇకపై ఇలాంటి వెధవ వేషాలు వేయొద్దు అని లాస్ట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మరోవైపు నా మీద పడిన నింద చెరిగిపోయింది ఇకమీదట ఇద్దరం హాయిగా ఉందాం అని భార్యతో అంటాడు సుభాష్. నేను మిమ్మల్ని జీవితంలో క్షమించను నలుగురు ముందు మాత్రమే మనం భార్యాభర్తలం అంటుంది అపర్ణ. మరోవైపు భార్యకి థాంక్స్ చెప్పాలనుకుంటాడు రాజ్. కానీ కావ్య ఆ ఛాన్స్ ఇవ్వకుండా భర్తని ఆటపట్టిస్తుంది. మరోవైపు అప్పుని చుట్టుపక్కల వాళ్ళు నానా మాటలు అంటూ ఉంటారు. అప్పుడే కళ్యాణ్ ఆ ఇంటికి రావడంతో మరిన్ని మాటలు అసహ్యంగా మాట్లాడుతారు. అప్పుడు కనకం కళ్యాణ్ ముఖం మీద తలుపు వేసి లోపలకి వెళ్లిపోతుంది.

జూన్ 25 వ తేదీ 445ఎపిసోడ్‌లో
భార్య కి తన మనసులో మాట చెప్పాలని ప్రయత్నించి విఫలమవుతూ ఉంటాడు రాజ్. అది కావ్య గమనించి నవ్వుకుంటూ ఉంటుంది. మరోవైపు బయటకు వెళ్తున్న అప్పుని బయటికి వెళ్లొద్దని వారిస్తుంది కనకం. అయినా నా భవిష్యత్తు కోసం నేను అడుగు ముందుకు వేయాలి అంటూ అప్పు వెళ్ళిపోతుంది. మరోవైపు రాజ్ చేస్తున్న పనులు చూసి మనసులో మాట భార్యకి చెప్పొచ్చు కదా అంటుంది ఇందిరాదేవి. వాతావరణం అనుకూలించే సమయంలో చెప్తాను అంటాడు రాజ్. ఆ వాతావరణం నేను క్రియేట్ చేస్తాను అనుకుంటుంది ఇందిరా దేవి. మరోవైపు ఆటోలో వెళ్తున్న అప్పుని ఆపి ఆమెతో రోడ్డు మీదే గొడవ పడుతుంది అనామిక. ఆమెకి సరైన సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు. మరోవైపు ఇందిరా దేవి ఇంట్లో వాళ్ళ సహాయంతో రాజ్ వాళ్ళకి తెలియకుండా శోభనం ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది
జూన్ 26వ తేదీ 446 ఎపిసోడ్ లో
శోభనం ఏర్పాట్లు హడావుడిలో ఉన్న కుటుంబ సభ్యుల ప్రవర్తనకి విషయం తెలియని కావ్య ఆశ్చర్య పోతుంది. ఏం జరుగుతుంది అని అక్కడి వాళ్ళని అడుగుతుంది. అన్ని విషయాలు నీకే కావాలా అని కోడల్ని మందలించి పంపించేస్తుంది అపర్ణ. ఇంట్లో జరుగుతున్న ఏర్పాట్లు చూసి కంగారు పడతాడు రాహుల్. నేను చూస్తూ ఊరుకుంటానా ఇంట్లో కళ్యాణ్ అనే అమాయకుడు ద్వారా అగ్గిపుల్ల రాజేస్తాను అంటుంది రుద్రాణి . మరోవైపు రాజ్ కూడా ఇంట్లో వాళ్ళ ప్రవర్తనకి ఆశ్చర్యపోతాడు. అనామిక కళ్యాణ్ దగ్గరికి వెళ్లి జరిగిందేదో జరిగిపోయింది మనం కలిసి పోదాం అంటుంది. అది కుదరని పని, నువ్వు నా మనసుని మొక్కలు చేసేసావు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. తర్వాత హోటల్లో మీ మీద కుట్ర జరిగింది ఆధారాలతో సహా నిరూపిస్తాను అని ఒక రిపోర్టర్ ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్తాడు కళ్యాణ్. మరోవైపు తమ గదిలో సీతారామయ్య దంపతులు పడుకోవడం చూసి ఆశ్చర్యపోతారు రాజ్ దంపతులు. మా గదిలో ఏసి పోయింది అందుకే ఇక్కడ పడుకున్నాము. మీరు వెళ్లి మా గదిలో పడుకోండి అంటుంది ఇందిరాదేవి.

జూన్27 వ తేదీ 447 ఎపిసోడ్‌లో
సీతారామయ్య గదిలోకి వెళ్లి చూసిన రాజ్ దంపతులు అక్కడ ఏర్పాటు చూసి షాక్ అవుతారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ప్రవర్తనకి కారణం అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని దగ్గర అయ్యే సమయానికి కళ్యాణ్ వచ్చి అనామిక అని గట్టిగా పిలుస్తాడు. ఏం జరిగిందో అని రాజ్ వాళ్లతో సహా అందరూ వస్తారు. హోటల్లో జరిగిన దాని గురించి సాక్షాదారాలతో సహా నిరూపిస్తాడు కళ్యాణ్. ధాన్యలక్ష్మి కోడలి చెంప పగల కొట్టి ఆమెకి చివాట్లు పెడుతుంది.
జూన్ 28 వ తేదీ 448 ఎపిసోడ్‌లో
నా కొడుకు దుగ్గిరాల వారసుడు కాబట్టి నిన్ను క్షమించాడు అంటుంది ధాన్యలక్ష్మి. కానీ మా చెల్లెలికి జరిగిన అన్యాయానికి మేము క్షమించము అంటూ అనామిక మీదకి చెయ్యెత్తుతుంది స్వప్న. కానీ కావ్య స్వప్నని వారించి ఇప్పుడు మనం ఏమన్నా కవిగారి కాపురం పాడవుతుంది వదిలేయమంటుంది. కళ్యాణ్ అనామిక కి డైవర్స్ ఇస్తాను అంటాడు. ఇదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఎలాగైనా వాళ్ళిద్దర్నీ కలపాలి అనుకుంటారు రాజ్ దంపతులు. రాజ్ అనమికాతో మాట్లాడి ఆమె మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు.కానీ అతను వెళ్ళిపోయిన తరువాత రుద్రాణి మాటలకు రెచ్చిపోయిన అనామిక తన తల్లిదండ్రులను ఇంటికి పిలిపించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కావ్య కళ్యాణ మనసు మార్చి అనామికతో మాట్లాడమని కళ్యాణ్ ని కిందికి తీసుకు వస్తుంది. అక్కడ కూడా కళ్యాణ్ అపర్ణతో ఏదో మాట్లాడుతూ ఉంటే భర్తని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది అనామిక.

జూన్ 29వ తేదీ 449 ఎపిసోడ్‌లో
తల్లిదండ్రులని తీసుకువచ్చి ఇంట్లో పంచాయతీ పెడుతుంది అనామిక. ఆమెకి సర్ది చెప్పాలని ప్రయత్నించిన పెద్ద వాళ్ళందరినీ తీసిపారేసినట్లు మాట్లాడుతుంది. అనామికని మందలించకుండా ఆమెనే సపోర్ట్ చేస్తారు ఆమె తల్లిదండ్రులు. కళ్యాణ్ కోపంతో నీ కూతురు తీసుకొని ఎక్కడి నుంచి వెళ్లిపోండి అని అనామిక తల్లిదండ్రులకి చెప్తాడు. వెళ్తాను కానీ ఇది ఇక్కడితో ఆగదు. మీరు నా కాళ్లు పట్టుకునే లాగా చేస్తాను అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనామిక. మరోవైపు ధాన్యలక్ష్మిని ఓదార్చడానికి వచ్చిన కావ్య తో తప్పంతా కావ్య ది,అప్పు ది అన్నట్టు మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. కావ్య ని వెనకేసుకొచ్చి ధాన్య లక్ష్మి ని మందలిస్తుంది అపర్ణ. మరోవైపు తనకి అన్యాయం జరిగిందని టీవీలో రచ్చబండ పెడుతుంది అనామిక. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











