Brahmamudi weekly roundup: రాజ్- ఇందూలను విడగొట్టిన రేఖ.. రాజ్‌కి చలపతి కండీషన్

Photo Courtesy: JioHotstar

రేఖ పెట్టిన రౌడీలకు మస్కా కొట్టి శృతి ఆఫీస్‌కి వచ్చేలా చేస్తాడు రాజ్. హర్షాకి ఆ డిజైన్లు నచ్చడంతో డీల్ ఓకే చెబుతాడు. నాకు ఎదురొచ్చినందుకు నీ ప్రాణాలు తీస్తానని శృతికి వార్నింగ్ ఇస్తుంది రేఖ. వెంకీ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడని తెలిసి చలపతి క్లాస్ పీకుతాడు. ఇంతలో నందూ వచ్చి వాడిని అలాగే ఉండనివ్వమని చెబుతుంది. రాజ్- ఇందూలని విడగొట్టేందుకు వడ్డీ వ్యాపారిని చలపతి దగ్గరికి పంపిస్తుంది రేఖ. అతను వెళ్లి రాజ్ దుగ్గిరాల ఇంటికి అల్లుడు అయ్యాడని చెప్పడంతో చలపతి - లక్ష్మీలు షాక్ అవుతారు. దుగ్గిరాల ఇంటికి వెళ్లి కొడుకుని వచ్చేయమని ప్రాధేయపడతారు. ఇందూకి ఇచ్చిన మాట కోసం తల్లిదండ్రులనే వదులుకుంటాడు రాజ్. చలపతి- లక్ష్మీల దగ్గరికి రాజ్‌ను పంపాలని అతని మనసు విరిగిపోయేలా మాట్లాడుతుంది ఇందూ. దీంతో రాజ్ దుగ్గిరాల ఇంటిని వదిలేసి తన ఇంటికి వెళ్తాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup June 29th to July 4th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి జూన్ 29వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు .. 1071వ ఎపిసోడ్ నుంచి 1076వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

జూన్ 29వ తేదీ 1071వ ఎపిసోడ్‌లో ..
బోర్డ్ మీటింగ్‌కు శృతి రాకపోవడంతో ఇందూ, రాజ్‌లు టెన్షన్ పడుతుంటారు. ఇదంతా చూసిన రేఖ.. శృతి వచ్చేలా కనిపించడం లేదు హర్షా గారిని వెళ్లిపోమని చెబుతానని అంటుంది. ఇంతలో శృతి ఆఫీస్‌కు రావడంతో రేఖ షాక్ అవుతుంది. దాంతో రౌడీలకు ఫోన్ చేసి శృతిని జాగ్రత్తగా వాచ్ చేయమని చెప్పాను కదా అని ఫైర్ అవుతుంది. వారికి లోపలి నుంచి లేడీ గెటప్‌లో లక్కీ వచ్చి లెమన్ సోడా ఇస్తాడు. శృతి వేసిన డిజైన్లు హర్షాకి బాగా నచ్చుతాయి. మీరు నాకు అనుకున్న టైంకి డిజైన్లు తయారు చేసి ఇస్తే మా కంపెనీకి వచ్చే ప్రతి ఆర్డర్ మీకే ఇస్తానని చెబుతాడు హర్షా. ఆ మాటలు విన్న రేఖ రగిలిపోతుంది. నేను రావొద్దు అన్నా ఎందుకు ఆఫీస్‌కి వచ్చావు? నా గురించి తెలిసికూడా ఇంత రిస్క్ తీసుకుంటావా? అని శృతిపై మండిపడుతుంది రేఖ. కావ్య- రాజ్‌ సార్‌లు మా కుటుంబానికి ఎంతో చేశారు. నా ప్రాణం పోయినా ఇందూ మేడంకి అన్యాయం చేయనని తేల్చేస్తుంది శృతి. చలపతి- లక్ష్మీని ఇంటికి పిలిచి భోజనం పెట్టడంతో పాటు 5 నెలల బోనస్ ఇస్తాడు ఓనర్. ఇంతలో ఫుడ్ డెలవరీ చేయడానికి అదే ఇంటికి వచ్చిన వెంకీ.. తల్లిదండ్రులను చూసి షాక్ అవుతాడు. ముఖానికి మాస్క్ పెట్టుకుని డెలివరీ చేసి వెళ్లిపోతాడు.

జూన్ 30వ తేదీ 1072వ ఎపిసోడ్‌లో..
కాస్తుంటే అమ్మనాన్నలకి దొరికిపోయేవాడినని నందూ దగ్గర బాధపడతాడు. ఈ విషయం వాళ్లతో చెబితే నీకు మనశ్శాంతి దొరుకుతుందని నందూ సలహా ఇస్తాడు. నా కోసం అమ్మనాన్న, మా అన్నయ్య ఎంతో త్యాగం చేశారు.. ఇప్పటికీ కష్టపడుతున్నారు అలాంటి వాళ్లకు నేను డెలివరీ బాయ్ ఉద్యోగం చేస్తున్నానని తెలిస్తే తట్టుకోలేరని బాధపడతాడు నందూ. ఇందూకి అండగా నిలిచి కంపెనీకి కాంట్రాక్ట్ దక్కేలా చేశావని రాజ్‌ను సుభాష్, అపర్ణలు మెచ్చుకుంటారు. వెంకీ అర్ధరాత్రి ఇంటికి రాగానే టిప్స్ బాగా వచ్చాయా అని అడుగుతాడు చలపతి. మేం నిన్ను ఎలా చూడాలనుకున్నాం.. నువ్వు ఎలా ఉన్నావని బాధపడతాడు. నువ్వు ఆ డెలివరీ బాయ్ జాబ్ మానేయ్.. నీ ఖర్చులకు, ఇంటి సంగతి నేను చూసుకుంటానని చెప్పడంతో తండ్రిని వెంకీ హత్తుకుంటాడు. ఇంతలో నందూ వచ్చి వాడు ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్నాడు, చెడగొట్టద్దని చెప్పడంతో డెలివరీ బాయ్‌గా ఉండటానికి చలపతి ఒప్పుకుంటాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup June 29th to July 4th episode Story

Photo Courtesy: JioHotstar

జూలై 01వ తేదీ 1073వ ఎపిసోడ్‌లో..
స్వీట్ పెట్టడానికి వస్తోన్న ఇందూని చూసి కలగంటున్నానని అనుకుంటాడు రాజ్. అయితే ఇందూ గట్టిగా గిల్లడంతో కేకలు పెడతాడు. నీ వల్లే ఈరోజు డీల్ ఫినిష్ చేశామని రాజ్‌కి స్వీట్ తినిపించి అదే స్వీట్‌ని ఇందూ తినడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇలాగే నా చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా ఉంటావా అని ఎమోషనల్ అవుతుంది. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన పని పూర్తయ్యే వరకు నేను నిన్ను వదిలిపెట్టనని మాట ఇస్తాడు రాజ్. ఒంటరిగా గదిలో కూర్చొని ఏడుస్తున్న రేఖ దగ్గరికి ఐశ్వర్య వచ్చి క్లాస్ పీకుతుంది. ఆ రాజ్- ఇందూ ఇద్దరూ తోడు దొంగలే. పార్టీలో మిమ్మల్ని వాళ్లిద్దరూ ఫూల్స్‌ని చేశారు. ఇప్పటి వరకు ఆ రాజ్‌గాడు వాళ్ల అమ్మనాన్నల్ని ఎందుకు తీసుకురాలేదు. వాళ్ల దగ్గరికి మనల్ని ఎందుకు తీసుకెళ్లలేదు. వాళ్లిద్దరి పెళ్లి వెనుక ఏదో ఉంది. అందుకే రాజ్ దాస్తున్నాడని ఐశ్వర్య చెప్పడంతో రేఖ స్కెచ్ గీస్తుంది. ఓ వ్యక్తిని చలపతి ఇంటికి పంపుతుంది రేఖ. మీ అబ్బాయి దుగ్గిరాల వారింటికి అల్లుడు అని చెప్పడంతో చలపతి, లక్ష్మీలు షాక్ అవుతారు.

జూలై 02వ తేదీ 1074వ ఎపిసోడ్‌లో..
ఉదయాన్నే బట్టలు ఐరన్ చేస్తున్న ఇందూ దగ్గరికి వెళ్లి తన షర్ట్ కూడా ఇస్త్రీ చేయమని చెబుతాడు రాజ్. తనకే పని చెబుతాడా అంటూ రాజ్‌పై రగిలిపోయిన ఇందూ.. ఆ షర్ట్‌ని కాల్చేస్తుంది. కాసేపటి తర్వాత వచ్చి చూసిన రాజ్‌కు షర్ట్ కాలిపోయి కనిపించడంతో ఇందూని కొట్టడానికి ఇల్లంతా వెంటపడతాడు. వారిద్దరిని చూసి అపర్ణ- సుభాష్‌లు సంతోషిస్తారు. ఇంతలో అక్కడికి వచ్చిన చలపతి - లక్ష్మీలు అక్కడికొచ్చి షాక్ అవుతారు. నీకు, ఇందూకి పెళ్లి జరిగిందా? లేదా? అని చలపతి అడగ్గా.. జరిగిందని ఒప్పుకోవడంతో రాజ్ చెంప పగలగొడతాడు తండ్రి. పిల్లల ఇష్టాన్ని గౌరవించాలని అపర్ణ, సుభాష్ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా మాకు వాడు ప్రాణాలతో ఉంటే చాలని అంటాడు చలపతి. నీకు మేం కావాలా? ఇందూ కావాలా తేల్చుకోమని చలపతి చెప్పడంతో నా భార్యను, ఈ ఇంటిని వదిలి ఎక్కడికి రాలేనని తేల్చేస్తాడు రాజ్. దాంతో రేఖ, ఐశ్వర్యలు షాక్ అవుతారు. తనకు ఇచ్చిన మాట కోసం కన్నవాళ్లనే వదులుకున్న రాజ్‌ని చూసి ఎమోషనల్ అవుతుంది ఇందూ.

Brahmamudi Telugu Serial Weekly roundup June 29th to July 4th episode Story

Photo Courtesy: JioHotstar

జూలై 03వ తేదీ 1075వ ఎపిసోడ్‌లో..
నీకు మేం కావాలా? భార్య కావాలా అని రాజ్‌ను నిలదీస్తాడు చలపతి. నాన్నని జాగ్రత్తగా చూసుకోమని లక్ష్మీతో రాజ్ అనడంతో ఇద్దరూ షాక్ అవుతారు. మేం నీ మీద పెట్టుకున్న ఆశల్ని నిలువునా కూల్చేశావని బాధపడతాడు చలపతి. నేను చస్తే నా తలకొరివి పెట్టడానికి కూడా నువ్వు రావొద్దని అంటాడు. తల్లిదండ్రులకు బిడ్డను దూరం చేశావని ఇందూపై కోప్పడి భార్యని తీసుకుని వెళ్లిపోతాడు చలపతి. ఇంటి దగ్గర రాజ్ కోసం చలపతి, లక్ష్మీ ఏడుస్తుంటారు. ఎలాగైనా రాజ్‌ను అక్కడి నుంచి తీసుకొచ్చేయాలని భార్యతో చెబుతాడు చలపతి. రాజ్ గాడిని వాళ్ల అమ్మనాన్న ఇంటికి తీసుకెళ్లిపోతారని అనుకుంటే ఇలా జరిగిందేంటీ అని రేఖపై మండిపడతారు భ్రమరాంబ, భూషణ్. మరేం పర్లేదు, ఆ ఇందూయే రాజ్‌ని గెంటేస్తుందని చెబుతుంది రేఖ. నా కారణంగా మీ అమ్మనాన్నలకు నువ్వు దూరం అవ్వడం నాకు ఇఫ్టం లేదు. చిన్నప్పటి నుంచి అమ్మనాన్నల లేక నేను నరకం చూశానని చెబుంది ఇందూ.

జూలై 04వ తేదీ 1076వ ఎపిసోడ్‌లో..
రాజ్ ఎంత చెప్పినా దుగ్గిరాల వారి ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో అతనిపై కోప్పడుతుంది. నీకు కావాల్సింది డబ్బులే కదా అని ఫుల్ పేమెంట్ ఇచ్చి అతని చేతిలో పెడుతుంది. నా సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోమని ఇందూ చెప్పడంతో రాజ్ మనసు ముక్కలవుతుంది. భారంగా తన ఇంటికి వచ్చిన రాజ్ లోపలికి వెళ్లబోతుండగా చలపతి అడ్డుకుంటాడు. ఇందూ చాలా మంచి అమ్మాయి.. తనే నన్ను ఇక్కడికి పంపించింది. అయినా ఆ ఇంటికి నాకు ఏదో బంధం ఉందని అనిపిస్తోందని చెబుతాడు రాజ్. ఈ మాటలు విన్న చలపతి షాక్ అవుతాడు. భోజనానికి రాజ్ రాకపోవడంతో మనవడు ఎక్కడ అని అపర్ణ అడగ్గా.. తన ఇంటికి శాశ్వతంగా వెళ్లిపోయాడని ఇందూ చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. రాజ్ పీడ విరగడైందని రేఖ, భ్రమరాంబ, ఐశ్వర్యలు సంతోషిస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X