Brahmamudi weekly roundup: యామిని కుట్ర భగ్నం చేసిన అప్పూ.. కావ్య ప్రాణాలు సేఫ్, రౌడీలకి బడితపూజ

Photo Courtesy: JioHotstar

అప్పూతో కళ్యాణ్ ఫస్ట్ నైట్ జరుగుతుంది. రాజ్‌ని రిసార్ట్‌కి తీసుకెళ్లి లోబరచుకోవాలని యామిని అనుకుంటుందని కావ్యకి ఇందిర, అపర్ణలు చెప్పడంతో కావ్య దానిని అడ్డుకోవడానికి వెళ్తుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం రిసార్ట్స్‌లో దిగిన యామిని తన అందంతో రాజ్‌ని టెంప్ట్ చేస్తుంది. కిటికీలో కావ్యని చూసిన రాజ్ ఆమె కోసం కిందకి వస్తాడు. కావ్యతో కలిసి ఒకే రూమ్‌లో ఉండగా సర్వర్ పండు వచ్చి చూసి యామిని చెప్పాలని వస్తుండగా రాజ్ అడ్డుపడతాడు. రాజ్‌ని మరోసారి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తుండగా యామినికి మస్కా కొట్టి కిందకి వచ్చేస్తాడు రాజ్.

కావ్య పక్కన రాజ్‌ని చూసిన యామిని.. ఇక కావ్యని శాశ్వతంగా లేకుండా చేయాలని కిల్లర్‌ని రంగంలోకి దించుతుంది. కావ్య- రాజ్‌లు టీ తాగుతుండగా కావాలని తన మనుషులతో గొడవ పెట్టుకుండాడు కిల్లర్. రాజ్‌కి ఏమైనా అవుతుందని భయపడ్డ కావ్య అతనిని తీసుకుని కారులో వెళ్తుండగా కిల్లర్ గ్యాంగ్ వెంటాడుతుంది. వాళ్లని తప్పించుకుంటూ అడవిలోకి పారిపోతారు రాజ్ - కావ్య. ఈ విషయాన్ని అపర్ణకి ఫోన్ చేసి చెబుతుంది కావ్య. దాంతో అపర్ణ .. వెంటనే అప్పూని రంగంలోకి దించుతుంది.

పిచ్చి కాయలు తిని మత్తులో నిద్రపోతున్న రాజ్- కావ్యల్ని రౌడీలు చంపబోతుండగా అప్పూ వాళ్లని రక్షించి కావ్యని ఇంటికి తీసుకొస్తుంది. రౌడీల నుంచి ఫోన్ రాకపోవడంతో యామిని టెన్షన్ పడుతూ తల్లికి జరిగింది చెబుతుంది. ఇంటిని అందంగా ముస్తాబు చేస్తుండటంతో ఏంటి స్పెషల్ అని అడుగుతాడు రాజ్. ఎల్లుండి మీ పెళ్లి జరగబోతోందని వైదేహి చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup June 2nd to June 7th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి జూన్ 2వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు .. 737 ఎపిసోడ్ నుంచి 742 వరకు ఏం జరిగిందంటే?

జూన్ 2వ తేదీ 737వ ఎపిసోడ్‌లో ... అవాంతరాలు దాటుకుని శోభనం జరుగుతుంటే తనను పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ కూర్చొన్న అప్పూపై కోప్పడతాడు కళ్యాణ్. దాంతో అప్పూ ఇచ్చిన పాల గ్లాస్‌ను పక్కకు నెట్టేయడంతో ఆమె అలుగుతుంది. ఆపై అప్పూ నడుము గిల్లి ఆమెను రెచ్చగొట్టి బెడ్‌పైకి తీసుకెళ్తాడు కళ్యాణ్. స్వప్న నగల్ని ప్రియురాలికి అలంకరించి ఆమెను అనుభవించాలని అనుకుంటాడు రాహుల్. తనకు విల్లా కొనిస్తేనే ఒంటి మీద చేయి వేయాలని తేల్చి చెబుతుంది. ఆ మాటలతో రాహుల్ షాక్ అవుతాడు. తన తల్లిదండ్రుల ద్వారా రాజ్‌ని రిసార్ట్స్‌కి తీసుకెళ్లా చేస్తుంది యామిని. ఆ రిసార్ట్‌లో ఏదైనా తప్పు జరిగిందా రాజ్ నీకు శాశ్వతంగా దూరమైపోతాడని కావ్యకి అపర్ణ, ఇందిరలు వార్నింగ్ ఇస్తారు. రిసార్ట్‌కు బయల్దేరుతున్న యామినిని చూసి రాజ్‌తో ఫస్ట్ నైట్ ఆలోచన మానుకోమని నచ్చచెబుతుంది వైదేహి.

జూన్ 3వ తేదీ 738వ ఎపిసోడ్‌లో ... కావ్య రిసార్ట్‌కి బయల్దేరిన విషయాన్ని రాజ్‌కు ఫోన్ చేసి చెబుతుంది ఇందిర. కారులో రాజ్ సైలెంట్‌గా ఉండటంతో యామిని హర్ట్ అవుతుంది. యామినిని తీసుకుని రాజ్ రిసార్ట్స్‌లో దిగగా వాళ్లకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందే చేసి పెడతాడు రఘునాథ్. ఒరిజినల్ నగల స్థానంలో డౌట్ రాకుండా డూప్లికేట్‌వి తీసుకొచ్చిన రాహుల్ వాటిని మార్చేందుకు ప్రయత్నిస్తూ స్వప్నకి దొరికిపోతాడు. రాజ్‌తో రూమ్‌లో ఏకాంతంగా ఉండటంతో అతనిని టెంప్ట్ చేసి లొంగదీసుకోవాలని చూస్తుంది యామిని. దాంతో రాజ్ ఆమెకి దూరం జరిగి ఆంటీ అంకుల్ నన్ను నమ్మి పంపించారని మండిపడతాడు. ఇంతలో రిసార్ట్‌లో కావ్యని చూసి కిందకి వెళ్లిపోతాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup June 2nd to June 7th episode Story

Photo Courtesy: JioHotstar

జూన్ 4వ తేదీ 739వ ఎపిసోడ్‌లో ... యామిని పక్కన ఉండాల్సిన రాజ్.. కావ్యతో ఉండటం చూసిన సర్వర్ పండు షాక్ అవుతాడు. ఈ విషయాన్ని వెంటనే యామినిక చెప్పాలని ఆమెను వెతుక్కుంటూ వచ్చిన పండు నిజం చెప్పబోతుండగా రాజ్ అడ్డుపడతాడు. మా బావ గురించి ఎవరేం చెప్పినా నేను నమ్మనని రాజ్‌తో కలిసి యామిని అతనిని గదిలోకి తీసుకెళ్తుంది. రాజ్‌ను మరోసారి లోబరచుకునేందుకు ప్రయత్నిస్తుండగా కావ్య ఫోన్ చేస్తుంది. దాంతో యామిని నుంచి తప్పించుకుని కిందకి వచ్చేస్తాడు రాజ్. కావ్యతో రాజ్‌ని చూసిన యామిని.. శాశ్వతంగా కావ్యని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని కిల్లర్‌కు ఫోన్ చేస్తుంది. స్వప్న బొడ్డులో ఉన్న తాళాలను కొట్టేసిన రాహుల్ డూప్లికేట్ కబోర్డులో పెడుతుండగా స్వప్న పట్టుకుని అందరి ముందు పంచాయతీ పెడుతుంది.

జూన్ 5వ తేదీ 740వ ఎపిసోడ్‌లో ... రాహుల్‌కు ఏ శిక్ష వేసినా మేమంతా నీకు సపోర్ట్ చేస్తామని స్వప్నతో ఇందిర అంటుంది. నగలు మాయం చేసి విషయం బయటకు రాకపోవడంతో రాహుల్ ఊపిరి పీల్చుకుంటాడు. కానీ కొడుకుని బయటికి లాక్కెళ్లిన రుద్రాణి లాగికొట్టి చీవాట్లు పెడుతుంది. కావ్య-రాజ్‌లు ఓ దుకాణం దగ్గర టీ తాగుతారు. యామిని ప్లాన్ ప్రకారం సుపారీ కిల్లర్ తన మనుషులతో కలిసి అక్కడికి వస్తారు. కావ్యని టీజ్ చేయడంతో రాజ్ వాళ్లతో గొడవ పడతాడని ఈ గ్యాప్‌లో కావ్యని చంపేయాలని అనుకుంటారు. అయితే దానికి పూర్తి రివర్స్‌గా రాజ్‌ని కూల్ చేసి కారులో పక్కకి తీసుకెళ్తుంది కావ్య. దాంతో రాజ్‌‌ కారును రౌడీలు వెంటాడతారు. సరిగ్గా ఆ సమయంలో కారు ఆగిపోవడంతో రాజ్- కావ్యలు అడవిలో తప్పిపోతారు. ఈ విషయాన్ని అపర్ణకి కావ్య ఫోన్ చేసి చెప్పడంతో ఆమె వెంటనే అప్పూకి చెబుతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup June 2nd to June 7th episode Story

Photo Courtesy: JioHotstar

జూన్ 6వ తేదీ 741వ ఎపిసోడ్‌లో ... అడవిలో తప్పిపోయిన రాజ్- కావ్యలు బయటికి ఎలా వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ తిరుగుతారు. ఇంతలో తనకు దాహం వేస్తుందని కావ్య చెప్పడంతో ఆమె కోసం మంచి నీళ్లు తీసుకొచ్చి తాగిపిస్తాడు రాజ్. కిల్లర్‌కి యామిని ఫోన్ చేసి కావ్యని చంపారా? లేదా? ఎంతసేపు వెయిట్ చేయాలి? అని మండిపడుతుంది. మరోవైపు కావ్య- రాజ్‌లను వెతుక్కుంటూ అప్పూ తన సిబ్బందితో అడవికి వస్తుంది. నడిచి నడిచి అలసిపోయానని ఇక నా వల్ల కాదని బాగా ఆకలి వేస్తోందని చెబుతుంది కావ్య. దాంతో కళావతిని చీకటిలొ వదిలేసి రాజ్ కనిపించకుండా వెళ్లిపోతాడు. దాంతో కావ్య టెన్షన్ పడుతూ అతను తిరిగి రాగానే గొడవ పడుతుంది. కొన్ని పండ్లు తీసుకొచ్చి తినమని ఇస్తాడు రాజ్.. వాటిని తినగానే ఇద్దరికీ మత్తు మత్తుగా ఉండి తల తిరుగుతుంది.

జూన్ 7వ తేదీ 742వ ఎపిసోడ్‌లో ... పిచ్చి పళ్లు తిన్న రాజ్-కావ్యలు మత్తుగా నిద్రపోతుండగా వారిని చూసిన సుపారీ గ్యాంగ్ వెంటనే కత్తితో కావ్యని పొడవటానికి వస్తాడు. ఉదయాన్నే రాజ్ లేచి చూసేసరికి ఎదురుగా రౌడీలు కట్టేసి ఉంటారు. కావ్యను నిద్రలేపి మీరే రాత్రి ఫైట్ చేసి దొంగల్ని కట్టేశారా? అని అడగ్గా వాళ్లని కట్టేసింది నేను అని అప్పూ చెబుతుంది. మా అక్కాబావల మీద అటాక్ చేయమని మిమ్మల్ని పంపింది ఎవరు? అని రౌడీలను అడుగుతుంది అప్పూ. రాజ్- కావ్యల గురించి దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుండగా కావ్య క్షేమంగా తిరిగి రావడంతో వాళ్లంతా సంతోషిస్తారు. మిమ్మల్ని ఆ రౌడీలు ఎందుకు వెంటాడారు? వాళ్లని పంపింది ఎవరు అనేది నేను తేలుస్తానని అప్పూ చెబుతుంది. కావ్యని చంపినట్లుగా ఫోన్ రాకపోవడంతో యామిని టెన్షన్ పడుతుంది. ఏం జరిగిందని వైదేహి అడగటంతో తల్లికి జరిగినదంతా చెబుతుంది. ఇంటిని అందంగా ముస్తాబు చేస్తుండటంతో రాజ్ ఎందుకని వైదేహిని అడుగుతాడు. ఎల్లుండి మీ పెళ్లి అని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు . తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X