Brahmamudi weekly roundup: సిద్ధార్ధ్ ట్రాప్‌లో కావ్య.. కంపెనీ కోసం రాజ్ రిస్క్, స్వప్నకి దొరికిన రాహుల్
Photo Courtesy: JioHotstar
యామిని ప్లాన్ ప్రకారం కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తుండగా సిద్ధార్ధ్ ఆఫీస్‌కి వచ్చిన విషయం ఫోన్ చేసి చెబుతాడు మేనేజర్. దాంతో ఆఫీస్‌కి వచ్చిన కావ్యని ఎండీ చైర్ నుంచి తప్పుకోవాలని సిద్ధార్ధ్ డెడ్‌లైన్ పెడతాడు. ఏం చేయాలో తెలియక కంపెనీ కోసం రాజ్‌ని ఎండీగా నటించేలా ఒప్పిస్తుంది కావ్య. రేవతి పేదరికంతో బాధపడుతుండటంతో రాజ్, కావ్యలు ఆమె కొడుకు పుట్టినరోజు చేయిస్తారు. రాహుల్ ఒరిజినల్ నగల ప్లేస్‌లో డూప్లికేట్ నగలు పెట్టిన విషయాన్ని అప్పూ, స్వప్నలు కనిపెట్టి రాహుల్‌ను ఫాలో అవుతారు. ఇంటి డాక్యుమెంట్స్‌ని తన ప్రియురాలికి రాహుల్ ఇస్తుండగా వాళ్లిద్దరూ పట్టుకుంటారు. రాహుల్‌కి చీపురుకట్టతో బడితపూజ చేసి నగల్ని తీసుకుని ఇంటికి బయల్దేరతారు. ఎండీ హోదాలో ఆఫీస్‌కి వచ్చిన రాజ్ స్టాఫ్ మొత్తాన్ని వణికిస్తాడు.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి జూన్ 30వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు .. 761 ఎపిసోడ్ నుంచి 766 వరకు ఏం జరిగిందంటే?
జూన్ 30వ తేదీ 761వ ఎపిసోడ్‌లో ..
స్వప్న కిడ్నాప్ ఎపిసోడ్ ముగియడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రిలాక్స్ అవుతుంది. ఉదయాన్నే రాజ్ ఇంటికి రావడంతో కావ్యను ఎక్కడికి వెళ్లొద్దని ఇందిర ఆర్డర్స్ వేస్తుంది. ఆ నాలుగు ముక్కలు త్వరగా చెప్పేయమని రాజ్‌కి అపర్ణ చెబుతుంది. కావ్యకి రాజ్ ఐ లవ్ యూ చెబుతుండగా కంపెనీ మేనేజర్ ఫోన్ చేయగా అపర్ణ ఆ ఫోన్ కట్ చేస్తుంది. దీంతో అతను సుభాష్‌కి ఫోన్ చేసి సిద్ధార్ధ్ బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేశారని అర్జెంట్‌గా రావాలని చెప్పడంతో సుభాష్ టెన్షన్ పడతారు. వెంటనే కావ్య ఆఫీసుకి చేరుకునేసరికి సిద్ధార్థ్ మాట్లాడుతుంటాడు. కంపెనీ లాభాల్లో లేదని నా చేతికి కంపెనీ అప్పగించాలని చెబుతాడు. దీనికి మిగిలిన డైరెక్టర్స్ అభ్యంతరం చెప్పడంతో నాకు ఫారిన్‌లో రూ.500 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందని ఇది బాగా చేస్తే మరో 1000 కోట్ల ప్రాజెక్ట్ మన కంపెనీకి వస్తుందని చెబుతాడు. కావ్య ఈ ప్రాజెక్ట్ డీల్ చేయలేదని ఎండీగా ఆమె దిగిపోవాలని.. రెండ్రోజుల్లోగా నాకంటే బెస్ట్ అని నిరూపించుకోవాలని కావ్యకి డెడ్‌లైన్ పెడతాడు సిద్ధార్ధ్.
జూలై 1వ తేదీ 762వ ఎపిసోడ్‌లో ...
బోర్డ్ మీటింగ్‌తో కావ్య టెన్షన్ పడుతుండగా మేనేజర్, శృతి వచ్చి ఈ కంపెనీని ఆ సిద్ధార్ధ్ చేతుల్లోకి వెళ్లకుండా కాపాడమని అడుగుతారు. ఇంతలో కావ్యకి యామిని ఫోన్ చేసి సిద్ధార్ధ్‌ను ఆఫీస్‌కు పంపించి.. కథ నడిపించింది నేనే అంటుంది యామిని. అలాగే తనకు వార్నింగ్ ఇచ్చిన అప్పూని పోలీస్ ఉద్యోగంలో నుంచి తప్పించడానికి యామిని కుట్ర చేస్తుంది. యామిని పంపించిన కుర్రాళ్లు గొడవపడుతున్నట్లు నటించి అప్పూని బురిడీ కొట్టిస్తారు. సిద్ధార్ధ్ నుంచి కంపెనీని కాపాడుకోవడానికి రాజ్ సాయం కోరుతుంది కావ్య. మా బాస్ ఫారిన్‌లో ఉన్నాడని.. ఆయనలాగా నటించి కంపెనీని, దానిని నమ్ముకున్న ఉద్యోగులను కాపాడమని రిక్వెస్ట్ చేస్తుంది కావ్య.

Photo Courtesy: JioHotstar
జూలై 2వ తేదీ 763వ ఎపిసోడ్‌లో ...
కొడుకు పుట్టినరోజు కావడంతో రేవతి తన పిల్లాడిని తీసుకుని షాపింగ్‌కు వస్తుంది. చెప్పుల షాపులో కొడుకు అడిగిన షూ కొనిపెట్టే స్తోమత లేక కన్నీటి పర్యంతమవుతుంది. ఇదంతా కారులో నుంచి రాజ్, కావ్యలు చూసి బాధపడతారు. రేవతికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఆమె ఇంటికి వెళ్తారు. రాజ్‌ను చూడగానే రేవతి అతనిని హగ్ చేసుకుంటుంది. నేను, మీకు ముందే తెలుసా? అని రాజ్ అడగ్గా.. దుగ్గిరాల కుటుంబంలో అందరూ ఊరిలో అందరికీ తెలుసునని కావ్య కవర్ చేస్తుంది. రేవతి కొడుకుతో కేక్ కట్ చేయించి బాబుకి వాళ్లు తీసుకొచ్చిన గిఫ్ట్ ఇవ్వడంతో ఆ చిన్నారి షూ చూసుకుని సంబరపడిపోతాడు. కొడుకు కళ్లలో ఆనందం చూసి రాజ్, కావ్యలకి రేవతి ఆమె భర్త థ్యాంక్స్ చెబుతారు. నన్ను మీ తమ్ముడు అనుకుని మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమని రాజ్ వాళ్లతో చెప్పి బయల్దేరతారు.
జూలై 3వ తేదీ 764వ ఎపిసోడ్‌లో ...
ఇంట్లో ఉన్న నగల్ని రాహుల్ ఎక్కడ కొట్టేస్తాడోనని భయపడి తన దగ్గర ఉన్న నగల్ని అప్పూకి ఇస్తుంది స్వప్న. మన కంపెనీలో వీటికి మెరుగు పెట్టిస్తే ఆ తర్వాత వాటిని బ్యాంక్‌లో పెడతానని చెబుతుంది స్వప్న. దుగ్గిరాల వారింటికి రాజ్ రాగానే నిన్నంతా ఎక్కడ తిరిగారు.. కావ్యతో ఏం చేశావ్? నీ మనసులోని మాటను చెప్పావా?లేదా? అని అడుగుతారు అపర్ణ, ఇందిర. కళావతిగారితో నా భవిష్యత్ గురించి మాట్లాడానని చెప్పడంతో మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తామని చెబుతారు పెద్దవాళ్లు. ఇంతలో కావ్య వచ్చి రాజ్‌ను లోపలికి తీసుకెళ్తుంది. రాజ్ పాత సూట్‌ని వేసి.. కంపెనీ ఎండీ ఎలా నడవాలో? ఎలా తినాలో ట్రైనింగ్ ఇస్తుంది. కావ్య దెబ్బకి రాజ్‌కు చెమటలు పడతాయి. చివరికి భోజనం ఎలా చేయాలో కూడా చెప్పడంతో రాజ్ అలిసిపోతాడు.

Photo Courtesy: JioHotstar
జూలై 4వ తేదీ 765వ ఎపిసోడ్‌లో ...
రాజ్‌కి కావ్య ఎండీగా ట్రైనింగ్ ఇస్తున్న విషయాన్ని పసిగట్టిన రుద్రాణి వెంటనే యామినికి చెప్పేస్తుంది. ఆ కావ్య ఏం చేసినా? ఎన్ని నాటకాలు ఆడినా మరేం పర్లేదని నేను చూసుకుంటానని చెబుతుంది యామిని. స్వప్న పాపని ఆడిస్తుండగా అప్పూ నగలు తీసుకుని సీరియస్‌గా వస్తుంది. జోక్ చేయడానికి నీకు నేనే దొరికానా? నీ వల్ల కంపెనీలో పరువు పోయిందని చెబుతుంది అప్పూ. ఈ నగలు గిల్ట్ నగలని అప్పూ చెప్పడంతో స్వప్న షాకై ఆమెకు అనుమానం వస్తుంది. ఈ నగల్ని రాహుల్ ముందే దొంగతనం చేసి అనుమానం రాకుండా డూప్లికేట్ నగలు పెడుతుండగా నాకు దొరికిపోయాడని చెబుతుంది. ఆ నగల్ని ఎవరికి ఇచ్చాడో కనుక్కోవాలని స్వప్న, అప్పూ ప్లాన్ చేస్తారు.
జూలై 5వ తేదీ 766వ ఎపిసోడ్‌లో ...
రాజ్ ఎండీ గెటప్‌లో కంపెనీకి రావడంతో అంతా షాక్ అవుతారు. రాజ్ ప్రవర్తన చూసి శృతికి ముచ్చెమటలు పడతాయి. వెంటనే కావ్యకి ఫోన్ చేసి ఆఫీస్‌లో జరిగినదంతా చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న కావ్య ఆగమేఘాల మీద ఆఫీసుకి పరుగులు తీస్తుంది. ఇంటి పేపర్లు తీసుకుని రాహుల్ తన ప్రియురాలి దగ్గరికి బయల్దేరగా అతనిని అప్పూ, స్వప్నలు ఫాలో అవుతారు. తన సెటప్‌కి ఇంటి పేపర్స్ ఇస్తుండగా రాహుల్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. అక్కడికక్కడే రాహుల్‌తో చీపురుకట్టతో చితకబాది.. అతని ప్రియురాలి నుంచి నగలు తీసుకుంటారు. ఆఫీస్‌లో అందరు ఉద్యోగులతో రాజ్ మీటింగ్ పెడతాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











