Brahmamudi weekly roundup: రేఖ దొంగ బంగారం ప్లాన్ అట్టర్ ఫ్లాప్.. ఇందూని, కంపెనీని కాపాడిన రాజ్

Photo Courtesy: JioHotstar

మనందరి కోసం నేను సీఈవో అవ్వాలని అనుకుంటున్నానని తను కట్లు విప్పితే ఆఫీస్‌కి వెళ్తానని ఐశ్వర్యకి చెబుతుంది ఇందూ. బోర్డ్ మీటింగ్‌లో రాజ్‌కు ఇద్దరు, రేఖకి ఇద్దరు సపోర్ట్ చేయగా.. పరంధామయ్య ఎవరికి ఓటు వేస్తే వాళ్లే సీఈవో అవుతారు. ఇందూ రాకపోవడంతో తనకి టైం కావాలని అడుగుతాడు పెద్దాయన. రౌడీలను చితక్కొట్టి ఇందూని విడిపించి పది నిమిషాల్లో ఆఫీస్‌కి తీసుకెళ్తాడు పొదరిల్లు నారాయణ. వెంకీకి డెలవరీ బాయ్‌గా ఉద్యోగం ఇప్పిస్తుంది నందూ. రాజ్‌ని సీఈవో కాకుండా ఉండటానికి ఇందూకి సపోర్ట్ చేసి ఆమెను సీఈవోని చేస్తుంది రేఖ. రేఖ చేతిలో కీలుబొమ్మ కావొద్దని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. దొంగ బంగారాన్ని స్వరాజ్ గ్రూప్‌లోకి చేర్చడానికి ఇందూతో వేలిముద్రలు వేయించాలనుకున్న ప్లాన్‌ని రాజ్ భగ్నం చేస్తాడు. తనకు పర్మిషన్ లేకుండా నా భార్య ఏ వేలిముద్రలు వేయొద్దని చెబుతాడు రాజ్. తమ ప్లాన్ ఫెయిల్ కావడంతో రేఖ రగిలిపోతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup June 8th to June 13th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి జూన్ 8వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు .. 1053వ ఎపిసోడ్ నుంచి 1058వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

జూన్ 8వ తేదీ 1053వ ఎపిసోడ్‌లో ..
నేను మనందరి కోసం సీఈవో అవ్వాలని అనుకుంటున్నాను.. అర్ధం చేసుకోమని ఇందూ చెబుతుంది. మీ అమ్మ కూడా అందరి కోసం అని చెప్పి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసేదని ఐశ్వర్య అనడంతో మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. నువ్వు ఎంత ఏడ్చినా, అరిచినా నిన్ను మాత్రం వదిలిపెట్టను.. నా నుంచి నిన్ను ఎవరూ కాపాడలేరని అంటుంది ఐశ్వర్య. ఈ మాటలన్నీ విన్న తాగుబోతు నారాయణ.. నేను కాపాడతానని అనుకుంటాడు. ఎంతసేపటికీ ఇందూ రాకపోవడంతో రేఖ టెన్షన్ పడుతుంది. తనకు సపోర్ట్ చేస్తే కంపెనీకి లాభాలు తీసుకొస్తానని చెబుతుంది. దాంతో ఇద్దరు బోర్డ్ మెంబర్స్ రేఖకి సపోర్ట్ చేస్తారు. ఈ రాజ్‌కి కంపెనీ గురించి, బిజినెస్ గురించి ఏం తెలియదని అంటుంది. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా మొత్తం తెలుసుకుని నేను కూడా ప్రాఫిట్స్‌లోకి తీసుకురాగలనని చెప్పడంతో ఇద్దరు బోర్డ్ మెంబర్స్ రాజ్‌కి సపోర్ట్ చేస్తాడు. సమానంగా ఓట్లు రావడంతో పరంధామయ్య మద్ధతు ఎవరికీ అనేది ఉత్కంఠగా మారుతుంది. నా నిర్ణయం తర్వాత చెబుతానని సస్పెన్స్‌లో పెడతాడు పెద్దాయన. రౌడీల దగ్గర మందు తాగి వాళ్లని చితక్కొట్టి ఇందూ, ఐశ్వర్యల దగ్గరికి వెళ్తాడు తాగుబోతు నారాయణ.

జూన్ 9వ తేదీ 1054వ ఎపిసోడ్‌లో..
ఇందూని విడిపించుకుని తీసుకెళ్తానని తాగుబోతు నారాయణ చెప్పడంతో అతనిపై సీరియస్ అవుతుంది ఐశ్వర్య. ఊరుకోక ఏం చేస్తావు.. నీ రౌడీలతో కొట్టిస్తావా? బయట ఇద్దరు పడిపోయారు, లోపల ఒకడు పడిపోయాడు.. నీ రౌడీలు నన్నేం చేయలేరని ఇందూ కట్లు విప్పేస్తాడు. ఇంకో 10 నిమిషాలలో నువ్వు అక్కడికి వెళ్లేసరికి సీఈవోని ఎన్నుకుంటారని ఐశ్వర్య అంటుంది. 10 నిమిషాలలో నువ్వు కారులో కూడా వెళ్లలేవని చెప్పడంతో అక్కడే ఉన్న బైక్‌పై ఇందూని జెట్ స్పీడ్‌తో ఆఫీస్‌కి తీసుకెళ్తాడు నారాయణ. మీ సపోర్ట్ ఎవరికి రాజ్‌కా? నాకా అని రేఖ అడగటంతో టెన్షన్ పడతాడు పరంధామయ్య. ఇంతలో ఇందూ రావడంతో ఈ అమ్మాయి కావ్యలా ఉంది.. నా సపోర్ట్ ఈమెకు అని చెబుతాడు పెద్దాయన. దాంతో రాజ్‌ని సీఈవో కాకుండా చేయడానికి ఇందూని సీఈవో చేయడానికి ఒప్పుకుంటుది రేఖ. చివరికి అందరి సపోర్ట్‌తో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి సీఈవోగా ఇందూ ఎన్నిక అవుతుంది. కారులో వస్తుండగా నేను టైంకి రాకపోతే నువ్వు సీఈవో అవుదామని ప్లాన్ చేశావట అని రాజ్‌పై మండిపడుతుంది ఇందూ. వెంకీని డెలివరీ బాయ్‌ ఉద్యోగంలో చేర్పించడానికి ఓ చోటికి తీసుకొస్తుంది నందూ.

Brahmamudi Telugu Serial Weekly roundup June 8th to June 13th episode Story

Photo Courtesy: JioHotstar

జూన్ 10వ తేదీ 1055వ ఎపిసోడ్‌లో..
వెంకీకి డెలివరీ బాయ్‌గా ఉద్యోగం ఇప్పిస్తుంది నందూ. సీఈవోగా గెలిచి ఇంటికొచ్చిన ఇందూకి అపర్ణ దిష్టి తీసి లోపలికి పిలుస్తుంది. మనమే ఇందూని సీఈవోని చేశామని తెలియక ముసల్ది పొంగిపోతుందని రేఖతో అంటుంది భ్రమరాంబ. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది.. మీ అమ్మానాన్నలు కంపెనీని ఎంత గొప్పస్థాయికి తీసుకెళ్లారో నువ్వు కూడా అలాగే కంపెనీని నడిపించాలని చెబుతుంది అపర్ణ. నేను పక్కనే ఉండి ఇందూకి తోడుగా ఉంటాను, కంపెనీని లాభాల బాటలో నడిపిస్తానని అంటాడు రాజ్. నువ్వు కూడా సీఈవో అవ్వాలని ట్రై చేశావు కదా? ఏం జరిగిందని అడుగుతుంది భ్రమరాంబ. రేఖ పిన్ని టాలెంట్ ముందు, ఆమె పవర్ ముందు నేను నిలబడలేకపోయా ఆమెకి ఫ్యాన్ అయిపోయానని అంటాడు రాజ్. నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తాను దాని మీద వేలిముద్రలు వేయమని రేఖ చెప్పగా ఇందూ సరేనని అంటుంది. ఇన్నాళ్లూ నువ్వు సీఈవో కావాలని కలలు కన్నది, నిన్ను కష్టపడి చదివించింది ఆ రేఖ చేతిలో కీలు బొమ్మ కావడానికి కాదని ఇందూకి క్లాస్ పీకుతుంది అపర్ణ.

జూన్ 11వ తేదీ 1056వ ఎపిసోడ్‌లో..
మీరంతా మీ మనవరాలిని అమాయకురాలని అనుకుంటున్నారు.. కానీ తనను సీఈవోని చేసేలా పరిస్ధితులు క్రియేట్ చేసింది ఇందూనే అని అంటాడు రాజ్. నేను రాజ్, కావ్యల కూతురిని, మీ మనవరాలిని.. నాలో ప్రవహించేది దుగ్గిరాల రక్తం.. మన కంపెనీలని, మనవాళ్లని నేనే కాపాడుకుంటానని చెబుతుంది ఇందూ. సీఈవో అంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి, నిన్ను వెనక్కి లాగడానికి ఎంతోమంది ప్రయత్నిస్తారు.. వాటి నుంచి నీకు నువ్వే కాపాడుకోవాలని మనవరాలికి సలహా ఇస్తాడు సుభాష్. తనను కిడ్నాప్ చేసినందుకు ఐశ్వర్యని లాగిపెట్టి కొడుతుంది ఇందూ. ఇకపై నీ అప్పు నువ్వు తీర్చుకో, రేఖ ఆంటీ దగ్గరి నుంచి నీకు పైసా కూడా రానివ్వనని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. ఆ ఇందూని సీఈవో చేసినందుకు భ్రమరాంబ, భూషణ్‌లు రేఖపై మండిపడతారు. సింగపూర్ గ్రూప్ వాళ్లు ఇచ్చే దొంగ బంగారాన్ని మన కంపెనీలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాను, ఇందూతో డాక్యుమెంట్స్‌పై వేలిముద్రలు వేయిస్తే తనే ఇరుక్కుంటుందని అంటుంది రేఖ.

Brahmamudi Telugu Serial Weekly roundup June 8th to June 13th episode Story

Photo Courtesy: JioHotstar

జూన్ 12వ తేదీ 1057వ ఎపిసోడ్‌లో..
సీఈవో పదవి చేజారిపోవడంతో బాధపడుతున్న రాజ్‌కి మందు పోస్తాడు శేషం. ఇద్దరూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇందూ దగ్గరికి వచ్చిన రేఖ.. నేను చెప్పిన డీల్ కోసం నీ వేలిముద్రలు వేయాలని చెప్పి పేపర్స్ ఇస్తుంది. అదంతా చదివిన ఇందూకి రేఖ ప్లాన్ ఏంటో అర్ధమవుతుంది. సంతకం పెడితే కంపెనీ పేరు పోవడంతో పాటు భారీగా నష్టం వస్తుందని గ్రహిస్తుంది. కానీ రేఖ వేలిముద్రలు వేస్తావా లేదా అని బెదిరించడంతో ఎలా ఆపాలో తెలియక టెన్షన్ పడుతుండగా రాజ్ పీకలదాకా తాగి గొడవ చేస్తాడు. భార్య సర్పంచ్ అయితే ఆమె భర్త ముందుగా పేపర్స్ చదివి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయంటేనే సంతకం పెట్టిస్తాడు. ఇప్పుడు నేను కూడా అంతే. ఇందూ సంతకం చేయడానికి ముందు అన్ని పేపర్స్ నేనే చూడాలి, నా పర్మిషన్ కావాలని మండిపడతాడు. రేఖ ఇచ్చిన డాక్యుమెంట్స్ చదివిన రాజ్‌కి మొత్తం అర్ధమైపోతుంది. ఆ విషయాన్ని చెప్పగా అంతా షాక్ అవుతారు. రేఖ బారి నుంచి వేలిముద్రలు వేయకుండా రాజ్ కాపాడటంతో ఇందూ సంతోషిస్తుంది.

జూన్ 13వ తేదీ 1058వ ఎపిసోడ్‌లో..
నా భార్యతో వేలిముద్రలు వేయించి కంపెనీకి నష్టాలు తీసుకొద్దామని అనుకుంటున్నారా? ఆమెను సీఈవో పనికి రాదనే ముద్ర వేసి తప్పించాలని చూస్తారా అంటూ రేఖపై మండిపడతాడు రాజ్. ఈ డీల్‌కి నేను ఒప్పుకోనని రాజ్ చెప్పగా.. మా రేఖ ఆంటీ అన్నీ ఆలోచించే ఇలా చేస్తుందని చెబుతుంది ఇందూ. అయితే కంపెనీ ఛార్టెర్డ్ అకౌంటెంట్‌ని పిలిపించు ఆయన ఓకే చెబితే ఎక్కడ కావాలంటే అక్కడ వేలిముద్రలు వేసుకోమని చెబుతాడు. ఆ మాటలతో రేఖ, భూషణ్‌లు ఏదో కవర్ చేయాలని చూస్తుండగా.. ఛార్టెర్డ్ అకౌంటెంట్ వచ్చే వరకు ఈ డీల్ జరగదని చెప్పి డాక్యుమెంట్స్ చింపేస్తాడు. డీల్‌ని ఆపేసి కంపెనీని కాపాడాడని తనిని ఇందూ హత్తుకుని ఐ లవ్ యూ చెబుతున్నట్లు, ముద్దు పెడుతున్నట్లు కల కంటాడు రాజ్. ఇంతలో ఇందూ వచ్చి ఊహించుకున్నది చాలని క్లాస్ పీకి నేలపై పడుకోబెడుతుంది. రాజ్‌తో కలిసి మందు తాగిన శేషానికి చన్నీటితో స్నానం చేయిస్తుంది భ్రమరాంబ. డెలివరీ బాయ్ ఉద్యోగానికి వెళ్తున్న వెంకీ బాగా రెడీ అవుతాడు. అయితే క్యారియర్ వద్దని కిచెన్‌లో భోజనం పెడతారని చెప్పడంతో చలపతి, లక్ష్మీలు షాక్ అవుతారు. నేను డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నానని తెలియకూడదని అనుకుంటాడు వెంకీ. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X