Brahmamudi weekly roundup: రాజ్ గుండెల్లో కావ్య .. యామిని పెళ్లి చెడగొట్టడానికి కనకం స్కెచ్
Photo Courtesy: JioHotstar
పెళ్లి కొంతకాలం వెయిట్ చేయమని రాజ్ అడగటంతో యామిని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి రాజ్ ఓకే చెబుతాడు. రాజ్ మనింటికి రాడని యామినితో పెళ్లికి రెడీ అవుతున్నాడని రుద్రాణి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. దుగ్గిరాల వారింటికి వచ్చిన యామిని రాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నానని కావ్యకి బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది యామిని. బ్రహ్మ వేసిన ముడిని ఎవ్వరూ విప్పలేరని యామినితో రాజ్ పెళ్లి జరగదని తేల్చి చెబుతుంది కావ్య. యామినిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కావ్య చెప్పాలని రాజ్ ఎంతో ప్రయత్నిస్తాడు.
యామిని ఇంటికి దుగ్గిరాల ఫ్యామిలీ రావడంతో రాజ్ షాక్ అవుతాడు. యామిని బ్లాక్‌మెయిల్ చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నట్లు అపర్ణ- ఇందిరకి చెబుతాడు రాజ్. పెళ్లిని ఆపడానికి కళ్యాణ్ - అప్పూలు ఏర్పాట్లు చేస్తారు. ప్లాన్ ప్రకారం పెళ్లి రాటను విరగ్గొట్టడంతో అక్కడే ఉన్న ముత్తయిదువలు ఈ పెళ్లి జరగకూడదని అంటారు. అమ్మవారికి పూజ చేస్తే ఎలాంటి విఘ్నాలు ఉండవని పంతులు చెప్పడంతో అతనిని కనకం సాయంతో ట్రాప్ చేస్తారు అపర్ణ, ఇందిర. యామిని బ్లాక్ మెయిల్ చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నానని కావ్యకి చెబుతాడు రాజ్. గదిలో ఇరుక్కుపోయిన రాహుల్- రుద్రాణిలు ఎలా బయటపడాలా అని ఎదురుచూస్తుంటారు.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి జూన్ 9వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు .. 743 ఎపిసోడ్ నుంచి 748 వరకు ఏం జరిగిందంటే?
జూన్ 9వ తేదీ 743వ ఎపిసోడ్‌లో ...
యామిని ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండటంతో ఆలస్యం చేయడం మంచిది కాదనుకున్న రాజ్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెబుతాడ. ఆ మాటలతో యామిని అతని తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఆ వెంటనే బావ లేని జీవితం నాకొద్దంటూ కత్తితో మణికట్టు నరం కట్ చేసుకుంటుంది. దాంతో రాజ్ ఆమెను లాగికొట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. నువ్వు కాదు అని చెబితే నా కూతురు బతకదని రఘునాథ్ - వైదేహిలు చెప్పడంతో రాజ్ తప్పనిసరి పరిస్ధితుల్లో పెళ్లికి ఓకే చెబుతాడు. రాజ్ కోసం ఎదురుచూస్తున్న దుగ్గిరాల ఫ్యామిలీకి అతను ఎంతకు రాకపోవడంతో కంగారు పడతారు. ఇంతలో రుద్రాణి వచ్చి రాజ్ ఎప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయడని యామినితో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడని చెప్పడంతో ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. ఈ విషయం నీకెలా తెలుసని అడగ్గా.. మనింటికి ఆ యామిని వచ్చి కార్డ్ ఇచ్చింది కదా అని అంటుంది రుద్రాణి.
జూన్ 10వ తేదీ 744వ ఎపిసోడ్‌లో ...
కావ్య ఫోన్ చేస్తే రాజ్ ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడని అనుకున్న అపర్ణ, ఇందిరలు ఆమె రూమ్‌కి వెళ్లేసరికి కళావతి తీరిగ్గా ఐఎస్‌క్రీమ్ తింటూ కనిపిస్తుంది. కావ్యకి ఫోన్ చేసిన యామిని.. రాజ్‌తో నా పెళ్లి త్వరలోనే జరగబోతోందని చెబుతుంది. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నావంటే? భయపడ్డావా? అని కావ్య ఎగతాళి చేసింది. నాకేం భయం లేదని రేపే మీ ఇంటికి వచ్చి బొట్టు పెట్టి పిలుస్తానని చెబుతుంది యామిని. డూప్లికేట్ నగల్ని బ్యాంక్ లాకర్‌లో పెడతానని స్వప్న చెప్పడంతో తన దొంగతనం విషయం బయటపడుతుందని రాహుల్ కంగారుపడతాడు. ఫంక్షన్స్ పేరు చెప్పి స్వప్నని డైవర్ట్ చేస్తాడు. దుగ్గిరాల వారింటికి వైదేహి.. యామిని వస్తారు. మా బావతో రేపు నా పెళ్లి జరగబోతోందని మీరంతా తప్పకుండా రావాలని కావ్యకి బొట్టు పెట్టి పిలుస్తుంది. మా ఫ్యామిలీ అంతా ఖచ్చితంగా నీ పెళ్లికి వస్తామని కావ్య చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది.

Photo Courtesy: JioHotstar
జూన్ 11వ తేదీ 745వ ఎపిసోడ్‌లో ...
కావ్యతో పాటు దుగ్గిరాల కుటుంబాన్ని పెళ్లికి పిలవడంపై యామినిపై కోప్పడుతుంది వైదేహి. వాళ్లు పెళ్లిలో ఎలాంటి తిక్క వేషాలు వేయరని.. రాజ్‌కి గతం గుర్తుచేస్తే ఏం జరుగుతుందో కావ్యకి తెలుసని తల్లికి ధైర్యం చెబుతుంది యామిని. ఆ పెళ్లికి మమ్మల్ని ఎందుకు తీసుకోస్తానని చెప్పావని కావ్యపై సుభాష్ కోప్పడతాడు. ఆ దేవుడు వేసిన బ్రహ్మముడిని ఎవ్వరూ విప్పలేరని, రాజ్- యామినిల పెళ్లి ఎట్టి పరిస్ధితుల్లో జరగదని తేల్చిచెబుతుంది కావ్య. యామినిని పెళ్లి చేసుకోబోతున్న విషయం చెప్పాలని ఫోన్ చేయగా రాజ్‌ని తిట్టి పెట్టేస్తుంది కావ్య. డైరెక్ట్‌గా తేల్చుకోవాలని రాజ్ బయల్దేరుతుండగా యామిని అడ్డుకుంటుంది. ఉదయాన్నే రుద్రాణి వచ్చి పెళ్లికి రెడీ అవ్వలేదా అని అపర్ణ, ఇందిరలను అడుగుతుంది. రాహుల్, రుద్రాణిలు యామిని ఇంటికి వస్తే మనం వేసే ప్లాన్స్ చెడగొడతారని ఇందిర చెప్పడంతో వాళ్ల సంగతి నేను చూసుకుంటానని చెబుతుంది స్వప్న.
జూన్ 12వ తేదీ 746వ ఎపిసోడ్‌లో ...
పెళ్లికి లేట్ అవుతుందని త్వరగా వెళ్లకపోతే ఆ యామిని మనల్ని చంపేస్తుందని రాహుల్‌తో గొడవ పడుతుంది రుద్రాణి. ఇంతలో తల్లీకొడుకుల్ని రూమ్‌లో పెట్టి తాళం వేస్తుంది స్వప్న. డోర్ రాకపోవడంతో బయటి నుంచి ఎవరో లాక్ చేశారని రుద్రాణికి చెబుతాడు రాహుల్. కావ్యకి ఎలాగైనా తన పెళ్లి విషయం చెప్పాలని రాజ్ బయల్దేరుతుండగా యామిని అడ్డుపడుతుంది. సరిగ్గా అదే సమయంలో కావ్యతో సహా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ప్రత్యక్షం కావడంతో రాజ్ షాక్ అవుతాడు. తన పెళ్లిని దగ్గరుండి జరిపించాలని కావ్యని తీసుకుని పక్కకి వెళ్తుంది యామిని. అపర్ణ, ఇందిరలు రాజ్‌ను పక్కకి తీసుకెళ్లి కావ్యకి అన్యాయం చేస్తావా అని నిలదీస్తారు. యామిని చనిపోతానని బ్లాక్‌మెయిల్ చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నానని రాజ్ చెబుతాడు.

Photo Courtesy: JioHotstar
జూన్ 13వ తేదీ 747వ ఎపిసోడ్‌లో ...
యామిని- రాజ్‌లు పెళ్లి ఆపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అప్పూ- కళ్యాణ్‌లు చెబుతారు. ముత్తయిదువుల గెటప్‌లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులను పిలుస్తాడు కళ్యాణ్. అనుకున్న విధంగానే పెళ్లి రాట విరిగేలా ప్లాన్ చేశామని వాళ్లు చెబుతాడు. పెళ్లి రాటకు పూజ చేస్తుండగా ప్లాన్ దానిని అప్పూ మనుషులు విరగ్గొడతారు. ఆ వెంటనే ముత్తయిదువల గెటప్‌లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు ఇలా జరగడం అరిష్టమని, వెంటనే ఈ పెళ్లి ఆపేయాలని అంటారు. అపర్ణ - ఇందిరలు కూడా ఇదే మాట చెబుతారు. దాంతో పెళ్లి జరిపిస్తున్న శాస్త్రి జోక్యం చేసుకుని అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి జరుగుతుందని చెబుతాడు. దాంతో అపర్ణ- ఇందిరలు శాస్త్రిపై రగిలిపోతారు. శాస్త్రి బుద్ధి చెప్పగలిగింది కనకం మాత్రమేనని అనుకోగా కనకం వాళ్ల ముందు ఆమె ప్రత్యక్షం అవుతుంది. అల్లుడుగారిని మరో ఆడది పెళ్లి చేసుకునే వరకు ఎందుకు తెచ్చుకున్నావని కావ్యపై కనకం మండిపడుతుంది. ఈ పెళ్లిలో నువ్వేం పిచ్చి ప్లాన్లు వేయొద్దని తల్లికి వార్నింగ్ ఇస్తుంది కళావతి.
జూన్ 14వ తేదీ 748వ ఎపిసోడ్‌లో ...
ఆ పంతులు మా కాలనీలోనే ఉంటాడని అతనికి కనకాంబరం అంటే వీక్ నెస్ ఉందని కనకం చెబుతుంది. పూజలో ఉన్న శాస్త్రి దగ్గరికి అపర్ణ- ఇందిరలు వచ్చి కనకాంబరం మీకోసం పైన గదిలో ఉందని చెబుతారు. ఎంతో ఆశతో పైకి వెళ్లి చూసిన శాస్త్రికి కనకం కనిపిస్తుంది. ఆలోపు ఇందిర, అపర్ణలు వచ్చి ఈ పెళ్లి ఆపితే బోల్డంత డబ్బు ఇస్తామని ఆశపెడతారు. డబ్బుతో నన్ను కొనలేరని శాస్త్రి చెప్పగా.. ఇందిరను బెదిరించినట్లుగా ఉన్న వీడియోలు తీస్తుంది కనకం. మేం చెప్పినట్లు చేయకపోతే మీ ఆవిడకు చూపిస్తామని బెదిరించడంతో పెళ్లి ఆపడానికి ప్లాన్ చెబుతాడు శాస్త్రి. యామిని బ్లాక్‌మెయిల్ చేయడంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నానని కావ్యకు చెబుతాడు రాజ్. ఎవరు బెదిరిస్తే వాళ్లని పెళ్లి చేసుకుంటారా? అని కావ్య నిలదీస్తుంది. రూమ్‌లో ఇరుక్కుపోయిన రాహుల్‌కు బాగా ఆకలి వేయడంతో తలుపు తీయమని స్వప్నను అడుగుతాడు. ఇంతలో రుద్రాణికి యామిని ఫోన్ చేసి పెళ్లికి త్వరగా రమ్మని చెబుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











