Brahmamudi Weekly Roundup: దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన అనామిక.. బెడిసి కొట్టిన రాజ్ ప్లాన్!

బ్రహ్మముడి సీరియల్‌లో గత వారం ఇంటి నుంచి వెళ్లిపోతున్న అపర్ణను ఓ కారణం చెప్పి కావ్య ఆమెను ఇంటి నుంచి వెళ్లకుండా ఆపుతుంది. బిడ్డకు తల్లి ఎవరో తెలుసుకొనే ప్రయత్నంలో కావ్యను కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఆ బిడ్డకు తల్లి మాయ అని తెలుస్తుంది. అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత నా బిడ్డకు తండ్రి రాజ్ అంటూ ఆమె షాక్ ఇస్తుంది. దాంతో రాజ్ కి మాయ కి పెళ్లి చేస్తానంటుంది సుమిత్ర. కావ్య చేసిన పనికి అందరూ ఆమెని మందలిస్తారు. జూన్ 3వ తేదీ నుంచి జూన్ 8 వ తేదీ వరకు.. 426 ఎపిసోడ్ నుంచి 431 వరకు ఏం జరిగిందంటే?

జూన్ 3 వ తేదీ 426 ఎపిసోడ్‌లో..

కావ్య ని తప్పుపడుతున్న అనామికతో బంధం విలువ నీకు అంతే తెలుసు, విడగొట్టుకోవడం సులువు కానీ అదే బంధాన్ని నిలుపుకోవటం చాలా కష్టం అది నీకు ఎప్పటికీ అర్థం కాదు అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మరోవైపు రాజ్ గదిలోకి వెళ్లలేనందుకు బాధపడుతుంది మాయ ఆమెని ఓదార్చుతూ ఉంటుంది రుద్రాణి అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య మాయ చేతిలో బిడ్డను పెట్టి బిడ్డ తల్లిగా హక్కులు కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదు అంటూ ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. మరోవైపు రాజ్ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తుంది అపర్ణ. మరోవైపు మాయ ఇల్లు దొరికిందని అప్పు కావ్య కి ఫోన్ చేస్తుంది. ఆ మాటలు విన్న ఫాలో అవుతుంది. మరోవైపు పాపని సముదాయించలేక అవస్థలు పడుతున్న మాయని ఇంట్లో వాళ్ళందరూ మందలిస్తారు కానీ ఆమెని వెనకేసుకొస్తుంది.

Brahmamudi Telugu Serial Weekly Roundup june3rd to June 8th episode Story

జూన్ 4 వ తేదీ 427 ఎపిసోడ్‌లో..

సీతారామయ్య దంపతుల దగ్గరికి వస్తుంది స్వప్న ఇంటి కోడలికి అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అని అడుగుతుంది కానీ సమస్య వారి చేయి దాటిపోయిందని వాళ్ళ మాటల ద్వారా అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆపు దగ్గరికి వచ్చినా కావ్య రాజ్ వాళ్ళని ఫాలో చేస్తున్నాడని గ్రహించి అతనికి నిజం తెలియకూడదని తిప్పిన చోటే తిప్పించి అతనిని ముప్పతిప్పలు పెడుతుంది. మరోవైపు తండ్రి అప్పుల ఊబిలో కూలిపోయాడని అర్జెంటుగా పది లక్షలు డబ్బు కావాలని అనామికకి తల్లి ఫోన్ చేస్తుంది కోప్పడుతూనే అరేంజ్ చేస్తాను అంటుంది అనామిక ఆ మాటలు వింటుంది స్వప్న అన్ని డబ్బులు ఎలా వస్తాయి అనుకుంటుంది. అయితే భర్త చెక్ ని దొంగతనం చేస్తుంది అనామిక, అదంతా స్వప్న చూస్తుంది కానీ ఏమీ తెలియనట్లు పక్కకు వెళ్లి దాక్కుంటుంది. మరోవైపు రాజ్ కావ్యని ఫాలో అవుతూనే ఉంటాడు.

జూన్ 5 వ తేదీ 428 ఎపిసోడ్‌లో...

భర్త పడుతున్న అవస్థలు చూడలేక అతని దగ్గరికి వెళ్లి కాయగూరలు కొనుక్కోవటానికి వచ్చాను మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. నువ్వు అబద్దం చెప్తున్నావని నాకు తెలుసు అంటూ ఆమెని కోప్పడే వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు అనామిక దగ్గర చెక్ లాక్కొని ఆమెని ఇంట్లో అందరి ముందు దోషి లా నిలబెడుతుంది స్వప్న. ఇంట్లో అందరూ అనామిక అని మందలిస్తారు. కళ్యాణ్ కూడా కోప్పడతాడు. అయితే ధాన్యలక్ష్మి మాత్రం కోడల్ని వెనకేసుకొస్తుంది. మరోవైపు మాయ ఇంటికి వచ్చిన కావ్య వాళ్ళ ని ఇప్పుడే క్యాంప్ నుంచి వచ్చిన మాయ గుర్తు పట్టి భయపడుతుంది. ఇదంతా కావ్యని ఫాలో అవుతున్న రుద్రాణి చూస్తుంది ఎలా అయినా మాయని వాళ్ళకి దొరక్కుండా చూడాలి అనుకుంటుంది.

జూన్ 6వ తేదీ 429 ఎపిసోడ్‌లో...

కావ్య వాళ్ళకి దొరక్కుండా పరిగెడుతున్న మాయని కారుతో గుద్దించేస్తుంది రుద్రాణి అపస్మారక స్థితిలో ఉన్న మాయని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు కావ్య, అప్పు. మరోవైపు రాజ్ దొంగ మాయ గురించి నిజం తెలుసుకుంటాడు. నీ పని చెప్తాను అనుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు. మరోవైపు అపస్మారక స్థితిలో ఉన్న మాయాని చూసి ఏడుస్తుంది కావ్య. రేపు ఈ మాయ నిజం చెప్పకపోతే మీ బావ పెళ్లి ఆపలేను అంటుంది. మాయా పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్తుంది డాక్టర్. మరింత బాధపడుతుంది కావ్య. మరోవైపు కోడలు చెంప పగలగొట్టి మరొకసారి ఇలాంటి పని చేస్తే నేను నిన్ను వెనకేసుకొని రాను అని హెచ్చరిస్తుంది ధాన్యలక్ష్మి. మాయ ( చిత్ర ) దగ్గరికి వచ్చిన రాజ్ నీ గురించి నిజం తెలిసిపోయింది మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపో లేదంటే నీ తండ్రిని అరెస్టు చేస్తాను అని బెదిరిస్తాడు. మరోవైపు ఇంటికి వచ్చిన కావ్యతో మాయతో రాజ్ పెళ్లి జరిపిస్తానని సవాలు చేస్తుంది రుద్రాణి జరగనివ్వను అని సవాల్ చేస్తుంది కావ్య. కావ్య ఇంట్లోకి వచ్చేసరికి అందరూ చీరలు సెలెక్ట్ చేయడం చూసి షాక్ అయిపోతుంది.

జూన్ 7 వ తేదీ 430 ఎపిసోడ్‌లో....

బాధగా ఉన్న కావ్యతో నువ్వు కూడా చీరలు కొనుక్కో అని వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణి. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న అత్తకి చివాట్లు పెడుతుంది. మాయని కూడా చీరలు తీసుకోమంటుంది రుద్రాణి కానీ ఆమె తీసుకోవటానికి భయపడుతుంది. ఆ తర్వాత రుద్రాణి కొత్త కోడలికి ఏమి ఇవ్వవా అంటూ కావ్య నగలు అపర్ణ ద్వారా మాయకి ఇచ్చేలా చేస్తుంది రుద్రాణి. నగలు ఇచ్చినందుకు కావ్యను కోప్పడుతుంది చిట్టి. తర్వాత భార్య దగ్గరికి వచ్చిన రాజ్ మాయ సంగతి చెప్పి నువ్వేమీ బాధపడకు ఈ పెళ్లి జరగదు అని సర్ది చెప్తాడు. మరోవైపు బట్టలు సర్దుకుంటున్న మాయ ని ఏం జరిగింది అని అడుగుతుంది రుద్రాణి. జరిగిందంతా రుద్రానికి చెప్తుంది మాయ. ఇంతవరకు వచ్చాక ఇప్పుడు నిన్ను ఎలా వెళ్ళనిస్తామనుకున్నావు అంటాడు రాహుల్.

Brahmamudi Telugu Serial Weekly Roundup june3rd to June 8th episode Story

జూన్ 8వ తేదీ 431 ఎపిసోడ్‌లో..

ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటున్న మాయని ఆపే ప్రయత్నం చేస్తారు రాహుల్,రుద్రాణి కానీ వెళ్ళిపోతానని మొండికేస్తుంది చిత్ర. తర్వాత తులసి కోట దగ్గర పూజ చేస్తున్న మాయన చూసి షాక్ అవుతాడు రాజ్. రాజ్ ని చూసిన ఇందిరా దేవి కావ్యకి అన్యాయం చేస్తున్నావంటూ మనవడిని మందలిస్తుంది. రాజ్ ఏమి మాట్లాడకపోవడంతో నీ మౌనమే నాకు సమాధానం ఇకమీదట మీ జీవితంలో జోక్యం చేసుకోను అంటు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత తన దగ్గరికి వచ్చిన రాజ్ తో మా నాన్న మలేషియా వెళ్ళిపోయాడు మీ ఇంట్లో అక్కడ పని చేయదు కాబట్టి మీరు పెళ్ళికి సిద్ధంగా ఉండండి అని రాజ్ కి షాక్ ఇస్తుంది మాయ. మాయ దగ్గర కొడుకుని చూసిన సుమిత్ర దానికి బుద్ధి లేకపోయినా నీకు బుద్ధి ఉండాలి కదా అని కొడుకుని మందలిస్తుంది. మరోవైపు పెళ్లికి రెడీ అవుతున్నందుకు ధాన్యలక్ష్మిపై ఫైర్ అవుతాడు ప్రకాష్ . మరోవైపు నిస్సహాయ స్థితిలో ఉన్న రాజ్ నన్ను ఈ సమస్య నుంచి నువ్వే గట్టెక్కించాలి అనే భార్యని బ్రతిమాలుకుంటాడు. మీరు ప్రశాంతంగా ఉండండి అనే భర్తకి ధైర్యం చెప్తుంది కావ్య. మరోవైపు కావ్యతో ఫోన్లో మాట్లాడిన డాక్టర్ హైడోస్ ఇంజక్షన్ ఇస్తే స్పృహ లోకి వస్తుంది అని చెప్తారు ఇంజక్షన్ చేయమని చెప్తుంది కావ్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X