Brahmamudi weekly roundup: రేఖకి ఇందూ షాక్.. చీటింగ్‌తో స్వరాజ్ జల్సాలు, రేఖ కాళ్లపై పడ్డ అపర్ణ
Photo Courtesy: JioHotstar
ఇందూని అనుభవించాలనుకున్న రాఖీ ప్లాన్‌ని స్వరాజ్ చెడగొడతాడు. మత్తులో ఉన్న ఐశ్వర్యని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమెను ఇందూ, స్వాతిలు కలిసి విడిపిస్తారు. రేఖ నిలదీయడంతో స్వాతి ఓ స్టోరీ చెప్పి ఇందూని కాపాడుతుంది. తన బైక్‌కి ఫైన్ కట్టడానికి తమ్ముడిని బకరా చేస్తాడు స్వరాజ్. మీ అమ్మనాన్నల వల్ల మా నానమ్మ, నాన్నలు చనిపోయారని నువ్వంటే నాకు అసహ్యమని ఇందూని అంటుంది ఐశ్వర్య. శివరామ్ ఇంట్లో వంట చేయడానికి వెళ్తున్నట్లుగా వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది ఇందూ. ఇంటర్వ్యూకి వెళ్తుండగా రాజ్ ఢీ కొట్టడంతో ఇందూ ఫోన్ పగిలిపోతుంది. దీంతో కొత్త ఫోన్ కొనిస్తాడు స్వరాజ్. టైంకి ఇంటర్వ్యూకి రాకపోవడంతో అవకాశం కోల్పోతుంది ఇందూ. రేఖ పేరు మీదున్న పవరాఫ్ అటార్నీని ఇందూ పేరు మీదకి మార్చాలని లాయర్‌ని కలుస్తుంది అపర్ణ. రేఖ ఇచ్చిన పాయిజిన్ ఇంజెక్షన్‌తో సుభాష్‌కి ఊపిరి ఆడదు. నా మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోవడంతో పాటు నాకు క్షమాపణలు చెబితేనే దానికి యాంటీ డోస్ ఇస్తానని రేఖ చెప్పడంతో ఇందూ, అపర్ణలు రేఖ కాళ్లపై పడి సుభాష్‌ని బతికించుకుంటారు.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి మార్చి 16వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు .. 981వ ఎపిసోడ్ నుంచి 986వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
మార్చి 16వ తేదీ 981వ ఎపిసోడ్‌లో ..
ఇందూని అనుభవించాలని కుట్ర చేసిన రాఖీ ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇవ్వబోతుండగా స్వరాజ్- లక్కీలు పరిగెత్తుకురావడంతో ఆ గ్లాస్ కిందపడిపోతుంది. దాంతో స్వరాజ్‌పై ఇందూ మండిపడుతుంది. బస్తీలో ఉండేవాళ్లు.. ఇలాంటి ఏరియాలకు రాకూడదని రాఖీ నోరు పారేసుకోవడంతో స్వరాజ్ లాగి పీకుతాడు. దాంతో సీరియస్ అయిన రాఖీ.. నీకు ఉద్యోగం ఇవ్వనని ఇందూకి చెప్పి వెళ్లిపోతాడు. తన ఉద్యోగం పోగొట్టావంటూ స్వరాజ్‌పై ఇందూ మండిపడుతుంది. పబ్‌లో ఇంటర్వ్యూ పెట్టాడంటే వాడు ఎలాంటి వాడో అర్ధం చేసుకోవాలని చెబుతాడు రాజ్. ఇంటికి వెళ్తుండగా ఐశ్వర్య కనిపించడంతో పక్కన దాక్కొంటుంది ఇందూ. పీకలదాకా తాగిన ఐశ్వర్యకు లక్కీ లిఫ్టి ఇస్తానని స్వరాజ్ దగ్గర బండి తీసుకుంటాడు. అయితే వాళ్లిద్దరినీ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు. మరోవైపు.. ఫోన్లు స్మగ్లింగ్ చేస్తున్న దొంగని నందూ పట్టుకుని అదే పోలీస్ స్టేషన్‌కి తీసుకొస్తుంది. ఐశ్వర్యను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న ఇందూ టెన్షన్ పడుతుంది. వెంటనే విషయం స్వాతికి ఫోన్ చేసి చెబుతుంది.
మార్చి 17వ తేదీ 982వ ఎపిసోడ్‌లో..
పోలీస్ స్టేషన్‌లో ఉన్న లక్కీని స్వరాజ్ విడిపించడానికి వస్తాడు. వీడిని వదిలేసినా బండిని మాత్రం వదిలేది లేదని ఎస్ఐ చెప్పడంతో స్వరాజ్ షాక్ అవుతాడు. మరోవైపు.. ఐశ్వర్యని తన ఇంట్లోకి వాళ్లకి ఫోన్ చేయమని ఫోన్ ఇవ్వగా ఆమె గాలిలో నెంబర్లు నొక్కుతుంది. దాంతో ఎస్ఐ సీరియస్ అవుతాడు. ఇంతలో స్వాతి, ఇందూలు వచ్చి ఐశ్వర్యను తీసుకుని వెళ్తారు. తనను పట్టుకున్న ఇందూపై ఐశ్వర్య సీరియస్ అవుతూ.. మత్తులో ఉండి ఇందూని తోసేస్తుంది. కిందపడిపోతున్న ఇందూని నందూ పట్టుకుంటుంది. చీకటిలో ఎవ్వరూ చూడకుండా ఐశ్వర్యని ఇంట్లోకి తీసుకెళ్తారు స్వాతి, ఇందూ. ఇంతలో లైట్స్ వెలిగి ఎదురుగా రేఖ ప్రత్యక్షమవుతుంది. రాత్రిపూట నువ్వు ఎక్కడికి వెళ్లావని రేఖ నిలదీయడంతో ఇందూ షాక్ అవుతుంది. చెడు తిరుగుళ్లు తిరుగుతోంది నీ మేనకోడలు.. నా మనవరాలు కాదంటూ అపర్ణ మండిపడుతుంది. నీకు నేనంటే భయం పోయింది.. నేనేం చేయగలనో మరిచిపోయావంటూ ఇందూపై సీరియస్ అవుతుంది రేఖ. దాంతో ఐశ్వర్యని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏం చేయాలో తెలియక ఇందూ అక్కని తీసుకుని వెళ్లానని చెబుతుంది స్వాతి. కావాలంటే పబ్‌కి, పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేయమని స్వాతి చెప్పడంతో రేఖ సైలెంట్ అయిపోతుంది.

Photo Courtesy: JioHotstar
మార్చి 18వ తేదీ 983వ ఎపిసోడ్‌లో..
రేఖని తెలివిగా బోల్తా కొట్టించడంతో స్వాతి, ఇందూలు నవ్వుకుంటూ ఉంటారు. ఒక వెధవ వల్ల నా ఉద్యోగం పోయిందని ఇందూ బాధపడుతుంది. దాంతో లాప్‌టాప్‌లో ఆన్‌లైన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తారు ఇందూ, స్వాతి. ఉదయాన్నే బైక్ కనిపించకపోవడంతో స్వరాజ్‌ను నిద్రలేపి నిలదీస్తాడు తండ్రి. ఏం చెప్పాలో తెలియక.. తమ్ముడి వల్ల ఇదంతా జరిగిందని, వాడి ఫ్రెండ్‌కి నా బైక్ ఇచ్చానని చెబుతాడు స్వరాజ్. వాడు పీకలదాకా తాగేసి పోలీసులుకు దొరికిపోవడంతో బైక్‌ను సీజ్ చేశారని అంటాడు. వెంకీ దగ్గరి నుంచి 1000 రూపాయలు తీసుకుని కోర్టులో ఫైన్ కట్టడానికి లక్కీతో కలిసి వెళ్తాడు స్వరాజ్. ఇందూ రెజ్యూమ్ చూసిన కంపెనీ వాళ్లు ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ చేయడంతో ఆమె సంతోషిస్తుంది. సాయంత్రం పార్టీకి వస్తానని, అన్ని ఏర్పాట్లు చేయమని ఫ్రెండ్‌తో చెబుతున్న ఐశ్వర్యపై మండిపడుతుంది స్వాతి. రాత్రి నువ్వు చేసిన రచ్చ అంతా ఇంతా కాదని, నీ కోసం ఇందూ అక్కా నేను రిస్క్ చేశామని ఇకనైనా ఇలాంటివి మానేయాలని చెబుతుంది స్వాతి. ఆ మాటలతో కోప్పడిన ఐశ్వర్య ఆవేశంలో స్వాతిని కొట్టబోతుండగా ఇందూ ఆపుతుంది. నీకు మంచి చెప్పడం తప్పించి స్వాతి ఏ తప్పు చేయలేదని ఇందూ చెబుతుంది. మా నానమ్మ, నాన్నలని మీ అమ్మనాన్నలే చంపేశారు.. అందుకే నువ్వంటే నాకు అసహ్యమని మండిపడుతుంది ఐశ్వర్య. ఇదంతా చూసిన అపర్ణ.. ఐశ్వర్యపై ఫైర్ అవుతుంది. మీలాంటి వాళ్లను ఈ ఇంట్లో ఉండనివ్వడం తప్పని నానామాటలు అంటుంది. ఆ మాటలతో బాధపడిన అపర్ణ.. భర్త దగ్గర ఏడుస్తుంది. స్వప్న, కావ్య, అప్పూలు ప్రాణానికి ప్రాణంగా ఉండేవారు. వాళ్ల పిల్లలు మాత్రం ఇలా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది.
మార్చి 19వ తేదీ 984వ ఎపిసోడ్‌లో..
ఆస్తికి అసలు హక్కుదారు, వారసురాలు ఇందూయే. ఇప్పటి వరకు రేఖ పేరు మీదున్న పవర్ ఆఫ్ అటార్నీని ఇందూ పేరు మీదకి మార్చాలని అనుకుంటుంది అపర్ణ. ఈ విషయం చెప్పగానే సుభాష్ షాక్ అవుతాడు. మన మనవరాలి కోసం ఏం చేసినా నాకు ఇష్టమేనని చెప్పడంతో అపర్ణ వెంటనే లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఇంటర్వ్యూ కోసం సర్టిఫికెట్లు పెట్టుకుని బయల్దేరుతున్న ఇందూని భ్రమరాంబ అడ్డుకుని బ్యాగ్ చెక్ చేస్తుంది. ఇంతలో శేషం అన్న మాటలకు కోపంతో బ్యాగ్ విసిరేస్తుంది భ్రమరాంబ. శివరామ్ గారింటికి వెళ్లిన ఇందూ.. ఆయనకు థ్యాంక్స్ చెబుతుంది. నువ్వు మా ఇంట్లో వంట చేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో తాను ఉద్యోగం చేయాలని అనుకుంటున్నానని చెబుతుంది ఇందూ. రేఖ అడిగితే నేను చూసుకుంటానని ధైర్యం చెబుతాడు శివరామ్. ఇంటర్వ్యూ కోసం వెళ్తున్న ఇందూని స్వరాజ్ మరోసారి బైక్‌తో ఢీకొడతాడు. దాంతో ఇందూ ఫోన్ పగిలిపోతుంది. స్వరాజ్‌తో గొడవపడ్డ ఇందూ.. తన ఫోన్ తనకు కావాలని గొడవ చేయడంతో రాజ్ ఆమెకు కొత్త ఫోన్ తీసిస్తాడు.

Photo Courtesy: JioHotstar
మార్చి 20వ తేదీ 985వ ఎపిసోడ్‌లో..
రేఖ పేరు మీదున్న పవర్ ఆఫ్ అటార్నీని ఇందూ పేరు మీదకి వచ్చేలా చేయమని లాయర్‌కి చెబుతుంది అపర్ణ. ఫీజు కింద తన నగల్ని ఇస్తుంది. ఆలస్యంగా ఇంటర్వ్యూకి వెళ్లిన ఇందూని అక్కడ హెచ్ఆర్ అవమానిస్తాడు. ఒక వెధవ వల్ల ఇలా జరిగిందని చెబుతుంది. ఇందూ ఎంత బతిమలాడినా సరే ఉద్యోగం మాత్రం ఇవ్వడు. దాంతో బాధగా బయటకు వచ్చేస్తుంది ఇందూ. స్వరాజ్‌కు పెద్ద లాప్‌లాప్‌ల బేరం తగులుతుంది. తన వద్ద 25 పనికిరాని లాప్‌టాప్‌లు ఉన్నాయని.. వాటిని అమ్మమని చెబుతాడు ఓ వ్యక్తి. దాంతో జనాన్ని చీట్ చేయడానికి రాజ్ ఓ ప్లాన్ గీస్తాడు. ఇంటి దగ్గర పనిచేసే అవకాశం అని చెప్పి 25 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి 20 వేల రూపాయలు వసూలు చేద్దామని చెబుతాడు. ఇంటర్వ్యూ నుంచి నందూ, గుడి నుంచి అపర్ణలు ఒకేసారి ఇంటి దగ్గరికి వస్తారు. ఒకడి వల్ల ఇంటర్వ్యూ పోయిందని చెబుతుంది ఇందూ. వారిద్దరూ వచ్చేసరికి సుభాష్ గదిలో నుంచి డాక్టర్‌తో బయటకు వస్తుంది రేఖ. మీరు వెళ్లాకా అంకుల్‌కి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చిందని, అందుకే డాక్టర్‌తో ఇంజెక్షన్ ఇప్పించానని చెబుతుంది రేఖ. లోపలికి వెళ్లి చూస్తే సుభాష్ బాగానే ఉన్నాడు. అయితే కాసేపటికే బ్రీతింగ్ అందకపోవడంతో రేఖని ఆసుపత్రికి వెళ్దామని బతిమలాడతారు ఇందూ, అపర్ణ.
మార్చి 21వ తేదీ 986వ ఎపిసోడ్‌లో..
సుభాష్‌కి ఊపిరి అందకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని రేఖని అడుగుతాడు ఇందూ, అపర్ణ. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు.. యాంటీ డోస్ ఇస్తే సరిపోతుందని చెబుతుంది రేఖ. ఆ ఇంజెక్షన్ కోసం ఇందూని అన్ని రూమ్‌లు పరిగెత్తిస్తుంది రేఖ. ఎక్కడ లేకపోవడంతో రేఖ కాళ్లపై పడుతుంది ఇందూ. నువ్వు కాదు.. మీ నానమ్మ పడాలి.. ఎంత ధైర్యముంటే నాకు వ్యతిరేకంగా లాయర్‌ని కలుస్తుంది, ఈ ఆస్తిని నీకు దక్కేలా చేస్తుందని మండిపడుతుంది. దాంతో ఇందూ షాక్ అవుతుంది. తాతయ్యని బతికించుకోవాలని.. కేసు వాపసు తీసుకుంటున్నట్లు చెప్పమని నానమ్మపై అరుస్తుంది ఇందూ. దాంతో వేరే దారిలేక రేఖ కాళ్లపై పడి క్షమాపణలు చెబుతుంది రేఖ. ఆ వెంటనే భూషణ్ యాంటీ డోస్ ఇవ్వడంతో సుభాష్‌ని కాపాడుతుంది ఇందూ. లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్లావు? నిన్ను ఎవరు వెళ్లమన్నారు? అంటూ అపర్ణపై మండిపడుతుంది ఇందూ. మీరిద్దరూ లేనప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు అంటూ క్లాస్ పీకుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











