Brahmamudi weekly roundup: దుగ్గిరాల నిలయంలోకి రాజ్ ఎంట్రీ.. రేఖకు ముచ్చెమటలు

Photo Courtesy: JioHotstar

నన్ను ఎంత అవమానించినా ఆ రేఖని ఎదిరించొద్దని అపర్ణ దగ్గర ఇందూ మాట తీసుకుంటుంది. లైఫ్‌లో త్వరగా సెటిల్ కావడానికి డబ్బున్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలని ఫ్రెండ్ చెప్పినా మాటలతో లక్కీ, స్వరాజ్‌లు అమ్మాయిల్ని వెతికే పనిలో పడతారు. అపర్ణని రెచ్చగొట్టడానికి ఇందూని టార్చర్ చేస్తారు భ్రమరాంబ, రేఖ. తన కుటుంబం మొత్తం కాలిపోయిన యాక్సిడెంట్ పదే పదే రాజ్‌కి కలలా రావడంతో అతను ఉలిక్కిపడతాడు. రాకేష్ బాకీని తీర్చడానికి రేఖ తనకు చేయించిన నెక్లెస్‌ని కొట్టేస్తుంది ఐశ్వర్య. ఇదే అదనుగా భ్రమరాంబ కూడా ఓ నెక్లెస్ కొట్టేస్తుంది. ఐశ్వర్యకి లక్కీ లిఫ్ట్ ఇవ్వడంతో వారిని ఇందూ ఫాలో అవుతుంది. అయితే కారులో నెక్లెస్ మిస్ అవ్వడంతో ఐశ్వర్య ప్లాన్ ఫెయిల్ అవుతుంది. నెక్లెస్ కనిపించకపోవడంతో ఇందూనే దొంగతనం చేసిందని ఆమెపై నేరం మోపుతారు ఐశ్వర్య, భ్రమరాంబ. ఇందూని నిలదీస్తుండగా స్వరాజ్, లక్కీలు దుగ్గిరాల వారి నివాసంలో అడుగుపెడతారు. రాజ్‌ని చూడగానే రేఖ షాక్ అవుతుంది. దొంగతనం చేసింది ఐశ్వర్య అని తేలడంతో ఆమెను లాగిపెట్టి కొడుతుంది రేఖ. రాజ్‌ని వివరాలు అడిగి పంపించేస్తుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup March 23rd to March 28th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి మార్చి 23వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ వరకు .. 987వ ఎపిసోడ్ నుంచి 992వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

మార్చి 23వ తేదీ 987వ ఎపిసోడ్‌లో ..
ఆ రేఖ నన్ను ఏమన్నా.. ఎన్ని అవమానాలకు గురిచేసినా నువ్వు రియాక్ట్ అవ్వకూడదు, ఆ రేఖని ఏమీ అనకూడదని మాట ఇవ్వమని అపర్ణని అడుగుతుంది ఇందూ. మనవరాలి కోసం మాట ఇస్తుంది అపర్ణ. అయితే ఈ దుగ్గిరాల వంశానికి వారసురాలివి నువ్వు.. ఈ కుటుంబాన్ని నమ్ముకుని కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ల జీవితాల్ని నిలబెడతానని, ఆస్తిని దక్కించుకుంటానని మాట ఇవ్వమని అడుగుతుంది అపర్ణ. అది నా చేతిలో లేదని కాలమే సమాధానం చెబుతుందని వెళ్లిపోతుంది ఇందూ. లాప్‌టాప్‌లు అమ్మి కోట్లు సంపాదించాలనుకున్న స్వరాజ్ ప్లాన్ బెడిసి కొడుతుంది. దాంతో లక్కీని చితకబాదుతుంటాడు స్వరాజ్. ఇంతలో వాళ్ల ఫ్రెండ్ కారులో వచ్చి డబ్బున్న ఆంటీని పెళ్లి చేసుకున్నానని, నా లైఫే మారిపోయిందని చెబుతాడు. ఆ మాటలతో తాము కూడా బాగా డబ్బున్న అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు లక్కీ, స్వరాజ్. అమ్మాయిల కోసం వెతుకుండగా అక్కడికి వచ్చిన ఐశ్వర్యని ఫాలో అవుతూ వెళ్లి బకరా అవుతాడు లక్కీ. మనం ఇచ్చిన డోస్ సరిగ్గా పనిచేసిందా లేదా అని రేఖని భ్రమరాంబ అడుగుతుంది. దాంతో ఇందూ చేసిన వంట బాలేదంటూ కావాలని వంకలు పెడతారు. ఆ మాటలు విన్న అపర్ణ.. మనవరాలి కోసం మౌనంగా ఉండిపోతుంది.

మార్చి 24వ తేదీ 988వ ఎపిసోడ్‌లో..
తాతని ఇబ్బంది పెట్టామని ఇందూ మన మీద ప్రతీకారం తీర్చుకుంటోందని రేఖను రెచ్చగొడుతుంది భ్రమరాంబ. దాంతో సాంబారు తీసుకొస్తున్న ఇందూకి కావాలని కాలు అడ్డుపెడుతుంది భ్రమరాంబ. దాంతో రేఖ మీద సాంబారు పడుతుంది. మొత్తం క్లీన్ చేయాల్సిందిగా రేఖ ఆర్డర్ వేయడంతో ఇందూ క్లీన్ చేస్తుండగా ఆమె ముఖం వైపు కాలు అడ్డుపెడుతుంది రేఖ. అది చూసిన అపర్ణ, స్వాతిలు రగిలిపోతారు. రేఖ ఆంటి అంత టార్చర్ చేస్తున్నా నువ్వెందుకు కోప్పడటం లేదని స్వాతి అడగ్గా.. నానమ్మ, తాతయ్యల కోసమని చెబుతుంది ఇందూ. ఇంతలో ఆమెను ఇంటర్వ్యూలో పాల్గొనాల్సిందిగా మెయిల్ రావడంతో ఇందూ సంతోషిస్తుంది. నానమ్మ, తాతయ్యలను బాగా చూసుకోవాలి.. తాతయ్యకి ఆపరేషన్ చేయించాలని చెబుతుంది ఇందూ. స్వరాజ్ నిద్రపోతుండగా.. తన కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయిన ప్రమాదం పీడకలగా రావడంతో ఉలిక్కిపడి లేస్తాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వాడికి ఆ కల ఎందుకొచ్చింది? వాడి కుటుంబ సభ్యులు ఎవరైనా దగ్గరవుతున్నారా? అని భయపడుతుంది లక్ష్మీ. ఐశ్వర్య కోసం రేఖ చేయించిన నెక్లెస్‌ని చూసి అవాక్కవుతుంది భ్రమరాంబ. స్వాతికి కూడా ఇలాంటిది చేయించమని అడగ్గా.. స్వాతి చిన్నపిల్ల అప్పుడే ఎందుకు అని అంటుంది రేఖ. నెక్లెస్‌ను చూసిన ఐశ్వర్య డల్‌గా ఉండటంతో ఏం జరిగిందని అడుగుతుంది రేఖ. నువ్వు ఇలాగే వదిలేస్తే రేపు ఆస్తి విషయంలోనూ నిన్ను రేఖ.. బొమ్మలా ఆడుకుంటుందని భ్రమరాంబకు శేషం వార్నింగ్ ఇస్తాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup March 23rd to March 28th episode Story

Photo Courtesy: JioHotstar

మార్చి 25వ తేదీ 989వ ఎపిసోడ్‌లో..
రాకేష్ దగ్గర చేసిన అప్పుని తీర్చడానికి రేఖ తనకు గిఫ్ట్‌గా కొన్న నెక్లెస్‌ని అమ్మాలని అనుకుంటుంది ఐశ్వర్య. రేఖ వెనకాలే వెళ్లి ఆ నెక్లెస్‌ని లాకర్‌లో నుంచి కొట్టేస్తుంది. ఇదంతా చూసిన భ్రమరాంబ కూడా మరో నెక్లెస్‌ని దొంగిలిస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్లిన ఇందూ అన్ని సర్టిఫికెట్స్ ఇచ్చినప్పటికీ డిగ్రీ సర్టిఫికెట్స్ లేకపోవడంతో ఉద్యోగం ఇవ్వడానికి హెచ్ఆర్ నిరాకరిస్తాడు. నేను డిగ్రీ పరీక్ష రాశానని, ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయని ఇందూ చెప్పినా వినిపించుకోడు. డబ్బున్న అమ్మాయిల్ని పట్టుకోవడానికి కారులో ఊరంతా చక్కర్లు కొడతారు లక్కీ, స్వరాజ్. కారు ఆగిపోవడంతో ఐశ్వర్య రోడ్డు మీద ఇబ్బందిపడుతుంది. దాంతో లక్కీ కారు ఆపించి ఐశ్వర్యని లిఫ్ట్ ఇస్తానని తీసుకెళ్తాడు. ఇదంతా చూసిన ఇందూ.. ఆ కారును ఫాలో అవుతుండగా నందూ ఇద్దరు దొంగలను వెంటాడుతూ ఆటోకి అడ్డుపడుతుంది. నందూని దొంగలు రౌండప్ చేయడంతో ఇందూ కాపాడుతుంది. ఇద్దరూ కలిసి ఆ దొంగలు దొంగ బంగారం అమ్మిన షాప్ దగ్గరకి బయల్దేరతారు. ఐశ్వర్యకు తాను కొట్టేసిన నెక్లెస్ కనిపించకపోవడంతో టెన్షన్ పడుతుంది. కారు దిగి కూల్‌డ్రింక్ తాగుతున్న లక్కీకి ఆ నెక్లెస్ కనిపించడంతో స్వరాజ్‌కి ఇస్తాడు.

మార్చి 26వ తేదీ 990వ ఎపిసోడ్‌లో..
కారులో ఐశ్వర్య మరిచిపోయిన నెక్లెస్‌ని ఆమెకు తిరిగిచ్చేసి ఇంప్రెస్ చేయాలని లక్కీ అనుకుంటాడు. అయితే ఈ నెక్లెస్ అమ్మేసి ఆమెకు గిఫ్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అవుతుందని స్వరాజ్ చెప్పడంతో లక్కీ సరేనని అంటాడు. లాకర్‌కి తాళం వేలాడుతూ ఉండటంతో అనుమానం వచ్చిన రేఖ.. లోపల చెక్ చేయగా రెండు నెక్లెస్‌లు మిస్ అవుతాయి. దాంతో ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది. ఇందూయే నెక్లెస్‌లను కొట్టేసి ఉంటుందని ఐశ్వర్య, భ్రమరాంబ ఆమెపై నిందలు వేస్తారు. అక్క.. మీ ముందే శివరామ్ గారింటికి వంట చేయడానికి వెళ్లింది. ఆ తర్వాతే ఆంటీ ఈ నెక్లెస్‌లను లాకర్‌లో పెట్టారు. అలాంటప్పుడు ఇందూ అక్క ఎలా దొంగతనం చేస్తుందని స్వాతి అడుగుతుంది. బయటికి వెళ్లినట్లే వెళ్లి ఇంటికొచ్చి దొంగతనం చేసి ఉండొచ్చని భ్రమరాంబ, ఐశ్వర్యలు చెప్పడంతో రేఖ కూడా అదే నిజమని అనుకుంటుంది. నేనంటే భయం రావాలంటే దానికి మామూలు పనిష్మెంట్ ఉండదని అంటుంది రేఖ. ఐశ్వర్య నెక్లెస్‌ను అమ్మడానికి సేట్ దగ్గరికి వెళ్తారు లక్కీ, స్వరాజ్. అక్కడ బేరం మాట్లాడుకుంటూ ఉండగా నందూ- ఇందూలు దొంగల్ని తీసుకుని వస్తారు. స్వరాజ్- లక్కీలను చూసి దొంగలు ఇక్కడికి వచ్చారంటూ గొడవ పడుతుంది ఇందూ. దాంతో వాళ్లిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. దొంగలు అమ్మిన అమ్మవారి నగల్ని స్వాధీనం చేసుకుంటుంది నందూ. రేఖ లాకర్‌లో కొట్టేసిన నెక్లెస్‌ని చూసుకుని భ్రమరాంబ మురిసిపోతుండగా శేషం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup March 23rd to March 28th episode Story

Photo Courtesy: JioHotstar

మార్చి 27వ తేదీ 991వ ఎపిసోడ్‌లో..
నెక్లెస్‌ల దొంగతనం గురించి తేల్చాలని రేఖ ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది. ఇంతలో ఇందూ రావడంతో ఆమెపై అందరూ విరుచుకుపడతారు. నీ తాత ఆపరేషన్‌కి డబ్బులు ఇవ్వలేదని నెక్లెస్‌లు కొట్టేశావా అని నిలదీస్తుంది రేఖ. నేను శివరామ్ గారి ఇంటిలో వంట చేసి ఇప్పుడే వస్తున్నాను, నాకేం తెలియదని ఇందూ చెప్పినా వినిపించుకోదు రేఖ. నేను ఏం చేయగలనో తెలిసి కూడా ఇంత ధైర్యం వచ్చిందా అని మండిపడుతుంది. నువ్వు చేసిన తప్పుకి ఆ ముసలివాళ్ల ప్రాణాలు తీస్తానని చెప్పడంతో ఇందూ కంగారుపడుతుంది. ఆ రోజు బస్సు ప్రమాదంలో మన వాళ్లంతా చనిపోయినా రేఖ కొడుకు బాడీ మాత్రం దొరకలేదు. వాడు ప్రాణాలతోనే ఉన్నాడని అనిపిస్తోంది, ఎప్పటికైనా ఈ ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడని అనిపిస్తోందని సుభాష్‌తో అంటుంది అపర్ణ. ఇంతలో ఐశ్వర్యని వెతుక్కుంటూ స్వరాజ్, లక్కీలు వస్తారు.. రాజ్‌ని చూడగానే రేఖ వణికిపోతుంది. మరోవైపు తన దొంగతనం ఎక్కడ బయటపడుతుందోనని ఐశ్వర్య కంగారుపడుతుంది. మీరంతా వెతుకుతున్నది, గొడవ పడుతున్నది ఈ నెక్లెస్ కోసమేనా అని లక్కీ ఆ నెక్లెస్ తీయగానే రేఖ షాక్ అవుతుంది. ఆ రెండో నెక్లెస్ ఎక్కడ అని అడగ్గా.. స్వాతి తీసుకొచ్చి ఇస్తుంది.

మార్చి 28వ తేదీ 992వ ఎపిసోడ్‌లో..
నెక్లెస్ ఇచ్చి వెళ్లిపోతున్న రాజ్‌ని పిలిచి నేను నీతో మాట్లాడాలని అంటుంది రేఖ. ఇంతలో అపర్ణ బయటకు వస్తుండటంతో ఆమెను పక్కకు తీసుకెళ్లమని భూషణ్‌కు చెబుతుంది రేఖ. నువ్వు ఉండేది ఎక్కడ? మీ అమ్మానాన్న ఎవరు? అని అడుగుతుంది రేఖ. రాజ్ సరిగా సమాధానం చెప్పకపోవడంతో టెన్షన్ పడుతుంది. నెక్లెస్ దొంగతనం చేసిన ఐశ్వర్యని లాగిపెట్టి కొడుతుంది. నువ్వు కూడా మీ నాన్నలాగే తయారయ్యావని గడ్డి పెడుతుంది. వెంకీని రోజాతో కలపడానికి నందూ పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు తెచ్చిపెడుతుంది. వాటిని తీసుకెళ్లి ఐశ్వర్యకు ఇవ్వగా.. నేను, మా కజిన్ సినిమాకు వెళ్తామని రోజా చెప్పడంతో వెంకీ సరేనని అంటాడు. ఈ మాటలు విన్న నందూ.. అది నిన్ను మోసం చేస్తోందని వెంకీకి చెప్పినా అతను వినిపించుకోడు. తన ప్రేమను గెలిపించడానికి కొత్త ప్లాన్ చెప్పమని అడుగుతాడు. స్వాతి అన్నం తినిపించడంతో ఇందూ ఎమోషనల్ అవుతుంది. అసలు ఆ దొంగల్ని ఇక్కడికి పంపించి, నెక్లెస్‌ను కాపాడింది నేనే అని ఇందూ చెప్పడంతో స్వాతి షాక్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X