Brahmamudi weekly roundup: యామినితో పెళ్లికి రాజ్ ఓకే.. యామిని గుట్టు పట్టేసిన కావ్య- అప్పూ
రాజ్ చుట్టూ యామిని అల్లుతున్న కట్టుకథని గమనించిన కావ్య ఎలాగైనా భర్తను కాపాడాలని అనుకుంటుంది. నెల తిరిగేసరికి రాజ్‌ను మీ ముందు నిలబెడతానని రుద్రాణితో సవాల్ చేస్తుంది కావ్య. యామినిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని, కొంచెం టైం కావాలని చెబుతాడు రాజ్. అప్పూ ఇచ్చిన అడ్రస్ సాయంతో యామిని ఇంటికి వెళ్లిన కావ్యను చూసి రాజ్ , యామిని, ఆమె తల్లిదండ్రులు షాక్ అవుతారు. మన ఇంటికి వచ్చింది రాజ్ భార్య కావ్య అని యామిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు షాక్ అవుతారు. భర్త కోసం క్యారియర్ పంపుతుంది కావ్య.. ఆ వంటలు తిన్న రాజ్ ఆమెను పొగిడేసరికి యామిని రగిలిపోతుంది.
కావ్య పంపిన కార్డ్ ఆధారంగా ఫోన్ నెంబర్ కనుక్కుని ఆమెకు మెసేజ్ చేస్తాడు రాజ్. ఇది చూసిన యామిని .. రాజ్‌కు కావ్యని దూరం చేయాలని అనుకుంటుంది. ఉన్నట్లుండి యామిని తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ఆయనను ఆసుపత్రిలో చేరుస్తాడు రాజ్. ఆయన చివరి కోరికగా యామినిని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు రాజ్. డాక్టర్‌ను కలిసిన అప్పూ- కావ్యలు యామిని డ్రామాను కనుక్కుంటారు. ఆసుపత్రిలో రాజ్‌ను చూసిన కావ్య అతనిని అప్పూకి కూడా చూపిస్తుంది. పెళ్లికి ఒప్పుకున్నందుకు రాజ్‌కి యామిని థ్యాంక్స్ చెప్పడంతో కావ్య గుండె ముక్కలవుతుంది.

బ్రహ్మముడి మార్చి 24వ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు.. 522 ఎపిసోడ్ నుంచి 527 వరకు ఏం జరిగిందంటే?
మార్చి 24వ తేదీ 677వ ఎపిసోడ్‌లో ... స్కూళ్లో ప్రిన్సిపాల్‌తో, రాజ్ ఫ్రెండ్స్ అంటూ కొందరితో మాట్లాడించడంతో పాటు తల్లిదండ్రులంటూ ఎవరివో సమాధులను రాజ్‌కి చూపిస్తుంది. ఈ పరిణామాలతో రాజ్‌కు పిచ్చెక్కిపోయి అక్కడి నుంచి వెళ్లిపోదాం అంటాడు. ఇదంతా దూరం నుంచి చూసిన కావ్య.. యామిని ఎందుకు ఈ కట్టుకథ అల్లుతుందోనని ఆలోచిస్తుంది. రుద్రాణి ఫోన్ చేయడంతో కావ్య కోసం పిచ్చాసుపత్రి నుంచి డాక్టర్ , స్టాఫ్ నేరుగా దుగ్గిరాల వారింట్లోకి వస్తారు. కావ్య పరిస్ధితి చూసి నేనే మెంటల్ ఆసుపత్రికి ఫోన్ చేసినట్లు రుద్రాణి చెప్పడంతో అంతా మండిపడతారు. ఈలోపు కావ్య వచ్చి రుద్రాణితో గొడవపడుతుంది. రాజ్‌ని నెల తిరిగేసరికి మీ ముందు తీసుకొచ్చి నిలబెడతానని.. లేకపోతే ఈ రాజ్యం మీరే ఏలుకోండని రుద్రాణితో కావ్య సవాల్ విసురుతుంది.
మార్చి 25వ తేదీ 678వ ఎపిసోడ్‌లో ... రాజ్ బతికే ఉన్నాడని కావ్య ధీమాగా చెప్పడంతో రాహుల్ - రుద్రాణిలకు డౌట్ వస్తుంది. రాజ్ ఒకవేళ బతికే ఉంటే వాడిని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేస్తే ఆస్తి, కంపెనీ మనదేనని కొడుకుతో చెబుతుంది రుద్రాణి. గతంలో ఏం జరిగింది? అసలు నేనేవరు? అని ఆలోచిస్తుంటాడు రాజ్. అతనిని అలాగే వదిలేస్తే నాకు ప్రమాదమని అనుకున్న యామిని .. రాజ్ మీదకి తన తల్లిదండ్రులను పంపుతుంది. నా భర్తను తిరిగి దక్కించుకునే మార్గం చూపించమని దేవుడిని వేడుకున్న కావ్య.. యామిని కారు నెంబర్‌ను అప్పూకి ఇచ్చి అడ్రస్ కనుక్కోమంటుంది.
మార్చి 26వ తేదీ 679వ ఎపిసోడ్‌లో ... అప్పూ ఇచ్చిన అడ్రస్ తీసుకుని యామిని ఇంటికి వెళ్లి తలుపు కొడుతుంది కావ్య. రాజ్ తలుపు తీసి చూడగానే ఎదురుగా కావ్య ఉండటం చూసి షాక్‌తో పాటు సంతోషిస్తాడు. ఆమెను లోపలికి పిలిచి కబుర్లు చెబుతుండగా యామిని, ఆమె తల్లిదండ్రులు వస్తారు. తన ఇంట్లో కావ్యను చూసేసరికి యామిని అవాక్కవుతుంది. రాజ్ - కావ్యలు ఒకరికొకరు తమ పేర్లు చెప్పుకుంటారు. మీరు బాగుందని రాజ్ చెప్పగా.. నాకెంతో ఇష్టమైన వ్యక్తి ఈ పేరు పెట్టారని చెబుతుంది. కావ్య చేతి స్పర్శ తనకు బాగా తెలిసినట్లుగా అనిపించి ఆమె వెళ్లిపోతుండగా డాబా మీద నుంచి బాధగా చూస్తాడు.
మార్చి 27వ తేదీ 680వ ఎపిసోడ్‌లో ... మన ఇంటికొచ్చింది ఆ రాజ్ భార్య కావ్య అని యామిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు షాక్ అవుతారు. కావ్య చాలా తెలివైనదని ఏదో ప్లాన్‌తోనే ఇక్కడికి వచ్చిందని జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తుంది యామిని. రాజ్‌ని త్వరగా పెళ్లి చేసుకుని నా సొంతం చేసుకుంటే కావ్య ఆటలు సాగవని చెప్పడంతో యామిని తల్లిదండ్రులు రాజ్ దగ్గరికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడతారు. తనకు కొంచెం సమయం కావాలని ఇప్పుడే యామినితో పెళ్లి వద్దని తేల్చిచెబుతాడు రాజ్. భర్త కోసం కావ్య క్యారియర్ పంపించగా ఆ వంటలు అద్భుతంగా ఉన్నాయని కావ్యని రాజ్ మెచ్చుకుంటుంటే యామిని రగిలిపోతుంది. భోజనాలు చేస్తుండగా క్యారియర్ ఎవరికి పంపించావని కావ్యని రుద్రాని నిలదీస్తుంది.
మార్చి 28వ తేదీ 681వ ఎపిసోడ్‌లో ... కావ్య వంట తిన్న రాజ్ కనీసం ఆమెకు థ్యాంక్స్ చెప్పలేకపోయానని బాధపడతాడు. ఇంతలో యామిని విసిరేసిన కార్డుని డస్ట్‌బిన్‌లో నుంచి దాని మీదున్న నెంబర్ సేవ్ చేసుకుని కావ్యకి మెసేజ్ చేస్తాడు. భర్త నుంచి మెసేజ్ రావడంతో కావ్య సంతోషిస్తుంది. అటు ఛాటింగ్‌లో చేస్తూ సంతోషంగా ఉండటంతో రగిలిపోతుంది యామిని. కావ్య చాలా డేంజర్ అని రేపటి నుంచి తన అసలు రూపాన్ని రాజ్‌కి చూపించాలని అనుకుంటుంది. ఉదయాన్నే జాగింగ్‌కు వెళ్లొచ్చిన యామిని తండ్రితో రాజ్ కబుర్లు చెబుతుంటాడు. ఇంతలో ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోతాడు.
మార్చి 29వ తేదీ 682వ ఎపిసోడ్‌లో ... యామిని తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్తాడు రాజ్. నేను పోయేలోపు యామినిని పెళ్లి చేసుకుంటే చూడాలని అడగటంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని రాజ్ మాట ఇస్తాడు. దీంతో యామిని, వైదేహి సంతోషిస్తారు. రాజ్ బయటికి వెళ్లగానే మన ప్లాన్ సక్సెస్ అయ్యిందని తల్లితో అంటుంది యామిని. డాక్టర్‌ను వెతుక్కుంటూ వచ్చిన అప్పూ - కావ్యలు అతనిని భయపెట్టి యామిని డ్రామా గురించి తెలుసుకుంటారు. బయటికొచ్చిన కావ్యకు రాజ్ కనిపించడంతో అప్పూకి కూడా చూపిస్తుంది. బావగారు బతికే ఉన్నారని తెలుసుకున్న అప్పూ చాలా సంతోషిస్తుంది. ఇంతలో యామిని వచ్చి రాజ్‌ను గట్టిగా హగ్ చేసుకుని పెళ్లికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చెబుతుంది. మరి తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











