Brahmamudi weekly roundup: పారిపోయిన అప్పూ కూతురు...అపర్ణకి అండగా ఇందూ, జులాయిలా స్వరాజ్

Photo Courtesy: JioHotstar

తన మనవరాళ్లకు కూడా అక్షరాభ్యాసం చేయించమని అపర్ణ అడగ్గా... రేఖ అవమానిస్తుంది. దాంతో ఏడుస్తున్న అపర్ణకి కావ్య ఆత్మ దారి చూపుతుంది. పిల్లలకు తానే గురువులా మారి చదువు చెబుతుంది. డైనింగ్ టేబుల్ మీద చికెన్ పీస్ తింటున్న నందూకి రేఖ వాతలు పెట్టడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఓ కానిస్టేబుల్ ఇంట్లో పెరుగుతుంది. ఇందూ పెరిగి పెద్దయి అపర్ణ, సుభాష్‌లకు అండగా నిలుస్తుంది. అక్కడ స్వరాజ్ జులాయిగా తిరుగుతూ.. బిజినెస్ పెట్టాలంటూ తండ్రితో గొడవ పడుతూ ఉంటాడు. రుద్రాణి ఫోటోను తుడుస్తుండగా స్వాతి వచ్చి సిలబస్‌ చెప్పమని గొడవ చేస్తుండగా రుద్రాణి ఫోటో కిందపడుతుంది. దానికి సీరియస్ అయిన రేఖ.. ఇందూని కొట్టబోతుండగా సుభాష్, రేఖలు నానామాటలు అంటారు. నేనంటే మీకు భయం పోయిందని సుభాష్‌ని ఇంట్లో నుంచి తోసేస్తుంది రేఖ. దాంతో ఇందూ క్షమాపణలు చెబుతుంది. స్వాతి సాయంతో ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది ఇందూ. దారిలో స్వరాజ్ తన బైక్‌తో ఢీకొట్టి డబ్బుల కోసం డిమాండ్ చేస్తుండటంతో ఇందూ వార్నింగ్ ఇస్తుంది. ఎగ్జామ్ హాల్‌లో ఐశ్వర్య ఉండటంతో ఇందూ కంగారుపడుతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup March 2nd to March 7th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి మార్చి 2వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు .. 969వ ఎపిసోడ్ నుంచి 974వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

మార్చి 2వ తేదీ 969వ ఎపిసోడ్‌లో ..
నిద్రలో ఉలిక్కిపడి లేచిన స్వరాజ్‌ను లక్ష్మీ హత్తుకుంటుంది. ఈ బిడ్డ పరిస్ధితి చూస్తుంటే ఏదో పెద్ద ప్రమాదమే జరిగినట్లుగా ఉంది.. బాబుకు గతం ఎప్పుడు గుర్తుకురావాలి? మనం వాళ్ల తల్లిదండ్రులకు ఎప్పుడు అప్పగించాలని భార్యను అడుగుతాడు భర్త. ఆ బాబుకు గతం గుర్తొచ్చే వరకు మనింట్లోనే పెరుగుతాడని చెబుతుంది లక్ష్మీ. రాజ్- కావ్యతో పాటు దుగ్గిరాల కుటుంబానికి చెందిన జ్ఞాపకాలు ఉండకూడదని ఫోటోలను కాల్చి బూడిద చేస్తుంది రేఖ. దాంతో అపర్ణ కంటతడి పెడుతుంది. తన పిల్లలకు, స్వప్న కూతురికి రేఖ అక్షరాభ్యాసం చేస్తుండగా తన మనవరాలికి కూడా అక్షరాభ్యాసం చేయాలని అడుగుతుంది అపర్ణ. వీళ్లు చదువుకోవడానికి వీల్లేదు.. రేపు ఇది పెరిగి పెద్దది అయిన తర్వాత సంతకం చేస్తే చాలని కసురుకుంటుంది రేఖ. తన మనవరాలి పరిస్థితి ఇలా అయిపోయిందని అపర్ణ బాధపడుతుండగా.. కావ్య ఆత్మ ప్రత్యక్షమై అపర్ణకి హితబోధ చేస్తుంది. దాంతో తానే గురువుగా మారి పిల్లలిద్దరికీ చదువు చెబుతుంది అపర్ణ. అది చూసిన రేఖ.. వీళ్లు చదువుకోవడానికి వీల్లేదని చెప్పాను, ఈసారి రిపీట్ అయితే నీ మనవరాలి చేతుల్ని విరిచేస్తానని అంటుంది. అయినప్పటికీ ఒక బోర్డు, ముగ్గు సాయంతో పిల్లలిద్దరికీ చదువు చెబుతుంది అపర్ణ. అక్కడ స్వరాజ్ పెరిగి పెద్దవాడై తనను పెంచిన తల్లిదండ్రులకు అండగా నిలబడతాడు.

మార్చి 3వ తేదీ 970వ ఎపిసోడ్‌లో..
పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టేది లేదని.. మేం ఎంత పెడితే అంత తినాల్సిందేనని అపర్ణకు భ్రమరాంభ వార్నింగ్ ఇస్తుంది. తాను పస్తులుండి.. పిల్లలకు భోజనం తినిపిస్తుంది అపర్ణ. అది చూసిన ఇందూ.. తన నాయనమ్మకు భోజనం తినిపిస్తుంది. ఇందూ- నందూలు ఆడుకుంటూ ఉండగా స్వాతి వచ్చి బొమ్మలు ఇస్తుంది. ఇంతలో ఐశ్వర్య వచ్చి ఇవి నా బొమ్మలు.. వీటిని ముట్టుకోవద్దని గొడవ పడుతుంది. భ్రమరాంభ వచ్చి పిల్లలపై కోప్పడుతుంది. ఉదయాన్నే ఓ బిజినెస్‌మెన్ ఇంటికి వస్తుండటంతో అతని కోసం రేఖ మంచి వెరైటీలు చేయిస్తుంది. నందూకి ఆకలి వేసి డైనింగ్ టేబుల్ మీదున్న చికెన్ ముక్క తినబోతుండగా రేఖ వచ్చి అడ్డుకుంటుంది. వెంటనే కోపంతో నందూని కిచెన్‌లోకి తీసుకెళ్లి వాతలు పెడుతుంది. దాంతో రేఖపై అపర్ణ మండిపడుతుంది. అందరూ పడుకున్నాక.. ఇక నేను ఈ ఇంట్లో ఉండలేనని బాగా చదువుకుని వచ్చి రేఖ ఆంటీని కొట్టి మీ ఇద్దరినీ తీసుకెళ్లిపోతానని అనుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఆకలి వేసి ఓ బ్యాగ్‌లో నుంచి బ్రెడ్ లాక్కొని తింటుండగా నందూని ఒకామె కొట్టబోతుండగా ఓ కానిస్టేబుల్ వచ్చి సేవ్ చేస్తాడు. దాంతో అతని వెంటే వెళ్లి అక్కడే పెరుగుతుంది నందూ.

Brahmamudi Telugu Serial Weekly roundup March 2nd to March 7th episode Story

Photo Courtesy: JioHotstar

మార్చి 4వ తేదీ 971వ ఎపిసోడ్‌లో..
ఇందూ ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పని మొత్తం చేసేసి స్వాతి సహా అందరికీ కాఫీ ఇస్తుంది. సీక్రెట్‌గా చదువుకుంటూ డిగ్రీ వరకు వచ్చేశావని ఇందూతో చెబుతుంది స్వాతి. ఈ రహస్యం లీకైతే నీ వల్లే అవుతుందని అంటుంది ఇందూ. తనకు జ్యూస్ ఆలస్యంగా తీసుకొచ్చావని ఇందూపై భ్రమరాంబ మండిపడుతుంది. ఆ తర్వాత అపర్ణ- సుభాష్‌ల దగ్గరికి కాఫీ ఇస్తుంది. నీ ఇంట్లోనే నువ్వు పనిమనిషిలా బతుకుతున్నావని అపర్ణ బాధపడుతుంది. ఈ వయసులో నీకు అండగా ఉండాల్సిన ఈ తాతయ్య ఏం చేయలేక మంచానికే పరిమితం అయిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తాడు సుభాష్. దేనికైనా టైం రావాలి.. మా అమ్మనాన్నల ఆశయాల్ని కాపాడటానికి అవసరమైతే ప్రపంచంతోనే యుద్ధం చేస్తాను.. ఈ రేఖ ఎంత అని అంటుంది ఇందూ. ఆరోజున ప్రమాదం జరగకుండా ఉంటే ఈపాటికి స్వరాజ్‌తో ఇందూ పెళ్లి జరిగేదని అపర్ణ బాధపడుతుంది. నా మనవడిని కాపాడుకోలేకపోయాను.. వాడు ప్రాణాలతో ఉండి ఉంటే ఇందూకి అండగా ఉండేవాడని సుభాష్ ఆవేదన వ్యక్తం చేస్తాడు. మరోవైపు బారెడు పొద్దెక్కిని నిద్రపోతూ.. కలలు కంటున్న స్వరాజ్‌ని లాగిపెట్టి తంతాడు తండ్రి. పనిపాటా లేకుండా ఊరంతా బలాదూర్‌ తిరగడం, పగటి కలలు కంటూ ఉంటే ఎప్పుడు బాగుపడతావని చీవాట్లు పెడతాడు. ఇంతలో వాటర్ ట్యాంక్ రావడంతో మంచినీళ్లు తీసుకురమ్మని చెబుతాడు తండ్రి. స్వరాజ్ అక్కడికి వెళ్లేసరికి ఆడవాళ్లు కొట్టుకుంటూ ఉండటంతో నకిలీ నోట్లతో వాళ్లని డైవర్ట్ చేస్తాడు స్వరాజ్.

మార్చి 5వ తేదీ 972వ ఎపిసోడ్‌లో..
నకిలీ 500 నోట్లతో వాటర్ ట్యాంక్ దగ్గర ఆడవాళ్లని బురిడీ కొట్టించిన స్వరాజ్‌ని అంతా చితకబాదుతుండగా తెలివిగా తప్పించుకుంటాడు. ఇకపై నేను ఈ నీళ్లు తీసుకురాను అని తండ్రికి చెబుతాడు. నా కోసం ఎవరో ఒక మహారాణి ఎదురుచూస్తుంటుందని అంటాడు స్వరాజ్. ఉదయాన్నే రుద్రాణి, రాహుల్‌ ఫోటోలను తుడుస్తుంది ఇందూ, ఇంతలో స్వాతి వచ్చి తనకు సిలబస్‌లో డౌట్ ఉందని అర్ధమయ్యేలా చెప్పమని అడుగుతుంది. తర్వాత వస్తానని ఇందూ చెబుతున్నా వినిపించుకోకుండా స్వాతి లాగడంతో చేయి తగిలి రుద్రాణి ఫోటో కిందపడిపోతుంది. దాంతో స్వాతి, ఇందూలు వణికిపోతారు. ఇంతలో రేఖ వచ్చి.. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు.. అయినప్పటికీ జాగ్రత్త లేకుండా పనిచేస్తున్నావా? అని ఇందూని కొట్టబోతుండగా అపర్ణ సీరియస్ అవుతుంది. అయినా కిందపడింది ఆఫ్ట్రాల్ రుద్రాణి ఫోటోయే.. దాని బతుకంతా కేరాఫ్ ఫ్లాట్‌ఫాం, జాలిపడి ఇంట్లోకి తీసుకొస్తే మా కుటుంబాన్ని నాకు దూరం చేసిందని నానామాటలు అంటుంది అపర్ణ. దాంతో రేఖ సీరియస్ అయి మీకు నేనంటే భయం పోయింది.. దానిని చంపేస్తానని చెబుతుంది. వెంటనే సుభాష్‌ని ఇంట్లో నుంచి తోసేస్తుంది. సుభాష్‌ కిందపడి దెబ్బలు పడటంతో ఇందూ క్షమాపణలు అడగటంతో రేఖ వదిలేస్తుంది. ఇకపై ఎవరు తప్పు చేసినా శిక్ష నీకేనని ఇందూకి వార్నింగ్ ఇస్తుంది. నా వల్ల రేఖ ఆంటీ చేతిలో మీరు అవమానాలు పడ్డారని ఇందూకి సారీ చెబుతుంది స్వాతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది.

Brahmamudi Telugu Serial Weekly roundup March 2nd to March 7th episode Story

Photo Courtesy: JioHotstar

మార్చి 6వ తేదీ 973వ ఎపిసోడ్‌లో..
పరీక్షకు టైం అవుతూ ఉండటంతో ఇంట్లో నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇందూ టెన్షన్ పడుతుంది. ఇంతలో రేఖ వచ్చి తనకు టిఫిన్ పెట్టమని అడుగుతుంది. ఇందూ వచ్చి దోశలు వేయడంతో తనకు బ్రెడ్ అమ్లేట్ వేయమని సీరియస్ అవుతుంది. భూషణ్‌ను పిలిచి నువ్వు చేసిన అప్పులు పెరిగిపోతున్నాయి. ఆ చక్రీ గాడు విసిగిస్తున్నాడని మండిపడుతుంది రేఖ. ఎలాగైనా ఎగ్జామ్‌కి వెళ్లాలని అనుకున్న ఇందూ.. వెంటనే ఐశ్వర్య ఇంకా నిద్రలేవలేదని మీరే చూసుకోండి అని రేఖకి చెబుతుంది. దాంతో రేఖ వెళ్లి ఐశ్వర్యని నిద్రలేపుతుంది. ఇంత లేట్ అయితే ఎగ్జామ్ ఎలా రాస్తావు? అసలు ప్రిపేర్ అయ్యావా? లేదా అని అడుగుతుంది రేఖ. మరోవైపు.. స్వరాజ్ ఎలాగైనా డబ్బులు సంపాదించాలని చీటింగ్ చేస్తుంటాడు. పాత లాప్‌టాప్‌ని కొత్తదానిలా మార్చేసి దానిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడతాడు. కస్టమర్ ఫోన్ చేయగానే దానిని 50 వేలకు అమ్ముతానని చెబుతాడు. తమ్ముడు ఆఫీస్‌కి రెడీ అవుతుంటే రాజ్ అడ్డుపడతాడు. నీ తమ్ముడు కష్టపడి చదివి నాకు ఇంటి ఖర్చులలో సాయం చేస్తున్నాడు. నువ్వు గాలి తిరుగుళ్లు తిరగడమే సరిపోతుందని తండ్రి చీవాట్లు పెడతాడు. నన్ను ప్రశాంతంగా టిఫిన్ కూడా తిననివ్వవా అని రాజ్ అలిగి వెళ్లిపోతాడు. ఇందూని ఎగ్జామ్‌కి తీసుకెళ్లడానికి స్వాతి ఓ ప్లాన్ వేస్తుంది.

మార్చి 7వ తేదీ 974వ ఎపిసోడ్‌లో..
ఇందూ ముఖాన డ్రెస్ విసిరేసిన స్వాతి.. దానిని అర్జెంట్‌గా కుట్టించుకుని రమ్మని చెబుతుంది. నేను బయటికి వెళ్తే రేఖ ఆంటీ ఊరుకోదని ఇందూ చెప్పగా భ్రమరాంబ కంగారుపడుతుంది. ఈ ఇంట్లో నీ పవర్ ఇంతేనా అని తల్లిని స్వాతి రెచ్చగొట్టడంతో ఏం జరిగినా నేను చూసుకుంటానని అంటుంది భ్రమరాంబ. వెంటనే డ్రైవర్‌ని పిలిచి ఇందూని బయటకు తీసుకెళ్లమని చెబుతుంది. ఇంతలో ఇందూ కారుకు డ్యాష్ ఇచ్చిన స్వరాజ్.. ఎలాగైనా డబ్బు కొట్టేయాలని పెద్ద గొడవ చేస్తాడు. దాంతో ఇందూ కారులోంచి దిగి వార్నింగ్ ఇవ్వడంతో రాజ్‌తో పాటు జనం పారిపోతారు. ఎగ్జామ్ హాల్‌కి వెళ్లిచూసేసరికి అక్కడ ఐశ్వర్య ఉండటంతో ఇందూ షాక్ అవుతుంది. ఆమె నుంచి తప్పించుకోవడానికి మాస్క్ పెట్టుకుని లోపలికి వస్తుంది. అక్కడ ఇన్విజిలేటర్ మాస్క్ తీయమని చెప్పడంతో ఐశ్వర్యకు కనిపించకుండా తీస్తుంది. అనంతరం కాపీ కొడుతూ ఇన్విజిలేటర్‌కు దొరికిపోతుంది ఇందూ. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X