Brahmamudi weekly roundup: ఇందూ పీకలపై రేఖ కత్తి.. కుటుంబం కోసం కిడ్నాపర్‌గా స్వరాజ్

Photo Courtesy: JioHotstar

స్వరాజ్ ఇంటికి జనాభా లెక్కల పేరుతో తన మనిషిని కలిసి రాజ్ గురించి అన్నీ తెలుసుకుంటుంది రేఖ. డ్రగ్స్ స్మగ్లర్‌ను పట్టుకునేందుకు నందూ వెంటబడుతుండగా అతను రాజ్- లక్కీలకు డబ్బు ఆశ చూపించి డ్రగ్స్ బ్యాగ్‌ని తన మనుషులకు ఇవ్వమని చెబుతాడు. దాంతో రాజ్- లక్కీలను నందూ వెంటాడుతుంది. బ్యాగ్‌లో ఉన్నది డ్రగ్స్ ప్యాకెట్ అని తెలుసుకున్న స్వరాజ్.. దీని వల్ల దేశానికి నష్టమని భావించి డ్రగ్స్ మొత్తం నీళ్లలో కలిపేస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన డ్రగ్స్ ముఠా వాళ్లు.. మర్యాదగా 10 లక్షలు ఇవ్వకుంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు. ఇందూ చేత వేలిముద్రలు వేయించుకుని ఆస్తి మొత్తం కొట్టేయడానికి రేఖ ప్లాన్ చేస్తుంది. ఇందూని కిడ్నాప్ చేసి రేఖ దగ్గరి నుంచి డబ్బులు కొట్టేయాలని అనుకున్న ఐశ్వర్య వెంటనే.. స్వరాజ్- లక్కీలతో డీల్ మాట్లాడుతుంది. స్వరాజ్ తమ్ముడు వెంకీని కారుతో గుద్దిస్తుంది డ్రగ్స్ మాఫియా. రేఖ బారి నుంచి ఆస్తిని ఎలా కాపాడాలో తెలియక ఇందూ ఏడుస్తూ ఉంటుంది. అటు ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఐశ్వర్య చెప్పినట్లు ఇందూని కిడ్నాప్ చేయడానికి ఒప్పుకుంటాడు స్వరాజ్.

Brahmamudi Telugu Serial Weekly roundup March 30th to April 4th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు .. 993వ ఎపిసోడ్ నుంచి 998వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

మార్చి 30వ తేదీ 993వ ఎపిసోడ్‌లో ..
స్వరాజ్ ఎవరు? రాజ్ మేనల్లుడేనా? అని ఆలోచిస్తూ పీకలదాకా మందు తాగుతుంది రేఖ. ఇంతలో భ్రమరాంబ వచ్చి.. ఏం జరిగిందని అడుగుతుంది. ఈ ఇంటి వారసుడు రాజ్‌ని మా అమ్మ కొట్టి కొట్టి చంపింది. ఉదయం మన ఇంటికి వచ్చిన కుర్రాడు అచ్చం రాజ్‌ పోలికలతో ఉన్నాడని రేఖ చెప్పడంతో భ్రమరాంబ షాక్ అవుతుంది. రేపు అతను మన ఇంటికి వచ్చిన ఇందూకి బావగా తోడుగా నిలబడితే మనం చిక్కుల్లో పడాల్సి వస్తుందని చెబుతుంది. అయితే ఈ ఆస్తి మనకి దక్కనట్లేనా? 20 ఏళ్ల మన నిరీక్షణ వృథాయేనా అని భ్రమరాంబ బాధపడుతుంది. తన కుటుంబం మొత్తం యాక్సిడెంట్‌లో చనిపోయిన కల రావడంతో రాజ్ ఉలిక్కిపడి లేస్తాడు. దాంతో రాజ్‌కి సంబంధించిన వాళ్లు ఎవరో మనింటికి వెతుక్కుంటూ రాబోతున్నారని లక్ష్మీ చెబుతుంది. స్వరాజ్ ఇంటి వద్దకు వచ్చిన రేఖ.. తన మనిషిని జనాభా లెక్కల అధికారిగా పంపించి వివరాలన్నీ తెలుసుకుంటుంది. చలపతి - లక్ష్మీ చెప్పినదానిని బట్టి రాజ్‌కి దుగ్గిరాల కుటుంబానికి సంబంధం లేదని తేల్చుకుంటుంది. నువ్వు తప్పులు మీద తప్పులు చేస్తున్నావు.. అంత డబ్బు నీకెందుకు? నెక్లెస్ ఎందుకు అమ్మాల్సి వచ్చిందని ఐశ్వర్యని నిలదీస్తుంది ఇందూ. దాంతో ఐశ్వర్య చాలా కోప్పడుతుంది. వెంకీని రోజాని కలపడానికి రెస్టారెంట్‌కి వస్తుంది నందూ.

మార్చి 31వ తేదీ 994వ ఎపిసోడ్‌లో..
రోజాని, వెంకీని కలపడానికి నందూ సాయం చేస్తుంది. చెవిలో బ్లూటూత్ పెట్టుకుని ఆమె చెబుతున్న మాటలను రోజా చెబుతాడు వెంకీ. ఇంతలో ఓ డ్రగ్స్ స్మగ్లర్ కనిపించడంతో అతనిని నందూ వెంటాడుతుంది. నందూ లేకపోవడంతో ఏదేదో మాట్లాడటంతో వెంకీకి ఛీ కొట్టి వెళ్లిపోతుంది రోజా. మార్కెట్‌లో కూరగాయలు కొనుక్కుని తిరిగి వస్తుండగా ఇందూని స్వరాజ్ బైక్‌తో ఢీకొట్టడంతో ఇందూ- స్వరాజ్‌కు పెద్ద గొడవ జరుగుతుంది. లక్కీ జోక్యం చేసుకుని కూరగాయలు కొనిపెట్టి ఇందూని పంపించేస్తాడు. నందూ బారి నుంచి తప్పించుకునే క్రమంలో హార్ట్ పేషెంట్‌లా నాటకమాడతాడు స్మగ్లర్. అతని పరిస్ధితి చూసి రాజ్- లక్కీలు బైక్ ఆపి ఆసుపత్రికి తీసుకెళ్తామని చెబుతారు. ఆసుపత్రి పక్కనే ఉంది, నేను వెళ్లిపోతాను .. కానీ ఈ మందులు అర్జెంట్‌గా నా తండ్రికి అప్పగించాలని చెబుతాడు స్మగ్లర్. మీకు 10 వేల రూపాయలు ఇస్తానని ఆశపెట్టడంతో రాజ్- లక్కీలు డ్రగ్స్ ఉన్న బ్యాగ్‌ని తీసుకుని బయల్దేరతారు. రాజ్ ఫోన్ నెంబర్, ఫోటోని వాళ్ల బాస్‌కి మెసేజ్ చేస్తాడు స్మగ్లర్. ఇంతలో నందూ, పోలీసులు అతనిని పట్టుకుని బ్యాగ్ ఏమైందని నిలదీస్తాడు. దూరంగా స్వరాజ్- లక్కీలు బైక్‌పై వెళ్తూ కనిపించడంతో వారిని వెంబడిస్తారు.

Brahmamudi Telugu Serial Weekly roundup March 30th to April 4th episode Story

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 1వ తేదీ 995వ ఎపిసోడ్‌లో..
ఇందూ ఆస్తిని కొట్టేయడానికి లాయర్‌ని కలుస్తుంది రేఖ. ఇందూ ఒక్క వేలు ముద్ర వేస్తే చాలు.. దుగ్గిరాల వారి ఆస్తి మొత్తం మీ సొంతం అయిపోతుందని చెబుతాడు లాయర్. ఆ ఇందూయే కోర్టులో కేసు వేసినా ఏం చేయలేని విధంగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశానని చెబుతాడు లాయర్. పోలీసులు వెంటాడుతూ ఉండటంతో ఓ బంగ్లాలో దాక్కుని కంగారు పడతారు స్వరాజ్- లక్కీ. అసలు ఆ బ్యాగ్‌లో ఏముందో చూడగా అందులో డ్రగ్స్ ఉంటాయి. ఇది మార్కెట్‌లోకి వెళితే అమాయకులైన పిల్లల జీవితాలు పాడైపోతాయి.. ఇది వాళ్లకి దక్కనివ్వకూడదని అనుకుంటాడు రాజ్. వెంటనే ఆ డ్రగ్స్ ప్యాకెట్ చించి పౌడర్ మొత్తాన్ని నీటిలో కలిపేస్తాడు. ఇదంతా చూసిన డ్రగ్స్ ముఠా.. 10 లక్షలు కట్టాలని లేదంటే నీ ఫ్యామిలీని చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇందూ ఆస్తిని కొట్టేయడానికి లాయర్‌ని కలుస్తుంది రేఖ. ఇందూ ఒక్క వేలు ముద్ర వేస్తే చాలు.. దుగ్గిరాల వారి ఆస్తి మొత్తం మీ సొంతం అయిపోతుందని చెబుతాడు లాయర్. ఆ ఇందూయే కోర్టులో కేసు వేసినా ఏం చేయలేని విధంగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశానని చెబుతాడు లాయర్. పోలీసులు వెంటాడుతూ ఉండటంతో ఓ బంగ్లాలో దాక్కుని కంగారు పడతారు స్వరాజ్- లక్కీ. అసలు ఆ బ్యాగ్‌లో ఏముందో చూడగా అందులో డ్రగ్స్ ఉంటాయి. ఇది మార్కెట్‌లోకి వెళితే అమాయకులైన పిల్లల జీవితాలు పాడైపోతాయి.. ఇది వాళ్లకి దక్కనివ్వకూడదని అనుకుంటాడు రాజ్. వెంటనే ఆ డ్రగ్స్ ప్యాకెట్ చించి పౌడర్ మొత్తాన్ని నీటిలో కలిపేస్తాడు. ఇదంతా చూసిన డ్రగ్స్ ముఠా.. 10 లక్షలు కట్టాలని లేదంటే నీ ఫ్యామిలీని చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో రాజ్ షాక్ అవుతాడు.

ఏప్రిల్ 2వ తేదీ 996వ ఎపిసోడ్‌లో..
నీకు నాలుగు బట్టలు తీసుకొచ్చి, ప్రేమగా మాట్లాడిందని రేఖ బుట్టలో పడొద్దని ఇందూతో చెబుతుంది అపర్ణ. రెండ్రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది.. ఆ రోజు నాతో ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకునేందుకు ఆ రేఖ డ్రామాలు ఆడుతుందని నాకు తెలుసు అంటుంది ఇందూ. ఆస్తి కన్నా నాకు మీ ప్రాణాలు ముఖ్యం.. నేను సంతకాలు పెట్టకపోతే ఆ రేఖ మిమ్మల్ని ఏమైనా చేస్తుందని నా భయం. కాకపోతే నా తల్లిదండ్రుల ఆశయాల్ని నెరవేర్చేందుకు నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను... ఆ దేవుడే దారి చూపుతాడని అంటుంది ఇందూ. రేఖ ప్రవర్తన అనుమానంగా ఉండటంతో గట్టిగా నిలదీస్తుంది భ్రమరాంబ. ఆస్తి మన చేతికి రావడానికి ముందు ఇవన్నీ తప్పదని నచ్చజెబుతుంది రేఖ. డ్రగ్స్ మాఫియా 10 లక్షల రూపాయలు కట్టమని బెదిరించడంతో స్వరాజ్- లక్కీలు మందు తాగుతారు. ఆ రోజు ఇందూ ఎదురు రావడం వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డ స్వరాజ్.. వెంటనే ఆమెకు ఫోన్ చేసి తిడతాడు. రాకేష్ బాకీ తీర్చడానికి 10 లక్షల రూపాయలు కావాలని ఐశ్వర్య అడగ్గా.. రేఖ నో చెబుతుంది. కారణం చెబితేనే ఇస్తాను, లేదంటే ఇవ్వనని చెప్పడంతో ఐశ్వర్య కోపంగా వెళ్లిపోతుంది. ఈ ఆస్తిని నమ్ముకుని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి.. వారిని ఆదుకోవడానికి నాకు దారి చూపించమని కృష్ణుడి ముందు వేడుకుంటుంది ఇందూ.

Brahmamudi Telugu Serial Weekly roundup March 30th to April 4th episode Story

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 3వ తేదీ 997వ ఎపిసోడ్‌లో..
నా బాకీ తీర్చాలంటే రాకేష్ ఒత్తిడి చేయడంతో ఐశ్వర్యకు ఏం చేయాలో అర్ధంకాక తలపట్టుకుంటుంది. పదివేల రూపాయల కోసం కక్కుర్తిపడి ఇప్పుడు 10 లక్షల రూపాయల్లో ఇరుక్కుపోయామని లక్కీపై మండిపడతాడు స్వరాజ్. మనం 10 లక్షలు సంపాదించాలంటే మనకి 2 లక్షలు పెట్టుబడి, 10 రోజులు టైం కావాలని అంటాడు. ఇందూ- స్వాతి మాట్లాడుకుంటూ ఉండగా.. ఇందూని కిడ్నాప్ చేయాలని అనుకుంటుంది ఐశ్వర్య. వెంటనే లక్కీకి ఫోన్ చేసి అర్జెంట్‌గా కలవాలని చెబుతుంది. నన్ను, రోజాని కలుపుతానని చెప్పి మధ్యలో వదిలేసి వెళ్లిపోయావని నందూపై అరుస్తాడు వెంకీ. అది నిన్ను వాడుకుంటోంది, నీకు అది కరెక్ట్ కాదని అంటుంది నందూ. నువ్వు వద్దు, నీ ఫ్రెండ్‌షిప్ వద్దంటూ కోపంగా వెళ్లిపోతుండగా వెంకీని కారు గుద్దేసి వెళ్లిపోతుంది. దాంతో తనకి మందు రాస్తుంది నందూ. రాజ్- లక్కీలను కలిసిన ఐశ్వర్య.. నేను చెప్పినట్లు ఒకరిని కిడ్నాప్ చేస్తే బోల్డెంత డబ్బు వస్తుంది, దానితో మీ కష్టాలు తీరతాయని టెంప్ట్ చేస్తుంది. స్వరాజ్- లక్కీలు మాత్రం ఈ ప్రపోజల్‌కు ఒప్పుకోకుండా కోపంగా వెళ్లిపోతారు. రేఖ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఆస్తిని ఎలా కాపాడుకోవాలో అర్ధంకాక ఏడుస్తున్న ఇందూని స్వాతి ఓదారుస్తుంది. స్వరాజ్- లక్కీలు ఇంటికెళ్లి చూసేసరికి సాహూ వాడి మనుషులు లోపల ఉంటారు.

ఏప్రిల్ 4వ తేదీ 998వ ఎపిసోడ్‌లో..
సాహూకి రాజ్ గురించి చలపతి చెబుతుండగా దెబ్బలతో ఇంటికొస్తాడు వెంకీ. తమ్ముడిని చూడగానే ఏం జరిగిందని కంగారుపడతాడు రాజ్. దాంతో ఓ కారు వేగంగా వచ్చి నన్ను గుద్ధిందని కొద్దిలో మిస్ అయిపోయిందని చెబుతాడు వెంకీ. రాజ్‌ను బయటకు తీసుకెళ్లిన సాహూ.. మీ తమ్ముడి మీదకి వెళ్లిన కారు మాదే, టైంకి డబ్బులు ఇవ్వకపోతే ఈసారి మీ ఇంటి మీదకి బుల్డోజర్ వస్తుందని వార్నింగ్ ఇస్తాడు సాహూ. దాంతో లక్కీ చేత ఐశ్వర్యకి ఫోన్ చేయించి కిడ్నాప్‌కి ఒప్పుకుంటాడు. మేం కిడ్నాప్ ఎవరినీ చేయాలని స్వరాజ్ అడగ్గా.. ఇందూ ఫోటో చూపిస్తుంది ఐశ్వర్య. అది చూడగానే రాజ్, లక్కీలు షాక్ అవుతారు. ఈమె సంతకం పెడితే కోట్ల ఆస్తి మా ఆంటీకి వస్తుంది, ఇందూని కిడ్నాప్ చేస్తే ఎంత కావాలంటే అంత డబ్బు వస్తుందని చెబుతుంది ఐశ్వర్య. ఇందూకి రేఖ బట్టలు ఇచ్చి.. రేపు ఫాంహౌస్‌లో నీ బర్త్ డే పార్టీ చేస్తున్నామని చెబుతుంది. ఇదంతా చూసిన అపర్ణ, స్వాతిలు ఇందూ ఏం చేయబోతుందా అని టెన్షన్ పడతాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X