Brahmamudi weekly roundup: కావ్య దెబ్బకి షాకైన రుద్రాణి.. కళావతితో క్లోజ్‌గా రాజ్, యామిని నిఘా

యామినిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రికి రాజ్ మాట ఇస్తాడు. బావగారు బతికే ఉన్నారని తెలుసుకున్న అప్పూ చాలా సంతోషిస్తుంది . కానీ ఈ యామిని ఎవరని టెన్షన్ పడుతుంది. రాజ్ ఒంటరిగా కలవాలని చెప్పడంతో రెస్టారెంట్‌కు బయల్దేరిన కావ్యను రుద్రాణి ఫాలో అవుతుంది. అక్కడ ఆమె గాల్లో మాట్లాడుతూ ఉండటంతో దానిని వీడియో తీసి ఇంట్లో వాళ్లకి చూపెడుతుంది. భర్త అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇంటికొచ్చిన కావ్యను రుద్రాణి నిలదీయడంతో నేను బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతున్నానని చెప్పి కౌంటర్ ఇస్తుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup March 31st to April 5th episode Story

కావ్య ప్రవర్తనతో అపర్ణ గుండె ముక్కలవుతుంది. కావ్యకు ప్రతి విషయలో అడ్డొస్తున్న రుద్రాణికి బుద్ధి చెప్పాలని అప్పూతో అంటుంది స్వప్న. ఇద్దరూ కలిసి ఓ ప్లాన్ గీస్తారు. ముందుగా రాహుల్‌ని అమ్మాయి పేరుతో ట్రాప్ చేసి ఇంటి నుంచి బయటికి రప్పిస్తారు. మధ్యలోనే ఎందుకు వచ్చేశారని కావ్యను రాజ్ అడగ్గా.. తొలనొప్పిగా ఉండే నేనే వచ్చేశానని అంటుంది కావ్య. ఇంతలో యామిని వచ్చి కారు కీస్ రాజ్ చేతిలో పెడుతుంది. రుద్రాణిని డైనింగ్ టేబుల్ దగ్గరికి రప్పించి బతికున్న చేపలని, కోడిని తన చేతిలో పెడతారు అప్పూ- స్వప్న.

మా అత్తయ్యకి చేపలు, చికెన్ పచ్చిగా కనిపిస్తున్నాయని చెబుతుంది స్వప్న. ప్రకాశం చెక్ చేసి చూడగా చేపల పులుసు, చికెన్ కర్రీ కనిపించి రుద్రాణిపై మండిపడతారు. వంటగదిలో బిజీగా ఉన్న కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు. తలనొప్పికి తన వద్ద చిట్కా ఉందని చెప్పడంతో రాజ్ చెప్పినట్లుగా వేడి కొబ్బరి నూనెను తలకు రాసుకుంటుంది కావ్య. రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేసిన స్వప్న ఇంటికి ఎలా రావాలో డైరెక్షన్స్ ఇస్తుంది.ఆ వెంటనే తిక్క వేషాలు వేస్తావా అంటూ రాహుల్‌ను చావబాదుతుంది.

బ్రహ్మముడి మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు.. 683 ఎపిసోడ్ నుంచి 688 వరకు ఏం జరిగిందంటే?

మార్చి 31వ తేదీ 683వ ఎపిసోడ్‌లో ... యామిని తండ్రి ఆరోగ్య పరిస్ధితి చూసి రాజ్ కరిగిపోతాడు. యామినిని పెళ్లి చేసుకుంటానని అతని చేతిలో చేయ్యేసి మాట ఇస్తాడు. బయటికి వెళ్లి బాధపడుతున్న రాజ్ దగ్గరికి యామిని వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని థ్యాంక్స్ చెబుతుంది. దూరం నుంచి వీరిద్దరి మాటలన్నీ విన్న అప్పూ - కావ్యలు షాక్ అవుతారు. బావగారికి నిజం చెప్పి మన ఇంటికి తీసుకెళ్దామని కావ్యతో అప్పూ అంటుంది. అలా చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి కావ్య ఆగిపోతుంది. అసలు ఆ యామిని వివరాలు తెలుసుకోమని అప్పూకి చెబుతుంది కావ్య. యామిని తండ్రిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నా జీవితంలో ఇంకో అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు రాజ్.

ఏప్రిల్ 1వ తేదీ 684వ ఎపిసోడ్‌లో ... మిమ్మల్ని ఒకసారి కలవాలని కావ్యకి మెసేజ్ చేస్తాడు రాజ్. రాజ్‌ గతం గురించి నిజం చెప్పబోయిన తండ్రిపై మండిపడిన యామిని కత్తి తీసుకుని తండ్రి మీదకి వెళ్తుంది. నా ప్రేమకు, రాజ్‌కు ఎవరైనా అడ్డొస్తే నేను క్షమించనని చేయి కోసుకోబోతుండగా తల్లిదండ్రులు యామినిని అడ్డుకుంటారు. నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదని.. నీకోసం ఏమైనా చేస్తానని మాట ఇస్తాడు తండ్రి. రాజ్‌ను కలవడానికి బాగా ముస్తాబై బయల్దేరుతుంది కావ్య.

ఆమెను చూసిన రుద్రాణి , దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రుద్రాణికి డౌట్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించడంతో ఆయన వచ్చే వరకు కంపెనీ వ్యవహారాలు చూసుకుందామని ఆఫీస్‌కి వెళ్తున్నానని అంటుంది కావ్య. కావ్యపై అనుమానం వచ్చి ఆమెను ఫాలో అవుతారు రాహుల్- రుద్రాణి. అమ్మానాన్నలు సమాధుల దగ్గరికి వెళ్లొస్తానని యామిని తల్లిదండ్రులకు చెప్పి బయల్దేరతాడు రాజ్.

ఏప్రిల్ 2వ తేదీ 685వ ఎపిసోడ్‌లో ... కావ్యని కారులో ఫాలో అయి రెస్టారెంట్ దగ్గరికి వస్తారు రాహుల్ - రుద్రాణి. వారు వెళ్లేసరికి ఎదురుగా ఎవ్వరూ లేకపోయినా ఉన్నారనుకుని కావ్య మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆమెను వీడియో తీసి కావ్యకి పిచ్చి పట్టిందని చెప్పి ఇంట్లో నమ్మించాలని బయల్దేరతారు రాహుల్ - రుద్రాణి. ఇంతలో రాజ్ అక్కడి రాగా అతని చేయి పట్టుకుని పక్కకి లాగుతుంది కావ్య.

ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత రాజ్‌ను ఒంటరిగా ఎందుకు పంపించారని తల్లిదండ్రులపై కోప్పడిన యామిని.. రాజ్‌కు పదే పదే ఫోన్ చేసి విసిగిస్తుంది. తల్లిదండ్రుల సమాధుల దగ్గరి నుంచి ఇప్పుడే రెస్టారెంట్‌కు వచ్చానని యామినికి చెబుతాడు రాజ్. రాజ్ గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక కావ్య కన్నీళ్లను ఆపుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఏప్రిల్ 3వ తేదీ 686వ ఎపిసోడ్‌లో ... రాజ్ ఎంత బతిమలాడుతున్న పట్టించుకోకుండా కావ్య రెస్టారెంట్‌ నుంచి ఇంటికి వెళ్లిపోతుంది. ఇంతలో రాజ్‌ను వెతుక్కుంటూ యామిని అక్కడికొస్తుంది. కాఫీ తాగేశానని ఇంటికి వెళ్లిపోదామని చెబుతాడు రాజ్. టేబుల్‌పై రెండు కప్పులు కనిపించడంతో యామినికి అనుమానం వస్తుంది. యామిని గురించి ఆరా తీయమని కానిస్టేబుల్‌కు చెప్పిన అప్పూ అతని నుంచి వివరాలు తెలుసుకుంటుంది. రెస్టారెంట్‌లో కావ్య గాల్లో మాట్లాడుతున్న వీడియోను దుగ్గిరాల ఫ్యామిలీకీ చూపించడంతో వారంతా షాక్ అవుతారు.

ఇంతలో కావ్య రావడంతో మన హీరోయిన్ ఇంటికి వచ్చేసిందంటూ ఆమెపై రుద్రాణి సెటైర్లు వేస్తుంది. కావ్యకి పూర్తిగా మతిస్థిమితం పోయిందని రాజ్ చనిపోయినా బతికే ఉన్నాడని అనుకుంటుందని అంటుంది. నేను గాల్లో మాట్లాడ లేదని, బ్లూటూత్ పెట్టుకుని క్లయింట్‌తో మాట్లాడుతున్నానని కావ్య చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. వీడియోలో తాను బ్లూటూత్ పెట్టుకున్న దృశ్యాన్ని చూపించడంతో రుద్రాణి ఉలిక్కిపడుతుంది. ఇంటికొచ్చిన యామిని .. ఇకపై నువ్వెక్కడికి వెళ్లినా నాకు చెప్పాల్సిందేనని రాజ్‌కు వార్నింగ్ ఇస్తుంది. నేనేం చిన్నపిల్లాడిని కాదని, నాకు కొంచెం ప్రైవసీ కావాలని అంటాడు రాజ్. కావ్య గురించి రుద్రాణి చూపించిన వీడియోతో గుండె పగిలిన అపర్ణ బాధపడుతుంది.

ఏప్రిల్ 4వ తేదీ 687వ ఎపిసోడ్‌లో ... కావ్యకు ప్రతి విషయంలోనూ అడ్డు రావడంతో పాటు పిచ్చిదానిలా ముద్ర వేయాలని చూస్తోన్న రుద్రాణికి షాక్ ఇవ్వాలని అప్పూతో చెబుతుంది స్వప్న. రాహుల్ ఉండగా ఆవిడను ఆడుకోవడం కుదరదని వేరే నెంబర్ నుంచి గొంతు మార్చి స్వీట్ వాయిస్‌తో రాహుల్‌కు ఫోన్ చేస్తుంది స్వప్న. నేను టీనా అని నీకోసం ఎదురుచూస్తూ ఉంటానని ఓ అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మంటుంది. ఆ అమ్మాయి కోసం రాహుల్ హడావుడిగా వెళ్తాడు. మధ్యలోనే ఎందుకు వచ్చేశారని కావ్యను రాజ్ అడగ్గా.. తొలనొప్పిగా ఉండే నేనే వచ్చేశానని అంటుంది కావ్య. ఇంతలో యామిని వచ్చి నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చానని కారు కీస్ చేతిలో పెడుతుంది. రాజ్ ఫోటో చూసి బాధపడుతున్న కావ్యని సుభాస్ ఓదారుస్తాడు. రుద్రాణిని డైనింగ్ టేబుల్ దగ్గరికి రప్పించి బతికున్న చేపలని, కోడిని తన చేతిలో పెడతారు అప్పూ- స్వప్న.

Brahmamudi Telugu Serial Weekly roundup March 31st to April 5th episode Story

ఏప్రిల్ 5వ తేదీ 688వ ఎపిసోడ్‌లో ... నాకు పిచ్చి పట్టిందని అప్పూ- స్వప్నలు ఏడిపిస్తున్నారని ధాన్యం- ప్రకాశం దగ్గరికి వెళ్లి చెబుతుంది రుద్రాణి. అంతా కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. మా అత్తయ్యకి చేపలు, చికెన్ పచ్చిగా కనిపిస్తున్నాయని చెబుతుంది స్వప్న. ప్రకాశం చెక్ చేసి చూడగా చేపల పులుసు, చికెన్ కర్రీ కనిపించి రుద్రాణిపై మండిపడతారు. వంటగదిలో బిజీగా ఉన్న కావ్యకి రాజ్ ఫోన్ చేయడంతో ఆ ఫోన్ ఎవరో చూడమని అత్తగారికి చెబుతుంది కావ్య.

ఫోన్ చేసింది తన భర్త ఏమోనని డౌట్ పడ్డ కావ్య .. పరుగు పరుగున వచ్చి ఫోన్ అందుకుని పైకి వెళ్లి మాట్లాడుతుంది. తలనొప్పికి తన వద్ద చిట్కా ఉందని చెప్పడంతో రాజ్ చెప్పినట్లుగా వేడి కొబ్బరి నూనెను తలకు రాసుకుంటుంది కావ్య. తన భర్తే వచ్చి తనకు మసాజ్ చేసినట్లుగా కావ్య ఊహించుకుంటుంది. టీనా కనిపించకపోవడంతో ఆమెకు ఫోన్ చేస్తాడు రాహుల్. ఫోన్ లిఫ్ట్ చేసిన స్వప్న ఇంటికి ఎలా రావాలో డైరెక్షన్స్ ఇస్తుంది. ఆమె చెప్పిన ప్లేస్ తన ఇల్లే కావడంతో రాహుల్ షాక్ అవుతాడు. ఆ వెంటనే పెళ్లయి, పెళ్లాం, బిడ్డలు ఉన్న నువ్వు తిక్క వేషాలు వేస్తావా అంటూ రాహుల్‌ను చావబాదుతుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X