Brahmamudi weekly roundup: రేఖని బోల్తా కొట్టించిన ఇందూ.. అక్క అని తెలియక ఐశ్వర్యతో నందూ గొడవ
Photo Courtesy: JioHotstar
పరీక్షల్లో కాపీ కొడుతున్న ఐశ్వర్యని ఎగ్జామ్ సెంటర్ నుంచి డిబార్ చేస్తారు. పరీక్ష రాసి ఇంటికొస్తున్న ఇందూని రేఖ చూసి ఇంటి దగ్గర నిలదీస్తుంది. తాను టైలర్ దగ్గరికి వెళ్లానని ఇందూ చెప్పగా.. రేఖ టైలర్‌కి ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటుంది. సుభాష్‌కి మందులతో నయం కాదని.. ఆపరేషన్ చేయాలని అందుకు 15 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్ చెప్పడంతో అపర్ణ, ఇందూలు షాక్ అవుతారు. తాతయ్య ఆపరేషన్‌కి డబ్బులు అడుగుదామని రేఖకి దగ్గరికి వెళ్లగా ఇందూని తిట్టి పంపేస్తుంది. రేఖ ఇంటికి శివరామ్ అనే బిజినెస్ వచ్చి తనకు ఇందూ వంట నచ్చి తన ఇంట్లో వంట మనిషిగా రమ్మని అడగటంతో సరేనని అంటుంది ఇందూ. ఇదంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని శివరామ్‌తో నేనే చెప్పించానని ఇందూ చెప్పడంతో అపర్ణ, స్వాతిలు షాక్ అవుతారు. శివరామ్ ఇంటికి వెళ్లే సమయంలో ఉద్యోగం చేస్తానని చెబుతుంది. స్వాతి తన ఫ్రెండ్ ద్వారా ఇంటర్వ్యూ కోసం ఇందూని ఓ పబ్‌కి పంపుతుంది. అక్కడ రాఖీ అనే వ్యక్తి కన్ను ఇందూపై పడి ఆమెను ఎలాగైనా అనుభవించాలని ప్లాన్ చేస్తాడు.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి మార్చి 9వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు .. 975వ ఎపిసోడ్ నుంచి 980వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
మార్చి 9వ తేదీ 975వ ఎపిసోడ్‌లో ..
పరీక్ష హాల్‌లో స్లిప్స్ పెట్టి దొరికిపోతుంది ఐశ్వర్య. దాంతో ఆమెను, ఆమె ఫ్రెండ్స్‌ని డిబార్ చేస్తారు. ఇదంతా చూసిన ఇందూ.. ఫాస్ట్‌గా ఎగ్జామ్ రాస్తుంది. భూషణ్ చేసిన అప్పుకి బదులుగా అతని కంపెనీని క్యాప్చర్ చేయాలని అనుకుంటాడు చక్రీ. దాంతో తన చేతికి త్వరలోనే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వస్తుందని.. ఆ కంపెనీ కాంట్రాక్ట్స్ అన్నీ నీకే ఇస్తానని ఆఫర్ చేస్తుంది రేఖ. ఆలోచనలో పడ్డ చక్రీ చివరికి డీల్‌కి ఓకే అంటాడు. నాకు మరో 2 కోట్ల రూపాయలు కావాలని రేఖ అడగటంతో సరేనని చెక్ రాసి ఇచ్చేస్తాడు చక్రీ. ఎగ్జామ్ రాసి తిరిగొస్తున్న ఇందూని రేఖ- భూషణ్‌లు చూస్తారు. పనికిరాని లాప్‌లాప్‌ని చీటింగ్ చేసి ఓ వ్యక్తికి అమ్మేస్తాడు స్వరాజ్. అది 5 నిమిషాలకు మించి వర్క్ కాదని తెలిసి వెంటనే హోటల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈ విషయాన్ని కస్టమర్ అడగ్గా.. మేం నీకు పనికిరాని లాప్‌లాప్ అమ్మానని స్వరాజ్ చెప్పడంతో ఆ వ్యక్తి షాక్ అవుతాడు. ఎగ్జామ్ రాసి ఇంటికొచ్చిన ఇందూపై సీరియస్ అవుతుంది రేఖ. నేను ఇల్లు దాటి బయటకు వెళ్లొద్దని చెప్పాను కదా? ఎందుకు వెళ్లావని నిలదీస్తుంది. స్వాతి డ్రెస్ కుట్టించమని భ్రమరాంబ పిన్ని పంపిస్తేనే వెళ్లానని అంటుంది ఇందూ.
మార్చి 10వ తేదీ 976వ ఎపిసోడ్‌లో..
బయటి నుంచి వచ్చిన ఇందూని ఎక్కడికి వెళ్లావు? ఎవరికి చెప్పి వెళ్లావు? అని నిలదీస్తుంది రేఖ. స్వాతి డ్రెస్‌ని కుట్టించడానికి బయటికి వెళ్లానని ఇందూ చెప్పడంతో నువ్వు వెళ్లి షాప్ అడ్రెస్, టైలర్ ఫోన్ నెంబర్ ఇవ్వమని అడగటంతో ఇందూ, స్వాతిలు షాక్ అవుతారు. వెంటనే టైలర్‌కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయగా.. ఇందూ గారు వచ్చారని చెప్పడంతో స్వాతి, ఇందూ, అపర్ణలు ఊపిరి పీల్చుకుంటారు. నన్నెందుకు మీరు బయటకు వెళ్లనివ్వడం లేదని ఇందూ అడగ్గా రేఖ మండిపడుతుంది. పరీక్ష బాగా రాశానని అపర్ణతో చెబుతుంది ఇందూ. అయితే చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అప్పూ కూతురు నందూని తలచుకుని అపర్ణ బాధపడుతుంది. నందూ చదువుకుంటూ పాకెట్ మనీ కోసం బోకే నడుపుతూ ఉంటుంది. అక్కడికి స్వరాజ్ తమ్ముడు వెంకట్ వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ కోసం మంచి బోకే ఇవ్వమని అడుగుతాడు. గోడ మీద రాసున్న కొటేషన్స్ బాగుండటంతో ఆమెను మెచ్చుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్‌ని ఫాలో అవుతూ గులాబీ పూలు ఇచ్చి.. నందూ దగ్గర చదివిన కొటేషన్స్ చెప్పడంతో అతని ప్రియురాలు ఇంప్రెస్ అవుతుంది. ఇంతలో నందూ వచ్చి తన కొటేషన్స్ వాడుకున్నందుకు 1000 రూపాయలు కట్టమని అడగటంతో వెంకట్ కట్టేస్తాడు.

Photo Courtesy: JioHotstar
మార్చి 11వ తేదీ 977వ ఎపిసోడ్‌లో..
సుభాష్‌కి మందుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆపరేషన్ ఒక్కటే మార్గమని, లేదంటే ఇలా జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సి వస్తుందని డాక్టర్ చెబుతాడు. అలాగే ఆపరేషన్‌కి 15 లక్షల రూపాయలు అవుతుందని చెప్పడంతో అపర్ణ, ఇందూలు షాక్ అవుతారు. దాంతో ఆపరేషన్‌కి కావాల్సిన డబ్బు కోసం రేఖని అడగటానికి వెళ్తుంది ఇందూ. ఇదే సమయంలో ఐశ్వర్య వచ్చి పార్టీ కోసం లక్ష రూపాయలు కావాలని అడగటంతో వెంటనే ఇచ్చేస్తుంది రేఖ. కానీ సుభాష్ ఆపరేషన్‌ని మాత్రం పట్టించుకోకుండా అవమానిస్తుంది. రాత్రికి మనింటికి శివరామ్ అని పెద్ద బిజినెస్‌మెన్ వస్తున్నాడని.. ఆయనకి మంచి వెరైటీలు వండాలని ఆర్డర్ వేయడంతో ఇందూ ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఈ ఆస్తి నా చేతికి వచ్చాక.. ఆ శివరామ్ ద్వారా మరింత ఎదగొచ్చని భ్రమరాంబతో చెబుతుంది రేఖ. టీ షాప్‌లో టీ తాగుతున్న ఓ రౌడీని గుర్తుపట్టిన నందూ.. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాడిని వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగిస్తుంది. ఇంతలో శివరామ్ దుగ్గిరాల వారింటికి వస్తాడు. ఆయనను లోపలికి పిలిచి ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంది. ఇందూని మాత్రం పనిమనిషి అని చెబుతుంది. ఆ మాటలతో స్వాతి, అపర్ణ రగిలిపోతారు. ఫుడ్ చాలా టేస్ట్‌గా ఉండటంతో ఇందూని మెచ్చుకున్న శివరామ్.. తన ఇంట్లో వంట చేయడానికి పంపించమని అడుగుతాడు. ఖచ్చితంగా వస్తుందని రేఖ చెప్పగా.. ఇందూ కూడా సరేనని అంటుంది. ఇదంతా చూసిన రేఖ, స్వాతిలు షాక్ అవుతారు.
మార్చి 12వ తేదీ 978వ ఎపిసోడ్‌లో..
ఇందూని శివరామ్ గారింటికి పనిమనిషిగా పంపడానికి నీకెంత ధైర్యమని రేఖపై మండిపడుతుంది అపర్ణ. ఇందూ ఈ ఇంటి వారసురాలు.. దుగ్గిరాల వారి రక్తమని చెబుతుంది. అయినా ఇందూకి లేని ఇబ్బంది నీకెంటీ అని ప్రశ్నిస్తుంది రేఖ. దాంతో నేను శివరామ్ గారింటికి వెళ్లనని చెప్పమని అపర్ణ చెప్పగా.. నాకు ఇష్టమేనని ఇందూ చెప్పడంతో అపర్ణ, స్వాతిలు షాక్ అవుతారు. ఇందూ అంత తేలికగా పనిమనిషిగా వెళ్లడానికి ఒప్పుకోవడంపై రేఖకి అనుమానం వస్తుంది. లోపల ఇందూకి అపర్ణ, స్వాతిలు క్లాస్ పీకుతారు. వాళ్లిద్దరినీ కూల్ చేసిన ఇందూ.. నాకు శివరామ్ గారు ముందే తెలుసు, నేను చెప్పడం వల్లే ఆయన అలా అడిగారని చెప్పడంతో అపర్ణ, స్వాతిలు షాక్ అవుతారు. తాతయ్యకి ఆపరేషన్ చేయించాలి... మీ ఇద్దరినీ బాగా చూసుకోవాలని ఇందూ చెప్పడంతో ఆమె తెలివితేటలకి స్వాతి ఆశ్చర్యపోతుంది. లాప్‌టాప్ అమ్మి సంపాదించిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ఫ్రెండ్‌తో చెబుతాడు స్వరాజ్. అయితే పబ్‌లో బిల్లు ఎలా కట్టాలో అర్ధం కాక తన తమ్ముడు వెంకట్‌ని అక్కడికి రప్పిస్తారు. మా ఫ్రెండ్ వాళ్ల అన్నయ్యని అడిగి నీకు మంచి ఉద్యోగం చూస్తానని ఇందూతో స్వాతి చెబుతుంది.

Photo Courtesy: JioHotstar
మార్చి 13వ తేదీ 979వ ఎపిసోడ్‌లో..
తమ్ముడిని మోసం చేసి పబ్‌లో ఎంజాయ్ చేస్తుంటాడు స్వరాజ్. ఫ్రెండ్‌తో మాట్లాడి స్వాతిని పబ్‌కి పంపిస్తుంది స్వాతి. అదే పబ్‌లో ఒక స్మగ్లర్ గురించి వెతుకుతూ ఉంటుంది నందూ. ఇంతలో అనుకోకుండా నందూని గుద్దుకోవడంతో ఐశ్వర్య నానామాటలు అంటుంది. ఆమెకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది నందూ. ఇందూని చూసిన రాఖీ.. ఆమెను ఎలాగైనా అనుభవించాలని ట్రాప్ చేయాలని చూస్తాడు. ఇందుకు అడ్డుగా ఉన్న సంతోష్‌ని ఆఫీస్‌కి పంపిస్తాడు. స్కాచ్ తాగుతున్నా ఎక్కకపోవడంతో బేరర్‌ని చితకబాదుతాడు లక్కీ. దాంతో స్వరాజ్ అతనిని కూల్ చేసి చీప్ లిక్కర్ తీసుకురమ్మని చెబుతాడు. స్మగ్లర్ పబ్‌కి రావడంతో అతని గురించి పోలీసులకు ఇన్ఫర్మ్ చేస్తుంది నందూ. అతనికి కనిపించకుండా ఉండేందుకు గాను అప్పుడే అక్కడికి వచ్చి వెంకీతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. నీకు నా పీఏగా జాబ్ ఇస్తాను.. కానీ నేను పెట్టే టెస్టులలో పాస్ కావాలని రాఖీ చెప్పడంతో ఇందూ సరేనని అంటుంది. ఆమెకు మందు పోస్తుండగా వద్దు అని చెప్పడంతో రాఖీ ఈగో హర్ట్ అవుతుంది. పబ్‌లో పరిస్ధితులు చూసి ఇందూకి అనుమానం వస్తుంది. అయితే జాబ్ కోసం అన్నింటినీ మౌనంగా భరిస్తుంది.
మార్చి 14వ తేదీ 980వ ఎపిసోడ్‌లో..
పబ్‌లో ఇందూని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా నటించి ఆమెను ఎలాగైనా తన ట్రాప్‌లోకి తీసుకురావాలని అనుకుంటాడు రాఖీ. మరోవైపు.. ఇందూ సంతకం పెడితే తనకు రాబోయే ఆస్తుల గురించి రేఖ, భ్రమరాంబలు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇంతలో రేఖకు ఎక్కిళ్లు రావడంతో మంచినీళ్లు తీసుకుని రమ్మని ఇందూని పిలుస్తారు. ఇందూ లేకపోవడంతో అపర్ణ, స్వాతిలు టెన్షన్ పడతారు. ఇందూకి బదులుగా రేఖ వెళ్లి వాటర్ ఇస్తుంది. దాంతో ఇందూ ఎక్కడ? అసలు ఇంట్లోనే ఉందా? లేదా అని రేఖ, భ్రమరాంబలకు అనుమానం వస్తుంది. భ్రమరాంబ వెళ్లి గదిలో చూడగా ఇందూ ప్లేస్‌లో స్వాతి పడుకుని ఉండటంతో అపర్ణ ఊపిరి పీల్చుకుంటుంది. పబ్‌లో ఐశ్వర్యని పడేస్తానని వెళ్లి చీవాట్లు తింటాడు లక్కీ. దాంతో స్వరాజ్ తన ఫ్రెండ్‌తో పందెం కాసి వెళ్లి ఐశ్వర్యతో పులిహోర కలిపి ఆమె దగ్గరి నుంచి ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. దాంతో ఫ్రెండ్స్ ఇద్దరూ గొడవపడతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











