Brahmamudi weekly roundup: రేఖ కన్నకొడుకే లక్కీ.. రాజ్ పుట్టుకపై నిజం దాచిన చలపతి, నిరాశలో అపర్ణ

Photo Courtesy: JioHotstar

ఇందూని పెళ్లి చేసుకొచ్చిన రాజ్ ఒక కథ చెప్పి అందరినీ బురిడీ కొట్టిస్తాడు. రాజ్‌ని పక్కకి పిలిచిన ఐశ్వర్య.. నువ్వు ఏదో పెద్ద ప్లాన్‌తోనే ఈ ఇంటికి వచ్చావు, మర్యాదగా నా డబ్బులు నాకివ్వమని మండిపడుతుంది. రాజ్- ఇందూలని ఒకే గదిలో పడుకోకుండా చూడటానికి రేఖ స్కెచ్ వేస్తుంది. రాజ్ గురించి తెలుసుకోవడానికి అతని ఇంటికి వెళ్లిన అపర్ణకి నిజం చెప్పకుండా దాచేస్తారు చలపతి- లక్ష్మీ. ఆస్తి మీ పేరు మీదకి రావాలంటే ఇందూ - రాజ్‌ల మ్యారేజ్ సర్టిఫికెట్, ఇందూ వేలిముద్రలు, ఇందూ భర్త సంతకం కావాలని లాయర్ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. తన తల్లి గురించి తెలుసుకోవడానికి ఆంటోనీ అనే వ్యక్తికి అడిగినవన్నీ ఇస్తుంటాడు లక్కీ. రేఖ కన్నకొడుకే లక్కీ అని తెలిసినా ఆ నిజం చెప్పడు ఆంటోనీ. రాజ్‌ను పెళ్లి చేసుకోవడంపై ఇందూని నిలదీస్తుంది నందూ. నీకెందుకు చెప్పాలని ఇందూ అడగ్గా.. నేను చెల్లెల్ని అని నిజం చెబుతుంది నందూ. కంపెనీలో శాలరీలు వేయడం లేదని అపర్ణకి పీఏ శృతి చెప్పడంతో రేఖపై విరుచుకుపడుతుంది అపర్ణ. రాజ్‌కి ఇవ్వాల్సిన పేమెంట్‌ని కట్ చేస్తుంది ఇందూ.

Brahmamudi Telugu Serial Weekly roundup May 11th to May 16th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి మే 11వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు .. 1029వ ఎపిసోడ్ నుంచి 1034వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

మే 11వ తేదీ 1029వ ఎపిసోడ్‌లో ..
నువ్వు ఎవరు? మీ అమ్మానాన్న పేర్లు ఏంటని రాజ్‌ను అడుగుతుంది అపర్ణ. దాంతో ఏదో ఒక పేరు చెప్పాలని అనుకుంటాడు రాజ్. అయితే ఇందూ మాత్రం ఇతని తల్లిదండ్రుల పేర్లు చలపతి- లక్ష్మీ అని తమ్ముడు వెంకటేశ్వర్లు అని చెబుతుంది. ఈ దుగ్గిరాల ఆస్తిని సంపాదించాలన్నది మా అమ్మ కల.. ఆమె తర్వాత నేను ఎన్నో పావులు కదుపుతున్నా, చివరి క్షణంలో ఆస్తి చేజారిపోతోందని భూషణ్‌తో చెబుతూ రగిలిపోతుంది రేఖ. ఏం చేసైనా సరే ఇందూ- రాజ్‌లను వీడగొట్టి మదన్‌తో ఇందూకి పెళ్లి చేసి ఆస్తిని దక్కించుకోవాలని అనుకుంటుంది రేఖ. కొడుకు పోలికలతో ఉన్న రాజ్‌ని చూసి అపర్ణ- సుభాష్‌లు సంతోషిస్తారు. వీడు ఖచ్చితంగా మన మనవడు.. మన కూతురి కొడుకే అయ్యుంటాడని అనుకుంటారు. ఇల్లంతా తిరిగి చూసిన రాజ్‌ను స్టోర్ రూమ్‌లోకి తీసుకొస్తుంది ఇందూ. ఇకపై మనం ఉండాల్సింది ఇక్కడేనని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. అలాగే పెళ్లి ఆపడానికి ఇద్దరి మధ్య జరిగిన డీల్ గురించి కూడా రాజ్‌కు గుర్తుచేస్తుంది. భర్త పేరుతో హద్దులు దాటితే శాలరీ కట్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. ఈ దెబ్బతో రాజ్‌ సరేనని అంగీకరిస్తాడు.

మే 12వ తేదీ 1030వ ఎపిసోడ్‌లో..
నువ్వు నా దగ్గర ఎక్స్‌ట్రాలు చేసినందుకు, నన్ను టచ్ చేసినందుకు 2 వేల రూపాయలు కట్ చేస్తున్నానని ఇందూ అనడంతో రాజ్ మండిపడతాడు. ఇకపై జాగ్రత్తగానే ఉంటానని రాజ్ చెప్పడంతో ఇందూ సరేనని వెళ్లిపోతుంది. రాజ్ ఎక్కడున్నాడో తెలియక లక్కీ ఎంత ఫోన్ చేసిన స్విచ్ఛాఫ్ వస్తుంది. అటు చలపతి- లక్ష్మీలు కూడా కొడుకు కోసం బాధపడుతుంటారు. ఇంతలో లక్కీ కూడా రాజ్ గురించి అడుగుతూ ఫోన్ చేయడంతో చలపతి ఇంకా కంగారుపడతాడు. రాజ్‌ని పక్కకి లాక్కెళ్లిన ఐశ్వర్య.. నువ్వు పెద్ద ప్లాన్‌తోనే మా ఇంటికి వచ్చావని నాకు తెలుసు. మర్యాదగా నాకు రావాల్సిన 10 లక్షలు నాకు ఇచ్చేయమని వార్నింగ్ ఇస్తుంది ఐశ్వర్య. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను.. ఆలోపు ఎక్స్‌ట్రాలు చేస్తే మీ ఆంటీకి అసలు నిజం చెప్పేస్తానని రాజ్ వార్నింగ్ ఇస్తాడు. రేఖ దగ్గరికి వెళ్లిన ఇందూ.. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని మీరేం చేయమంటే అది చేస్తానని అంటుంది. దాంతో విడాకులు ఇచ్చేస్తావా? అని రేఖ అడగ్గా.. సరేనని చెబుతుంది ఇందూ. అయితే పక్కనే ఉన్న భ్రమరాంబ ఈ ప్లాన్ చెడగొట్టాలని.. ఏడాది వరకు విడాకులు తీసుకోవడం కుదరదని చెబుతుంది. విడాకులకు ఏడాది అయితే ఏంటీ? ఇందూకి పెళ్లి అవ్వగానే ఆస్తి మీద పూర్తి హక్కు వచ్చేసింది కాబట్టి తనతో వేలిముద్రలు వేయించుకోవాలని ప్లాన్ చేస్తుంది రేఖ.

Brahmamudi Telugu Serial Weekly roundup May 11th to May 16th episode Story

Photo Courtesy: JioHotstar

మే 13వ తేదీ 1031వ ఎపిసోడ్‌లో..
రాజ్ ఇంటికి రాకపోవడంతో చలపతి- లక్ష్మీ కంగారుపడతారు. వీడు దుగ్గిరాల వారి వారసుడని తెలిసినప్పటి నుంచి వాడికి ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని ఇద్దరూ భయపడతారు. వాటర్ తీసుకుంటూ కిందపడిపోతున్న సుభాష్‌ని రాజ్ పట్టుకుని మంచినీళ్లు తాగిస్తాడు. ఇదంతా చూసిన అపర్ణ మురిసిపోతుంది. ఖచ్చితంగా ఇతనికి మాతో ఏదో బంధం ఉందని అనుకుని రాజ్ ఇంటి అడ్రస్ ఇవ్వమని ఇందూని అడుగుతుంది అపర్ణ. దుగ్గిరాల కుటుంబం గురించి, మా పరిస్ధితి ఇలా ఎందుకు మారిపోయిందో రాజ్‌కు చెబుతాడు సుభాష్. రాజ్- ఇందూలు కలిసిపోతే వాళ్లకి బిడ్డ పుడితే విడాకులు కష్టమని భావించిన రేఖ.. భ్రమరాంబ, శేషంలతో కలిసి రాజ్- ఇందూలు ఒకే గదిలో పడుకోకుండా ఆపుతుంది. ఇందూని భ్రమరాంబ గదిలో ఉంచి, రాజ్‌తో శేషం ఉండేలా చేస్తుంది. రాజ్‌ను వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తుంది అపర్ణ. నా పేరు దుగ్గిరాల అపర్ణా దేవి అని చెప్పగానే చలపతి - లక్ష్మీలు షాక్ అవుతారు. మీ అబ్బాయి అచ్చం మా అబ్బాయిలాగే ఉన్నాడు. ఒక ప్రమాదంలో నా కొడుకులు, కోడళ్లు, కుటుంబం మొత్తాన్ని పొగొట్టుకున్నాను. మీ అబ్బాయి నా కూతురి కొడుకులాగా అనిపిస్తున్నాడు అంటుంది అపర్ణ.

మే 14వ తేదీ 1032వ ఎపిసోడ్‌లో..
రాజ్ తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్లిన అపర్ణ.. తనను తాను దుగ్గిరాల కుటుంబానికి చెందిన వ్యక్తినని చెప్పడంతో లక్ష్మీ- చలపతిలు షాక్ అవుతారు. మీ ఇంట్లో ఉన్నది నా మనవడే, వాడిది దుగ్గిరాల రక్తమని అంటుంది. అపర్ణ కన్నీటితో కరిగిపోయిన చలపతి నిజం చెప్పబోతుండగా పీఏ శృతి మాటలు గుర్తొచ్చి రాజ్ మా పెద్ద కొడుకని అబద్ధం చెబుతాడు. దాంతో అపర్ణ ఏడుస్తూ వెళ్లిపోతుంది. రాజ్ పనిపాటా చేయకుండా జీవితాంతం ప్రాణాలతో నా కళ్లముందే ఉంటే చాలని, ఎప్పటికీ ఈ నిజం చెప్పనని లక్ష్మీతో అంటాడు చలపతి. లక్కీ తండ్రి ఆంటోనీ జైలు నుంచి విడుదలవుతాడు. చలపతి ఇంటి నుంచి వస్తున్న అపర్ణని పీఏ శృతి చూసి తనను తాను పరిచయం చేసుకుంటుంది. రాజ్ సార్, కావ్య మేడం ఉన్నప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైభవంగా ఉన్నాయి. కానీ రేఖ మేడం కంపెనీని నాశనం చేస్తోందని, ఈ నెలలో ఉద్యోగులకు జీతం కూడా వేయలేదని శృతి చెప్పడంతో అపర్ణ కోపంతో రగిలిపోతుంది. రాజ్‌ని ఇందూ పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న నందూ నేరుగా ఇంటికొచ్చి అక్కని నిలదీస్తుంది. నువ్వు ఆ జులాయిగాడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు.. వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని కోప్పడుతుంది. దాంతో సీరియస్ అయిన ఇందూ.. నా పెళ్లి గురించి నీకెందుకు? నువ్వు నా సొంత చెల్లివా? అని అడుగుతుంది. సొంత చెల్లెలిని కాబట్టే బాధపడుతున్నానని.. నేనెవరో కాదు నందూని అని చెప్పడంతో ఇందూ షాక్‌తో కంటతడి పెడుతుంది. ఇన్నాళ్లూ ఎక్కడికి వెళ్లిపోయావని చెల్లిని హత్తుకుంటుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup May 11th to May 16th episode Story

Photo Courtesy: JioHotstar

మే 15వ తేదీ 1033వ ఎపిసోడ్‌లో..
చిన్నప్పుడు రేఖ ఆంటీకి భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయానని ఇందూకి చెబుతుంది నందూ. అయినా నువ్వు వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని నందూ అడగ్గా.. జరిగినదంతా చెబుతుంది ఇందూ. లోపలికి వెళ్లి నానమ్మతో మాట్లాడదామని ఇందూ తీసుకెళ్తుండగా.. నా చదువు త్వరలోనే పూర్తవుతుంది, ఆ లోపు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అంటుంది నందూ. నేను పోలీస్‌ని అయ్యాక నీకు కూడా సాయం చేస్తానని చెబుతుంది. చెల్లెలి మాటలతో ఏం చేయలేక మౌనంగా ఉంటుంది ఇందూ. ఆంటోనీని తన తల్లి గురించి చెప్పమని అడుగుతాడు లక్కీ. దాంతో ఆంటోనీ జరిగినదంతా గుర్తుచేసుకుంటాడు. లక్కీగాడు రేఖకి పుట్టిన అక్రమ సంతానం కావడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. రేఖ ఫ్యామిలీ అంతా లాయర్‌ను కలిసి ఇందూ ఆస్తిని తమ పేరిటకి ట్రాన్స్‌ఫర్ చేయమని అడుగుతుంది. ఇందూ మ్యారేజ్ సర్టిఫికెట్, ఆమె వేలిముద్రలు, ఆమె భర్త సంతకం కావాలని అప్పుడే ఆస్తి మీ పేరు మీదకి వస్తుందని లాయర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంత ఆస్తి తనకు వస్తుందని తెలిస్తే రాజ్ గాడు సంతకం పెట్టడని వాడికి డబ్బులు ఆశ చూపించి సంతకం పెట్టించుకోవాలని రేఖ ప్లాన్ చేస్తుంది.

మే 16వ తేదీ 1034వ ఎపిసోడ్‌లో..
ఇందూని పెళ్లి చేసుకున్నావు.. ఐశ్వర్యకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇవ్వకుండా ఆమెను నాకు దూరం చేశావని రాజ్‌పై మండిపడతాడు లక్కీ. నిన్ను కూడా ఆ ఇంటికి వచ్చేలా చేస్తాను.. అప్పుడు ఐశ్వర్యకి ఇంకా దగ్గరగా ఉండి ఆమెను పెళ్లి చేసుకోవచ్చని అంటాడు రాజ్. ఆ మాటలకు లక్కీ సంబరపడిపోతాడు. ఉద్యోగులకు జీతం ఇవ్వకపోవడంపై రేఖపై మండిపడుతుంది అపర్ణ. ఆ డబ్బుతో నేను జల్సాలు చేయలేదు. నీ మనవరాలిని విడిపించడానికి కిడ్నాపర్లకు ఇచ్చానని అంటుంది. నా జోలికి వస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా రెచ్చిపోతున్నావని వార్నింగ్ ఇవ్వడంతో అపర్ణని ఇందూ కూల్ చేస్తుంది. కంపెనీలో ఆ రేఖ ఇంకా ఎలాంటి తప్పులు చేస్తుందోనని సుభాష్‌ దగ్గర బాధపడుతుంది అపర్ణ. ఇంతలో ఇందూ రావడంతో నీ స్థానంలో మీ అమ్మ ఉండి ఉంటే ఆ రేఖని ఎదిరించేది, మనవాళ్లకు అండగా నిలిచేదని క్లాస్ పీకుతుంది అపర్ణ. రాజ్‌కి డాక్టర్ ఫోన్ చేసి నా డబ్బులు నాకు ఇవ్వకపోతే ట్రీట్‌మెంట్ ఆపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. దాంతో తన పేమెంట్ గురించి ఇందూని అడగ్గా.. ఆమె 1000 రూపాయలు చేతిలో పెడుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X