Brahmamudi Weekly Roundup: యామినితో రుద్రాణి డీల్.. డేంజర్‌లో అప్పూ ఉద్యోగం.. పుట్టింటికి అల్లుడైన రాజ్

మీరు బలవంతం పెట్టడం వల్లే నేను ఆయన ప్రాణాలతో ఆడుకున్నానని అపర్ణపై మండిపడుతుంది కావ్య. ఇకపై రాజ్‌తో మాట్లాడనని తేల్చి చెబుతుంది. కావ్యను వెతుక్కుంటూ ఇంటికొచ్చిన రాజ్‌ మనసును కళావతి ముక్కలు చేస్తుంది. యామినితో చేతులు కలిపిన రుద్రాణి .. రాజ్‌ను తీసుకుని మా ఇంటికి రమ్మని చెబుతుంది. పెళ్లి పత్రికలు ఇచ్చే వంకతో దుగ్గిరాల వారింటికి రాజ్‌ను తీసుకొచ్చిన యామిని.. పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ సమయంలో అపర్ణ అక్కడే ఉండటంతో మీకు, కళావతికి ఏంటి సంబంధమని అడుగుతాడు రాజ్. వాళ్లిద్దరూ అత్తా కోడళ్లని చెప్పడంతో కావ్యని ఛీ కొట్టి రాజ్ వెళ్లిపోతాడు.

కావ్యని, రాజ్‌ని కలపాలని ఫ్యామిలీతో కలిసి అపర్ణ ప్లాన్ చేసి కళ్యాణ్ ద్వారా రాజ్‌ని ఇంటికి పిలిపిస్తుంది. నువ్వంటే మా కావ్యకి చాలా ఇష్టమని ఆమెను ఒప్పించడానికి మేమంతా సాయం చేస్తామని రాజ్‌కి చెబుతుంది అపర్ణ. ఉదయాన్ని రాజ్‌ని ఇంట్లో చూసిన కావ్య అతనిని వెళ్లిపోమని మండిపడుతుంది. దుగ్గిరాల వారింటికి వెళ్లిన సంగతి దాచి పెట్టిన రాజ్ పెళ్లి పనుల మీద తిరుగుతున్నానని చెప్పడంతో యామిని సంతోషిస్తుంది. ఆయన మా ఇంటికే వచ్చారని కావ్య చెప్పడంతో షాక్ అవుతుంది.

అప్పూ తన కళ్యాణ్‌ని పట్టించుకోవడం లేదని ప్రకాశంతో చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఉదయాన్నే ఆఫీసుకి వెళ్తున్న అప్పూని ఉద్యోగం మానేయమని ఆర్డర్ వేస్తుంది. ఫ్యామిలీ అంతా అండగా నిలబడటంతో ధాన్యం సైలెంట్ అయిపోతుంది. కావ్యకి అర్జెంట్ వర్క్ ఉందని శంషాబాద్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేయిస్తుంది రుద్రాణి. నిజమేనని బయల్దేరిన కావ్యని సుభాష్ ఆపి ఆ పని మేం పూర్తి చేశామని చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. రాజ్ ఇంటికొచ్చాక కావ్య పెళ్లి ఫోటోను చూపిస్తానని యామినికి రుద్రాణి చెబుతుండగా స్వప్న వింటుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup May 12th to May 17th episode Story

బ్రహ్మముడి మే 12వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు .. 719 ఎపిసోడ్ నుంచి 724 వరకు ఏం జరిగిందంటే?

మే 12వ తేదీ 719వ ఎపిసోడ్‌లో ... నేను ఆయనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చానని కానీ మీరు నా ప్లాన్ మొత్తం చెడగొట్టి నన్ను తొందరపెట్టారని అపర్ణపై మండిపడుతుంది కావ్య. ఇకపై మీరెంత బలవంతం చేసినా ఆయనతో మాట్లాడనని కనీసం ఆయన ప్రాణాలతో ఉంటే చాలని కావ్య చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తకపోవడంతో బాధపడ్డ రాజ్ నేరుగా కావ్య ఇంటికి వెళ్తాడు. ప్రేమగా తనను కలవడానికి వచ్చిన భర్తను కావ్య నానామాటలు అని పంపిస్తుంది కళావతి. రాజ్‌ను ఇంటికి రాకుండా చేయాలని యామినితో చేతులు కలుపుతుంది రుద్రాణి. నేరుగా దుగ్గిరాల ఇంటికి వచ్చి కావ్య - అపర్ణల నాటకాన్ని బయటపెట్టాలని యామినికి సలహా ఇస్తుంది.

మే 13వ తేదీ 720వ ఎపిసోడ్‌లో ... మీ బెస్ట్ ఫ్రెండ్ కావ్యకి తొలి శుభలేఖ ఇద్దామని చెప్పి రాజ్‌ను దుగ్గిరాల వారింటికి తీసుకెళ్తుంది యామిని. త్వరలో మేం పెళ్లి చేసుకోబోతున్నామని సీతారామయ్య- ఇందిరలకు పెళ్లి పత్రిక ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. మీరంతా ఖచ్చితంగా మా పెళ్లికి రావాలని దుగ్గిరాల ఫ్యామిలీని ఆహ్వనిస్తుంది యామిని. ఇంతలో అపర్ణ రావడం చూసిన మీరెవ్వరు? మీకు కావ్యకి సంబంధం ఏంటని నిలదీస్తాడు. వాళ్లిద్దరూ అత్తాకోడళ్లని అందుకే ఒకే ఇంట్లో ఉంటున్నారని రుద్రాణి చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇక జీవితంలో మీ మొహం చూడనని కావ్యని ఛీ కొట్టి వెళ్లిపోతాడు రాజ్. నా దారికి అడ్డు తగిలితే ఇలాగే ఉంటుందని కావ్యకి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది యామిని. రాజ్‌ను కావ్యని కలపాలని నిర్ణయించుకున్న అపర్ణ ఫ్యామిలీతో కలిసి ప్లాన్ చేస్తుంది.

మే 14వ తేదీ 721వ ఎపిసోడ్‌లో ... రాజ్‌ను ఇక్కడికి రప్పించే బాధ్యతను కళ్యాణ్‌కు అప్పగించి ఇంటికి పిలిపిస్తుంది అపర్ణ. కావ్య నిన్ను ఇష్టపడుతుందని, కానీ నీకు యామినితో పెళ్లి ఫిక్స్ కావడంతో మౌనంగా ఉండిపోయిందని చెప్పడంతో రాజ్ సంబరపడిపోతాడు. కావ్యను ఒప్పించడానికి మేమంతా నీకు సాయం చేస్తామని చెప్పడంతో రాజ్ సరేనంటాడు. ఉదయాన్నే కావ్య రెడీ అవుతుండగా ఇంట్లో ఇకఇకలు పకపకలు వినిపిస్తాయి. బయటికి వచ్చి చూడగా రాజ్‌కు డైనింగ్ టేబుల్ వద్ద కొసరి కొసరి వడ్డిస్తారు. మా ఇంటికి ఎందుకు వచ్చారు వెళ్లిపోమని తేల్చిచెబుతుంది. ఇంట్లో రాజ్‌ను చూసిన రాహుల్, రుద్రాణిలు షాక్ అవుతారు.

మే 15వ తేదీ 722వ ఎపిసోడ్‌లో ... రాజ్‌ను చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్తుంది కావ్య. మీరేం చేసినా సరే ఇకపై మీ ఇంటికొచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తానని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. ఆ వెంటనే లోపలికి వచ్చి ఇలాంటి పనులు చేసి ఆయన ప్రాణాల మీదకి తీసుకురావొద్దని దుగ్గిరాల ఫ్యామిలీకి వార్నింగ్ ఇస్తుంది కావ్య. మెలికలు తిరుగుతూ, సిగ్గుపడుతూ ఇంటికొస్తున్న రాజ్‌ను చూసిన యామిని ఎక్కడి నుంచి వస్తున్నావని అడుగుతుంది. మన పెళ్లి పనుల మీద వెళ్లొస్తున్నానని రాజ్ చెప్పడంతో యామిని సంతోషించి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెబుతుంది. ఆ వెంటనే కావ్యకి ఫోన్ చేయగా మా ఆయన మా ఇంటి నుంచే వచ్చాడని చెప్పడంతో యామిని ఉలిక్కిపడుతుంది. అప్పూ కోసం వెయిట్ చేస్తూ భోజనం చేయకుండా కవితలు రాసుకుంటున్న కళ్యాణ్‌‌కి చీవాట్లు పెడుతుంది ధాన్యలక్ష్మీ.

Brahmamudi Telugu Serial Weekly roundup May 12th to May 17th episode Story

మే 16వ తేదీ 723వ ఎపిసోడ్‌లో ... కావ్యను ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్న రాజ్‌కి అపర్ణ ఫోన్ చేస్తుంది. ఆడపిల్లను కలవడానికి వచ్చేటప్పుడు బొకే లేదా గిఫ్ట్ తీసుకురమ్మని సలహా ఇస్తుంది. డ్యూటీ డ్యూటీ అంటూ కళ్యాణ్‌ను అప్పూ దూరం పెడుతోందని ప్రకాశంతో గొడవ పడుతుంది ధాన్యలక్ష్మీ. అలిసిపోయి వచ్చిన అప్పూకి కళ్యాణ్ భోజనం తినిపించడంతో ఆమె ఎమోషనల్ అవుతుంది. రాజ్ దగ్గరికి యామిని వచ్చి మనం పెళ్లిపత్రికలు పంచడానికి వెళ్లాలని చెబుతుంది. నేను నీతో రానని, నేనే ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నానని రాజ్ చెప్పడంతో యామిని రగిలిపోతుంది. వెంటనే రుద్రాణికి ఫోన్ చేసి దుగ్గిరాల వారింట్లో ఏం జరుగుతోందని అడుగుతుంది. రాజ్ వచ్చే సమయానికి నేను కావ్యని ఇంట్లో లేకుండా చేసి కావ్య-రాజ్‌ల పెళ్లి ఫోటోని చూపిస్తానని అప్పుడు పెళ్లయిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిసి రాజ్ ఇక్కడి నుంచి వెళ్లిపోతాడని అంటుంది రుద్రాణి.

మే 17వ తేదీ 724వ ఎపిసోడ్‌లో ... యామినికి చెప్పినట్లుగా కావ్యను ఇంట్లో లేకుండా చేయడానికి మేనేజర్‌కు ఫోన్ చేసి అర్జెంట్ పనుందని శంషాబాద్ బ్రాంచ్‌కి రమ్మని చెప్పాలని ఆర్డర్ వేస్తుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న అప్పూని ఆగమని చెప్పిన ధాన్యలక్ష్మీ నువ్వు వెంటనే ఉద్యోగం మానేయాలని చెబుతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ధాన్యలక్ష్మీకి చీవాట్లు పెట్టి అప్పూకి అండగా నిలుస్తారు. రుద్రాణి చెప్పినట్లుగానే మేనేజర్ ఫోన్ చేయడంతో కావ్య హడావుడిగా బయల్దేరుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ఆ సమస్యను మేం సాల్వ్ చేశామని ప్రకాశం, సుభాష్‌లు చేయడంతో రుద్రాణి రగిలిపోతుంది. వెంటనే యామినికి ఫోన్ చేసి మన ప్లాన్ ఫెయిలై కావ్య ఇంట్లోనే ఉండిపోయిందని, కానీ కావ్య-రాజ్‌ల పెళ్లి ఫోటోని చూపిస్తానని చెబుతుంది. దీనిని దొంగచాటుగా విన్న స్వప్న.. రుద్రాణికి కౌంటర్ ఇవ్వాలని అనుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X