Brahmamudi Weekly Roundup రాజ్‌ ఫోన్ స్విచ్చాఫ్ చేసి తప్పు చేశాడా? కావ్య కిడ్నాప్ తర్వాత...!

బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ తీసుకొచ్చి బిడ్డ ఎవరనే విషయంపై ఇంట్లో రకరకాల గొడవలు మొదలవుతాయి. ఆ తల్లికి బిడ్డ ఎవరో తెలియజేయకపోతే.. నేను ఇంటి నుంచి వెళ్లిపోతానని రాజ్ తల్లి శపథం చేస్తుంది. అయితే ఓ కారణం చెప్పి కావ్య ఆమెను ఇంటి నుంచి వెళ్లకుండా ఆపుతుంది. బిడ్డకు తల్లి ఎవరో తెలుసుకొనే ప్రయత్నంలో కావ్యను కొందరు కిడ్నాప్ చేస్తారు. మే 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు.. 408 ఎపిసోడ్ నుంచి 413 ఎపిసోడ్ వరకు ఏం జరిగిందంటే?

మే 13వ తేదీ ఎపిసోడ్‌లో
తాను తీసుకొచ్చిన బిడ్డకు తల్లి ఎవరో చెప్పకపోతే ఇంటి నుంచి వెళ్తానని చెప్పిన అత్త అపర్ణను ఓ విషయం చెప్పి ఆపుతుంది. నేను ఆ బిడ్డకు తల్లిని తీసుకొస్తానని చెప్పి అప్పటి వరకు ఉన్న సీరియస్‌ వాతావారాణ వేడిని కావ్య తగ్గించేలా చేస్తుంది. అయితే ఏ ధైర్యంతో ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తావని మాటిచ్చావని నిలదీస్తారు. అయితే ఆ స్థితిలో మరో మార్గం లేక అలా చేశానని కావ్య చెబుతుంది. మీ అత్తగారికి అలా ఎలా మాటిస్తావు, అలా చేస్తే కోడలుగా ఈ ఇంట్లో నీ స్థానం ఏమైపోతుంది అని చిట్టి కోప్పడుతుంది.

Brahmamudi Telugu Serial Weekly Roundup May 13th to May 18th episode Story

మే 14వ తేదీ ఎపిసోడ్‌లో
కల్యాణ్‌కు మరొకరితో బంధం ఉండటంపై కేసు పెట్టిన అనామిక.. తన భర్త చేతిని ముద్దు పెట్టుకోవాలని ట్రై చేస్తుంది. అయితే నీకు కేసు పెట్టడమే తెలుసని అనుకొన్నాను. కానీ ముద్దులు పెట్టడం కూడా తెలుసా? అని కల్యాణ్ సెటైర్ వేస్తాడు. ఇదిలా ఉండగా. . బెడ్‌పై పడుకొన్న రాజ్‌ను కూడా కావ్య ముద్దు పెట్టాలనుకొంటుంది. అయితే కావ్య ఆత్మ వచ్చి.. నీవు ఇలాగే ముద్దులు పెడుతూ ఉండు.. నీకు మరో బిడ్డను తెచ్చి చేతిలో పెడుతాడని దెప్పి పొడుస్తుంది.

మే 15వ తేదీ ఎపిసోడ్‌లో
రాజ్ కంపెనీ ఎండీ పదవికి రాజీనామా చేయడంతో కల్యాణ్‌ను ఆ పదవి బాధ్యతలు చెపట్టాల్సి వస్తుంది. అయితే ఆ పదవిలో ఉండటానికి అయిష్టాన్ని వ్యక్తం చేస్తాడు. దాంతో ఇంటిలో ఆధిపత్య పోరు పెరుగుతుంది. దాంతో రుద్రాణి రంగంలోకి దిగి రాహుల్‌ను కంపెనీకి వెళ్లమని ప్రోత్సహిస్తుంది. అయితే సుభాష్ వద్దకు కావ్య వచ్చి.. రాజ్ తీసుకొచ్చిన బిడ్డకు తల్లి గురించి చర్చిస్తుంది. అయితే ఏ తల్లి కూడా పాలు తాగే బిడ్డను వదిలి ఉండదు అని చెబుతుంది. దాంతో సుభాష్ తన జీవితంలో జరిగిన విషయాన్ని అంతా చెబుతాడు. ఓ అమ్మాయితో పరిచయం వల్ల కలిగిన బిడ్డను రాజ్ తీసుకొచ్చాడని చెబుతాడు.

మే 16వ తేదీ ఎపిసోడ్‌లో
రాజ్ స్థానంలో బాధ్యతలు చేపట్టేలా కల్యాణ్‌కు ఆఫీస్ వెళ్లేలా ఏదైనా మంచి ఐడియా ఇవ్వమని రుద్రాణిని అనామిక అడుగుతుంది. అయితే నీ తల్లిదండ్రులను రప్పించి వారితో చెప్పించు. నువ్వు చెబితే వినడు అని రుద్రాణి ఓ కుట్రను బయటపెడుతుంది. అయితే అయితే బిడ్డకు తల్లి ఎవరో కావ్యకు తెలిసిపోయిందా అని రాజ్ కంగారు పడుతాడు. అప్పుతో కలిసి ప్రయత్నాలు చేస్తుండటంతో ఆయన టెన్షన్ పడిపోతాడు.

మే 17వ తేదీ ఎపిసోడ్‌లో
అప్పుతో కలిసి రాజ్ బిడ్డను తీసుకొచ్చిన ఇంటికి కావ్య వెళ్తుంది. అయితే ఇంతలో రౌడీలు వచ్చి కావ్యను కిడ్నాప్ చేస్తారు. ఆమె దగ్గర ఫోన్ లాక్కొని స్విచ్ఛాఫ్ చేస్తారు. ఆ తర్వాత బలవంతంగా వ్యాన్‌లో ఆమెను తీసుకెళ్తారు. అప్పు వాళ్ల నుంచి కావ్యను కాపాడే ప్రయత్నం చేస్తుంది. కానీ అది ఫలించదు. కావ్య కిడ్నాప్ వ్యవహారాన్ని రాజ్‌కు చెప్పాలని ఫోన్ చేస్తే.. ఫోన్ స్విచ్ఛాఫ్ అవుతుంది. కల్యాణ్‌కు ట్రై చేస్తే అతడు ఫోన్ ఎత్తడు. దాంతో ఎలాగైనా రాజ్‌కు సమాచారం అందించాలని ఇంటికి బయలుదెరుతుంది. రాజ్ బావ ఇంట్లో లేరా నేను ఆయన కోసమే వచ్చాను అంటుంది. రాజ్ ఇంట్లో లేడు అని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పు.

50 ఏళ్ల వయసులో తల్లైన గబ్బర్ సింగ్ భామ.. భర్తకు విడాకులిచ్చి.. ప్రియుడితో రెండో బిడ్డ!

మే 18వ తేదీ ఎపిసోడ్‌లో
ఇక రాజ్‌ను కలిసి ఫోన్ స్విచ్చాఫ్ చేశావని అప్పు అడుగుతుంది. అయితే చార్జింగ్ లేకపోవడం వల్ల ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయిందని చెబుతాడు. దాంతో కావ్య కిడ్నాప్ విషయాన్ని రాజ్‌కు చెబుతుంది. దాంతో ఆయన షాక్ అవుతాడు. పాతబస్తీ వద్ద ఎవరో నలుగురు కిడ్నాప్ చేశారని చెబుతుంది. మరోవైపు రాజ్ పోలీసులకు విషయం అంతా చెప్పి కార్ నెంబర్ ప్లేట్ ఫోటోను పెడతాడు. మరోవైపు కిడ్నాపర్స్ అరగంటలో వ్యాన్ వస్తుంది గంటలో చెక్పోస్ట్ దాటించేస్తాము అని మాట్లాడుకోవడం కావ్యతో పాటు అక్కడ కిడ్నాప్ అయిన వాళ్ళు వింటారు. రాజ్‌ను కిడ్నాపర్లు చూసి ఎందుకు వచ్చావంటే.. ఊరికే చూడడానికి వచ్చాము అంటూ గార్డెన్ ఏరియా అంతా గమనిస్తాడు రాజ్. అయితే ప్లాన్ వర్కువుట్ చేసి కావ్యను కిడ్నాపర్ల నుంచి విడిపిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X