Brahmamudi weekly roundup: రేఖ సీఈవోగా దించేసేలా ఇందూ స్కెచ్.. ఆంటోనీ దెబ్బకు రేఖకి షాక్
Photo Courtesy: JioHotstar
ఇందూని రాజ్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకుంటుంది రేఖ. ఐశ్వర్య ఇవ్వాల్సిన డబ్బుని నేను ఇచ్చేస్తానని రాకేష్‌కు మాటిస్తుంది ఇందూ. కంపెనీ ఉద్యోగుల్ని ఆదుకోవడానికి సంస్థ బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది ఇందూ. ఉదయాన్నే రాజ్, ఇందూలు మంచి బట్టలు వేసుకుని ఆఫీస్‌కి వెళ్తుంటే అపర్ణ- సుభాష్‌లు సంతోషిస్తారు. శాలరీలు ఇస్తేనే పనిచేస్తామని స్టాఫ్ బెదిరించడంతో రేఖ రగిలిపోతుంది. ఇంతలో రాజ్- ఇందూలు అక్కడికి వచ్చి మీ జీతాలు త్వరలోనే వేయిస్తానని మాటిస్తారు. రాజ్ బిజినెస్ చేస్తున్నట్లు తన తల్లిదండ్రులకు అబద్దం చెబుతాడు. వెంకీకి నందూ తీసుకొచ్చిన అమ్మాయిలు నచ్చకపోవడంతో అందరినీ రిజెక్ట్ చేస్తాడు. నాకు, ఇందూకి రూమ్ కావాలని రాజ్ పట్టుబట్టడంతో ఐశ్వర్య గదిని ఖాళీ చేయమని చెబుతుంది రేఖ. సీఈవో పోస్ట్‌కి పోటీ చేయమని రాజ్‌ని రెచ్చగొట్టి బోర్డ్ మెంబర్‌తో మాట్లాడిస్తుంది. అతను రివర్స్ కావడంతో ఇందూ కొత్త స్కెచ్ పథకం వేస్తుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి మే 18వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు .. 1035వ ఎపిసోడ్ నుంచి 1040వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
మే 18వ తేదీ 1035వ ఎపిసోడ్‌లో ..
రాజ్‌కి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇందూ కట్ చేయడంతో అతను రగిలిపోతాడు. నువ్వు చాలా కండీషన్స్ బ్రేక్ చేశావు అందుకే డబ్బులు కట్ చేశానని అంటుంది ఇందూ. నిన్న రాత్రి నేను వంట చేస్తుంటే నువ్వు నా నడుము చూశావు. ఆ ఓవరాక్షన్‌కే నాకు మండింది అని చెబుతుంది ఇందూ. ఇకపై ఇలాంటి వేషాలు వేస్తే డబ్బులు ఇవ్వనని తేల్చేస్తుంది. రాజ్ అసలు ఇందూని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలని రేఖ అండ్ బ్యాచ్ డైనింగ్ టేబుల్ దగ్గర ప్లాన్ చేస్తుంది. రాజ్ రాగానే.. ఫోన్ కోసం ఇందూని తన గదిలోకి పంపిస్తుంది రేఖ. ఇందూ వెళ్లగానే అసలు ఇందూని ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడుగుతుంది రేఖ. నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని, ఇండస్ట్రియలిస్ట్ కావాలని ఆశ అందుకే ఇందూని పెళ్లి చేసుకున్నాను. రేపు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ని నడిపిస్తానని రాజ్ చెప్పడంతో రేఖ అండ్ బ్యాచ్ షాక్ అవుతుంది.
మే 19వ తేదీ 1036వ ఎపిసోడ్‌లో..
డబ్బు కోసం రాకేష్‌తో ఐశ్వర్య గొడవ పడటం చూసిన ఇందూ ఏం జరిగిందని అడుగుతుంది. మీ ఐశ్వర్య నా దగ్గర పది లక్షల రూపాయలు అప్పు చేసింది.. డబ్బులు ఇవ్వమంటే టార్చర్ చేస్తోందని మండిపడతాడు రాకేష్. నా సంగతి నేను చూసుకుంటానని, త్వరలోనే డబ్బులు ఇచ్చేస్తానని రాకేష్‌తో చెప్పి కోపంగా వెళ్లిపోతుంది ఐశ్వర్య. మీ డబ్బులు మీకు త్వరలోనే వచ్చేలా చేస్తానని రాకేష్‌తో చెబుతుంది ఇందూ. కంపెనీ గురించి, ఉద్యోగుల కష్టాల గురించి అపర్ణ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ బాధపడుతున్న ఇందూ.. తన తండ్రి సూట్ చూసి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉదయాన్నే రాజ్ దగ్గరికి వచ్చి ఈ సూట్ వేసుకుని నాతో పాటు ఆఫీస్‌కి రావాలని చెబుతుంది. ఉదయాన్నే రాజ్- ఇందూలు ఆఫీస్‌కి బయల్దేరుతుండటం చూసి సుభాష్, అపర్ణలు ముచ్చపడతారు. ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయటకు రాగానే కంపెనీకి వెళ్లడానికి కారు లేదా అంటూ ఇందూపై మండిపడతాడు రాజ్. ఆ వెంటనే భ్రమరాంబ కారు తాళాలు కొట్టేస్తాడు రాజ్.

Photo Courtesy: JioHotstar
మే 20వ తేదీ 1037వ ఎపిసోడ్‌లో..
భ్రమరాంబ దగ్గర కారు కోట్టేసి ఆఫీస్‌కి ఇందూని తీసుకెళ్తాడు రాజ్. ఇందూ- రాజ్‌లు ఆఫీస్‌కి వెళ్లడం చూసి సుభాష్- అపర్ణలు సంతోషిస్తారు. ఆఫీస్‌లో పెండింగ్ వర్క్స్ పెరిగిపోవడంతో శృతిపై సీరియస్ అవుతుంది రేఖ. శాలరీలు ఇచ్చే వరకు ఎంప్లాయిస్ వర్క్ చేయమని చెప్పేశారని అంటుంది శృతి. దాంతో అందరినీ పిలిచి మాట్లాడుతుంది రేఖ. శాలరీ ఇస్తేనే పనిచేస్తామని లేదంటే లేదని తేల్చేస్తారు ఉద్యోగులు. నన్ను బెదిరిస్తే మీ పేర్లను బ్లాక్ లిస్ట్‌లో పెడతాను. మీకు ఎక్కడా ఉద్యోగాలు లేకుండా చేస్తానని వార్నింగ్ ఇస్తుంది రేఖ. ఇంతలో ఇందూ- రాజ్‌లు ఆఫీస్‌కి రావడంతో రేఖ షాక్ అవుతుంది. మీ అందరికీ నేను అండగా ఉంటాను, త్వరలోనే మీ శాలరీ మీకు వచ్చేలా చేస్తానని ఇందూ చెప్పడంతో ఉద్యోగులు తిరిగి పనుల్లోకి దిగుతారు. ఆఫీస్ దగ్గరికి వచ్చిన ఆంటోనీ.. రేఖను కలవాలని శృతితో గొడవపడుతుండగా అతను వచ్చిన విషయాన్ని రేఖకి చెబుతుంది శృతి. దాంతో కంగారుపడిన రేఖ పరిగెత్తుకుంటూ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆంటోనీని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది. నాకు నెల నెలా లక్ష రూపాయలు ఇస్తే ఓకే లేదంటే మీ అక్రమ సంతానం గురించి చెప్పేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో రేఖ ఒప్పుకుంటుంది.
మే 21వ తేదీ 1038వ ఎపిసోడ్‌లో..
రాజ్ కారులో ఎలా వస్తాడో? నా కారు సేఫ్‌గా వస్తుందా లేక పార్ట్స్‌గా వస్తుందా అంటూ శేషం దగ్గర టెన్షన్ పడుతుంది భ్రమరాంబ. ఇంతలో కారులో వేగంగా వస్తాడు రాజ్. ఇకపై నా కారును నువ్వు అడగొద్దని వార్నింగ్ ఇస్తుంది భ్రమరాంబ. నేను ఆఫీస్‌కి వెళ్లినంత కాలం నీ కారులోనే వెళ్తానని చెబుతాడు రాజ్. ఇంటి నుంచి ఫోన్ రావడంతో వీడియో కాల్ మాట్లాడతాడు రాజ్. నేను బిజినెస్ చేస్తున్నా.. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇంద్రభవనంలో ఉంచుతానని, కారులో తిప్పుతానని చెబుతాడు రాజ్. వీడియో కాల్ మాట్లాడి వెనక్కి తిరిగి చూసేసరికి అపర్ణ ఏడుస్తూ కనిపించడంతో రాజ్ కంగారుపడతాడు. నువ్వు నా మనవరాలిని, మా ఆస్తికి జీవితాంతం అండగా ఉంటావా అని అడుగుతుంది అపర్ణ. మీ మనవరాలి సంగతి నేను చూసుకుంటానని అంటాడు రాజ్. వెంకీని ఓ రెస్టారెంట్‌కు తీసుకొచ్చి.. డేటింగ్ యాప్‌లో నేను ముగ్గురిని చూశాను, వాళ్లతో మాట్లాడి ఎవరు నచ్చితే వాళ్లని లవ్ చేయమని చెబుతుంది నందూ. వచ్చిన ముగ్గురు కూడా తేడాగా ఉండటంతో అందరినీ రిజెక్ట్ చేస్తాడు వెంకీ.

Photo Courtesy: JioHotstar
మే 22వ తేదీ 1039వ ఎపిసోడ్‌లో..
ఇంట్లో వస్తువులు పగులగొట్టి పెద్ద గొడవ చేస్తాడు రాజ్. దాంతో పరిగెత్తుకుంటూ వచ్చిన రేఖ.. ఏం జరిగింది? ఎందుకింత గొడవ చేస్తున్నావని మండిపడుతుంది. నేను, ఇందూ స్టోర్ రూమ్‌లో ఏదో మూలన పడుకుంటున్నాం.. మాకు స్పెషల్ గది కావాలని అడుగుతాడు. భ్రమరాంబ, స్వాతిలు రూమ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఐశ్వర్యని రూమ్ ఖాళీ చేయమని చెబుతుంది రేఖ. నేను చేయనని ఐశ్వర్య అనగా.. అయితే ఇందూకి నువ్వేం చేశావో చెబుతానని రాజ్ బ్లాక్‌మెయిల్ చేయడంతో ఐశ్వర్య సరేనని అంటుంది. ఆ రాజ్ గాడు ఏం అడిగితే అది ఎందుకిస్తున్నావని రేఖపై భ్రమరాంబ, భూషణ్ మండిపడతారు. వాడు సంతకం పెడితేనే ఈ కోట్ల ఆస్తి మన చేతికి వస్తుంది. అలాంటప్పుడు వాడిని మనదారిలోకి తెచ్చుకోవాలి కదా అని చెబుతుంది రేఖ. ఐశ్వర్య తన రూమ్ ఖాళీ చేస్తుండగా ఇందూ వస్తుంది. నువ్వు, నీ మొగుడు నాటకాలాడి నన్ను రూమ్‌లో నుంచి గెంటేశారని నీ మీద రివేంజ్ తీర్చుకుంటానని వార్నింగ్ ఇస్తుంది ఐశ్వర్య. స్వాతి రూమ్‌లోకి వెళ్లిన ఐశ్వర్య అక్కడ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది. నందూ తీసుకొచ్చిన అమ్మాయిలు నచ్చకపోవడంతో అందరినీ రిజెక్ట్ చేస్తాడు వెంకీ.
మే 23వ తేదీ 1040వ ఎపిసోడ్‌లో..
ఐశ్వర్య గదిలో బెడ్ బాగుందని హాయిగా పడుకుంటానని చెబుతాడు రాజ్. అయితే నువ్వు ఇక్కడ పడుకోవడానికి వీల్లేదని వెళ్లి సోఫాలో పడుకోమని ఇందూ ఆర్డర్ వేయడంతో విసుక్కుంటాడు. సోఫాలో నిద్ర పట్టకపోవడంతో స్వాతి పక్కనే పడుకుంటుంది ఐశ్వర్య. స్వాతి కాళ్లు, చేతులు వేయడంతో చిరాకు పడుతుంది. ఉదయాన్నే లేచేసరికి తన ముఖం దగ్గర రాజ్ ఉండటం చూసి భయపడుతుంది ఇందూ. ఇప్పుడు నును సీఈవో పోస్ట్‌కి పోటీ చేస్తే మా ఆంటీకి అనుమానం వస్తుంది, అందుకే నాకు బదులుగా నువ్వు పోటీ చేయమని ఇందూ చెప్పడంతో రాజ్ సంతోషిస్తాడు. వెంటనే అభిలాష్ అనే బోర్డ్ మెంబర్‌కి రాజ్ కాల్ చేస్తాడు. అయితే తాను రేఖ మేడం మనిషిని చెప్పడంతో రాజ్, ఇందూలు షాక్ అవుతారు. ఆ వెంటనే ఇందూ.. రేఖ దగ్గరకి వెళ్లి రాజ్ సీఈవో పోస్ట్ కోసం పోటీ చేస్తున్నాడని చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications