Brahmamudi weekly roundup: రుద్రాణి-యామినిల ప్లాన్ రివర్స్.. స్వప్న నగలపై రాహుల్ కన్ను, డేంజర్‌లో అప్పూ
Photo Courtesy: JioHotstar
రాజ్ వేసిన దోశలు తిన్న దుగ్గిరాల ఫ్యామిలీ బాత్‌రూంకి పరుగులు తీస్తుంది. కావ్య పెళ్లి ఫోటోతో గుట్టురట్టు చేయాలనుకున్న రుద్రాణి ప్లాన్‌ని స్వప్న తిప్పికొడుతుంది. స్వప్న ఫోటో చూసిన రాజ్ .. రుద్రాణిపై ఫైర్ అవుతాడు. కావ్య కోసం రాజ్ తీసుకొచ్చిన చీరను పక్కనపడేసిన ఇందిర ఓ మోడ్రన్ డ్రెస్ ఇచ్చి పంపిస్తుంది. అది చూసిన కావ్య మండిపడుతుంది. కళ్యాణ్‌తో లెటర్ రాయించి కావ్యను ఇంప్రెస్ చేయాలనుకుంటాడు రాజ్. అయితే లెటర్‌పై పొరపాటున కళ్యాణ్ సంతకం ఉండటంతో కావ్య కనిపెట్టేస్తుంది.
రాహుల్‌ను ఓ అమ్మాయి ట్రాప్ చేసి స్వప్న నగల్ని తీసుకురమ్మని చెబుతుంది. రుద్రాణికి యామిని ఫోన్ చేసి నా మనిషిని జనాభా లెక్కల అధికారిగా పంపిస్తున్నానని కొంచెం సపోర్ట్‌గా ఉండమని చెబుతుంది. అందరి వివరాలను నోట్ చేసుకున్న ఆ నకిలీ అధికారి వెళ్లిపోతుండగా కావ్య గురించి కూడా కనుక్కోమని చెబుతుంది రుద్రాణి. కావ్య ఏమవుతుందో ఏం చెప్పాలో తెలియక దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుండగా ఆమెను అపర్ణకి మేనకోడలని చెబుతాడు రాజ్.
కావ్యకి ప్రపోజ్ చేయమని రాజ్‌తో ఇందిర, అపర్ణలు చెబుతుండగా రాహుల్ వారి మాటలు విని రుద్రాణికి చెబుతాడు. రుద్రాణి ఈ విషయాన్ని వెంటనే యామినికి ఫోన్ చేసి చెబుతుంది. రాజ్ కనుక కావ్యకి ప్రపోజ్ చేస్తే నీ జీవితం నాశనమేనని హెచ్చరిస్తుంది. కళ్యాణ్ - అప్పూలకి ఫస్ట్ నైట్ జరగలేదని తెలుసుకున్న ధాన్యలక్ష్మీ కొడుకు కోడల్ని ఒక్కటిగా చేయాలని అనుకుంటుంది. స్వప్న లేని టైం చూసి ఆమె నగలు కొట్టేయాలని అనుకుంటాడు రాహుల్.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి మే 19వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు .. 725 ఎపిసోడ్ నుంచి 730 వరకు ఏం జరిగిందంటే?
మే 19వ తేదీ 725వ ఎపిసోడ్‌లో ... ఇంటికొచ్చిన రాజ్‌ను కావ్య వెళ్లిపోమ్మని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ కావ్యపై మండిపడుతుంది. రాజ్ కోసం టిఫిన్ చేయమని ఇందిర చెప్పడంతో నేనేం టిఫిన్ చేయలేదని కావ్య చెప్పడంతో నేనే దోశలు వేసి అందరికీ తినిపిస్తానని రాజ్ సవాల్ విసురుతాడు. ఇందిర, అపర్ణల సాయంతో దోశలు వేసిన రాజ్ టమోటా కెచప్‌తో చట్నీచేసి అందరికీ వడ్డిస్తాడు. ఆ దెబ్బతో అంతా బాత్‌రూమ్‌లోకి పరుగులు తీస్తారు. రాజ్‌కి కావ్య పెళ్లి ఫోటో కనిపించేలా బెడ్ రూంలో పెడుతుంది. కింద అలిసిపోయి కూర్చొన్న రాజ్‌ను తన బెడ్‌రూంలోకి వెళ్లి కూర్చోమని చెబుతుంది రుద్రాణి. బెడ్‌పై స్వప్న ఫోటో ఉండటంతో బయటికొచ్చి రుద్రాణిని తిడతాడు రాజ్.
మే 20వ తేదీ 726వ ఎపిసోడ్‌లో ... బెడ్‌రూమ్‌లో రాజ్‌కి కనిపించేలా నా ఫోటో ఎందుకు పెట్టావని రుద్రాణిపై సీరియస్ అవుతుంది స్వప్న. కావ్యను ఇంప్రెస్ చేయడానికి గిఫ్ట్ తీసుకొచ్చావా లేదా అని అడుగుతారు ఇందిర, అపర్ణ. అదెందుకు మరిచిపోతానని చెప్పి తను తీసుకొచ్చిన చీర చూపించడంతో అపర్ణకి అది చాలా నచ్చగా, ఇందిర మాత్రం డిజప్పాయింట్ అవుతుంది. మీరు నా జనరేషన్‌లో ఉన్నారంటూ రాజ్‌కి మోడ్రన్ డ్రెస్ ఇచ్చి కావ్య దగ్గరికి పంపిస్తుంది ఇందిర. ఆ డ్రెస్ చూసిన కావ్య.. రాజ్‌పై మండిపడుతుంది. కావ్య గదిలో నుంచి
నీరసంగా వచ్చిన రాజ్ నీ మనవరాలు నా ముఖంపై ఛీ కొట్టిందని, ఇకపై మీ సలహాలు విని మోసపోనని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. రాజ్ నీకు దగ్గరవ్వాలని చూస్తుంటే నువ్వెందుకు ఇలా చేస్తున్నావని కావ్యపై మండిపడతారు అపర్ణ, ఇందిర.
మే 21వ తేదీ 727వ ఎపిసోడ్‌లో ... రాజ్‌కు గతం గుర్తుచేసి మళ్లీ ఆయన ప్రాణాలతో ఆడుకునేంత పిచ్చి పనులు నేను చేయనని అపర్ణ, ఇందిరలకు తేల్చి చెబుతుంది కావ్య. నువ్వు హెల్ప్ చేయపోయినా రాజ్ వైపు నుంచి కథ నడుపుకొస్తామని వాళ్లిద్దరూ వెళ్లిపోతారు. గిఫ్ట్ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో కళ్యాణ్‌తో లవ్ లెటర్ రాయించి కావ్యని ఇంప్రెస్ చేయాలని అనుకుంటాడు రాజ్. ఇంట్లో ఎవరికి ఎవరు ఏమవుతారో వరసలు చెబుతుండగా రుద్రాణిపై చిరాకు పడతాడు రాజ్. మీ బెడ్ రూంలో రాజ్‌కు కనిపించేలా కావ్య ఫోటో ప్లేస్‌లో నా ఫోటో పెట్టింది నేనే అని రుద్రాణితో చెబుతుంది స్వప్న. పెళ్లాం బిడ్డలను వదిలేసి రాహుల్ ఓ అమ్మాయితో రొమాన్స్ చేస్తుంటాడు. మీ ఆవిడ ఏడు వారాల నగలు తీసుకొచ్చి ఇస్తేనే నీతో గడుపుతానని చెప్పడంతో స్వప్న నగలు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు రాహుల్
మే 22వ తేదీ 728వ ఎపిసోడ్‌లో ... కావ్యకు ఎంతో సంతోషంగా లవ్ లెటర్ ఇస్తాడు రాజ్. అంతా చదివిన కావ్య గట్టిగా నవ్వేసి మీకు లవ్ లెటర్ రాయడం రాక కవిగారి హెల్ప్ తీసుకున్నారా అని కళ్యాణ్ సంతకం చూపిస్తుంది. దాంతో కళ్యాణ్ మీదకి కత్తితో వెళ్తాడు రాజ్. అయితే ఇందిర, అపర్ణలు రాజ్‌ను ఆపుతారు. పెద్దల మాట చద్దన్నం మూట అని ఇకపై మీరు చెప్పినట్లే వింటానని వాళ్లతో చెబుతాడు రాజ్. తన కోసం, తన ప్రేమ కోసం భర్త పడుతున్న తపన చూసి కావ్య మురిసిపోతుంది. ఇంతలో యామిని ఆమెకు ఫోన్ చేసి రాజ్‌ను ఎలాగైనా దక్కించుకుంటానని సవాల్ విసురుతుంది. రుద్రాణికి యామిని ఫోన్ చేసి జనాభా లెక్కల అధికారిగా నా మనిషిని పంపిస్తానని అప్పుడు చచ్చినట్లు దుగ్గిరాల ఫ్యామిలీ కావ్య భర్త ఎవరో చెప్పాల్సిందేనని అంటుంది. ఓ సాంగ్ పాడి కావ్యకు సారీ చెప్పి ఆమెను నవ్విస్తాడు రాజ్. ఇంతలో యామిని మనిషి జనాభా లెక్కల ఆఫీసర్‌గా వచ్చి దుగ్గిరాల ఫ్యామిలీ వివరాలు అడుగుతాడు.

Photo Courtesy: JioHotstar
మే 23వ తేదీ 729వ ఎపిసోడ్‌లో ... అందరి వివరాలు తీసుకుని వెళ్లిపోతున్న జనాభా లెక్కల అధికారిని ఆపుతుంది రుద్రాణి. అందరినీ అడిగారు కానీ కావ్య గురించి కనుక్కోలేదని చెబుతుంది రుద్రాణి. మీరు ఈ ఇంటికి ఏమవుతారని అతను ప్రశ్నించగా.. కావ్యతో సహా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతుంది. రాజ్ జోక్యం చేసుకుని కళావతి గారు అపర్ణ ఆంటీకి మేనకోడలని అంటాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. తమను టెన్షన్ పెట్టిన రుద్రాణిని ఇందిర గదిలోకి తీసుకెళ్లి చితక్కొడుతుంది. కావ్యకి కిచెన్‌లో సైట్ కొడతాడు రాజ్. ఇలాగైతే లాభం లేదని కావ్యకి ప్రపోజ్ చేయమని ఇందిర, అపర్ణలు సలహా ఇస్తారు. వీరి మాటలను విన్న రాహుల్.. వెంటనే రుద్రాణికి ఈ విషయం చెప్పడంతో ఆమె యామినికి ఫోన్ చేస్తుంది. కావ్యకి రాజ్ ఐ లవ్ యూ చెప్పకుండా ఆపమని హెచ్చరిస్తుంది.
మే 24వ తేదీ 730వ ఎపిసోడ్‌లో ... పోలీస్ స్టేషన్‌లో ఛార్లెస్ కడుపునొప్పని ఏడుస్తుంటాడు. కానిస్టేబుల్ అప్పూకి ఫోన్ చేసి విషయం చెబుతుండగా కళ్యాణ్ వెనుక నుంచి వచ్చి ఆమెను పట్టుకుంటాడు. కళ్యాణ్‌కు దొరక్కుండా పారిపోతూ ధాన్యలక్ష్మీకి ఎదురుపడుతుంది అప్పూ. కళ్యాణ్ - అప్పూలకి ఫస్ట్ నైట్ జరగలేదని తెలుసుకున్న ధాన్యలక్ష్మీ రగిలిపోతుంది. ఆమెకు రుద్రాణి కనిపించి వారిద్దరి ఫస్ట్ నైట్‌కు ముహూర్తం పెట్టించమని చెబుతుంది. ఇంటికొచ్చిన రాజ్‌ని యామిని, ఆమె పేరెంట్స్ రౌండప్ చేసి మీయిద్దరికీ త్వరలో పెళ్లికాబోతోందని .. కానీ మీరు యామినిని పట్టించుకోవడం లేదని మండిపడుతుంది వైదేహి. త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. కావ్యకి ఎలా ప్రపోజ్ చేయాలా అని నైట్ అంతా రాజ్ ఆలోచిస్తుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications










