Brahmamudi Weekly Roundup సంసారం చేద్దాంరా.. మాయను రాజ్ బెడ్‌పైకి తోసి.. భర్త తీరుపై కావ్య రియాక్షన్ ఏంటంటే?

బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ తీసుకొచ్చి బిడ్డ ఎవరనే విషయంపై ఇంట్లో రకరకాల గొడవలు మొదలవుతాయి. ఆ తల్లికి బిడ్డ ఎవరో తెలియజేయకపోతే.. నేను ఇంటి నుంచి వెళ్లిపోతానని రాజ్ తల్లి శపథం చేస్తుంది. అయితే ఓ కారణం చెప్పి కావ్య ఆమెను ఇంటి నుంచి వెళ్లకుండా ఆపుతుంది. బిడ్డకు తల్లి ఎవరో తెలుసుకొనే ప్రయత్నంలో కావ్యను కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఆ బిడ్డకు తల్లి మాయ అని తెలుస్తుంది. అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత నా బిడ్డకు తండ్రి రాజ్ అంటూ ఆమె షాక్ ఇస్తుంది. మే మే 20వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు.. 414 ఎపిసోడ్ నుంచి 419 వరకు ఏం జరిగిందంటే?

మే 20వ తేదీ 414 ఎపిసోడ్‌లో
కావ్యను రాజ్ కిడ్నాపర్ల నుంచి కాపాడిన తర్వాత క్లాస్ పీకుతాడు. నేను సమయానికి అక్కడికి రాకపోతే నీ బతుకు ఏమైపోయేది. కిడ్నాపర్లు నిన్ను ఈ దేశం దాటించే వారు అంటూ కోపం చేస్తాడు. రాజ్ తిడుతుంటే.. కావ్య నవ్వుతూ నీ తిట్లు తియ్యగా ఉన్నాయి అంటూ ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత నీ బాధ ఏంటి? నేను ఆపదలో చిక్కుకొన్నానా? లేదా నీ విషయం మీ అమ్మ నాన్నలకు తెలుస్తుందా? అని నిలదీస్తుంది. ఇక భద్రాచలం నుంచి రాముల వారి అక్షింతలు రావడంతో కుటుంబ సభ్యులను సుభాష్ ఆశీర్వదిస్తాడు.

Brahmamudi Weekly Roundup

మే 21వ తేదీ 415 ఎపిసోడ్‌లో
అక్షింతల విషయంలో అనామిక గురించి డిస్కషన్ జరుగుతుంది. నీవు సింగిల్‌గా లేవు. నీకు భర్త ఉన్నాడు. కల్యాణ్ చేత అక్షింతలు వేయించుకోమని చెబుతారు. దాంతో అనామిక భర్త వద్దకు వెళ్లి.. అక్షింతలు వేయమని అడిగితే.. ఆదేశాలివ్వ వద్దు.. ప్రేమతో అడిగి వేయించుకోవాలని అంటాడు. అయినా నీలాంటి శూర్పణఖకు అక్షింతలు వేయను. నేను నీతో విడిపోవాలని అనుకొంటున్నాను. కాబట్టి నీకు నేను అక్షింతలు వేయను అని కల్యాణ్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక బిడ్డకు మాయకు సంబంధం ఉందని అనుమానంతో ఆమె ఇంటికి వెళ్తుంది. ఆమెను బిడ్డకు తల్లి ఎవరంటే చెప్పకపోతే..చెంపపై లాగి కొట్టి.. నీవల్ల ఓ కుటుంబ సర్వం నాశనం అవుతున్నది అంటూ ఫైర్ అవుతుంది.

Brahmamudi Weekly Roundup

మే 22వ తేదీ 416 ఎపిసోడ్‌లో
కావ్య నిలదీయంతో నా బిడ్డకు తండ్రి రాజ్ అని చెప్పగానే కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. రాజ్‌తో పరిచయం వల్ల ఆయనకు శారీరకంగా దగ్గరయ్యాను. దాని ఫలితం ఈ బిడ్డ. నేను ఎలాగు సుఖంగా ఉండలేను. కాబట్టి ఈ బిడ్డను పంపించాను అని కావ్య చెబుతుంది. దాంతో సుమిత్ర, సుభాష్ దిగ్బ్రాంతికి గురవుతారు. అయితే ఈ బిడ్డకు తల్లి కాబట్టి కావ్య ఇంటికి కోడలు అవుతుందని రుద్రాణి అంటూ.. ఇంటి సభ్యులు తిడుతారు. అధికారికంగా ఈ ఇంటికి కోడలు కేవలం కావ్య మాత్రమే అంటారు. అయితే ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ సీతారామయ్య అంటాడు. దాంతో నేను చేసింది తప్పే.. కాబట్టి తప్పును సరిదిద్దేందుకు కావ్యను నేను తీసుకొస్తాను అని రాజ్ అంటాడు. దాంతొ ఇంటికి కొత్త తలనొప్పులు తేవోద్దని కావ్య సలహా ఇస్తుంది.

Brahmamudi Weekly Roundup

మే 23వ తేదీ 417 ఎపిసోడ్‌లో

మాయ ఎవరో తెలుసుకొని ఇంటి నుంచి బయటకు గెంటి వేస్తాను అని కావ్య అంటే..నీకు కావాలని సవతిని తీసుకురాలేదు. దీనిని ఎలా హ్యాండిల్ చేస్తావో చేసుకో అంటూ రాజ్ వెళ్లిపోతాడు. అయితే కావ్య దగ్గరకు రుద్రాణి వచ్చి.. నీవు వెతికే ప్రాంతంలో ఓ ముసలావిడను పెట్టి.. కావ్య ఇంటికి పంపించేలా చేశాను. కావ్యను నేనే అక్కడ సెట్ చేశాను. కావాలంటే నీవు ఎవరికైనా చెప్పుకో అంటూ కావ్యకు షాకిస్తుంది. అయితే బెడ్ రూమ్‌లోకి వచ్చిన మాయను చూసి.. నీకు ఏం కావాలి అని రాజ్ అంటే.. నువ్వే కావాలి అని సమాధానం ఇస్తుంది. దాంతో రా కాపురం చేద్దాం అంటూ ఆమెను బెడ్ మీదకు తోస్తాడు. దాంతో రా అంటూ రాజ్‌ను బలవంతంగా బెడ్ మీదకు లాగేసుకొంటుంది. దాంతో ఆయన చిరాకు పడుతాడు. కావ్య అక్కడికి వచ్చి.. ఏంటి అంటే.. బెదిరిద్దామని అనుకొన్నాను. కానీ కావ్య మామూలు ఆడది కాదు అంటూ రాజ్ అంటాడు.

Brahmamudi Weekly Roundup

మే 24వ తేదీ 418 ఎపిసోడ్‌లో

ఇంట్లోకి మాయ రావడంతో సుభాష్ ఆవేదన చెందుతాడు. నా వల్ల కావ్యకు సమస్యల్లో పడింది. ఈ విషయంలో ఆమెకు సాయం చేయాలి అనుకొంటాడు. మాయ వద్దకు వెళ్లి.. నీవు మాయవి కాదు. నీకెంత డబ్బు కావాలో చెప్పు అంటే.. ఈ ఇంటికి కోడలు కావాలని అనుకొంటున్నాను. నీ చిల్లర డబ్బులకు ఆశపడుతానా? అంటూ మాయ జవాబిస్తుంది.నేను మాయను కాదు. మీరు ఈ విషయం ఎవరికి చెప్పలేరు. చేసిన చిన్న తప్పుకు నాలాంటి ఆడదాని ముందు తలవంచుకొనేలా చేసింది. ఇంట్లో పనులు చాలా ఉన్నాయి.. వస్తా అంటూ మాయ ఇంట్లోకి వెళ్లుతుంది.

మే 25వ తేదీ 419 ఎపిసోడ్‌లో

చిట్టి అమ్మమ్మతో మాట్లాడుతూ.. ఇంటిలో అందరికి నచ్చేలా మారుతాను అని మాయ అంటే..మారే గుణం నీకు ఉన్నా.. మాకు లేదని చిట్టి సమాధానం ఇస్తుంది. అయితే నీకు తగినట్టు మా అత్త ఉంది. ఆమె నీకు సరిపోతుంది అని స్వప్న అంటుంది. ఇక చేతిలో బిడ్డను మాయ చేతిలో పెడుతూ.. నీవు కన్న బిడ్డ.. మూత్రం, మరోటి చేసుకొన్నాడు. వెళ్లి క్లీన్ చేయండి అంటే.. మాయ ఇబ్బందిగా ఫీలైంది. దాంతో నీకు ఫ్యూచర్‌లో ఈ అనుభవం బాగా పనికి వస్తుంది అంటూ కావ్య సెటైర్ వేస్తుంది. అయితే ఎవరినైనా సాయం తీసుకు వెళ్లండి అంటే.. రుద్రాణి సాయం చేయమని చిట్టి బలవంతం చేయడంతో మాయతో కలిసి వెళ్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X