Brahmamudi weekly roundup: రోడ్డునపడ్డ వెంకీ.. ఇందూతో శోభనానికి రాజ్ రెడీ, రేఖకు భ్రమరాంబ షాక్
Photo Courtesy: JioHotstar
వెంకీ ఉద్యోగం పోవడంతో చలపతి- లక్ష్మీలు షాక్ అవుతారు. స్వాతి ప్రేమను మదన్ తిరస్కరించడంతో స్వాతిని ఓదార్చిన ఇందూ.. మీ ఇద్దరికీ నేను పెళ్లి చేస్తానని మాట ఇస్తుంది. సీఈవో పోస్ట్ కోసం ఇందూకి బోర్డ్ మెంబర్ పరంధామయ్య సపోర్ట్ చేస్తాడు. నువ్వు ఇకపై ఇందూతో క్లోజ్‌గా ఉండాలని మదన్‌కి రేఖ చెప్పడంతో ఇందూ- రాజ్‌ల శోభనం జరిగేలా భ్రమరాంబ పథకం వేస్తుంది. హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో తనకు డబ్బులు కావాలని ఇందూపై ఒత్తిడి తీసుకొస్తాడు రాజ్. దాంతో ఏం చేయాలో తెలియక తన తల్లి ఇచ్చిన నెక్లెస్‌ను ఇచ్చేస్తుంది ఇందూ. ఆ నెక్లెస్ విలువ గురించి అపర్ణ ద్వారా తెలుసుకున్న రాజ్.. తన బైక్ అమ్మేసి నెక్లెస్ విడిపించుకుని తీసుకొస్తాడు. ఎన్ని చోట్ల ట్రై చేసినా వెంకీకి ఉద్యోగం దొరకకపోవడంతో బాధపడతాడు. రాజ్- ఇందూ- రాజ్‌ల శోభనానికి అపర్ణ ముహూర్తం పెట్టిస్తుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి మే 25వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు .. 1041వ ఎపిసోడ్ నుంచి 1046వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
మే 25వ తేదీ 1041వ ఎపిసోడ్‌లో ..
ఆ రాజ్ గాడు అస్సలు సీఈవో అవ్వకూడదు.. మీరే సీఈవోగా ఉండాలని ఇందూ చెప్పడంతో నేను చూసుకుంటానని అంటుంది రేఖ. ఆఫీస్‌లో లే ఆఫ్స్ గురించి వెంకీ తన ఫ్రెండ్‌తో మాట్లాడుకుంటూ ఉండగా.. అతని ఖాతాలో 3 లక్షల రూపాయలు పడతాయి. దీని గురించి మేనేజర్‌ని అడుగుదామని వెళ్లగా.. నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశామని చెప్పడంతో వెంకీ షాక్ అవుతాడు. పెరుగులో చికెన్ వేసుకుని తింటున్న రాజ్‌ని చూస్తుంటే తన కొడుకే అపర్ణకి గుర్తొస్తాడు. నువ్వు సీఈవో పోస్ట్‌కి పోటీ చేస్తున్నావా అని రేఖ నిలదీయగా రాజ్ అవునని అంటాడు. నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో, నా ప్రయత్నాలు నేను చేసుకోమని సవాల్ విసురుతాడు. ఇంటికొచ్చిన వెంకీ బాధగా 3 లక్షల రూపాయలు ఇచ్చి.. నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారని చెబుతాడు. దాంతో తల్లిదండ్రులు షాక్ అవుతారు.
మే 26వ తేదీ 1042వ ఎపిసోడ్‌లో..
నేను సీఈవో పోస్ట్‌కి పోటీ పడుతున్నానని చెప్పావు.. మీ రేఖ ఆంటీతో సీరియస్‌గా తీసుకుని నన్ను ఏమైనా చేస్తే ఏంటీ పరిస్థితి అని అడుగుతాడు రాజ్. నేను సీఈవో అవుతున్నాని తెలిస్తే మా రేఖ ఆంటీకి అనుమానం వస్తుంది.. అందుకే నిన్ను ముందుపెట్టి వెనుక నేను గేమ్ ఆడుతున్నానని రాజ్‌తో చెబుతుంది ఇందూ. ఓ రెస్టారెంట్‌లో నందూ, వెంకీలు కలుసుకుంటారు. ఉద్యోగం పోయిందని బాధపడొద్దు.. దీనికంటే మంచి జాబ్ వస్తుంది, నిన్ను వద్దు అనుకున్న వారికి నీ టాలెంట్ ఏంటో చూపించాలని అంటుంది నందూ. ఓ డేటింగ్ యాప్‌లో మాట్లాడిన అమ్మాయిని నందూ పిలిపిస్తుంది. ఆమెను ఇష్టాయిష్టాలు తెలుసుకున్న వెంకీ ముఖం మీదే ఛీ కొడతాడు. బయటకు వెళ్తున్న మదన్‌కి స్వాతి అడ్డొచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతుంది. మా అమ్మ ఏది చెబితే అదే చేస్తానని ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు మదన్. ఇదంతా చూసిన ఇందూ.. స్వాతికి ధైర్యం చెప్పి మదన్‌తో పెళ్లి చేస్తానని మాట ఇస్తుంది. వీరి మాటలు విన్న రేఖ రగిలిపోతుంది.

Photo Courtesy: JioHotstar
మే 27వ తేదీ 1043వ ఎపిసోడ్‌లో..
సీఈవో పోస్ట్ కోసం పరంధామయ్య అనే బోర్డ్ మెంబర్‌ని రాజ్, ఇందూలు కలుస్తారు. ఆ రేఖకి ఎదురెళ్తున్నావు జాగ్రత్త అని హెచ్చరిస్తాడు పెద్దాయన. మా కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్లకి న్యాయం చేయడానికి, మా అమ్మానాన్నల ఆశయాల్ని కాపాడటానికి ఇలా చేస్తున్నానని అంటుంది ఇందూ. ఇకపై నువ్వు ఇందూతో బాగా క్లోజ్‌గా ఉండాలి.. నువ్వు లేకపోతే ఉండలేని స్టేజ్‌కి తీసుకురావాలని రేఖ చెప్పడంతో మదన్ సరేనని అంటాడు. ఇందూ- రాజ్‌లకు విడాకులు ఇప్పించి ఇందూతో నా కొడుకు పెళ్లి చేసి ఈ ఆస్తిని దక్కించుకుంటానని రేఖ చెబుతుంది. ఆ మాటలతో శేషం- భ్రమరాంబలు షాక్ అవుతారు. ఇందూ- రాజ్‌లు విడిపోకుండా ఉండాలంటే వాళ్లిద్దరికీ శోభనం జరిపించాలని భ్రమరాంబ ప్లాన్ చేస్తుంది. అపర్ణ- సుభాష్‌లకి వినిపించేలా ఈ విషయం గురించి గట్టిగా మాట్లాడటంతో వాళ్లిద్దరు కూడా ఇందూ- రాజ్‌ల ఫస్ట్‌నైట్‌కు ఏర్పాట్లు చేయాలని అనుకుంటారు.
మే 28వ తేదీ 1044వ ఎపిసోడ్‌లో..
కంపెనీకి సీఈవో అయితే శేషంను పీఏగా పెట్టుకోవడానికి రాజ్ సరేనని చెబుతాడు. ఆ వెంటనే డాక్టర్ దగ్గరి నుంచి రాజ్‌కు ఫోన్ వస్తుంది. నేను ఇచ్చిన టైం అయిపోయింది. మరో గంటలో వచ్చి డబ్బులు కట్టకపోతే పేషెంట్‌ను తీసుకెళ్లిపోవచ్చని చెప్పడంతో రాజ్ వెంటనే డబ్బు కోసం ఇందూ దగ్గరికి వెళ్తాడు. తన దగ్గర డబ్బులు లేవని ఇందూ ఎంత చెప్పినా వినకపోవడంతో కాళ్లపై పడబోతాడు. దాంతో తన తల్లి జ్ఞాపకంగా దాచుకున్న గోల్డ్ చైన్‌ని రాజ్‌కి ఇస్తుంది ఇందూ. సేట్ దగ్గరికి వెళ్లి చైన్ తాకట్టు పెట్టి 50 వేలు తీసుకోవడానికి రాజ్ సరేనని అంటాడు. ఆసుపత్రి డబ్బులు కట్టేసిన రాజ్‌తో డాక్టర్ మాట్లాడుతూ.. నిన్ను డబ్బుల కోసం వేధించడం నా ఉద్దేశం కాదు. కానీ ఈ ట్రీట్‌మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నదని చెబుతాడు. రాజ్ ఐసీయూలో నుంచి చూస్తూ.. నిన్ను ఎలాగైనా కాపాడుకుంటానని మనసులో అనుకుంటాడు. వెంకీ ఇంటర్వ్యూకి వెళ్లగా... ఏఐ టెక్నాలజీ వస్తేనే జాబ్ ఇస్తానని చెప్పడంతో బాధపడతాడు.

Photo Courtesy: JioHotstar
మే 29వ తేదీ 1045వ ఎపిసోడ్‌లో..
ఇందూ మెడలో కావ్య ఇచ్చిన చైన్ లేకపోవడంతో ఏం జరిగిందని అడుగుతుంది అపర్ణ. పైన గదిలో ఉందని అబద్ధం చెప్పి వెళ్లిపోతుంది ఇందూ. ఆ చైన్.. ఇందూకి వాళ్లమ్మ జ్ఞాపకంగా మిగిలిన ఏకైక జ్ఞాపకమని అపర్ణ చెప్పడంతో రాజ్ బాధపడతాడు. తన తల్లి ఆచూకీ చెప్పమని ఆంటోనీని బతిమలాడతాడు లక్కీ. ఇంతలో లక్కీకి రాజ్ ఫోన్ చేసి అర్జెంట్‌గా ఇంటికి రమ్మని చెబుతాడు. ఈ బైక్ తాకట్టు పెట్టి ఇందూ చైన్‌ని విడిపించి తీసుకొద్దామని చెబుతాడు రాజ్. డబ్బుల కోసం రాకేష్ ఫోన్ చేయడంతో దానిని తీసుకెళ్లి ఇందూకి ఇస్తుంది ఐశ్వర్య. మీ మాట మీద గౌరవంతో ఇన్నాళ్లూ వెయిట్ చేశాను. ఇంకో రెండ్రోజుల్లో నా డబ్బులు నాకు ఇవ్వకపోతే మీ పరువు తీసేస్తానని రాకేష్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో డబ్బులు ఇస్తానని మాటిస్తుంది ఇందూ. ఐశ్వర్య చేసిన గొడవతో బాధపడుతున్న ఇందూ దగ్గరికి రాజ్ వచ్చి నెక్లెస్ తిరిగి ఇవ్వడంతో ఆమె చాలా సంతోషిస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్లిన వెంకీకి అన్ని చోట్ల తిరస్కరణ ఎదురుకావడంతో బాధపడుతూ ఇంటికొస్తాడు.
మే 30వ తేదీ 1046వ ఎపిసోడ్‌లో..
తన దగ్గర తీసుకున్న మొత్తం 5 లక్షల రూపాయలు తీర్చమని వడ్డీ వ్యాపారి డెడ్‌లైన్ పెట్టడంతో లక్ష్మీ- చలపతిలు షాక్ అవుతారు. త్వరలోనే బాకీ మొత్తం తీర్చేస్తానని చెబుతాడు చలపతి. ఈ మాటలన్నీ విన్న వెంకీ బాధపడతాడు. ఇందూ- రాజ్‌ల శోభనానికి పెళ్లి ముహూర్తం పెట్టించడానికి పంతులుగారు రావడంతో రేఖ షాక్ అవుతుంది. నా మనవడు- మనవరాలు కలిసుండటం నీకు ఇష్టం లేనట్లుగా ఉందని సుభాస్ మండిపడతాడ. రాజ్ కూడా తగులుకోవడంతో రేఖ సైలెంట్ అవుతుంది. రాజ్- ఇందూల ఫస్ట్ నైట్ జరగకుండా ఆపుతానని భూషణ్‌తో అంటుంది రేఖ. ఏం జరిగినా సరే వాళ్లిద్దరినీ ఒక్కటి చేస్తానని భ్రమరాంబ అనుకుంటుంది. భోజనం చేస్తుండగా వడ్డీ వ్యాపారి అన్న మాటలు గుర్తొచ్చి వెంకీ బాధపడుతుండగా కొడుకుని లక్ష్మీ, చలపతిలు ఓదారుస్తారు. నందూ ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా వెంకీ ఫోన్ లిఫ్ట్ చేయడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications