Brahmamudi weekly roundup: ఛార్లెస్‌ని పట్టుకున్న అప్పూ.. రాజ్- కావ్య మధ్య యామిని చిచ్చు, రుద్రాణి సంబరాలు
Photo Courtesy: JioHotstar
స్వప్న నగలు కొట్టేయడానికి టైం కోసం చూస్తున్న రాహుల్‌కి అప్పూ- కళ్యాణ్‌ల ఫస్ట్ నైట్ బాగా కలిసొస్తుంది. ఫస్ట్ నైట్ వంకతో కావ్యకి దగ్గరవ్వడానికి ట్రై చేస్తాడు రాజ్. స్వప్న నగల్ని బ్యాంక్ నుంచి తెప్పించేలా చేసి అప్పూకి అలంకరించేలా చేస్తాడు రాహుల్. స్టేషన్ నుంచి చార్లెస్ చాకచక్యంగా తప్పించుకున్న సంగతి తెలియడంతో అప్పూ టెన్షన్ పడుతూ ఈ విషయాన్ని కళ్యాణ్‌కు చెబుతుంది. కావ్య- రాజ్‌ల సపోర్ట్‌తో అప్పూ- కళ్యాణ్ కలిసి ఛార్లెస్‌ను వెతకడానికి బయల్దేరతారు. బయటికి వెళ్లేముందు నగలన్నీ అప్పూ పక్కన పెట్టేయడంతో వాటిని కొట్టేస్తాడు రాహుల్.
అప్పూ - కళ్యాణ్‌లకు ఎదురుపడ్డ ఛార్లెస్ తప్పించుకుంటూ దుగ్గిరాల వారింటికే వచ్చి రాజ్- కావ్యలను కట్టేస్తాడు. ఫోన్ సంపాదించిన రాజ్ - కావ్యలు ఛార్లెస్‌ను కట్టేసి వెంటనే అప్పూకి మెసేజ్ పెడతాడు. చార్లెస్‌ను అరెస్ట్ చేసి లోపలికి వస్తుండగా అప్పూ - కళ్యాణ్‌లు ధాన్యలక్ష్మీకి దొరికిపోతారు. తప్పించుకున్న దొంగను పట్టుకోకపోతే అప్పూ ఉద్యోగం పోతుందని అందుకే నా భార్యకి సాయం చేశానని చెబుతాడు కళ్యాణ్. మీరిద్దరూ బయటికెళ్లారు మరి రాజ్- కావ్యలు ఎక్కడని ఇందిర ప్రశ్నించగా అక్కా బావ మా గదిలోనే ఉన్నారని అప్పూ చెప్పడంతో అంతా లోపలికి వెళతారు.
కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తుండగా యామిని కళ్లు తిరిగి పడిపోయిన విషయం చెబుతుంది వైదేహి. దీంతో రాజ్ కంగారుగా యామిని ఇంటికి బయల్దేరతాడు. యామిని డిప్రెషన్‌లోకి వెళ్లిందని ఆమెను జాగ్రత్తగా చూసుకోమని రాజ్‌తో చెబుతాడు డాక్టర్. మా అమ్మాయిని మీరు సరిగా పట్టించుకోకపోవడంతోనే డిప్రెషన్‌లోకి వెళ్లిందని రాజ్‌ని నిలదీస్తారు వైదేహి - రఘునాథ్. యామినిని రిసార్ట్స్‌కి తీసుకెళ్లడానికి రాజ్ ఒప్పుకుంటాడు. రిసార్ట్స్‌లో బావతో నా శోభనం జరుగుతుందని తల్లితో చెబుతుంది యామిని.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి మే 26వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు .. 731 ఎపిసోడ్ నుంచి 736 వరకు ఏం జరిగిందంటే?
మే 26వ తేదీ 731వ ఎపిసోడ్‌లో ... ప్రియురాలిని దక్కించుకునేందుకు గాను స్వప్న నగలు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు రాహుల్.. ఇంటికొచ్చి ఒరిజినల్ నగల ప్లేసులో డూప్లికేట్‌ది పెడతాడు. రాహుల్‌పై అనుమానం రావడంతో తన నగలు చెక్ చేసుకుంటుంది స్వప్న. అప్పూ- కళ్యాణ్‌లకు ఫస్ట్ నైట్ కోసం ముహూర్తం పెట్టించడానికి ధాన్యలక్ష్మీ పంతులు గారిని పిలవడంతో దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది. ఫస్ట్ నైట్‌కి ఏర్పాట్లు చేసే వంకతో కావ్యకి దగ్గరవ్వాలని అనుకుంటాడు రాజ్. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతున్న విషయాన్ని యామినికి చెబుతుంది రుద్రాణి.
మే 27వ తేదీ 732వ ఎపిసోడ్‌లో ... అప్పూ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా శోభనానికి ముహూర్తం పెట్టిస్తుంది ధాన్యలక్ష్మీ. ఈ ప్లాన్ నువ్వే వేశావా? అని కళ్యాణ్‌ని ప్రశ్నిస్తుంది అప్పూ. ఇదంతా మా అమ్మ ప్లాన్ తప్పించి నా ప్రమేయం ఏం లేదని అంటాడు కళ్యాణ్. అన్ని అవకాశాలు మూసుకుపోవడంతో అప్పూ- కళ్యాణ్‌లు ఫస్ట్ నైట్ చేసుకోవడానికి రెడీ అవుతారు. ఇదే అదనుగా బ్యాంక్‌లో ఉన్న నీ ఏడు వారాల నగలు తీసుకొచ్చి అప్పూకి అలంకరించమని స్వప్నని రెచ్చగొడతాడు రాహుల్. ఫస్ట్ నైట్ కోసం కావ్య దగ్గర రాజ్ హడావుడి చేస్తాడు. మత్తు మందు కలిపిన టీ తాగడంతో స్టేషన్‌లో కానిస్టేబుల్స్ అంతా నిద్రపోవడంతో ఛార్లెస్ తప్పించుకుంటాడు. కాసేపటికీ నిద్రలేచిన కానిస్టేబుల్స్.. ఛార్లెస్ తప్పించుకున్న విషయం అప్పూకి చెప్పడంతో ఆమె టెన్షన్ పడుతుంది.
మే 28వ తేదీ 733వ ఎపిసోడ్‌లో ... అప్పూని ఆడవాళ్లంతా గది లోపలికి పంపుతారు. కళ్యాణ్‌ని హత్తుకుని ఛార్లెస్ తప్పించుకున్న విషయం చెబుతుంది అప్పూ. నేను వాడిని పట్టుకోకపోతే నా జాబ్ పోతుందని అంటుంది. నీ ఫస్ట్ నైట్ చెడగొట్టి నిన్ను టార్చర్ చేస్తున్నానని అప్పూ సారీ చెబుతుంది. శోభనం ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చని వెంటనే బయల్దేరదామని అంటాడు కళ్యాణ్. తర్వాత ఇద్దరూ కలిసి రాజ్ - కావ్యల హెల్ప్ అడుగుతారు. మీరిద్దరూ ఆ దొంగని పట్టుకోండి, మీరు వచ్చే వరకు మేం మేనేజ్ చేస్తామని ప్లాన్ చెబుతాడు రాజ్. అప్పూ ఉద్యోగం కోసం కావ్య కూడా అందుకు సరేనని అంటుంది. అప్పూ చీర, నగలు తీసేసి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తుంది. ఆమెను ఫాలో అయిన రాహుల్.. ఆ నగల్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు.

Photo Courtesy: JioHotstar
మే 29వ తేదీ 734వ ఎపిసోడ్‌లో ... శోభనం గదిలో ఉండాల్సిన కళ్యాణ్ - అప్పూలు కారులో బయటికి వెళ్లిపోయినట్లుగా అనిపించడంతో ధాన్యలక్ష్మీకి అనుమానం వస్తుంది. గదిలో వాళ్లు ఉన్నారా? లేదా? అన్నది తేల్చుకోవడానికి అక్కడికి వెళ్తుంది. గది బయట ఏదో శబ్ధం వినిపించడంతో రాజ్- కావ్యలు వెంటనే తమ మొబైల్స్‌లో ఉన్న అప్పూ-కళ్యాణ్‌ల వాయిస్‌లు ప్లే చేస్తారు. పాపం వాళ్లు గదిలో ఉన్నారని, ఎవరినో చూసి భ్రమపడ్డానని అనుకుంటుంది. దొంగచాటుగా కొడుకు - కోడలు ఫస్ట్ నైట్ గది దగ్గరికి వచ్చి వాళ్ల మాటలు వింటున్న ధాన్యలక్ష్మీపై ప్రకాశం కోప్పడతాడు. రాజ్- కావ్యలు కనిపించకపోవడంతో ఇందిర, అపర్ణలు రాజ్‌కి ఫోన్ చేస్తారు. దొంగను వెతుకుతూ వెళ్లిన అప్పూ- కళ్యాణ్‌లను ఛార్లెస్ బైకుతో డాష్ ఇస్తాడు. దాంతో వాళ్లిద్దరి కళ్లు కప్పి దుగ్గిరాల ఇంట్లోకి ప్రవేశించిన ఛార్లెస్ .. రాజ్- కావ్యలను కట్టిపడేసి స్వీట్స్ తింటూ ఉంటాడు.
మే 30వ తేదీ 735వ ఎపిసోడ్‌లో ... తమను కట్టేసినప్పటికీ తెలివిగా ఫోన్ అందుకున్న రాజ్.. వెంటనే ఛార్లెస్ మనింటికే వచ్చి మమ్మల్ని కట్టేశాడని అప్పూకి మెసేజ్ పెడతాడు. అనంతరం కావ్య సాయంతో వాడిని కట్టేసి గోనె సంచెలో కుక్కి కింద పడేస్తాడు రాజ్. అప్పటికే కానిస్టేబుల్స్‌తో రెడీగా ఉన్న అప్పూ వాడిని అరెస్ట్ చేస్తుంది. ఫ్యామిలీ అంతా నట్టింట్లో కాచుకుని కూర్చోవడంతో తాడు తీసుకొస్తుంది అప్పూ. ఇంతలో కొడుకు కోడల్ని ప్రకాశం- ధాన్యలక్ష్మీ చూస్తారు. ఛార్లెస్ అనే దొంగ పారిపోయాడని అతనిని వెంటనే పట్టుకోకుంటే అప్పూ ఉద్యోగం పోతుందని ఆమెకు తోడుగా వెళ్లానని చెబుతాడు కళ్యాణ్. నా భార్య కోసం ఎన్ని సార్లయినా, ఎంత రిస్క్ అయినా తీసుకుంటానని చెబుతాడు. రాజ్- కావ్యలు ఎక్కడని ఇందిర అడగ్గా.. అక్కాబావ మా రూమ్‌లో ఉన్నారని చెబుతుంది అప్పూ. కుటుంబ సభ్యులంతా ఒకేసారి లోపలికి రావడంతో రాజ్- కావ్యలు షాక్ అవుతారు. నీ మనసులోని మాటను చెప్పమని ఇందిర అనడంతో కావ్య వెనుక పడతాడు రాజ్.

Photo Courtesy: JioHotstar
మే 31వ తేదీ 736వ ఎపిసోడ్‌లో ... కావ్యకి తన మనసులోని మాటను చెబుతుండగా వైదేహి పదే పదే రాజ్‌కి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయగా యామిని కళ్లు తిరిగిపడిపోయిందని చెప్పడంతో రాజ్ కంగారుగా వెళ్లిపోతాడు. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయకపోవడంతో రుద్రాణి సంబరపడిపోతుంది. డిప్రెషన్‌లోకి వెళ్లడం వల్లే యామిని స్పృహ తప్పిందని ఆమెను జాగ్రత్తగా చూసుకోమని రాజ్‌కి డాక్టర్ చెబుతాడు. మీరే సర్వస్వం అనుకున్న యామినిని మీరు పట్టించుకోకపోవడంతో తను డిప్రెషన్‌లోకి వెళ్లిందని రాజ్‌తో చెబుతుంది వైదేహి. తనను మామూలు మనిషిని చేయడానికి ఎక్కడికైనా తీసుకెళ్లమని అడగడంతో రాజ్ మాటిస్తాడు. కావ్యకి ప్రపోజ్ చేయడానికి రేపు రావడం కుదరదని ఇందిర, అపర్ణలకి చెబుతాడు రాజ్. రిసార్ట్స్‌లో బావతో నా శోభనం జరుగుతుందని యామిని చెప్పడంతో వైదేహి షాక్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications










