Brahmamudi Weekly Roundup మాయ నుంచి శీలం కాపాడుకో.. రాజ్‌ను ఆటపట్టించిన కావ్య
బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ తీసుకొచ్చి బిడ్డ ఎవరనే విషయంపై ఇంట్లో రకరకాల గొడవలు మొదలవుతాయి. ఆ తల్లికి బిడ్డ ఎవరో తెలియజేయకపోతే.. నేను ఇంటి నుంచి వెళ్లిపోతానని రాజ్ తల్లి శపథం చేస్తుంది. అయితే ఓ కారణం చెప్పి కావ్య ఆమెను ఇంటి నుంచి వెళ్లకుండా ఆపుతుంది. బిడ్డకు తల్లి ఎవరో తెలుసుకొనే ప్రయత్నంలో కావ్యను కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఆ బిడ్డకు తల్లి మాయ అని తెలుస్తుంది. అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత నా బిడ్డకు తండ్రి రాజ్ అంటూ ఆమె షాక్ ఇస్తుంది. మే మే 20వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు.. 414 ఎపిసోడ్ నుంచి 419 వరకు ఏం జరిగిందంటే?
మే 27వ తేదీ 420 ఎపిసోడ్‌లో
మాయను ఇంట్లో పెట్టడంపై కావ్యపై రాజ్ మండిపడుతాడు. ఆమె తెచ్చి నా నెత్తి మీద పెట్టావు అని రాజ్ అంటే.. నేను కూడా మీతోపాటు ఇరుక్కొన్నాను. ఆమెను ఇంటి నుంచి ఎలా పంపించాలా? అని ఎదురు చూస్తున్నాను. అప్పటి వరకు నీవు నీ శీలాన్నీ ఎలా కాపాడుకోవాలో జాగ్రత్త పడు అంటూ రాజ్‌పై కావ్య సెటైర్ వేసింది. అయితే రాజ్‌తో మాయకు పెళ్లి చేయాలని నిర్ణయించిన అపర్ణ.. కావ్యకు విడాకులు ఇచ్చేలా లాయర్‌తో డాక్యుమెంట్ ప్రిపేర్ చేయిస్తుంది. అయితే రాజ్ అంటే ఇష్టం లేదు. అందుకే అతడితో కావ్య పిల్లల్ని కనలేదు అని ఫ్యామిలీ మెంబర్స్ అంటారు.

మే 28వ తేదీ 421 ఎపిసోడ్‌లో
విడాకులు డాక్యుమెంట్ తయారు చేసినప్పడు.. నా అభిప్రాయం మీకు అక్కర్లేదనేది అర్దమైంది. కనీసం మీ అబ్బాయినైనా అభిప్రాయం తీసుకొన్నారా? అని కావ్య అపర్ణను నిలదీసింది. అయితే కావ్య మాటలకు నా వద్ద సమాధానం లేదని రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే కావ్యకు విడాకులు ఇప్పించాలని అనుకొంటే.. అడ్డుపడేది నేనే అంటూ అపర్ణతో చిట్టి వాదనకు దిగుతుంది. అయితే కావ్యతోనే విడాకులు ఇప్పించేలా చేస్తాను అంటూ రుద్రాణి కుట్రను తెరపైకి తెచ్చింది.
మే 29వ తేదీ 422 ఎపిసోడ్‌లో
మాయతో రాజ్ పెళ్లి జరిపించడానికి రాహుల్ కొత్త కుట్రను తెరపైకి తెచ్చాడు. మాయ పెట్టే నరకానికి రాజ్ కంపెనీ విషయాల మీద దృష్టిపెట్టడు. అప్పుడు నేను కంపెనీ బాధ్యతలను హస్తగతం చేసుకొంటాను అని రాహుల్ ప్లాన్ వేస్తాడు. అసలు మాయ ఎవరో అనే విషయంపై ఆరా తీయడానికి అప్పు రెడీ అవుతుంది. అయితే రాజ్ పెళ్లి చేయడానికి నాకు అభ్యంతరం లేదని కోడలు కావ్యతో ఒక సంతకం పెట్టించు అని అపర్ణకు రుద్రాణి సలహా ఇస్తుంది.

మే 30వ తేదీ 423 ఎపిసోడ్‌లో
ఇక బాబు ఏడుస్తుండటంతో మాయ, రుద్రాణి ఊరుకో పెట్టడానికి తంటాలు పడుతుంటారు. అసలు నీవు తల్లివేనా? బాబు ఏడుస్తుంటే అలానే చూస్తావా? స్వప్న క్లాస్ పీకుతుంది. అయితే చాలా రోజులుగా పాలు పట్టలేదు అందుకే పాలు రావడం లేదు. యాపిల్ జ్యూస్ తెమ్మని చెబుతుంది. అయితే విడాకుల కోసం సంతకం పెట్టమని అపర్ణ అడిగితే.. ఎలాంటి ఆలోచన లేకుండా కావ్య సంతకం పెడితే అందరూ షాక్ అవుతారు. నేను ఆలోచించే పెట్టాను అని కావ్య చెబుతుంది.
మే 31వ తేదీ 424 ఎపిసోడ్‌లో
అయితే రాజ్‌తో విడాకుల తీసుకోవడానికి సమ్మతే అంటూ డాక్యుమెంట్‌పై సంతకం పెట్టినందుకు కావ్య చెంపను ఇందిరాదేవీ చెల్లుమనిపిస్తుంది. ఎవరి కోసం ఎందుకు నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. ఈ కుటుంబంలో ఎవరైనా నీకు తోడుగా ఉన్నారా? అని నిలదీస్తుంది. అయితే కావ్య సంతకంపెట్డడంపై రుద్రాణి, రాహుల్, మాయ హ్యాపీగా ఫీలవుతారు. ఇప్పటికే పర్వాలేదనిపిస్తుంది. అసలు విషయం తెలిస్తే.. నా జీవితం ఏమౌపోతుంది అని మాయ అంటుంది. మరోవైపు అప్పు నిజమైన మాయని వెతికే పనిలో పడుతుంది. నీ నిర్ణయాలు నువ్వే తీసుకునే అంత స్థాయికి వెళ్ళిపోయావు అంటూ కావ్య పై ఇందిరా దేవి కోప్పడుతుందిజ
జూన్ 1వ తేదీ 425 ఎపిసోడ్‌లో
అసలైన మాయను వెతికే పనిలో ఓ ఇంటి ఓనర్‌ను అప్పు కలుస్తుంది. అయితే ఆమె నా ఫ్రెండ్. చిన్నప్పటి స్నేహితురాలిని అని చెబుతుంది. ఫోన్ చేయమని నంబర్ ఇస్తుంది. ఇదిలా ఉండగా,
నీ గదికి వెళ్ళు ఏ అర్ధరాత్రి అయినా ఆ మాయ నీ గదిలో దూరినా దూరిపోతుంది అని కావ్యను హెచ్చరిస్తుంది స్వప్న. డబ్బు కోసమే రాజ్‌కు భార్య ఉందని తెలిసినా కూడా ఇదే ఇంట్లో మాయ ఉంటుందని అనామిక అని అంటుందిమన పెళ్ళికి సపోర్ట్ చేసింది ఆవిడే, మర్చిపోయావా అంటూ భార్యని మందలిస్తాడు కళ్యాణ్.


Click it and Unblock the Notifications











